Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Anand (2004) Telugu Songs Lyrics Album Cover

Anand (2004) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Anand (2004) Music : K. M. Radha Krishnan Starring : Raja Abel, Kamalinee Mukherjee Director : Sekhar Kammula Producers : Sekhar Kammula Release Date : 15 October 2004

Vachhe Vachhe Song Lyrics in Telugu – Anand (2004)

‘Vachhe Vachhe’ song from Anand (2004) movie is composed by K. M. Radha Krishnan and sung by Shreya Ghoshal

SONG INFORMATION
Movie : Anand (2004) Music : K. M. Radha Krishnan Lyricist : Veturi Singers : Shreya Ghoshal
చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: శ్రేయా గోషల్ వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్ గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయ్ తీరుస్తారా బాధ తీరుస్తారా గాలి వాన లాలి పాడేస్తారా చరణం: 1 పిల్ల పాపల వాన బుల్లి పడవల వాన చదువు బాధనే తీర్చి సెలవులిచ్చిన వాన గాలి వానతో కబడ్డి వేడి వేడి పకోడి ఈడు జోడు ఢీ ఢీ ఢీ తొడుండాలి ఓ లేడి ఇంద్రధనస్సులో తళుకుమనే ఎన్ని రంగులో ఇంతి సొగసులే తడిసినవి నీటి కోంగులో శ్రావణ మాసాలా జల తరంగం జీవన రాగాలకిది ఓ మృదంగం చరణం: 2 కోరి వచ్చిన ఈ వాన గోరు వెచ్చనై నాలోన ముగ్గుల సిగ్గు ముసిరేస్తే ముద్దు లాటలే మురిపాలా మెరిసే మెరిసే అందాలు తడిసే తడిసే పరువాలు గాలి వానలా పందిళ్లు కౌగిలింతలా పెళ్లిల్లు నెమలి ఈకలా ఉలికి పడే ఎవరి కన్నుల్లో చినుకు చాటునా చిటికెలతో ఎదురు చూపులో నల్లని మేఘాలా మెరుపులందం తీరని దాహాలా వలపు పందెం

Yamunatheeram Song Lyrics in Telugu – Anand (2004)

“Yamunatheeram” from the movie Anand (2004) is composed by K. M. Radha Krishnan and sung by K.S.Chithra, Hariharan

SONG INFORMATION
Movie : Anand (2004) Music : K. M. Radha Krishnan Lyricist : Veturi Singers : K. S. Chithra, Hariharan

చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: హరిహరన్ , చిత్ర పల్లవి: యమునా తీరం సంధ్యా రాగం నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో నిలువగనే తేనెల్లో పూదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో చరణం: 1 ప్రాప్తమనుకొ ఈ క్షణమే బ్రతుకులాగ పండెననుకొ ఈ బ్రతుకే మనసు తీరా శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమ హృదయంలా తననైనా మరిచేదే ప్రేమ మరువుకుమా ఆనందం ఆనందం ఆనందమాయేటి మనసు కథా మరువుకుమా ఆనందం ఆనందం ఆనందమాయేటి మనసు కథా చరణం: 2 ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం శిశిరంలో చలి మంటై రగిలెదే ప్రేమ చిగురించే ఋతువళ్ళే విరబూసే ప్రేమ మరువుకుమా ఆనందం ఆనందం ఆనందమాయేటి మధుర కథా మరువుకుమా ఆనందం ఆనందం ఆనందమాయేటి మధుర కథా

Nuvvena Naa Nuvvena Song Lyrics in Telugu – Anand (2004)

“Nuvvena Naa Nuvvena” from the movie Anand (2004) is composed by K. M. Radha Krishnan and sung by Shreya Ghoshal, K.M. Radha Krishnan

SONG INFORMATION
Movie : Anand (2004) Music : K. M. Radha Krishnan Lyricist : Veturi Singers : Shreya Ghoshal, K.M. Radha Krishnan

చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: శ్రేయా గోషల్, కె.యమ్. రాధాకృష్ణన్ పల్లవి: నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా సూర్యుడల్లె సూది గుచ్చే సుప్రభాతమేనా మాటలాడే చూపులన్ని మౌనరాగమేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన దూరమైన ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా చరణం: 1 మేఘమల్లె సాగి వచ్చి దాహమేదో పెంచుతావు నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు కలలేనా కన్నీరేనా తేనెటీగ లాగ కుట్టి తీపి మంట రేపుతావు పువ్వులాంటి గుండెలోన దారమల్లె దాగుతావు నేనేనా నీ రూపేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన దూరమైన ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా చరణం: 2 కోయిలల్లే వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు కొమ్మగొంతులోన గుండె కొట్టుకుంటే నవ్వుతావు ఏ రాగం..ఇది ఏ తాళం మసక ఎన్నెలల్లె నీవు ఇసుక తిన్నె చేరుతావు గసగసాల కౌగిలంత గుసగుసల్లె మారుతావు ప్రేమంటే నీ ప్రేమేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన దూరమైన ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా

Charumati I Love You Song Lyrics in Telugu – Anand (2004)

“Charumati I Love You” from the movie Anand (2004) is composed by K. M. Radha Krishnan and sung by Lucky Ali

SONG INFORMATION
Movie : Anand (2004) Music : K. M. Radha Krishnan Lyricist : Veturi Singers : Lucky Ali

చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: లక్కీ ఆలి చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు (2) రూపవతి ఐ లవ్ యు నేను నీకె ఏక్ లవ్యు  A E I O U అన్ని ఐ లవ్ యు  లవ్ యు లవ్ యు   చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు   ఎదనె నీవు నిదరె లేపి ఎదురైనావు తొలి ప్రేమల్లె  కునుకె రాని ఉలుకై తీపి కలవైనావు ఎద నీడల్లె  అడిగా నిన్ను వరమిస్తావా  విడిగ నన్ను వదిలేస్తావా  Yes No Yes No చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు  (2) ఫ్లవరై విచ్చి కలరె ఇచ్చి వికసించావు తొలి ఊహల్లొ  చెలిమై వచ్చి చెలిగా నచ్చి ఉసిగొల్పావు నడి జాముల్లొ  క్షణమె నేను యుగమౌతావ  సఖివై నాకు సగమౌతావ  Yes No Yes No చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు  (2) రూపవతి ఐ లవ్ యు నేను నీకె ఏక్ లవ్యు  A E I O U అన్ని ఐ లవ్ యు  లవ్ యు లవ్ యు చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు 

Telisi Telisi Song Lyrics in Telugu – Anand (2004)

“Telisi Telisi” from the movie Anand (2004) is composed by K. M. Radha Krishnan and sung by Shreya Ghoshal

SONG INFORMATION
Movie : Anand (2004) Music : K. M. Radha Krishnan Lyricist : Veturi Singers : Shreya Ghoshal

చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: శ్రేయా గోషల్ పల్లవి: తెలిసి తెలిసి వలలో పడెనే వయసు తలచి వలచి కలలే కనెనే మనసు తనువున ఎన్నో తపనలు రేగే తహ తహలోనే తకదిమి సాగే చరణం: 1 పొద్దసలే పోక నిద్దుర పోనీక ఎవ్వరిదో కేక ఎదలోతులదాక భారమాయె యవ్వనం బోరు కొట్టే జీవితం రగిలేటి విరహాన రాధల్లె నేనున్నా నీగాలి సోకేనా నా ఊపిరాడేనా తెలిసి తెలిసి వలలో పడెనే వయసు తలచి వలచి కలలే కనెనే మనసు అది ఒక ఇదిలే ఇదిలే ఏదోలే చరణం: 2 నాకొద్దీ దూరం వెన్నెల జాగారం బాత్రూం సంగీతం లేత ఈడు ఏకాంతం కోపమొచ్చే నామీద తాపమాయె నీ మీద దేహాలు రెండైన ప్రాణాలు నీవేగా విసిగించు పరువాన విధిలేక పడివున్న తెలిసి తెలిసి వలలో పడెనే వయసు తలచి వలచి కలలే కనెనే మనసు

Yedalo Ganam Song Lyrics in Telugu – Anand (2004)

“Yedalo Ganam” from the movie Anand (2004) is composed by K. M. Radha Krishnan and sung by K.S.Chithra, Hariharan

SONG INFORMATION
Movie : Anand (2004) Music : K. M. Radha Krishnan Lyricist : Veturi Singers : K.S.Chithra, Hariharan

చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: హరిహరన్ , చిత్ర ఎదలో గానం పెదవే మౌనం  సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో  మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో  చరణం: 1 కట్టుకథలా ఈ మమతే కలవరింత  కాలమొకటే కలలకైనా పులకరింత  శిల కూడా చిగురించే విధి రామాయణం విధికైనా విధిమార్చే కథ ప్రేమాయణం  మరవకుమా వేసంగి ఎండల్లో పూసేటి మల్లెల్లో మనసు కథ ఎదలో గానం పెదవే మౌనం  సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో  మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగా వర్ణాలలో అలజడిలో చరణం: 2 శ్రీగౌరి చిగురించే సిగ్గులెన్నో  శ్రీగౌరి చిగురించే సిగ్గులెన్నో  పూచే సొగసులో ఎగసిన ఊసులు మూగే మనసులో అవి మూగవై  తడి తడి వయ్యారాలెన్నో ప్రియా ప్రియా అన్న వేళ

Most Recent

Default