Search Box

MUSICAL HUNGAMA

Bhadrachalam (2001)చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: శంకర్ మహదేవన్, చిత్ర
నటీనటులు: శ్రీహరి, సింధు మీనన్
దర్శకత్వం: యన్. శంకర్
నిర్మాత: మేడికొండ వెంకట మురళీకృష్ణ
విడుదల తేది: 06.12.2001

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు
బతుకు అంటె గెలుపూ గెలుపు కొరకె బ్రతుకు
కష్టాలు రానీ కన్నీళ్ళు రానీ
ఏమైన గానీ ఎదురేది రానీ
ఓడిపోవద్దు రాజీపడొద్దు
నిద్ర నీకొద్దు నీకేది హద్దు

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు
బతుకు అంటె గెలుపూ గెలుపు కొరకె బ్రతుకు

రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి
ఆ గెలుపూ తప్పట్లే గుండెలలో మోగాలీ
నీ నుదిటీ రేఖలపై సంతకమే చేస్తున్నా
ఎదనిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా
నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓ నేస్తం
నమ్మకమే మనకున్న బలం

నీలికళ్ళలో మెరుపూ మెరవాలి
కారు చీకట్లో దారి వెతకాలి
గాలివానల్లో ఉరుమై సాగాలి
తగిలే గాయాల్లో గేయం ఊదాలి

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు
బతుకు అంటె గెలుపూ గెలుపు కొరకె బ్రతుకు

నిదరోకా నిలుచుంటా వెన్నెలలో చెట్టువలె
నీకోసం వేచుంటా కన్నీటీ బొట్టువలె
అడుగడుగు నీ గుండె గడియారం నేనవుతా
నువు నడిచే దారులలో ఎదురొచ్చి శుభమవుతా
రాసిగ పోసిన కలలన్నీ దోసిలి నిండా నింపిస్తా
చేతులు చాచిన స్నేహంలా

ముట్టుకున్నావా మువ్వా అవుతుంది
పట్టుకున్నావా పాటే అవుతుంది
అల్లుకున్నావా జల్లే అవుతుంది
హత్తుకున్నావా వెల్లువౌతుంది

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు
బతుకు అంటె గెలుపూ గెలుపు కొరకె బ్రతుకు


AMAZON PRIME MOVIES

Most Recent

Default
google.com, pub-8613670326032963, DIRECT, f08c47fec0942fa0