Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Iddaru (1997)



చిత్రం: ఇద్దరు (1997)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: ఆశా బోస్లే
నటీనటులు: మోహన్ లాల్, ప్రకాష్ రాజ్, ఐశ్వర్యా రాయ్, గౌతమి, రేవతి, టబు
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాత: మణిరత్నం
విడుదల తేది: 14.03.1997

వెన్నెలా వెన్నెలా వెళ్ళి రావే
వచ్చెనే మొదటి కాంక్ష
కన్నుల చల్లకే మధుర ధార
కలిగెనే ముద్దు కాంక్ష
తూలుతూ ఉన్నా తుళ్ళిపోతున్నా
కారణం నేనా నీవే నీవేలే

వెన్నెలా వెన్నెలా వెళ్ళి రావే
వచ్చెనే మొదటి కాంక్ష
కన్నుల చల్లకే మధుర ధార
కలిగెనే ముద్దు కాంక్ష
తూలుతూ ఉన్నా తుళ్ళిపోతున్నా
కారణం నేనా నీవే నీవే లే

ఎన్నెలా కన్నులా ఏదింత మత్తెక్కించే
ఎదకే ఎదురై హిమాలెన్నో కన్నుల పూసి
నీవేదో పెట్టంగా నేనేదో పూయంగా
ఒడి చేరే ప్రేమికా ఉసురే దోచా

వెన్నెలా వెన్నెలా వెళ్ళి రావే
వచ్చెనే మొదటి కాంక్ష
కన్నుల చల్లకే మధుర ధార
కలిగెనే ముద్దు కాంక్ష
తూలుతూ ఉన్నా తుళ్ళిపోతున్నా
కారణం నేనా నీవే నీవేలే

కన్నులే మూసినా కలలో వచ్చి వయసే గిల్లు
కౌగిళే చేరితే తెలవారుతుంది కాలం
వేసంగి వెన్నెల వేధించే కన్నుల
కవ్విస్తున్న కాంక్షలే కలిసే వరమా

వెన్నెలా వెన్నెలా వెళ్ళి రావే
వచ్చెనే మొదటి కాంక్ష
కన్నుల చల్లకే మధుర ధార
కలిగెనే ముద్దు కాంక్ష
తూలుతూ ఉన్నా తుళ్ళిపోతున్నా
కారణం నేనా నీవే నీవేలే



*******  *********   *********



చిత్రం: ఇద్దరు (1997)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: సంధ్య

పూనగవే పువ్వులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి
పూనగవే పువ్వులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి
అల పౌర్ణమి నవ్వులో ఒక మాసపు పువ్వులే
నీ ఒడిలో పూల వేళ నా బ్రతుకే పండగా
నా బ్రతుకే పండగా...

పూనగవే పువ్వులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి

విరబూసెను విరజాజే ఏ మంత్రం వేశావో
విరబూసెను విరజాజే ఏ మంత్రం వేశావో
చేబంతుల నీడలలో తెలుసుకుంటి నీ వలపే
ఒకనాడైనా శోధించావా అణువణువు ఉసురౌతాలే
అణువణువు ఉసురౌతాలే

పూనగవే పువ్వులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి

నీలవర్ణం సెలవంటే ఆకశమే గాలి కదా
నీలవర్ణం సెలవంటే ఆకశమే గాలి కదా
సూర్యుడునే వేకువ విడితే తొలిదిశకు తిలకమెలా
నన్నికపై విడిచావా నా ఉసురిక నిలవదులే
నా ఉసురిక నిలవదులే

పూనగవే పువ్వులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి
పూనగవే పువ్వులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి
అల పౌర్ణమి నవ్వులో ఒక మాసపు పువ్వులే
నీ ఒడిలో పూల వేళ నా బ్రతుకే పండగా
అహ హహ హా...



*********  *********   **********


చిత్రం: ఇద్దరు (1997)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: బాంబే జయశ్రీ, ఉన్నికృష్ణన్

శశి వదనే శశి వదనే స్వర నీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా

నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా

చరణం: 1
మదన మోహిని చూపులోన మాండు రాగమేలా
మదన మోహిని చూపులోన మాండు రాగమేలా
పడుచువాడినీ కన్న వీక్షణ పంచదార కాదా
అలా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం
అలా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం
చందనం కలిసిన ఊపిరిలో
కరిగే మేఘాల కట్టిన ఇల్లే

శశి వదనే శశి వదనే స్వర నీలాంబరి నీవా
సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగా రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా

నెయ్యం  వియ్యం ఏదేదైనా తనువు నిలువదేలా
నెయ్యం  వియ్యం ఏదేదైనా తనువు నిలువదేలా
నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేలా
ఒకే ఒక చైత్ర వేళ ఊరే వీడి పూతలాయే
ఒకే ఒక చైత్ర వేళ ఊరే వీడి పూతలాయే
అమృతం కురిసిన రాతిరివో
జాబిలి హృదయం జత చేరే

నవమదనా నవమదనా కలపకు కన్నుల
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా



*********  ********   ********



చిత్రం: ఇద్దరు (1997)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్

వి.డు.ద.ల,  వి.డు.ద.ల
వి.డు.ద.ల,  విడుదల
వి.డు.ద.ల,  విడుదల
వి.డు.ద.ల,  విడుదల
వి.డు.ద.ల,  విడుదల

కళ్ళగంతలు కట్టద్దోయి
కళ్ళను సైతం నమ్మద్దోయి
కాకే కోయిల కాలేదోయ్ ఛోడా
దాడీ ఉంటే ఠాగురా
మీసం ఉంటే గురజాడా
వేషాలకు ఏమారొద్దోయ్ ఛోడా
మన బతుకే బరువనకోయ్ - భయమొద్దులే
మనసుకు తెరలెందుకోయ్ - గురి ఉందిలే
తుది గెలుపు అదేలే ఏహే హే హే హే...

కళ్ళగంతలు కట్టద్దోయి
కళ్ళను సైతం నమ్మద్దోయి
కాకే కోయిల కాలేదోయ్ ఛోడా

వి.డు.ద.ల.. విడుదల (4)
ఛోడా...ఛోడా...లాలల్లాలల్లాలల్లాల
ఛోడా...ఛోడా...లాలల్లాలల్లాలల్లాల

మనిషీ మనసూ నా పక్షం
మలయానిలమే నా పక్షం
చిట్టి చిలుకలు నా పక్షం
చెట్లు కొమ్మలు నా పక్షం
ఎండే తుమ్ములు నా పక్షం
తెలుగింటమ్మలు నా పక్షం
దిక్కులెనిమిది నా పక్షం
ఇది కల కాదోయ్...
కడుపిరికే కత్తి ధలుకు
వీడు మాత్రం సత్యే శక్తి నమ్ముతాడోయ్
ఏకమౌతుంటే ఆకలి వర్గాలే
కొలువులు కోటలు క్షణమున మారే కాలం

కళ్ళగంతలు కట్టద్దోయి
కళ్ళను సైతం నమ్మద్దోయి
కాకే కోయిల కాలేదోయ్ ఛోడా
దాడీ ఉంటే ఠాగురా
మీసం ఉంటే గురజాడా
వేషాలకు ఏమారొద్దోయ్ ఛోడా

పోరాపో అనరాదోయ్
అది నా పతనం కాలేదోయ్
కనకం కాసు విసిరేస్తే
ఆ కాసుకు ధర్మం లొంగదులే
వెండి వానలిచ్చే మల్లె మేఘం
పిలుపుకు చినుకై పడుతుందా
విత్తులు శక్తి కాసుకు బలి కాదు
లొంగే పనిలేదు...
వెండి వెలుగే వచ్చు వరకే
తెలవారని చీకటి రాజ్యమురా
చురుకుమని మొదటి దిశ
చీకటింట చిచ్చుపెట్టి మాకు దక్కు వేకువమ్మా

కళ్ళగంతలు కట్టద్దోయి
కళ్ళను సైతం నమ్మద్దోయి
కాకే కోయిల కాలేదోయ్ ఛోడా
దాడీ ఉంటే ఠాగురా
మీసం ఉంటే గురజాడా
వేషాలకు ఏమారొద్దోయ్ ఛోడా
మన బతుకే బరువనకోయ్ - భయమొద్దులే
మనసుకు తెరలెందుకోయ్ - గురి ఉందిలే
తుది గెలుపు అదేలే ఏహే హే హే హే...

వి.డు.ద.ల.. విడుదల (4)
ఛోడా...ఛోడా...లాలల్లాలల్లాలల్లాల
ఛోడా...ఛోడా...లాలల్లాలల్లాలల్లాల

Most Recent

Default