Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Seetayya (2003)
చిత్రం: సీతయ్య (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నందమూరి హరికృష్ణ , సౌందర్య, సిమ్రాన్
దర్శకత్వం: Y.V.S చౌదరి
నిర్మాత: Y.V.S చౌదరి
విడుదల తేది: 22.08.2003Songs List:ఎవరి మాట వినడు పాట సాహిత్యం

 
చిత్రం: సీతయ్య (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యమ్.యమ్.కీరవాణి

ఆ విక్రమ స్పూర్తి ఆ విశృంఖల దీప్తి
ఎవరతడు ఎవరతడు ఎవరు
ఆ సముజ్వల మూర్తి ఆ సమున్నత కీర్తి
ఎవరతడు ఎవరతడు ఎవరు

కో: సీతయ్యా... సీతయ్యా... సీతయ్యా...

ఎవరి మాట వినడు సీతయ్య (౩)

ఆ రూపు సింహేద్ర సదృశం ఆ చూపు బాణాగ్ర నిశితం
ఉచ్వాసామతని ఓంకారం విశ్వాసమతని ధిక్కారం

ఎవరి మాట వినడు సీతయ్య (౩)

అణువుణువు ధర్మాగ్రహం అడుగుడుగు న్యాయాంకితం
శిష్టరక్షణమతని యాగం దుష్టశిక్షణమే ఉద్యోగం

ఆ పాదం తాకితే మాతృధరణి మది పులకిస్తుంది
ఆ పాదం కదిలితే వాయుమండలం ప్రచలిస్తుంది
ఆ పాదం కదిపితే ఆకాశం శిరసు వంచుతుంది 
ఆ పాదం కుదిపితే తేజోవలయం తీంద్రిస్తుంది
ఆ పాదం ఉరిమితే జలధరాత్మ జలజలజలజలజల  జల వర్షిస్తుంది
ఓం.....ఓం.......

ఇదిగో రాయలసీమ గడ్డ పాట సాహిత్యం

 
చిత్రం: సీతయ్య (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు 

పల్లవి: 
ఇదిగో రాయలసీమ గడ్డ
దీని కధ తెలుసుకో తెలుగు బిడ్డ (౩)
ఈ గడ్డలో పగలు సెగలొద్దురా
ఈ మట్టిలో నెత్తురొలకొద్దురా   

చరణం: 1
పతిత పావనుడు తిరుపతి వేంకటేశ్వరుడు
సర్వ రక్షకుడు శ్రీశైల మల్లేశ్వరుడు
కొలువున్నదీ సీమలోనే
రంకెలిడు లేపాక్షి బసవన్న శిల్పం
రణభేరి నినదించు చంద్రగిరి దుర్గం
నెలకొన్నాదీ నేలలోనే

చరణం: 2
హరుని కంటికే కన్నర్పించిన కన్నప్ప భక్తవరుడూ
విజయ నగర సామ్రాజ్య దురంధర కృష్ణరాయ భూవిధుడు
చరిత్ర కెక్కిన ధరణి ఇది....
పదాలనే స్వరపధాల నడిపిన అన్నమయ్య కృతులు
ఇహ పరాల కలిపిన వీరబ్రహ్మేంద్ర తత్వగతులు
అలలై పొంగిన అవని ఇది. అందుకే

ఈ గడ్డలో పగలు సెగలొద్దురా
ఈ మట్టిలో నెత్తురొలకొద్దురా   

ఇదిగో రాయలసీమ గడ్డ
దీని కధ తెలుసుకో తెలుగు బిడ్డ 

చరణం: 3
తెల్లదొరల హడలెత్తించిన ఉయ్యాల వాడ నరసింహారెడ్డి
కో: వందేమాతరం
మడమ తిప్పక స్వరాజ్య సంగ్రామం నడిపిన కడప కోటరెడ్డి
కో: వందేమాతరం
గాడిచెర్ల కల్లూరి సదాశివం పప్పూరి
హంపణ్ణ...లింగణ్ణ.. షేక్పీర్ రబియాబి
ఒక్కరా... ఇద్దరా ... పదుగురా...ఆ నూర్గురా...
ఎందరెందరో త్యాగమోర్తులకు జన్మమిచ్చిన జనని యిది

అంతటి చిరంతన నిరంతర వికస్వర వైభవంతో విరాజిల్లిన
రాయలసీమ ... మన రైతన్నల సీమ...ఈనాడు దుష్కర ముష్కర
శక్తుల దురంతాలతో అతలాకుతలమవుతుంటే
చూస్తూ ఉంటారా... చూస్తూనే ఉంటారా...కో: లేదు...లేదు....
అయితే... యువత విక్రమించాలి... నవత విప్లవించాలి...
నాగొంతున గర్జించే నాదమే మహాద్యమమై
కుళ్ళిన ఈ వ్యవస్దకే కొత్తనెత్తురెక్కించాలి
సరికొత్త చరిత సృష్టించాలి.....(2)రావయ్యా రావయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: సీతయ్య (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు , యమ్.యమ్.కీరవాణి

పల్లవి : 
పైరు కోయిల కూసింది... పల్లె దరువులు వేసింది...
పైరుతో శృతి కలిపి పల్లెతో జత కలిసి
పైరుతో శృతి కలిపి పల్లెతో జత కలిసి

రావయ్యా రావయ్యా రామసక్కని సీతయ్యా 
రావయ్యా రావయ్యా రామసక్కని సీతయ్యా

చరణం: 1
కత్తులు దూసే పల్లెల్లో మెత్తని ప్రేమలు నింపావు
తెంచుకుపోయే గుండెల్లో తీయని ముళ్లే వేశావు
ఇన్నాళ్ళు వేచిన మా కళ్ళు ఇచ్చేను కర్పూర హారతులు
ఇన్నాళ్ళు వేచిన మా కళ్ళు ఇచ్చేను కర్పూర హారతులు

కోరస్: 
అందుకోవయ్యా ఆదుకోవయ్యా 
అందుకోవయ్యా ఆదుకోవయ్యా 
రావయ్యా రావయ్యా రామసక్కని సీతయ్యా 
రావయ్యా రావయ్యా రామసక్కని సీతయ్యా

చరణం: 2
ఆ రెడ్డి ఈ రెడ్డి ఆ నాయుడీ నాయుడందరొక్కటైపోతే
ఆ ఎత్తులీ ఎత్తులు ఆ కత్తులీకత్తులన్నీ చిత్తయిపోతే
సీమలన్నిటికి మిన్నా... 
సీమలన్నిటికి మిన్న మన రాయలసీమోరన్నా
వింటున్నావా వెంకన్నా కంటున్నావా మల్లన్నా
వింటున్నావా వెంకన్నా కంటున్నావా మల్లన్నా

రావయ్యా రావయ్యా రామసక్కని సీతయ్యా 
రావయ్యా రావయ్యా రామసక్కని సీతయ్యా
ఒక్క మగాడు పాట సాహిత్యం

 
చిత్రం: సీతయ్య (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: అనురాధ శ్రీరాం

పెళ్లీడు కొచ్చినా ఒంటిగా ఉన్నానూ 
సో శాడ్ 
పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నానూ 
ఈజ్ ఇట్ ఊఁ
ఏడ తానున్నాడో వాడు ఒక్కగానొక్క మగాడూ
అంత స్పెసలా 
ఊఁ నా ఊహలో అందగాడు
నాన్చొద్దూ...

సుఘునాభి రాముడు సమరానా భీముడు
ఎవరు ఎవరూ అతగాడు 
ఒక్క మగాడు ఒక్క మగాడు
చెప్పిందే చేసేవాడు చేసేదే చెప్పేవాడు ఎవరో ఎవరో అతగాడు
ఒక్క మగాడు ఒక్క మగాడు

చరణం: 1
జీన్స్ ప్యాంటు కట్టినా గల్లలుంగి చుట్టినా నీటుగాడు
జానపదుల పాటైనా జాగువీత రూటైన ఆటగాడు
మగువలకే మరుడు మదనుడికే గురుడు
మాటలు తను అనడు చేతలకిక ధనుడు
ముక్కుమీద కోపం వాడు ముక్కుసూటిగా వెళ్ళేవాడు ముక్కుతాడు నాకే వేశాడూ
అతల వితల సుతల సత్యభూతల భువనాలన్ని ప్రణవిల్లు పురుషుడు
ఒక్క మగాడు ఒక్క మగాడు
కొమ్ములు తిరిగిన కండలు కలిగిన తనలో మెదిలే మొనగాడు
ఒక్క మగాడు ఒక్క మగాడు

చరణం: 2
ఆకుచాటు పిందైన ఆకశంలో చుక్కైనా వేటగాడు
లక్షమంది అడ్డున్నా లక్ష్యమంటూ ఏదైనా పోటుగాడు
మగసిరి గల రేడు మనసున పసివాడు
శతమత గజ బలుడు అతనికి ఎదురెవడు
పాత సినిమా హీరో లాగా సాహసాలు చేసేవాడు సాక్షాత్తు నాకై పుట్టాడూ
శాంత కరుణ రౌద్ర వీర అద్భుత శ్రుంగారాని రసదేవా దేవుడు
ఒక్క మగాడు ఒక్క మగాడు
సుఘునాభి రాముడు సమరానా భీముడు
ఎవరు ఎవరూ అతగాడు 
ఒక్క మగాడు ఒక్క మగాడు
ఆంధ్రుల తనయుడు అనితర సాద్యుడు...! నా కథ నడిపే నాయుకుడూ
ఒక్క మగాడు ఒక్క మగాడు
ఒక్క మగాడు
డూ డు డు డు డు డు డు డు డు డు డు డు
ఒక్క మగాడు
డురు డురు డురు డు డు డు డు డు డు డు డు
ఒక్క మగాడు
ఒక్క ఒక్క మగాడు
సిగ్గేస్తుంది నిను చూస్తుంటే పాట సాహిత్యం

 
చిత్రం: సీతయ్య (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: అనురాధ శ్రీరాం

పల్లవి: 
సిగ్గేస్తుంది నిను చూస్తుంటే
సిగ్గేస్తుంది నీ మాటింటే
సిగ్గేస్తుంది నీతో ఉంటే
సిగ్గేస్తుంది ఆలోచిస్తే
సిగ్గేస్తుంది అడుగు వేస్తే
సిగ్గేస్తుంది అందాకొస్తే
ఏదో ఇవ్వాలనుకుంటే 
ఇచ్చే ధైర్యం లేకుంటే
ఓరయ్యో.....
కళ్ళల్లో కడివెడు సిగ్గు
బుగ్గలో బుట్టెడు సిగ్గు
ఒళ్ళంతా ఒకటే సిగ్గూ...

చరణం: 1
ముద్దిమ్మని నా అంతట నేను పెదవే విప్పి అడగాలంటే 
అయ్ బాబోయ్ సిగ్గు
ఇస్తానని తానంతట తాను ఎదురే వచ్చి ఇదుగో అంటే 
అడ్డగోలు సిగ్గు
కో కో కోకో కో కో కో కో కోకలాగుతుంటే సిగ్గు
చీ చీ చీచీ చీ చీ చీ చీ  చీ చిలిపి సైగ చేస్తే సిగ్గూ
వెలుపల సిగ్గూ లోలోపల సిగ్గూ
సిగపూవై ఉన్నోడు మొగ్గంతా తడిమేస్తుంటే సిగ్గూ

చరణం: 2
రాతిరి తాను నిద్దరమాని నాకలలోనే
తిరిగేస్తుంటే ఓరినాయనో సిగ్గూ
కలలో కలిగిన అలసటతో నా ఒళ్ళోనే
నిదిరిస్తానంటే ఎక్కడలేని సిగ్గూ
ఊ ఊ ఉ ఉ ఊ ఉ ఊహత్తరుముతుంటే సిగ్గూ....
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆశ కలుగుతుంటే సిగ్గూ...
తొలితొలి సిగ్గూ నను తొలిచిన సిగ్గూ
చిదిమేసే చిన్నోడికి సిగ్గంటూ చెప్పాలంటే సిగ్గూ 
బస్సెక్కి వస్తావో పాట సాహిత్యం

 
చిత్రం: సీతయ్య (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, చిత్ర 

బస్సెక్కి వస్తావో బండెక్కి వస్తావో కారెక్కి వస్తావో లారెక్కి వస్తావో
బస్సెక్కి వస్తావో బండెక్కి వస్తావో కారెక్కి వస్తావో లారెక్కి వస్తావో
ఏదైనా ఎక్కేసిరా నా ఎదలోన పక్కేస్తారా
ఏదైనా ఎక్కేసిరా నా ఎదలోన పక్కేస్తారా 

రాముడై వస్తానో భీముడై వస్తానో కాముడై వస్తానో కృష్ణుడై వస్తానో
రాముడై వస్తానో భీముడై వస్తానో కాముడై వస్తానో కృష్ణుడై వస్తానో
ఏ వేషంలో వచ్చినా నీ ఆవేశం తగ్గించనా
ఏ వేషంలో వచ్చినా నీ ఆవేశం తగ్గించనా

మావా అంటే మాపటికి మనసిస్తానే
మావా మమా మావా
బావా అంటే బ్రహ్మండం చూపిస్తానే
బావా
పోరీ అంటే పొద్దంతా ప్రేమిస్తాలే
ఏయ్ పోరీ
రాణి అంటే రాత్రికి నిను రానిస్తాలే
ఏమోయ్ అంటే ఏమే అంటు ఏమేమో చేస్తానే
సతీ అంటే అతీ అంటూ ప్రతిదీ అందిస్తాలే
ఎట్టాగైనా నను ఎట్టాగైనా ఎట్టాగైనా పిలిచేసుకో నా పట్టుతేనె పిండేసికో
ఏపియస్సార్టీసీ బస్సెక్కివస్తానే బండెక్కివస్తాను
కారెక్కివస్తాను లారీఎక్కొస్తాను
ఏదైనా ఎక్కేసిరా నా ఎదలోన పక్కేస్తారా
ఓకే
ఏదైనా ఎక్కేసి రావయ్ వయ్ రావయ్ రా నా ఎదలోన పక్కేస్తారా రా
ఓయ్యస్

కన్నే కొడితే మెరుపల్లే ముందుంటానే
హాయ్ హాయ్
యీలే వేస్తే గాలల్లే అల్లేస్తానే
అబ్బబ్బో
నవ్వే నవ్వితే నడిచొచ్చి నడుమిస్తాలే
అబ్బో
చెయ్యే వుపితే చిలకలని చుట్టిస్తాలే....
పైటే దువ్వి బయటేపడితే పైపైకే వస్తానే
కాలే దువ్వి కబురే పెడితే ప్రువపు పరుపేస్తాలే
ఎల్లాగైనా యిక ఎల్లాగైనా
ఎల్లాగైనా కవ్వించుకో నన్ను ఎల్ల కాలం కాపాడుకో 

రాముడై వస్తానో భీముడై వస్తానో కాముడై వస్తానో కృష్ణుడై వస్తానో
రాముడై వస్తానో భీముడై వస్తానో కాముడై వస్తానో కృష్ణుడై వస్తానో
ఏ వేషంలో వచ్చినా నీ ఆవేశం తగ్గించనా
ఏ వేషంలో వచ్చినా నీ ఆవేశం తగ్గించనా

ఆదిశంకరుల సౌందర్యలహరి పాట సాహిత్యం

 
చిత్రం: సీతయ్య (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, సునీత 

ఆదిశంకరుల సౌందర్యలహరి 
దేవులపల్లి లలితా గీతా ఝరీ
శ్రీనాధ శృంగార లాహిరి.. 
వేటూరి గేయాల మాధురి
నవలా శౌరి యండమూరి, 
షెల్లీ ,కిట్స్... యద్దనపూడి
ఎందరో మహానుభావులు చూపిన దారి

పట్టాల్సిన పిచ్చే ప్రేమరా 
పుట్టాల్సిన చిచ్చే ప్రేమరా

జీవితమే వడబోసి. అనుభవమే కలబోసి
ఎందరో మహానుభావులు చూపిన దారి

చెయ్యాల్సిన తప్పే ప్రేమరా 
తెలియాల్సిన నొప్పే ప్రేమరా

అందరికి తెల్లారితే సూర్యోదయం
నాకు మాత్రం నిన్ను చూస్తేనే సూర్యోదయం

ముంచుతుంది ప్రేమ అమృత జలపాతంలో
తేల్చుతుంది ప్రేమ ఆకాశంలో
మొగ్గుతుంది ప్రేమ మమతల తులసిదళంతో
నెగ్గుతుంది ప్రేమ తలరాతతో
మనసు పుటల్లో వయసే రాసే రసవద్గీతే ప్రేమ
తలపులతో తలపండి వలపులనే తెగ వండి
ఎందరో మహానుభావులు చూపినదారి

తిరగాల్సిన మలుపే ప్రేమరా
తియ్యాల్సిన తలుపే ప్రేమరా

ఎదురుగా నువ్వుంటే గుండె దడ పెరుగుతుంది
దూరమైతే ఆగిపోతుందేమో
ఓ...ఓ...ఓహొ....
ఆడుతుంది ప్రేమ మనసుల మైదానంలో
పొంగుతుంది ప్రేమ మది దానంతో
ఓ...ఓ...ఓ... 
పాడుతుంది ప్రేమ ఊపిరి కచ్చేరిలో
పడుతుంది ప్రేమ దస్తూరితో
అడిగినవన్నీ మనకందించే అక్షయ పాత్రే ప్రేమ
కవితలనే దివ్వెలుగా భావనలే వెలుగులుగా
ఎందరో మహానుభావులు చుపిన దారి

ఎదగాల్సిన ఎత్తే ప్రేమరా
కలగాల్సిన మత్తే ప్రేమరా  
అమ్మతోడు నాన్నతోడు పాట సాహిత్యం

 
చిత్రం: సీతయ్య (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, చిత్ర 

ఓ పిల్లా.... ఓ పిల్లా.... ఓ పిల్లా.... ఓ పిల్లా....
అమ్మతోడు నాన్నతోడు నినుపుట్టించిన బ్రహ్మతోడు
వదలను నిన్నే ఓ పిల్లా, వదలను నిన్నే ఓ పిల్లా
మీ అమ్మ కాదన్నా మీ నాన్న కాదన్నా
ఆ బ్రహ్మ కాదన్నా వదలను నిన్నే ఓ పిల్లా
ఓ రాజా.... ఓరాజా...
కొమ్మతోడు రెమ్మతోడు కట్టుకు వచ్చిన కోకతోడు
మరువను నిన్నే ఓ రాజా 
ఓ రాజా.... ఓరాజా...

నీ తోడుంటే దీపావళీ నువ్వు ఊ అంటే ధూపావళీ
ఒక్కరు వుంటే ఏకాదశి జంటైతే కేకాదశి
సయ్యంటే ప్రతి సంద్యకి సుఖాల సంక్రాంతి
నువ్వుంటే ప్రతి రాతిరి అయ్యేను నవరాత్రి
నా తీగను అల్లితే నాగుల పంచమిలే
నీ సోకులు అందితే గోకుల అష్టమిలే
బ్రతుకంతా సీతా రాముల నవమే ఓ పిల్లా 
ఓ పిల్లా.... ఓ.... పిల్లా....

అమ్మతోడు నాన్నతోడు నినుపుట్టించిన బ్రహ్మతోడు
వదలను నిన్నే ఓ పిల్లా, 

బిడియాలతో బిల్లంగోడు పిల్లా నేడే ఆడేయనా
వయ్యారంతో ఓమనగుంటా ఆడించి ఓడించనా
పెద కోలాటాలే యివాళ ఆడాలి
గదుల్లో కోతి కొమ్మ గలాటా చూడాలి
చలిదాగుడు మూతల ఆటకు ముందుకు రా...
నను గుజగుజ రేకుల ఆటకు గుంజకురా
మనువాటే ఆడి మొగుడై పోరా ఓ రాజా 
ఓరాజా...ఓ...రాజా...
కొమ్మతోడు రెమ్మతోడు కట్టుకు వచ్చిన కోకతోడు....
మరువను నిన్నే ఓ రాజా మరువను నిన్న్ ఓ రాజా
ఏ కొమ్మాకాదన్నా ఏ రెమ్మా కాదన్నా నా కోకే కాదన్నా
మరువను నిన్నే .ఓ రాజా   
ఓ పిల్లా.... ఓ....పిల్లా
సమయానికి తగు సేవలు పాట సాహిత్యం

 
చిత్రం: సీతయ్య (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: విజయ్ ఏసుదాస్, సునీత 

సమయానికి తగు సేవలు సేయనీ నీ శ్రీవారినీ
సమయానికి తగు సేవలు సేయనీ నీ శ్రీవారినీ
ఇన్నాళ్ళుగా శ్రమియించిన ఇల్లాలిని 
ఇకసేవించనీ ఈ శ్రీవారినీ 

సమయానికి తగు సేవలు సేయనీ నీ శ్రీవారినీ

నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటతో
చెవిలోన గుసగుసల చిలిపి వలపు పాటతో
శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవ
బంగారు నగలు మించు బహు బంధాలతో
చలువ చందనాల మించు చల్లని నా చూపుతో
అర్ధాంగి కి జరిగేను అలంకార సేవ

అమ్మలోని బుజ్జగింపు కలిపిన ఈ బువ్వతో
నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో
నా పాపకు జరిగేను నైవేద్యసేవ నైవేద్యసేవ 

సమయానికి తగు సేవలు సేయనీ నీ శ్రీవారినీ

కలతలేని లోకంలో దిష్టిపడని దీవిలో
చెడుచేరని చోటులో ప్రశాంత పర్ణశాలలో
ఈ కాంతకు జరిగేను ఏకాంత సేవ
అనుబందమె బంధువై మమతలె ముత్తయిదువలై
ఆనంద బాష్పాలె అనుకోని అతిధులై 
సీతమ్మకు జరిగేను సీమంతపుసేవ

నులివెచ్చని నా ఎదపై పరిచేటి పాన్పులో
కనురెప్పల వింజామర విసిరేటి గాలితో
చూలాలికి జరిగేను జోలాలి సేవ జోజోలాలి సేవ
శ్రీవారికి ఒక మనవిని సేయనీ ఈ ప్రియదాసినీ
శ్రీవారికి ఒక మనవిని సేయనీ ఈ ప్రియదాసినీ
కనుతెరవగ మీరూపే చూడాలని
మీ కౌగిళ్లలో కనుమూయాలని 
ఈ కౌగిళ్ళలో కలిసుండాలని

Most Recent

Default