Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Abhilasha (1983)





చిత్రం: అభిలాష (1983) 
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: చిరంజీవి, రాధిక
దర్శకత్వం: ఏ. కోదండ రామిరెడ్డి
నిర్మాత: కె.ఎస్. రామారావు
విడుదల తేది: 11.03.1983



Songs List:



నవ్వింది మల్లెచెండు పాట సాహిత్యం

 
చిత్రం: అభిలాష (1983) 
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ఎస్. జానకి

పల్లవి:
యురేకా...హహ్హాహ్హా...
తార తతార తతారత్తా... తార తతార తతారత్తా...
హహ్హాహ్హా... హహ్హాహ్హా... హే...
నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్‌ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక... నీ ముద్దు తీరేదాక
నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్‌ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక... సకమిక సకమిక సకమిక సకమిక

చరణం: 1
లవ్వు సిగ్నల్ నాకివ్వగానే నవ్వుకున్నాయ్ నా యువ్వనాలే
ఆ నవ్వుతోనే కదిలెయ్యుగానే నాటుకున్నయ్ నవనందనాలే
అహా చూపుల్లో నీ రూపం కనురెప్పల్లో నీ ప్రాణం
కన్నుకొట్టి కమ్ముకుంట.... కాలమంత అమ్ముకుంట
రపప్ప రపప్ప రపప్ప రపప్ప
కన్నె ఈడు జున్నులన్నీ జుర్రుకుంటా
నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్‌ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక...

చరణం: 2
కస్సుమన్న ఓ కన్నెపిల్ల యుస్సు అంటే ఓ కౌగిలింత
కిస్సులిచ్చి నే కౌగిలిస్తే అరె తీరిపోయే నాకున్న చింత
నేను పుట్టిందే నీ కోసం ఈ జన్మంతా నీ ధ్యానం
ముద్దు పెట్టి మొక్కుకుంట మూడు ముళ్ళు వేసుకుంట
సబబ్బా రిబబ్బా సబబ్బా సబరిబరబ...
ఏడు జన్మలేలుకుంట నేను జంటగా
నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్‌ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక... నీ ముద్దు తీరేదాక...
యురేకా సకమిక... నీ ముద్దు తీరేదాక...
యురేకా సకమిక... నీ ముద్దు తీరేదాక....



ఉరకలై గోదావరి పాట సాహిత్యం

 
చిత్రం: అభిలాష (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ఎస్.జానకి

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ
రసమయం జగతి

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి

నీ ప్రణయభావం నా జీవ రాగం
నీ ప్రణయభావం నా జీవ రాగం
రాగాలు తెలిపే భావాలు నిజమైనవి
లోకాలు మురిసే స్నేహాలు రుజువైనవి
అనురాగ రాగాల స్వరలోకమె మనదైనది
 
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ 
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ
రసమయం జగతి

నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది
నీవన్న మనిషే ఈ నాడు నాదైనది
ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ
రసమయం జగతి
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే



సందెపొద్దుల కాడ పాట సాహిత్యం

 
చిత్రం: అభిలాష (1983) 
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ఎస్. జానకి

సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో
ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

చరణం: 1
కొండాకోన జలకాలాడే వేళ
కొమ్మరెమ్మ చీర కట్టే వేళ
పిందె పండై చిలక కొట్టే వేళ
పిల్ల పాప నిదరే పోయే వేళ
కలలో కౌగిలి కన్నులు దాటాల
ఎదలే పొదిరిల్లై వాకిలి తియ్యాల
ఎదటే తుమ్మెద పాట పువ్వుల బాట వెయ్యాల

సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

చరణం: 2
మల్లె జాజి మత్తు చల్లే వేళ
పిల్లా గాలి జోల పాడే వేళ
వానే వాగై వరదై పొంగే వేళ
నేనే నీవై వలపై సాగే వేళ
కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల
పుట్టిన ఎన్నెల్లో పుట్టకళ్ళు తాగాల
పగలే ఎన్నెల గుమ్మా చీకటి గువ్వాలాడాల

సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవరికిస్తుందో ఏమౌతుందో
ఎవరికిస్తుందో ఏమౌతుందో
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది



బంతీ చామంతీ పాట సాహిత్యం

 
చిత్రం: అభిలాష (1983) 
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ఎస్.జానకి

బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే

తేనెవాగుల్లో మల్లె పూలల్లే తేలిపోదాములే
గాలీవానల్లో మబ్బు జంటల్లే రేగిపోదాములే
విసిరే కొసచూపే ముసురై పోతుంటే
ముసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే
వేడెక్కి గుండెల్లో తలదాచుకో
తాపాలలో ఉన్న తడి ఆర్చుకో
ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే

బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే

తారత్తా తరతత్ తరతా 
తారత్తా తరతత్ తరరా

పూతపెదవుల్లో పుట్టు గోరింట బొట్టు పెట్టిందిలే
ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గు తీరిందిలే
ఒదిగే మనసేదో ఒకటై పొమ్మంటే
ఎదిగే వలపంతా ఎదలొకటై రమ్మంటే
కాలాలు కరిగించు కౌగిళ్ళలో
దీపాలు వెలిగించు నీ కళ్ళతో
ఆ మాట వింటే కరిగే నా ప్రాణమంతా నీ సొంతమేలే

బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని



వేళా పాళ లేదు పాట సాహిత్యం

 
చిత్రం: అభిలాష (1983) 
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ఎస్. జానకి

వేళా పాళ లేదు కుర్రాల్లాటకు... ఓడే మాట లేదు ఆడే వాళ్లకు...
ఏది గెలుపో హొయ్ హొయ్ ఏది మలుపో హొయ్ హొయ్
తెలియువరకు ఇదే ఇదే ఆట మనకు
వేళా పాళ లేదు కుర్రాల్లాటకు ఓడే మాట లేదు ఆడే వాళ్లకు
తకదిమి తద్దోంత తకదిమి తద్దోంత
తకదిమి తద్దోంత తకదిమి తద్దోంత

మన్మధుడే నీకు మంత్రి అనుకోకు నీ వయసు కాచేందుకూ
వయసు ఒక చాకు అది వాడుకోకు నా మన్సు కోసేందుకూ
మనసే లేదు నీకు ఇచ్చేసావు నాకు
లేదని నీదని కలగని నిజమని అనుకొని ఆడకు
లల…
తకదిమి తద్దోంత తకదిమి తద్దోంత
తకదిమి తద్దోంత తకదిమి తద్దోంత

కలలకొక రూపు కనులకొక కైపు తొలి మాపు విరి పానుపూ
కవితలిక ఆపు కలుసుకో రేపు చెబుతాను తుది తీరుపూ
అహ ఏ తీర్పు వొద్దు ఇదిగో తీపి ముద్దు
వొద్దని ముద్దని చిదుమని పెదవని చిటికెలు వెయ్యకు

వేళా పాళ లేదు కుర్రాల్లాటకు ఓడే మాట లేదు ఆడే వాళ్లకు
ఏది గెలుపో హొయ్ హొయ్ ఏది మలుపో హొయ్ హొయ్
తెలియువరకు ఇదే ఇదే ఆట మనకు
వేలా పాల లేదు కుర్రాల్లాటకు ఓడే మాట లేదు ఆడే వాళ్లకు

Most Recent

Default