Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Devi (1999)
చిత్రం: దేవి (1999)
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల (All)
నటీనటులు: ప్రేమ, శిజు, భానుచందర్
దర్శకత్వం: కోడి రామకష్ణ
నిర్మాత: యం. యస్. రాజు
విడుదల తేది: 12.03.1999

( దేవీశ్రీప్రసాద్  సంగీత దర్శకుడిగా ఇది  మొదటి  సినిమా )Songs List:అనంత దివ్యశక్తికై పాట సాహిత్యం

 
చిత్రం: దేవి (1999)
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్. పి. బాలు

అనంత దివ్య శక్తికై

బంగారు పాట సాహిత్యం

 
చిత్రం: దేవి (1999)
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: కోరస్

బంగారు పడగయేభువి ఎరుగది పాట సాహిత్యం

 
చిత్రం: దేవి (1999)
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్. పి. బాలు

భువి ఎరుగది
కుంకుమ పూల తోటలో పాట సాహిత్యం

 
చిత్రం: దేవి (1999)
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: చిత్ర, యస్. పి. బాలు

కుంకుమ పూల తోటలో
కులికే ఓ కుమారీ
మేలిమి బంగారు చీరలో
మెరిసే ఓ వయ్యారీ

నా మనసులోని మరాళీ
మల్లెల చిరుగాలీ
నా ప్రేమ నీకు నివ్వాలీ
నువ్వే నువ్వే కావాలి

శంఖములూదిన ప్రేమకే
చేశా మది నివ్వాలీ
అంకెలకందని ఆశలే
దాచా రావిహారీ

నా వలపు నీకు సుమాలీ
యవ్వన వనమాలీ
ఈ చంద్రకాంత చకోరీ
గుండెల్లోకి చేరాలీ

కుంకుమ పూల తోటలో
కులికే ఓ కుమారీ
శంఖములూదిన ప్రేమకే
చేశా మది నివ్వాలీ

మంచు కొండా అంచు మీద నుంచి
వచ్చు మబ్బుల సందేశం
ఈ తామర మొగ్గకి తప్పదు
అన్నది కాముని సాహవాసం
హంస రెక్క పక్క ఆది తాళమేసి
పలికెను ఆహ్వానం
ఈ అచ్చట ముచ్చట ఇచ్చట తీరగా
హెచ్చెను హేమంతం

ప్రియమగు ప్రియురాలా
చంపకు విరహాలా
విరిసిన పరువాల
పిలిచెను మధుబాల

ఊగీ ఊగీ రేగే అందాలే
విరిసే పూ బంధాలే
మధురం మధురం సాగే సరాగం
మనసా వాచా

కుంకుమ పూల తోటలో
కులికే ఓ కుమారీ
శంఖములూదిన ప్రేమకే
చేశా మది నివ్వాలి

అక్షరాలా నీకు ఇచ్చి పుచ్చుకున్న
వెచ్చని తాంబూలం
అది ముద్దుగా మారీ
బుగ్గన చేరిన పుష్యమి నక్షత్రం
ఎక్కు పెట్టి ఉన్న పంచదార విల్లు
చేసింది ఈ గాయం
అది గుచ్చాక పొతే
వచ్చిన వయసుకు తీరదు మోమాటం

నిలిచా నిను కోరీ
రసమయ రహదారీ
శుభమే సుకుమారీ
సొగసుకి ప్రతి సారీ

మదిలో ఎదలో ఒడిలో నువ్వేలే
పొంగే ఆనందాలే
నింగీ నెలా ఏలే రాగాలే
నీవూ నేనై

శంఖములూదిన ప్రేమకే
చేశా మది నివ్వాలీ
కుంకుమ పూల తోటలో
కులికే ఓ కుమారీ

నా వలపు నీకు సుమాలీ
యవ్వన వనమాలీ
నా ప్రేమ నీకు నివ్వాలీ
నువ్వే నువ్వే కావాలినీ నవ్వే నాగ స్వరమే పాట సాహిత్యం

 
చిత్రం: దేవి (1999)
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: సుమంగళి, యస్.పి. బాలు

నీ నవ్వే నాగ స్వరమే
నీ నడకే హంస రథమే
నీ కులుకే కళల కనకాంబరమే

నీ ఒడిలో ఒక్క క్షణమే
నా మదిలో స్వర్ణ యుగమే
నీ వలపే వేయి జన్మల వరమే

కలిసి రావే కళల తార
వయసు మీటే ప్రియా సితార
చుక్కలొలుకు స రి గ మా పలికి

పాలపుంత ప్రేయసి
పారిజాత సుందరి
రోదసికి ఆమనీ
ప్రేమలోక పౌర్ణమి

నీలాల మబ్బులో కూచిపూడి నాట్యాలమ్మ
వయ్యారి స్వాతి జల్లు పైట చాటు
ముత్యాలమ్మ
గోదారి తీరంలోని సంధ్య రాగం కుచ్చిళ్ళమ్మ
మనసారా కోరుకున్న ఓసారైనా వచెల్లమ్మ

నువ్వే నువ్వే చుక్కలోంచి రావాలి
నవ్వే రువ్వి నా జంటే కట్టాలి

నీ నవ్వే నాగ స్వరమే
నీ నడకే హంస రథమే
నీ కులుకే కళల కనకాంబరమే

నీ ఒడిలో ఒక్క క్షణమే
నా మదిలో స్వర్ణ యుగమే
నీ వలపే వేయి జన్మల వరమే

నీలి నీలి ముంగురులు
గాలి లోన గింగిరులు
అందగాతెలందిరికి నిన్ను చూసి ఆవిరులు

నీలాగా పాడలేక కు కు కోయిలమ్మ
ఒక్కొక అక్షరాన్ని పట్టి పట్టి పాడెనమ్మా
జాబిల్లి చిన్నబోయి సున్నాలాగా మారిపోయి
సిగ్గేసి నల్లమబ్బు రగ్గు కప్పి తొంగుందమ్మా

ఎన్నో ఎన్నో అందాలన్నీ ఏనాడో
నిన్నే చేరి ఆయనయే పారాణి

నా నవ్వే నాగ స్వరమే
నా నడకే హంస రథమే
నా కులుకే కళల కనకాంబరమే

నా ఒడిలో ఒక్క క్షణమే
నా మదిలో స్వర్ణ యుగమే
నా వలపే వేయి జన్మల వరమే

కలిసి రానా కళల రాజా
ననననాన ననననాన
ఊహలొలుకు సరిగమా పలికిపాతాళ లోకమే పాట సాహిత్యం

 
చిత్రం: దేవి (1999)
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి. బాలు

పాతాళ లోకమే
ప్రళయాగ్ని పాట సాహిత్యం

 
చిత్రం: దేవి (1999)
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి. బాలు

ప్రళయాగ్ని
రామచిలకలా పాట సాహిత్యం

 
చిత్రం: దేవి (1999)
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి. బాలు, అనురాధ శ్రీరామ్

రామచిలుకలా
శర్వాణి రుద్రాణి పాట సాహిత్యం

 
చిత్రం: దేవి (1999)
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: కె. ఎస్. చిత్ర

శార్వాణి రుద్రాణి
స్త్రీ జన్మకు పాట సాహిత్యం

 
చిత్రం: దేవి (1999)
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి. బాలు, అనురాధ శ్రీరామ్

స్త్రీ జన్మకు
వేయి పడగల పాట సాహిత్యం

 
చిత్రం: దేవి (1999)
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: స్వర్ణలత

వేయి పడగల నీడలో రేయి పగలు
జగములన్నియు కాపాడు జనని నీవు
లోక కళ్యాణకారిని


Most Recent

Default