Search Box

MUSICAL HUNGAMA

Premisthe (2005)చిత్రం: ప్రేమిస్తే (2005)
సంగీతం:  జోష్వా శ్రీధర్
సాహిత్యం: వేటూరి
గానం: హరిచరన్, హరిణి సుధాకర్
నటీనటులు: భరత్, సంధ్యా
దర్శకత్వం: బాలాజీ శక్తివేల్
నిర్మాత: సురేష్ కొండేటి
విడుదల తేది: 12.10.2005

ఏ దూర తీరాలు నా పయనమయినా
నే సేద తీరేది నీ ఓడిలోనే
మరణాన ఒడిచేరు ఆ క్షణమునైనా
నీ సిగకు పూలిచ్చి పోనీ ప్రాణం
ప్రాణం ప్రాణం ప్రాణం ప్రాణం

మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి
శిల్పంలాగ చేసిందెవరో
నన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి
పట్టుతేనె కోరిందెవరో
ఎదలో ఎపుడు చెరగని తలపులే
జతగా ఆ ఆ బతికే కలలే నిజములే

మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి
శిల్పం లాగ చేసిందెవరో
నన్ను చుట్టి చుట్టి గుండే కొల్ల గొట్టి
పట్టు తేనె కోరిందెవరో

మాటలు నేర్పే అమ్మను కూడా మరిచే క్షణము
మనసే దోచే వెన్నెల గువ్వ నీకై పరుగు
నిన్ను చూడ వచ్చే కంటి పాప చేసే ఎంతో పుణ్యం
ఒంటి మీద వాలే వాన చుక్క నీవై తడిపే వైనం
హ్రుదయము నిండే ప్రియమైన మాటే
చెరగని గురుతైపోదా
ఎద చేరి ఏలే చిత్రమైన ప్రేమ నిన్ను నన్ను కలిపేను కాదా

ఏ దూర తీరాలు నా పయనమయినా
నే సేద తీరేది నీ ఓడిలోనే
మరణాన ఒడిచేరు ఆ క్షణమునైనా
నీ సిగకు పూలిచ్చి పోనీ ప్రాణం

మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి
శిల్పం లాగ చేసిందెవరో
నన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి
పట్టు తేనె కోరిందెవరో
ఎదలో ఎపుడు చెరగని తలపులే
జతగా ఆ ఆ బతికే కలలే నిజములే

మనసులు రెండు ఒకటైపొయే పలికే రాగం
ఎదనే మీటే చెరగని పేరు నిలిపే ప్రాణం
నన్ను తాకి వెళ్ళే చల్లగాలి లోన నీదే తలపు
నాలోఆశ దాచా పైట చాటు చేసా ఎదకే సుఖమై
స్వరముల జల్లై వలపు వెన్నెల్లై
అల్లుకుంటే ప్రేమే కదా
ఆది అంతం లేని మనల వీడిపోని దైవం ప్రేమే కాదా

మట్టిలాంటి నిన్ను పట్టి పట్టి చూసి
శిల్పం లాగ చేసిందెవరో
నిన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి
పట్టు తేనె కోరిందెవరో
ఎదలో ఎపుడు చెరగని తలపులే
జతగా ఆ ఆ బతికే కలలే నిజములే
మట్టిలాంటి నిన్ను పట్టి పట్టి చూసి
శిల్పం లాగ చేసిందెవరో
నిన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి
పట్టు తేనె కోరిందెవరో
*********  *********  ********
చిత్రం: ప్రేమిస్తే (2005)
సంగీతం:  జోష్వా శ్రీధర్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: హరిచరణ్

జన్మ నీదేలే మరుజన్మ నీకేలే
జతను విడిచావో చితికి పోతానే
ప్రియతమా ప్రణయమా కుమలకే ప్రాణమా
అడుగు నీతోనే
జన్మ నీదేలే మరుజన్మ నీకేలే
జతను విడిచావో చితికి పోతానే

కన్నుల బాధను కన్నుల నీరే తెలుపును
వలచిన హృదయము తెలపదులే
గడ్డిలో పిచ్చిగా పూసిన పువ్వులే ఎన్నడు
దేవత పూజకు నోచవులే
మెరుపుల్లో తీగల మీద మైనా కడుతుందాగూడు
మన ప్రేమకు ఓటమి రానే రాదు
ప్రతి నదికి మలుపులు తధ్యం
బ్రతుకుల్లో బాధలు నిత్యం
ఎద గాయం మాన్పును కాలం
సిరివెన్నెల మాత్రం నమ్మి
చిగురాకులు బ్రతుకవు కాదా
మిణిగురులే ఓడి కిరణం


తల్లిని తండ్రిని కాదని ప్రేమే కోరిన చిలుకకు
గూడుగ నే ఉన్నా
గుండెపై నీవుగ వాలిన ప్రేమలో
ఎదురుగా పిడుగులే పడినను విడువనులే
స్నానానికి వేణ్ణిలవుతా అవి కాచే మంటనవుతా
హ్రుదయంలో నిన్నే నిలిపాలే
నిదురించే కంట్లో నేనే పాపల్లే మేలుకుంటా
కలలోనే గస్తీ కాస్తాలే
నేనంటే నేనే కాదు నువు లేక నేనే్లేను
నీ కంటి రెప్పల్లే ఉంటా

జన్మ నీదేలే మరుజన్మ నీకేలే
జతను విడిచావో చితికి పోతానే
ప్రియతమా ప్రణయమా కుమలకే ప్రాణమా
అడుగు నీతోనే.. అడుగు నీతోనే ..
అడుగు నీతోనే.. అడుగు నీతోనేAMAZON PRIME MOVIES

Most Recent

Default
google.com, pub-8613670326032963, DIRECT, f08c47fec0942fa0