Search Box
Pellaindi Kaani (2007)
చిత్రం: మా అన్నయ్య బంగారం (2010)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం:
గానం: కార్తీక్ , ప్రియదర్శిని
నటీనటులు: రాజశేఖర్, కమలినీ ముఖర్జీ, రోహిత్, ఆదిత్య ఓం
దర్శకత్వం: జొన్నగడ్డల శ్రీను
నిర్మాత: నట్టి కుమార్
విడుదల తేది: 31.07.2010
పల్లవి:
అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
ఉల్లాసాలే నువ్వుండే ఊరు
అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
ఉల్లాసాలే నువ్వుండే ఊరు
ఆనంద రాజ్యపు రాణివి నీవు
నాముందు నిలిచావు
అదృష్ట గీతాల భాణీవు నీవు
నాలోన పలికావు
అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
ఉల్లాసాలే నువ్వుండే ఊరు
చరణం: 1
మేఘాలకు విలువేముంది నీ కురులై మెరవకపోతే
గగనాన్నే వదిలేసి కలిశాయంట నీలో
ముత్యాలకు విలువేముంది నీ మాటై వెలకపోతే
సంద్రాన్నే విడిచేసి చేరాయంట నీలో
పువ్వుకు విలువేముంది నీ నవ్వై నిలవక పొతే
నవ్వుకు విలువేముంది నువు నవ్వకుంటే
నువ్వేలేని నాకు విలువేది
యవ్వనమంటు నీది అన్నాలే
అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
ఉల్లాసాలే నువ్వుండే ఊరు
చరణం: 2
సూర్యుడికే వెలుగొచ్చింది నీ చూపులు సోకంగానే
లోకాన్నే లెమ్మంటు చూపించాడు నిన్నే
కోవెలకే వెలిగొచ్చింది నీ అడుగులు తాకంగానే
దైవాలే మేల్కొంటు దీవించేను నిన్నే
కలలకు వెలుగొచ్చింది కనులెదుటే నువ్ కనిపించి
కవితకు వెలిగొచ్చింది నిను వర్ణించి
నేనే నీతో వెలిగాలే నాలో వెలుగు నీవనేదిలే
అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
ఉల్లాసాలే నువ్వుండే ఊరు
ఆనంద రాజ్యపు రాణివి నీవు
నాముందు నిలిచావు
అదృష్ట గీతం భాణీవు నీవు నాలోనే పలికావు
అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
ఉల్లాసాలే నువ్వుండే ఊరు
Maa Annayya Bangaram (2010)
చిత్రం: క్లాస్ మేట్స్ (2007)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్లికార్జున, అంజనా సౌమ్య
నటీనటులు: సుమంత్, రవివర్మ, శర్వానంద్, సదా, కమిలిని ముఖర్జీ
దర్శకత్వం: కె.విజయభాస్కర్
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 20.04.2007
గుండెచాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ
ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోనీ - నిన్ను కలుసుకోనీ
నిన్ను కలుసుకోనీ విన్నవించుకోనీ ఇన్నాళ్ళ ఊసులన్నీ
నీలిమబ్బులో నిలచిపోకలా నింగి రాగమాల
మేలిముసుగులో మెరుపుతీగలా దాగి ఉండనేల
కొమ్మ కొమ్మలో పూలుగా దివిలోని వర్ణాలు వాలగ
ఇలకు రమ్మని చినుకుచెమ్మని చెలిమి కోరుకోనీ - నిన్ను కలుసుకోనీ
రేయిదాటని రాణివాసమా అందరాని తార
నన్నుచేరగ దారిచూపనా రెండు చేతులార
చెదిరిపోని చిరునవ్వుగా నా పెదవిపైన చిందాడగ
తరలిరమ్మని తళుకులిమ్మని తలపు తెలుపుకోనీ - నిన్ను కలుసుకోనీ
******** ********* ********
చిత్రం: క్లాస్ మేట్స్ (2007)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చైత్ర , హేమచంద్ర
మౌనమెందుకు మాటాడవెందుకు
దూరమెందుకు దరిచేరవెందుకు
ఎదమారుమూల దాగివున్నమాట దాచి ఉంచకు
ఎదురైన వేళ అదుపుదాటి చేరవెందుకు
అంత బిగువా మెట్టుదిగవా ఎంత ఇష్టం ఉన్నా పైకి చెప్పవా
ఇంత తెగువా మాటవినవా కొంత కష్టమైనా కాస్త ఆగవా
మది నాకు చెప్పకుండ నీ వెంట పడ్డది
మన చేతిలోన ఉంద ఈ ప్రేమ పద్ధతి
తప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకు
దారేమి ఉన్నది నిను తప్పుకొందుకు
నందకిషోరా నవనీతచోరా నవమన్మదాధారా రారా నన్నేలుకోవేరా
చెయ్యందుకోరా శృంగారశూరా చేరంగరావేరా కృష్ణా చెట్టెక్కిదిగవేరా
రెచ్చగొట్టినా నవ్వుతున్నదే మత్తు కమ్మేసిందా కన్నెమనసుని
ఎంత కుట్టినా కెవ్వుమనదే పువ్వు పొమ్మంటుందా తేనెటీగని
నిను చూడకుంటె ప్రాణం ఇక నిలువనన్నది
పదునైన పూలబాణం నను తాకుతున్నది
దారేమి ఉన్నది నిను తప్పుకొందుకు
తప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకు
******** ********* ********
చిత్రం: క్లాస్ మేట్స్ (2007)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హేమచంద్ర
భూగోళంతో బంతాట ఆడాలంది మన పాదం
పూబాణంలా అందాలే వేటాడాలంది ప్రాయం
పడిలేస్తూ మనవెనకాలే తడబడిపోతుంటే కాలం
ఆనందోబ్రహ్మ అంది మన వేగం
కథలోకింక అద్భుతం ఎదురయేదాక వెతుకుదాం
పదమందీ నవయవ్వనంలో పసితనం
దొరుకుతుందా అది అడగదే మన నమ్మకం
కలనైనా తరిమేగుణం మన లక్షణం
నిజమైనా కలలాంటిదే మనకీక్షణం
అదుపులోలేని పరుగులం రసతరంగాన ఉరుములం
మనకింకా తెలియదు కద భయమన్నది
పిల్లగాలై ఎదురేగుదాం గగనానికి
ఎగరేద్దాం చిరునవ్వుని నలువైపులా
స్వాగతిస్తాం స్వర్గాలనే మనవైపిలా
Classmates (2007)
చిత్రం: గోదావరి (2006)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: ఉన్నికృష్ణన్, చిత్ర
నటీనటులు: సుమంత్ , కమిలినీ ముఖర్జీ , నీతూ చంద్ర
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
నిర్మాత: జి. వి.జి. రాజు
విడుదల తేది: 19.05.2006
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ... ఆ మాట దాచా కాలాలు వేచా
నడిచా నేనే నీడలా...
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
అ...చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు
కన్నీరైనా గౌతమి కన్నా
తెల్లారైనా పున్నమి కన్నా
మూగైపోయా నేనిలా...
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా
కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననా
నీ జతలోనే బ్రతుకనుకోనా
రాముని కోసం సీతలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ... ఆ మాట దాచా కాలాలు వేచా
నడిచా నేనే నీడలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
******** ********* ********
చిత్రం: గోదావరి (2006)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు
షడ్జమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శృతి శిఖరే నిగమ ఝరే స్వరలహరే
సా స పా ప ప ప ప మ రి స స ని స
సా స పా ప ప ప ప మ ద ప ప
సా స పా ప ప ప ప మ రి స స ని స
సా స పా ప ప ప ప మ ని ద ప
ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
ఏసెయ్ చాప జోర్సేయ్ నావ వార్సేయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా
ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయ్యంగానె లాభసాటి బేరం
ఇళ్ళే వోడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ?
నది ఊరేగింపులో పడవ మీద రాగా
ప్రభువు తాను కాదా
ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు
లంకానాధుడింకా ఆగనంటు పండు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి
లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపి కొండలా నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా
ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
ఏసెయ్ చాప జోర్సేయ్ నావ వార్సేయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా
ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరీ
******** ********* ********
చిత్రం: గోదావరి (2006)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: సునీత
అందంగాలేనా అసలేం బాలేనా
అంత లెవలెందుకోయ్ నీకు ఉఁ
అందంగాలేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా
అందంగాలేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా
అలుసైపోయానా అసలేమి కానా
వేషాలు చాల్లే పొమ్మనా
అందంగాలేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా
కనులు కలపవాయే మనసు తెలుపవాయే
పెదవి కదపవాయే మాటవరసకి
కలికి చిలకనాయే కలత నిదురలాయే
మరువలేక నిన్నే మదనపడితినే
ఉత్తుత్తిగా చూసి ఉడికించవేలా
నువ్వోచ్చి అడగాలి అన్నట్టు
నే బెట్టు చేసాను ఇన్నాళ్ళుగా
అందంగాలేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా
నీకు మనసు ఇచ్చా ఇచ్చి నపుడే నచ్చా
కనుల కబురు తెచ్చా తెలుసు నీకదీ
తెలుగు ఆడపడచు తెలుపలేదు మనసు
మహాతెలియనట్టు నటనలే అది
ఎన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను
తరగల్లే నురగల్లే ఏనాడు
తాకేసి తడిపేసిపోలేదుగా
అందంగాలేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా
అందంగాలేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా
అలుసైపోయానా అసలేమి కానా
వేషాలు చాల్లే పొమ్మనా
అందంగాలేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా
******** ********* ********
చిత్రం: గోదావరి (2006)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: శ్రేయ గోషల్
టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు
గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు
చెంగుమన్న నీటి జింకలు
జిల్లు జిల్లున జల్లు ముద్దులు
చేసిపోయే ముద్ద ముద్దగా
మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు
కళ్ళలోన కన్ను గీటగా
గాలుల మేడల చినుకుమన్న జాడలా
టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు
గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు
చెంగుమన్న నీటి జింకలు
గాలి వాన తోడై వచ్చీ ఊయ్యాలూపగా
వాన రేవు పిల్ల పెద్ద సయ్యాటాడగా
గూటి పడవలో కోటి జంటలు
కూత పెట్టు లేత వలపులు
లంగరేసినా అంది చావని
రంగసాని చాటు పిలుపులు
రాకడో పోకడో రాములోరికెరుకలే
టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు
గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు
చెంగుమన్న నీటి జింకలు
ఏరు నీరు ఓ దారైతే ఎదురీదాలిలే
ఎండా వాన కొండా కోనా నీళ్ళాడాలిలే
ఘల్లు ఘల్లున సాని కిన్నెర
ఓటమింక గజ్జె కట్టెలే
నింగి నంటని గంగ వంటిది
పండు ముసలి శబరి పళ్ళివే
వాన రా ఓ నరా తోకలేని వానరా
టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు
గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు
చెంగుమన్న నీటి జింకలు
జిల్లు జిల్లున జల్లు ముద్దులు
చేసిపోయే ముద్ద ముద్దగా
మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు
కళ్ళలోన కన్ను గీటగా
గాలుల మేడల చినుకుమన్న జాడలా
టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు
గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు
చెంగుమన్న నీటి జింకలు
******** ********* ********
చిత్రం: గోదావరి (2006)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: గాయత్రి
నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ...
మధురవదన నళిననయన మనవి వినరా రామా
రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట
రామ చక్కని సీతకి...
చరణం: 1
ఉడుత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుడి విల్లును ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో
రామ చక్కని సీతకి...
చరణం: 2
ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పి చెప్పలేమని కనులు చెప్పి
నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు
రామ చక్కని సీతకి...
చరణం: 3
చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలిచే
చూసుకోమని మనసు తెల్పి మనసు మాటలు కాదుగా
రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకా ఎవరో మొగుడంట
ఇందువదన కుందరదన మందగమన భామా
ఎందువలన ఇందువదన ఇంతమధన... ప్రేమా...
******** ********* ********
చిత్రం: గోదావరి (2006)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: శంకర్ మహదేవన్, చిత్ర, కె.యమ్. రాధాకృష్ణన్
విధి లేదు ఇది లేదు ప్రతి రోజు నీదేలేరా
పడిలేచే కెరటాల సరిజోడి నీవేలేరా
ఈ దేశం అందించే ఆదేశం నీకేరా
ఈ శంఖం పూరించే ఆవేశం రానిరా
రేపు మాపు నీవేరా
మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవెరా
తలకుల తారల్లో వెలుగుల ధారల్లో
తలకుల తారల్లో వెలుగుల ధారల్లో
మనసా గెలుపు నీదేరా.... నీదేరా...
చరణం: 1
మనస్సులోనే మార్గముంది తెలుసుకోర ఇక
పూరి లేని దేని బాణమింక చేరుకోదు ఎలా
ప్రతి రోజు నీకొక పాఠమే
చదువుకుంటూ పద
ఇక నిన్ను నీవు మోసగిస్తూ మోసపోతే వృదా
చరణం: 2
ఆమనొస్తే కొమ్మల్లన్ని కోయిలమ్మలు కదా
ఆమె నీకై సాగి వస్తే ప్రేమ ఋతువే సదా
దేవుడైన రాముడైనది ప్రేమ కోసం కదా
ప్రతి జీవితం ఓ వెలుగు నీడల
బొమ్మలాటే కదా
Godavari (2006)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: నాగార్జున, శ్రీకాంత్
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
నిర్మాతలు: మహేష్ రెడ్డి, గిరీష్ రెడ్డి
విడుదల తేది: 06.09.2012
Songs List:
దత్తాత్రేయుని అవతరణం పాట సాహిత్యం
చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: శ్రీ వేదవ్యాస
గానం: యమ్. యమ్. కీరవాణి
దత్తాత్రేయుని అవతరణం భక్తబృంద భవతరణం
సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం
దత్తాత్రేయుని అవతరణం భక్తబృంద భవతరణం
సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం
అలా ఒకనాడు అనంత విశ్వమున అద్భుతమే జరిగింది
పరమ పతివ్రత ఎవరని పార్వతి పరమేశుని అడిగింది
బ్రహ్మ మానస పుత్రుడైన ఆ అత్రి మహాముని పత్ని
అనసూయ పరమసాధ్వి అని పలికెను ఉమాపతి
అది విని రగిలిన ముగురమ్మలు అసూయా జలధిని మునిగి
అనసూయనే పరీక్షింపగా తమ తమ పతులను పంపిరి
దత్తాత్రేయుని అవతరణం భక్తబృంద భవతరణం
సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం
అతిధి రూపములు దాల్చిన మువ్వురు మూర్తులనాసతి కొలిచినది
దిగంబరముగా వడ్డింపమనిన దిక్పతులను చూసి
దిగ్ర్బాంతి చెందినది
కాలమూర్తులను చంటి పాపలుగ మార్చి వివస్త్రగ వెలిగినది
పరమ సాధ్వి పరమాత్మలకే పాలు ఇచ్చి పాలించినది
పతులు పసిపాపలైరని తెలిసి లక్ష్మీ సరస్వతి పార్వతులు పరితపించిరి
గొల్లుమనుచూ పతిభిక్ష పెట్టమని కొంగుచాచి యాచించిరి
అనసూయ పాతివ్రత్యంతో పాలకులోకటిగ బాసిల్లిరి
తమ తమ పతులెవరో తెలియక ముగ్గురమ్మలే మొరడిలిరి
ముగురు మూర్తులను ముగ్గురమ్మలకు ఇచ్చి అనసూయ అత్తయైనది
బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అంశ అత్రిముని దత్తమైనది
అత్రిముని దత్తమైనది
దత్తాత్రేయుని అవతరణం భక్తబృంద భవతరణం
సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం
సృష్టి స్థితి లయ కారకులౌ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు
ఒకే దేహమున వరలగా
అన్ని ధర్మముల ఆలవాలముగా ఆవు పృష్ఠమున అలరగా
నాల్గు వేదముల నడివడిగా నాల్గు శునకములు నానుడిగా
సమర్థ సద్గురు అంశమే ఆ దత్తుని ఐదు అంశములై
ధర వెలిగే ధర్మ జ్యోతులుగా
ధర వెలిగే ధర్మ జ్యోతులుగా
ధర వెలిగే ధర్మ జ్యోతులుగా
నీ పదముల ప్రభవించిన పాట సాహిత్యం
చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యమ్. యమ్. కీరవాణి
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు
సాయినాథ మహరాజ్ కీ జై
పల్లవి:
నీ పదముల ప్రభవించిన గంగా యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణా
సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణా
ఏ క్షేత్రమైనా తీర్థమైన నీవేగా
ఓ జీవమైనా భావమైన నీవేగా
నీవులేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ
నీవులేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ
సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణా
చరణం: 1
మనుజులలో దైవము నువ్వు
కోసల రాముడివై కనిపించావూ
గురి తప్పని భక్తిని పెంచావు
మారుతిగా అగుపించావూ
భక్త సులభుడవై కరుణించావూ
భోళా శంకరుడిగ దర్శనమిచ్చావు
ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు
ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు
ఏకమనేకమ్ముగ విస్తరించినావు
ఏకమనేకమ్ముగ విస్తరించినావు
నీవు లేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయి
నీవు లేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ
కృష్ణా... రాధాకృష్ణా హే కృష్ణా
తనువులన్ని నీవుకాచుకోలేనురా కృష్ణా
త్రోవచూపు తోడు నీవే కృష్ణా
తలపులన్ని నీవరనా పోలేమురా
తరలిపోని తావి నీవే కృష్ణా
జగదేక జ్ఞానమూర్తి వసుదైక ప్రాణకీర్తి
తరగపోని కాంతి నీవే నంద నందనా
నీవులేని చోటులేదు కృష్ణా
ఈ జగమంతా నీవేలే కృష్ణా
నీవులేని చోటులేదు కృష్ణా
ఈ జగమంతా నీవేలే కృష్ణా
సాయి అంటే తల్లి పాట సాహిత్యం
చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి. బాలు, సినీత
పల్లవి:
సాయి అంటే తల్లి
బాబా అంటే తండ్రి
సాయి బాబా తోడేలేక
తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము
రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యాము
నువ్వోస్తావన్న ఆశతో
బ్రతికొస్తావన్న ఆశతో
జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము
కోటి చుక్కలమయ్యాము
కన్నీటి చుక్కుల మయ్యాము
తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము
రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యాము
చరణం: 1
బోథలు చేసేదెవరు మా బాధలు బాపేదెవరు
లీలలు చూపేదెవరు మాతో గోళీలాడే దెవరు
బోథలు చేసేదెవరు మాలో బాధలు బాపేదెవరు
లీలలు చూపేదెవరు మాతో గోళీలాడే దెవరు
పాటలు పాడేదెవరు మా పొరపాటులు దిద్దేదెవరు
పాటలు పాడేదెవరు మా పొరపాటులు దిద్దేదెవరు
తీయగ కసిరేదెవరూ...
తీయగ కసిరేదెవరు ఆపై ప్రేమను కొసరేదెవరు
సాయి... జీవం పోసే నువ్వే నిర్జీవుడవైనావా?
నువు కన్నులు తెరిచేదాకా మా కంటికి కునుకేరాదు
తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము
రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యాము
చరణం: 2
మాకిచ్చిన నీ విబూదిని నీకూ కాస్త పూసేమయ్యా
లేవయ్యా సాయి లేవయ్యా
నీ చేతిచిన్నికర్రతో నిన్నే తట్టి లేపేమయ్య
లేవయ్యా బాబా లేవయ్యా
ఇన్నాళ్లు నువ్వడిగావు మానుండి భిక్షని
ఇన్నాళ్లు నువ్వడిగావు మానుండి భిక్షని
యివ్వాళ మేమడిగేము నీ ప్రాణ భిక్షని
నీ ప్రాణ భిక్షని
యిచ్చేవరకు ఆగలేము
యిచ్చేవరకు ఆగలేము
నువ్వొచ్చేవరకు వూరుకోము
వచ్చే వరకు వూరుకోము
పచ్చి మంచినీరైనా తాకబోము
సాయి అంటే తల్లి
బాబా అంటే తండ్రి
సాయి బాబా నీ తోడేలేక
తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము
రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యాము
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి (13)
ఒక్కడే సూర్యుడు పాట సాహిత్యం
చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: శంకర్ మహాదేవన్
సబ్ కా మాలిక్ ఏక్ హై
ఒక్కడే సూర్యుడు
ఒక్కడే చంద్రుడు
ఒక్కడే ఆ దేవుడు
రాముడే దేవుడని కొలించింది మీరు
ఏసునే దైవమనీ తలచింది మీరు
అల్లా అని ఎలుగెత్తి పిలించింది మీరూ
ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా
ఏ తీరుగా ఎవరు పూజించినా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
కాషాయ ధ్వజమునెత్తి ప్రణవ గంగ గలగలలను హిందూమతమన్నావు నీవు
ఆకుపచ్చ కేతనాన చంద్రవంక తళతళలను ఇస్లాము అన్నావు నీవు
శిలువపైన ఏసు రక్త కన్నీళ్ళతొ ఎదను తడిసి క్రైస్తవమని అన్నావు నీవు
బౌద్ధమని జైన మని సిక్కు అని ఒప్పుకునే పలు గుండెల పలుగొంతుల పలుకేదైనా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
రాజు పేద బేధమెపుడు చూపబోదు గాలీ
అది దేవదేవునీ జాలీ...
పసిడి మేడనీ పూరి గుడిసనీ బేధమెరిగి కురియబోదు వానా
అది లోకేశ్వరేశ్వరుని కరుణా
సాటి మానవాళి హృదయ ఆలయాల కొలువు దీరి ఉన్నాడు ఆ స్వయంభువుడు
కులం అని మతం అని జాతులని భ్రాంతి విడు
ప్రతి అణువున తన రూపమె ప్రతిబింబముగా
ప్రతి జీవిని పరమాత్మకు ప్రతి రూపముగా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవదేవుడు
ఓం సాయి శ్రీ సాయి పాట సాహిత్యం
చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: మేడిచెర్ల
గానం: సునీత
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
సాయీ శిరిడి సాయి శిరిడి సాయీ
శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
సాయి కథా శ్రవణం సకల పాప హరణం
సాయి కథా శ్రవణం సకల పాప హరణం
సాయి దివ్య చరణం భాగీరధీ సమానం
సాయి దివ్య చరణం భాగీరధీ సమానం
సాయి దివ్య నామం భవతారక మంత్రం
శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
సాయి కథా శ్రవణం సకల పాప హరణం
యోగి ఓలే భిక్షాటన చేసి
మా పాలకు జోలిపట్టే భిక్షువు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
నీటితోనే జ్యోతులు వెలిగించి
తెరిపించెనులే జ్ఞాన చక్షువు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
రగిలే ధునిలో... చేతులు ఉంచి
పసి పాపను ఆదుకున్న ఆత్మబంధువూ
శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
సాయి కథా శ్రవణం సకల పాప హరణం
శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
సాయి కథా శ్రవణం సకల పాప హరణం
సేవించిన రోగుల దీవించి
వైద్యో నారాయణో హరి అని నిలిచాడు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
జన్మనిచ్చు తల్లికే ఊపిరులూది
పునర్జన్మ ప్రసాదించినాడు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
తిరగలి విసిరి... వ్యాధిని కసిరి
ఆపదనే తప్పించిన దీనబంధువు
శరణు శరణు శరణం గురుసాయి నాధ శరణం
సాయి కథా శ్రవణం సకల పాప హరణం
ఎక్కడయ్యా సాయి ఎడనున్నావోయీ
నడవలేకున్నాను ఎదురుపడవోయీ
నిను చూడందే నా మనసు కుదుటపడదాయె
ఎపుడు చూసినా ఆత్మధ్యానమే కానీ నీ ఆకలే నీకు పట్టదా
ఏ జన్మ బంధమో మనది ఏనాటి రుణమో ఇది పట్టవయ్యా సాయి
ప్రతిరూపం తన ప్రతిరూపమని
యుగాలకే మోక్షమిచ్చే మౌని
పెను తుఫానులే విరుచుకుపడగా
బీతిల్లిన జనులు పరుగులిడగా
ఆగిపోమ్మని ఆజ్ఞపించినా
గోవర్థన గిరిధారి షిరిడి పుర విహారీ
ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయీ
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయీ
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయీ
అమరా రామా పాట సాహిత్యం
చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: కె. శివశక్తిదత్త
గానం: శ్వేతా పండిట్
అమరా రామా సుమా రామచరి
కామధేను క్షీరాలతో
సాయినాధుని పావనమూర్తికి
అభిషేకం క్షీరాభిషేకం
అభిషేకం క్షీరాభిషేకం
సురకల్పలతా సురభిడ సుమాలా
సురుచర సుమధుర మకరందంతో
సాయినాధుని మంగళమూర్తికి
అభిషేక్షం మధురాభిషేకం
అభిషేక్షం మధురాభిషేకం
మలయమై దర శిఖరవనంతార
చందన శీతల గంధంతో
సాయి నాధుని సుందరమూర్తికి
అభిషేక్షం చందనాభిషేకం
అభిషేక్షం చందనాభిషేకం
శ్రీహరి పదరాజీవ సముద్భవ
గగన గంగ పావన శ్రీకరముల
సాయి నాధుని శ్రీకర మూర్తికి
అభిషేకం నీరాభిషేకం
సాయి నాధుని శ్రీకర మూర్తికి
అభిషేకం నీరాభిషేకం
నీ భవహీజ సమీప ధూనీగత
ఆ దివ్యది నిరోధి ఊదితో
నీ భవహీజ సమీప ధూనీగత
ఆ దివ్యది నిరోధి ఊదితో
సాయినాధుని తేజోమూర్తికి అభిషేక్షం
పూజాభిషేఖం
సాయినాధుని తేజోమూర్తికి అభిషేక్షం
పూజాభిషేఖం
జయహో సాయి జయం జయం
నీ పదకమలములకు జయం జయం
జయహో సాయి జయం జయం
నీ పదకమలములకు జయం జయం
జయహో సాయి జయం జయం
నీ పదకమలములకు జయం జయం
మానవ సేవే పాట సాహిత్యం
చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: యమ్. యమ్. కీరవాణి
గానం: దీపు
మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా
మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి శ్రీ సాయిబాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా
మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి శ్రీ సాయిబాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా
మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా
చరణం: 1
మమతా కరుణా తనరక్తం
తరగని సహనం ఊపిరిగా
పలికే పలుకే వేదంగా
ప్రియభాషణమే మంత్రముగా
ప్రేమే సత్యమని, ప్రేమే దైవమని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వమూర్తి శ్రీ సాయిబాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా
మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా
చరణం: 2
సిరి సంపదలు ఎన్నున్నా
శీలం విలువ చేయవని
సుఖభోగములే నీవైనా
దొరకని ఫలమే శాంతమని
ప్రేమే సాధనరా బ్రతుకే ధన్యమని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి శ్రీ సాయిబాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా
మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా
ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా
ఎక్కడయ్యా సాయి పాట సాహిత్యం
చిత్రం: షిరిడిసాయి (2012)సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: మేడిచెర్ల
గానం: సునీత
ఎక్కడయ్యా సాయి ఎడనున్నావోయి
కడసారి కనులార దర్శనమునీయి
నీలోని ఈ ఆత్మ కలసిపోనీ
ఈ జన్మకిది చాలునోయి
నీ ఒడిలో కనుమూయానీ
సదానింబ వృక్షస్య పాట సాహిత్యం
చిత్రం: షిరిడిసాయి (2012)సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: ట్రెడిషనల్
గానం: యమ్. యమ్. కీరవాణి
సదానింబ వృక్షస్య మూలాది వాసాత్
సుధా స్రావిణం తిక్త మప్యప్రియంతం
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నామామీశ్వరం సద్గురుం సాయినాథం
Sadaa nimbavrikshasya muladhivasat
Sudha sravinam tikthamapya priyantam
Tarum kalpavrikshadhikam saadhayantam
Namaameeswaram sadgurum sai nadham
రామనవమి పాట సాహిత్యం
చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: శ్రీ వేదవ్యాస
గానం: హరిచరణ్ , మాళవిక
శ్రీ రామా జయ రామా రమణీయ నామ రఘురామా (5)
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రామనవమి చెప్పింది రామకథా సారం
రామనవమి చెప్పింది రామకథా సారం
శ్రీరామనవమి చెప్పింది రామకథా సారం
శ్రీరామనవమి చెప్పింది రామకథా సారం
ఊరు వాడా సంబరం
ఊరు వాడా సంబరం
ఊరు వాడా సంబరం
ఊరు వాడా సంబరం
చిందేసింది అంబరం
రామ నవమి జయనామ నవమి శ్రీరామ నవమి చెప్పింది రామకథా సారం
దశరధుని ఇంట రామరూపమున కౌసల్య కడుపు పండెను
విశ్వామిత్రుని వెంట దాశరథి విశ్వశాంతి విలసిల్లెను
పాదధూళితో రాయిని రమణిగ మార్చెను మంగళధాముడు
పాదధూళితో రాయిని రమణిగ మార్చెను మంగళధాముడు
శివ థనువు విరిచి నవ వధువును సీతను చేరెను రాముడు
సాయి...
ఆ రాముడు కొలిచిన పరమ శివుడవు పరమేశ్వరుడవు నీవే సాయి
పరమేశ్వరుడవు నీవే సాయి
రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ నవమి చెప్పింది రామ కథా సారం
తండ్రి మాటకే విలువ తెలిపింది దండకారణ్య పయనము
మాయలేడితో మలుపు తిరిగింది మాధవదేవుని ప్రయాణము
వానర సేనలు వారధి కట్టగ వారధి దాటెను నరవరుడు
వానర సేనలు వారధి కట్టగ వారధి దాటెను నరవరుడు
రణ శిరమున రావణుకూర్చి పట్టాభిరాముడాయే రఘురాముడు
సాయి...
ఆ రామసాయి శ్రీకృష్ణ సాయి శ్రీరంగ సాయివి నీవే సాయి
సకల దేవత సన్నిధి నీవే సమర్ద సద్గురు షిరిడి సాయి
రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ నవమి చెప్పింది రామ కథాసారం
సాయి పాదం పాట సాహిత్యం
చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: శ్రీ వేదవ్యాస
గానం: యమ్. యమ్. కీరవాణి
పరమ యోగీంధ్రులకు పరమ పదమందించు
పరమ పావన విష్ణు పాదం
భవబంధ రహితమై బ్రహ్మమై బాసిల్లు
పరమ పావన విష్ణు పాదం
పరమ పావన పరబ్రహ్మ పాదం
ఘనభూమి గగనముల కొలిచి చుంబించి
ఫలితం భ్రమణంన వామనుడి పాదం
దివ్యమౌ భవ్యమౌ దివిజా గంగాజలము
జాలువారిన జగన్నాథ పాదం
కూనీగుండెల నిండి మైత్రి పండించిన
కులమాతీత రఘుకుల రామ పాదం
దశ దిశ దీపమీ పాదం దయకు ప్రతిరూపమీ ధర్మపాదం
శరణం శ్రీవిష్ణు పాదం
శరణం శ్రీరామ పాదం
శరణం శ్రీకృష్ణ పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం గురుసాయి పాదం
కపట రాక్షస వికట బహుపదాటోప
విదుషకట సువిపాటన సుచనలపటు పాదం
కాళీయు తలలపై తక్దిమ్మి తకదిమ్మి
తాండవమ్ముల కృష్ణ పాదం
కంసాది విధ్వంస హింసావిధ్రంశ
యదువంశ నరరాజ హంస పాదం
మూడు మూర్తుల ముక్తి పాదం
ముక్కోటి దేవతల మూలపాదం
శరణం శ్రీవిష్ణు పాదం
శరణం శ్రీరామ పాదం
శరణం శ్రీకృష్ణ పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం గురుసాయి పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం గురుసాయి పాదం
వస్తున్నా బాబా వస్తున్నా పాట సాహిత్యం
చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చైత్ర , యమ్. యమ్. కీరవాణిి, రేవంత్ , యస్. పి. బాలు, సాయి కుమార్
గాలే ఆగిపోతుందంటే నమ్మాలా
నేలే ఆవిరౌతుందంటే నమ్మాలా
నింగికి ఆయువు తీరిందంటే నమ్మాలా
దైవానికి మరణం ఉంటుందంటే నమ్మాలా
అది జరగబోదు అని, జగరనివ్వనని
వస్తున్నా బాబా వస్తున్నా
ఆ మృత్యువు రాకని ఆపేయాలని వస్తున్నా
మీ బదులుగా నేనే బలి అవుతానని వస్తున్నా బాబా వస్తున్నా
వస్తున్నా బాబా వస్తున్నా
బాబా మిమ్మల్ని చూడకుండా
మీ చూపుకు నోచుకోకుండా ఎలా బ్రతకటం బాబా
బాబా ఈ నిజాన్ని ఎలా భరించాలి
ఇక మా బాధల్ని ఎవరితో చెప్పుకోవాలి బాబా
భక్తులు మీరు మీ భక్తికి బానిస నేను
సూర్యచంద్రులు, చుక్కలు నేనై కనపడుతుంటాను
మిమ్ము కనిపెడుతుంటాను
బాబా నేను మీ భారం మోస్తుంటాను
సమాధి నుండే సమాధి నుండే బదులిస్తాను
సహాయమడిగితే కదిలొస్తాను
పిలిస్తే పలుకుతాను పిలిస్తే పలుకుతాను
పిలిస్తే పలుకుతాను, బాబా బాబా
వస్తున్నా బాబా వస్తున్నా
నీ బదువుగా నేనే బలిఅవుతానని వస్తున్నా బాబా వస్తున్నా
వస్తున్నా బాబా వస్తున్నా
మీ భక్తుల ఇంట్లో లేదు అనే మాటే వినపడదని మీరే చెప్పారు బాబా
మాకిప్పుడు వెలుగు లేదు నీడ లేదు అసలు మా బ్రతుక్కి అర్థమే లేదు
మీరు లేనిలోటు ఎలా తీరాలి బాబా ఎలా తీరాలి
నిర్మలమైన మనసుతో నిశ్చలమైన భక్తితో
నా రూపాన్నే తలవండి మీ లోపల కొలువవుతాను
నా నామాన్నే పలకండి మీ లోపం తొలగిస్తాను
నా హారతి దర్శించండి, మీ ఆపద ఆపేస్తాను
నా విభూది ధరియించండి, మీ వేదన నాదంటాను
నా జ్యోతులు వెలిగించండి మీ మనసులు వెలిగిస్తాను
నా చరితను పఠియించండి మిము చరితార్థుల చేస్తాను
మరణ శయ్య కాదిది శరణు కోరినవారికి కరుణ శయ్య
సమాధి కాదిది, కష్టాల తొలగించు సన్నిధి
జ్ఞాన సిరిలనందించు పెన్నిధి
శాంతి సౌఖ్యాలనొసగే షిరిడీ షిరిడీ
శాంతి సౌఖ్యాలనొసగే షిరిడీ
Shirdi Sai (2012)
చిత్రం: నాగవల్లి (2010) సంగీతం: గురుకిరణ్ నటీనటులు: వెంకటేష్ , అనుష్క శెట్టి, రీచా గంగోపాధ్యాయ, శ్రద్ధా దాస్, కమిలిని ముఖర్జీ దర్శకత్వం: పి.వాసు నిర్మాత: బెల్లంకొండ సురేష్ విడుదల తేది: 16.12.2010
Songs List:
అభిమాని లేనిదే పాట సాహిత్యం
చిత్రం: నాగవల్లి (2010) సంగీతం: గురుకిరణ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: యస్. పి. బాలు అభిమాని లేనిదే హీరోలు లేరులే అనుచరులు లేనిదే లీడర్లు లేరులే కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే భక్తులే లేనిదే దైవాలు లేరులే హీరో నువ్వే లీడర్ నువ్వే ఓనర్ నువ్వే దైవం నువ్వే వెనక వెనక వెనక ఉండకురా ముందుకు ముందుకు ముందుకు దూసుకురా వాళ్ల వెనక వెనక వెనక ఉండకురా నువ్వు ముందుకు ముందుకు ముందుకు దూసుకురా అభిమాని లేనిదే హీరోలు లేరులే అనుచరులు లేనిదే లీడర్లు లేరులే చరణం: 1 నీ శక్తే ఆయుధము నీ ప్రేమే ఆలయము నమ్మరా ఒరేయ్ తమ్ముడా నీ చెమటే ఇంధనము ఈ దినమే నీ ధనము లెమ్మురా నువ్వో బ్రహ్మరా మనసే కోరే మందు ఇదే మనిషికి చేసే వైద్యమిదే అల్లోపతి టెలీపతీ అల్లోపతి హోమియోపతి అన్నీ చెప్పెను నీ సంగతి వెనక వెనక వెనక ఉండకురా ముందుకు ముందుకు ముందుకు దూసుకురా ఒణకు బెణుకు తొణుకు వదలరా జర ముందుకు ముందుకు ముందుకు దూసుకురా అభిమాని లేనిదే హీరోలు లేరులే అనుచరులు లేనిదే లీడర్లు లేరులే కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే భక్తులే లేనిదే దైవాలు లేరులే చరణం: 2 సంతృప్తే చెందడమూ సాధించేదాపడమూ తప్పురా అదో జబ్బురా సరిహద్దే గీయటమూ స్వప్నాన్నే మూయటమూ ముప్పురా కళ్లే విప్పరా ఆ లోపాన్నే తొలగించు ఆశయాన్నే రగిలించు దేహం నువ్వే ప్రాణం నువ్వే దేహం నువ్వే ప్రాణం నువ్వే దేశానికి గర్వం నువ్వే వెనక వెనక వెనక ఉండకురా ముందుకు ముందుకు ముందుకు దూసుకురా చమకు చమకు చురుకు చూపైరా ముందుకు ముందుకు ముందుకు దూసుకురా అభిమాని లేనిదే హీరోలు లేరులే అనుచరులు లేనిదే లీడర్లు లేరులే కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే భక్తులే లేనిదే దైవాలు లేరులే హీరో నువ్వే లీడర్ నువ్వే ఓనర్ నువ్వే దైవం నువ్వే వెనక వెనక వెనక ఉండకురా ముందుకు ముందుకు ముందుకు దూసుకురా వాళ్ల వెనక వెనక వెనక ఉండకురా నువ్వు ముందుకు ముందుకు ముందుకు దూసుకురా
వందనాలు వందనాలు పాట సాహిత్యం
చిత్రం: నాగవల్లి (2010) సంగీతం: గురుకిరణ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: రాజేష్ కృష్ణన్, నందిత , షమిత మల్నాడ్ వందనాలు వందనాలు
గిరిని గిరిని పాట సాహిత్యం
చిత్రం: నాగవల్లి (2010) సంగీతం: గురుకిరణ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: యస్.పి.బాలు గిరిని గిరిని
ఖేలో ఖేలో పాట సాహిత్యం
చిత్రం: నాగవల్లి (2010) సంగీతం: గురుకిరణ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: రంజిత్, జోగి సునీత ఖేలో ఖేలో
ఓంకార పాట సాహిత్యం
చిత్రం: నాగవల్లి (2010) సంగీతం: గురుకిరణ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: చిత్ర ఓంకార
రారా రీమిక్స్ పాట సాహిత్యం
చిత్రం: నాగవల్లి (2010) సంగీతం: గురుకిరణ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: నిత్యశ్రీ మహదేవన్, శ్రీ చరణ్ రారా రీమిక్స్
Nagavalli (2010)
చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ నటీనటులు: రాజా, కమిలినీ ముఖర్జీ దర్శకత్వం: శేఖర్ కమ్ముల నిర్మాత: శేఖర్ కమ్ముల విడుదల తేది: 15.10.2004
Songs List:
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా పాట సాహిత్యం
చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: శ్రేయా గోషల్ వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్ గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయ్ తీరుస్తారా బాధ తీరుస్తారా గాలి వాన లాలి పాడేస్తారా చరణం: 1 పిల్ల పాపల వాన బుల్లి పడవల వాన చదువు బాధనే తీర్చి సెలవులిచ్చిన వాన గాలి వానతో కబడ్డి వేడి వేడి పకోడి ఈడు జోడు ఢీ ఢీ ఢీ తొడుండాలి ఓ లేడి ఇంద్రధనస్సులో తళుకుమనే ఎన్ని రంగులో ఇంతి సొగసులే తడిసినవి నీటి కోంగులో శ్రావణ మాసాలా జల తరంగం జీవన రాగాలకిది ఓ మృదంగం చరణం: 2 కోరి వచ్చిన ఈ వాన గోరు వెచ్చనై నాలోన ముగ్గుల సిగ్గు ముసిరేస్తే ముద్దు లాటలే మురిపాలా మెరిసే మెరిసే అందాలు తడిసే తడిసే పరువాలు గాలి వానలా పందిళ్లు కౌగిలింతలా పెళ్లిల్లు నెమలి ఈకలా ఉలికి పడే ఎవరి కన్నుల్లో చినుకు చాటునా చిటికెలతో ఎదురు చూపులో నల్లని మేఘాలా మెరుపులందం తీరని దాహాలా వలపు పందెం
యమునా తీరం పాట సాహిత్యం
చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: హరిహరన్ , చిత్ర పల్లవి: యమునా తీరం సంధ్యా రాగం నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో నిలువగనే తేనెల్లో పూదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో చరణం: 1 ప్రాప్తమనుకొ ఈ క్షణమే బ్రతుకులాగ పండెననుకొ ఈ బ్రతుకే మనసు తీరా శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమ హృదయంలా తననైనా మరిచేదే ప్రేమ మరువుకుమా ఆనందం ఆనందం ఆనందమాయేటి మనసు కథా మరువుకుమా ఆనందం ఆనందం ఆనందమాయేటి మనసు కథా చరణం: 2 ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం శిశిరంలో చలి మంటై రగిలెదే ప్రేమ చిగురించే ఋతువళ్ళే విరబూసే ప్రేమ మరువుకుమా ఆనందం ఆనందం ఆనందమాయేటి మధుర కథా మరువుకుమా ఆనందం ఆనందం ఆనందమాయేటి మధుర కథా
నువ్వేనా నా నువ్వేనా పాట సాహిత్యం
చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: శ్రేయా గోషల్, కె.యమ్. రాధాకృష్ణన్ పల్లవి: నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా సూర్యుడల్లె సూది గుచ్చే సుప్రభాతమేనా మాటలాడే చూపులన్ని మౌనరాగమేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన దూరమైన ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా చరణం: 1 మేఘమల్లె సాగి వచ్చి దాహమేదో పెంచుతావు నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు కలలేనా కన్నీరేనా తేనెటీగ లాగ కుట్టి తీపి మంట రేపుతావు పువ్వులాంటి గుండెలోన దారమల్లె దాగుతావు నేనేనా నీ రూపేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన దూరమైన ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా చరణం: 2 కోయిలల్లే వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు కొమ్మగొంతులోన గుండె కొట్టుకుంటే నవ్వుతావు ఏ రాగం..ఇది ఏ తాళం మసక ఎన్నెలల్లె నీవు ఇసుక తిన్నె చేరుతావు గసగసాల కౌగిలంత గుసగుసల్లె మారుతావు ప్రేమంటే నీ ప్రేమేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన దూరమైన ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా
చారుమతి ఐ లవ్ యు పాట సాహిత్యం
చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: లక్కీ ఆలి చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు రూపవతి ఐ లవ్ యు నేను నీకె ఏక్ లవ్యు A E I O U అన్ని ఐ లవ్ యు లవ్ యు లవ్ యు చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు ఎదనె నీవు నిదరె లేపి ఎదురైనావు తొలి ప్రేమల్లె కునుకె రాని ఉలుకై తీపి కలవైనావు ఎద నీడల్లె అడిగా నిన్ను వరమిస్తావా విడిగ నన్ను వదిలేస్తావా Yes No Yes No చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు ఫ్లవరై విచ్చి కలరె ఇచ్చి వికసించావు తొలి ఊహల్లొ చెలిమై వచ్చి చెలిగా నచ్చి ఉసిగొల్పావు నడి జాముల్లొ క్షణమె నేను యుగమౌతావ సఖివై నాకు సగమౌతావ Yes No Yes No చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు రూపవతి ఐ లవ్ యు నేను నీకె ఏక్ లవ్యు A E I O U అన్ని ఐ లవ్ యు లవ్ యు లవ్ యు చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు
తెలిసి తెలిసి పాట సాహిత్యం
చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: శ్రేయా గోషల్ పల్లవి: తెలిసి తెలిసి వలలో పడెనే వయసు తలచి వలచి కలలే కనెనే మనసు తనువున ఎన్నో తపనలు రేగే తహ తహలోనే తకదిమి సాగే చరణం: 1 పొద్దసలే పోక నిద్దుర పోనీక ఎవ్వరిదో కేక ఎదలోతులదాక భారమాయె యవ్వనం బోరు కొట్టే జీవితం రగిలేటి విరహాన రాధల్లె నేనున్నా నీగాలి సోకేనా నా ఊపిరాడేనా అది ఒక ఇదిలే ఇదిలే ఏదోలే చరణం: 2 నాకొద్దీ దూరం వెన్నెల జాగారం బాత్రూం సంగీతం లేత ఈడు ఏకాంతం కోపమొచ్చే నామీద తాపమాయె నీ మీద దేహాలు రెండైన ప్రాణాలు నీవేగా విసిగించు పరువాన విధిలేక పడివున్న
ఎదలో గానం పాట సాహిత్యం
చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: హరిహరన్ , చిత్ర ఎదలో గానం పెదవే మౌనం సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో చరణం: 1 కట్టుకథలా ఈ మమతే కలవరింత కాలమొకటే కలలకైనా పులకరింత శిల కూడా చిగురించే విధి రామాయణం విధికైనా విధిమార్చే కథ ప్రేమాయణం మరవకుమా వేసంగి ఎండల్లో పూసేటి మల్లెల్లో మనసు కథ ఎదలో గానం పెదవే మౌనం సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగా వర్ణాలలో అలజడిలో చరణం: 2 శ్రీగౌరి చిగురించే సిగ్గులెన్నో శ్రీగౌరి చిగురించే సిగ్గులెన్నో పూచే సొగసులో ఎగసిన ఊసులు మూగే మనసులో అవి మూగవై తడి తడి వయ్యారాలెన్నో ప్రియా ప్రియా అన్న వేళ
Anand (2004)
చిత్రం: గోపి గోపికా గోదావరి (2009)
సంగీతం: చక్రి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: చక్రి , కౌశల్య
నటీనటులు: వేణు తొట్టెంపూడి, కమిలినీ ముఖర్జీ
దర్శకత్వం: వంశీ
నిర్మాత:
విడుదల తేది: 10.07.2009
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల
ఎందుకో ఏకాంతవేళా చెంతకే రానందీ వేళ
గాలిలో రాగాలమాలా జంటగా తోడుంది నీలా
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిలా పాడింది కోకిల
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల
సరిగమలే వర్ణాలుగ కలగలిసేనా
కంటి పరదా నీ బొమ్మగ కళలొలికేనా
వర్ణమై వచ్చానా వర్ణమే పాడానా
జాణ తెలుగులా జాణ వెలుగులా
వెన్నెలై గిచ్చానా వేకువే తెచ్చానా
పాల మడుగులా పూల జిలుగులా
అన్ని పోలికలు విన్నా వేడుకలో ఉన్నా
నువ్వేమన్నా నీ మాటలో నన్నే చూస్తున్నా
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల
ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోలా
ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాలా
అంతగా నచ్చానా ఆశలే పెంచానా
గొంతు కలపనా గుండె తడపనా
నిన్నలా వచ్చానా రేపుగా మారానా
ప్రేమ తరపునా గీత చెరపనా
ఎంత దూరాన నే ఉన్నా నీతోనే నేలేనా
నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల
ఎందుకో ఏకాంతవేళా చెంతకే రానందీ వేళ
గాలిలో రాగాలమాలా జంటగా తోడుంది నీలా
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిలా పాడింది కోకిల
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల
Gopi Gopika Godavari (2009)
చిత్రం: స్టైల్ (2006) సంగీతం: మణిశర్మ నటీనటులు: రాఘవ లారెన్స్, ప్రభుదేవా, ఛార్మి, కమిలిని ముఖర్జీ దర్శకత్వం: రాఘవ లారెన్స్ నిర్మాత: లగడపాటి శిరీష శ్రీధర్ విడుదల తేది: 12.01.2006
Songs List:
స్టైల్ స్టైల్ పాట సాహిత్యం
చిత్రం: స్టైల్ (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: మధు గానం: రవివర్మ స్టైల్ స్టైల్
ఎదలో ఏదో పాట సాహిత్యం
చిత్రం: స్టైల్ (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: విశ్వా గానం: కార్తీక్ ఎదలో ఏదో
రాక్ & రోల్ పాట సాహిత్యం
చిత్రం: స్టైల్ (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: విశ్వా గానం: కె.కె. రాక్ & రోల్
తడవ తడవకు పాట సాహిత్యం
చిత్రం: స్టైల్ (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చిన్ని చరణ్ గానం: కార్తిక్, మహలక్ష్మి అయ్యర్ తడవ తడవకు
చిరు చెయ్యేస్తే పాట సాహిత్యం
చిత్రం: స్టైల్ (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: మధు గానం: మనో చిరు చెయ్యేస్తే
మెరుపై సాగరా పాట సాహిత్యం
చిత్రం: స్టైల్ (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చిన్ని చరణ్ గానం: కార్తిక్ మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా నలుదిక్కులు నవ్వుతు ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కలనే ఇల దించే నీ శక్తి ని యుక్తి గ చూపెయ్ నటరాజై నువు రాజెయ్ నీ గెలుపే నీలో మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా అమ్మ మాట కోసం నువ్వు ఆయుధం గా మారి కొండలే డీకొట్టరా అది ఎంత కష్టమైనా ఆశయాల పీఠం నువు అందుకున్న నాడు నిండుగా మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా చేయూతే ఇస్తుంటే ఓ స్నేహబంధం చరితల్లే మారాలి నువ్వెళ్ళు మార్గం నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అడుగు కావాలి నీ వెనుక సైన్యం లేరా అడుగెయ్ రా ఆ శిఖరం చేరా మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా కింద పడుతు ఉన్నా పైపైకి పరుగు తీసి అలలతో పోటి పడి చేరాలి కలల కడలి పందెమేది ఐనా నీ పట్టుదలను చూసి ఒంటరై వణకాలిరా ఆ ఓటమైనా హడలి అందరికి చేతుల్లో ఉంటుంది గీతా నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మ రాత నీ కాలు అడుగులతో కాలాన్ని ఆపి లోకాలే పొగిడేలా చూపించు ఘనత లేరా చిందెయ్ రా విజయం నీదేరా మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా
రారా రారా రమ్మంటున్నా పాట సాహిత్యం
చిత్రం: స్టైల్ (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చిన్ని చరణ్ గానం: శంకర్ మహదేవన్ రారా రారా రమ్మంటున్నా