Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Shankar Dada M.B.B.S. (2004)





చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
నటీనటులు: చిరంజీవి, సొనాలి బింద్రే
దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ
నిర్మాత: అక్కినేని రవిశంకర ప్రసాద్
విడుదల తేది: 15.10.2004



Songs List:



శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. పాట సాహిత్యం

 
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: మనో

శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. ఊ హా ఊ హా
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. ఊ హా ఊ హా
హొయ్...

హే బేగంపేట బుల్లమ్మో...
అరె పంజాగుట్ట పిల్లమ్మో...
హే బేగంపేట బుల్లమ్మో...
పంజాగుట్టా పిల్లమ్మో
బాడీలోన వేడే చూసి గోలీ వేస్తనమ్మో
హే చింతల్ బస్తీ చిట్టమ్మో కుకట్ పల్లి కిట్టమ్మో
బాధే నీకు లేకుండానే దూదే రాస్తనమ్మో
హే...హైదర్ గూడా గున్నమో
కో: శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.
అరె దోమల్ గూడ గుండమ్మో....
కో: శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
హైదర్ గూడ గున్నమ్మో
దోమల్ గూడ గుండమ్మో
వాతంగానీ పైత్యంగానీ చెంతకొస్తే చాలు చిత్తు చిత్తమ్మో
నీ పేరేందబ్బాయా....
దా దా దా దా దా దా...

కో: శంకర్ దాదా... శంకర్ దాదా...
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
హే శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్

బోలో శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్

హే బేగంపేట బుల్లమ్మో...
అరె పంజాగుట్టా పిల్లమ్మో...
ఎహె ఎహె ఎహె ఎహె

హే... నడవలేని వాళ్ళు ఉరికేలాగా
నే పెంచుకున్న కుక్క నొదులుతా  హె... హె...
అరె పలకలేని వాళ్ళు అరిచేలాగా
నే రాసుకున్న కవిత చదువుతా... హె...హె...హె...
అరె మూర్ఛపోయి వచ్చినోళ్ళ కళ్ళు మిటకరించేలా
మలయాళం ఫిల్ము చూపుతా.... హెయ్...
అరె జంతర్ మంతర్ జాలీ
అరె చూ  మంతర కాళీ నీ బతుకుల్లో బాధలెన్నున్నా
చిన్న చిరునవ్వే మందు ఓరన్నా ...హొయ్....స్

నిన్న హేసరనప్పా
నన్న హేసరా...అహహహ....

కో: శంకర్ దాదా శంకర్ దాదా  ఎం.బి.బి.ఎస్
శంకర్ దాదాఎం.బి.బిఎస్  
బోలో శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్

చేతకానితనము టీబీ అయితే
నే చూపు చూస్తే బాగుపడునులే
లంచగొండి తనము కలరా అయితే
నే చెయ్యి వేస్తే తిరిగిరాదులే....హే...హె...
అన్యాయాలు అధర్మాలు అక్రమాలు కాన్సరైతే
అంతు తేల్చు ఆన్సరుందిలే...
అరె మోసమున్న  బీ.పి. యమ స్వార్ధమన్న షుగరు
ప్రతి జబ్బుకీ వైద్యముందిలే
మరి అన్నిటికీ ఒకే మందులే  హా
కో: ఏం మందు గురూ.....?
ఏం మందా ...?  అహహహ....

కో: శంకర్ దాదా శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
బోలో శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
అరె హో శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ కో జై బోలో

అరె శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్  ఊ హ ఊ హ (11)




నా పేరే కాంచనమాల పాట సాహిత్యం

 
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: వేటూరి 
గానం: కార్తీక్ , మాలతి లక్ష్మణ్ 

నా వయసే పాదరసం... నేనసలే చిన్న రసం
నా పెదవే ద్రాక్షరసం నా నడుమే నాగస్వరం
నా సోకు పూలవనం నా చూపు నీకు వరం
అందిట్లో ఆడతనం అందిస్తా మూలధనం... ఓయ్

హే నా పేరే కాంచనమాల నా వయసే గరమ్ మసాలా
తందాన తాన అంటు మోగనీ తబలా
హేయ్ రావే నా రస రంగీలా నీ గుట్టే నా రసగుల్లా
తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా
కలిసొస్తా కాని వేళ కైపెక్కే కన్నులా
నీదేరా రాకుమారా దోర దోర ఊడుకుల ఊయ్యాలా
ఊ... నన్ను అల్లుకో అల్లుకో
ఆ...నన్ను గిల్లుకోరా
హే...నన్ను చంపుకో చంపుకో... ఓ...ఓ...ఓహ్
ఊ... నిన్ను తాకనా తాకనా
నిన్ను చుట్టుకోనా హే...
ముద్దు పెట్టనా పెట్టనా...హొయ్...

హాయ్యో  హాయ్యో  హాయ్యో  (4)

ఆ నీ రాకలో రాపిడుంది నా సోకుల దోపిడుంది
నీ దొంగ చుపుకే నా బెంగ తీరనా నీవుండిపో రాత్రికి
నీ మీదనే మోజువుంది ఈ రోజునే రాజుకుంది
ఏ పోజు పెట్టినా ఈ పోరు తప్పునా తెల్లారదీ ఆటకి
మాయాబజార్ మల్లెపూలకి వేలాల వెర్రి నాకు రేగే
పారాహుషార్ పట్టుచిక్కెరో మామా ఓ మామా ఓ మామా
కావాలిలే కజ్జికాయలే నీ గిల్లి కజ్జికాయలే
ఆడాలిలే గచ్చకాయలే భామ ఓ భామ ఓ భామ

ఊ...నన్ను అల్లుకో అల్లుకో 
ఆ నన్ను గిల్లుకోరా
హే...నన్ను చంపుకో  చంపుకో...ఓ...ఓ...ఓహ్

హే నా పేరే కాంచనమాల నా వయసే గరమ్ మసాలా
తందాన తాన అంటు మోగనీ తబలా

ఓలమ్మో...
నీ నవ్వులో చిచ్చువుంది నా గుండెలో గుచ్చుకుంది
ఏ మాట చెప్పినా ఆ మంట తీరునా నన్నాపకే ఎప్పుడూ
నీ సూపులో సూదివుంది సూదంటులా లాగుతుంది
నీవంటు తొక్కిన నావంటి చెక్కన నేమోయలేనిప్పుడు
బస్తీ సవాల్ బాలీవుడ్ లో చిత్రాంగి చీర కట్టదాయె
చారుమినార్ సెంటుబుడ్డివే భామ ఓ భామ ఓ భామ
తాకించనా పూతరేకులే లేలేత కొత్త సోకులే
ముట్టించనా ముంజకాయలే మామా ఓమామా ఓ మామా

ఊ... నన్ను అల్లుకో అల్లుకో
ఆ... నన్ను గిల్లుకోరా
హే...నన్ను చంపుకో చంపుపో...ఓ....ఓ..ఓహ్
హొయ్...నా పేరే - కాంచనమాల
నావయాసే - గరమ్  మసాలా
తందాన తాన అంటు మోగని తబలా
హే...రావే నా - రస రంగీలా
నీ బుగ్గే  - నా రసగుల్లా
తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా లా లా
హే...ఊయ్....ఆ....ఆహ...



చైలా చైలా చైలా చైలా పాట సాహిత్యం

 
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్  
గానం: చిరంజీవి, కె.కె

కరెక్టే ప్రేమ గురించి నాకేం తెలుసు
లైలా మజ్నూలకు తెలుసు 
పారు దేవదాసులకు తెలుసు
ఆ తరువాత తమకే తెలుసు

ఇదిగో తమ్ముడూ...
మనకీ ఓ లవ్ స్టోరీ ఉందమ్మా వింటావా ఆ

ఓ యస్   ఓ యస్

హేయ్...చైలా చైలా చైలా చైలా
నేను వెంటపడ్డపిల్లపేరు లైలా
హేయ్...చైలా చైలా చైలా చైలా
నేను వెంటపడ్డపిల్లపేరు లైలా
హొయ్ లా హొయ్ లా హొయ్ లే హొయ్ లా
నడక చూస్తే చిక్కుబుక్కురైలా
గులాబిలాంటి లిప్పుచూసి నా పల్సురెటే పెరిగింది
జిలేబిలాంటి హిప్పుచూసి నా హర్టు బీటే అదిరింది
పాల మీగడంటి రంగుచూసి  నా రక్తమంతా మరిగింది
నా ఏరియాలో ఎప్పుడూలేని లవ్వేరియా నాకు అంటుకుంది

ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంతే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా
ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంతే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా

చైలా చైలా  చైలా చైలా
నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా

తర్వాతేమయ్యిందన్నా...
ఏమయిందా...ఆ రోజువరకూ హాయిగా 
ఎలాపడితే అలా తిరుగుతూ గడిపేసేవాణ్ణి
కానీ ఆ రోజు నుంచి 
తిరుగుళ్ళు నో చాన్స్...దాదాగిరి...నోచాన్స్... 
ఓన్లీ రొమాన్స్...

ఊ...తన్ని చూసినాకనే డ్రింకింగ్ మానేసా
తెల్లావారుజామునే జాగింగే చేశా
డే...వన్...దమ్ము కొట్టడం వదిలేశా
డే... టూ...దమ్ముదులపటం ఆపేశా
డే...త్రీ... పీక కోసే కత్తితోనే పూలు కోసి తీసుకొచ్చా
హొ యా ఇంటి ముందరే టెంటువేశా
హొ యా ఒంటికందిన సెంటు పూశా
హొ యా మంచినీళ్ళ లారీ దగ్గర బిందెకూడా బ్లాకుచేశా
ఆ దెబ్బతో చిన్న చిర్నవ్వుతో ఫేసు నా వైపు టర్నింగ్ ఇచ్చుకుంది
అదెమిటో మరి ఆ నవ్వు తో నా మనసంతా రఫ్ఫాడేసింది

ఓ మాయా ఓ మాయా ఈప్రేమ అంతే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా

చైలా చైలా చైలా చైలా...

జీవితంలో దేనీ మీదా ఆశపడని నేను
ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను
ఎన్నో కలలుకన్నాను ఆ అమ్మాయి 
నాకే సొంతం అనుకున్నాను
కానీ ఒక రోజు ఏం జరిగిందో ఏమో తెలీదు
ఆ అమ్మాయికి  పెళ్ళయిపోయింది...

కళ్లలోన కలలు అన్నీ కధలుగానే మిగిలెనే
కనులుదాటి రాను అంటూ కరిగిపోయెలే

మరి తర్వాత ఏమయింది....
హు...తర్వాత...తర్వాత ఏమౌతుంది

ఆ మరుసటిరోజు ...
మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చిందీ

ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా
ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా

చైలా  చైలా  చైలా  చైలా .....
ఇదర్ ఆ...ఏంటిరా మీ కుర్రవాళ్ల గోల

చూడు తమ్ముడూ 
ప్రేమ అనేది లైఫ్లో ఓ చిన్న పార్టేకానీ ప్రేమే లైఫ్ కాదు
ఆ మాత్రం దానికి అమ్మాయికోసం
ప్రాణాలు తీసుకోవటం లేదా 
ఆ అమ్మాయి ప్రాణాలే తీయటం నేరం...
క్షమించరాని నేరం అండర్ స్టాండ్

ఓడిపోవటం తప్పుకాదురా 
చచ్చిపోవడం తప్పు సోదరా
చావు ఒక్కటే దారంటే 
ఇక్కడుండే వాళ్లు ఎంతమందిరా
జీవితం అంటే జోక్ కాదురా 
దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ రా
దాన్ని మద్యలో కతమ్ చేసే 
హక్కు ఎవరికీ లేదురా
నవ్వెయ్యరా చిరు చిందెయ్యరా
అరె బాధ కూడా నిన్ను చూసి పారిపోద్దిరా
దాటేయరా అడ్డు దాటేయరా 
ఏ ఓటమీ నిన్ను ఇక ఆపలేదురా

ఓ మాయా ఓమాయా ఈ లైఫ్ అంటే మాయా



ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్లా నీది ఏ జిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: అద్నన్ శామి, కల్పన

ఏ జిల్లా ఏ జిల్లా  ఓ పిల్లా నీది ఏ జిల్లా (2)
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోల ఓరుగల్లా
ఏ జిల్లా ఏ జిల్లా  ఓ పిల్లా నీది ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోల ఓరుగల్లా
ఇరవై మూడు జిల్లాలలోన ఏదో ఒకటి నీది అయినా
ఇరవై నాలుగు నీ నడుము కొలత ఐతే చాలులే
ఇరవై ఐదు నిముషాలలోనే కవ్విస్తాను రావే మైనా
ఇరవై ఏడు ముద్దుల్ని పెట్టి 
తకిట  తకిట  తకిట తకిట తా

ఏ జిల్లా ఏ జిల్లా  ఓ పిల్లా నీది ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోల ఓరుగల్లా (2)

హెయ్ నువ్వట్టా జల్సా పూర్ సిగ్నల్నే దాటేస్తా
నేనట్టా సిగ్గాపూర్ సిగ్నల్ నే దాటేస్తా
నువ్వట్టా మనసాపూర్ సెంటర్ లో మాటేస్తే
నేనట్టా సరసాపూర్ సెంటర్ లో వాటేస్తా
కమ్మేస్తాను కొకాకుళంలోరాజేస్తాను రాణిమండ్రి
ఊరిస్తాను ఊపేశ్వరంలో ఉడికిస్తానులే
మురిపిస్తాను మద్దాపురంలో చేరుస్తాను సోకునాడ
సాగించాలి హింసాచలంలో  
తకిట తకిట  తకిట  తకిట  తా

ఏ జిల్లా ఏ జిల్లా  ఓ పిల్లా నీది ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోల ఓరుగల్లా (2)

కో: ఏ జిల్లా .....ఏ జిల్లా...

ఓ నీలోని అందం చందం అదిరేబాదవుతుంటే
నాలోని ఆత్రం మొత్తం ముదిరేబాదయిపోదా
నువ్వట్టా కన్నేకొట్టి గిల్లూరు రమ్మంటే
నేనిట్టా మూటేకట్టి ఒళ్ళూరు రాసేస్తా
చంపాపేట సరిహద్దు దాటి పెదవుల పాడు చేరుకుంటా
ఆ పై నేను ఒడివాడలోనే ఒకటవుతానులే
పగలే కానీ రాత్రైన గానీ నిదురానగరు వెళ్లనంటా
పక్కలపల్లి పొలిమేరలోనే  
తకిట  తకిట  తకిట తకిట  తా

ఏ ఏ జిల్లా ఏ జిల్లా  ఓ పిల్లా నీది ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోల ఓరుగల్లా
ఆ జిల్లా ఆ జిల్లా పిల్లోడా నాది ఆజిల్లా
దాచెయ్ నా దుప్పట్లో మరుమల్లె పూలజల్లా




పట్టు పట్టు చెయ్యే పట్టు పాట సాహిత్యం

 
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: సాహితి 
గానం: మణిక్క వినయాగం , సుమంగళి 

పట్టు పట్టు చెయ్యే పట్టు 




సండే పొద్దుల్ల తాండె పాట సాహిత్యం

 
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: సాహితి 
గానం: శంకర్ మహదేవన్ , కల్పన


సండే పొద్దుల్ల తాండె

Most Recent

Default