Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Suprabhatam (1998)
చిత్రం: సుప్రభాతం (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: శ్రీకాంత్, రాశి
దర్శకత్వం: భీమనేని శ్రీనివాస్
నిర్మాత: కెప్టెన్. యన్. ఏ. చౌదరి
విడుదల తేది: 18.09.1998Songs List:ప్రేమ మొదలైతే హృదయంలో పాట సాహిత్యం

 
చిత్రం: సుప్రభాతం (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర

ప్రేమ మొదలైతే హృదయంలో 
ఏదో కొత్త సుప్రభాత సూచన
ఏమైందంటే తెలిసేనా 
లోలో కలిగే చెప్పలేని యాతన
ఏం చేస్తూ ఉన్నా ఏదో ఒక లోపం
ఏం చూస్తూ ఉన్నా ఒకటే ఒక రూపం
మనసిక మన అదుపున ఉండదు ఎంత ఆపిన

ప్రేమ మొదలైతే హృదయంలో 
ఏదో కొత్త సుప్రభాత సూచన

ఉన్నపాటుగా ఎదురు పడ్డది
పేరు అడిగితే ప్రేమ అన్నది
మూగ బాషలే నేర్పుతున్నది
కొత్తదారిలో నడుపుతున్నది
ఇన్నాళ్లు ఎక్కడ దాగుందో
గుండెల్లో ఎప్పుడు చేరిందో
కళ్ళేమో తెరిచే ఉన్నా 
కలలెన్నో చూస్తూ ఉన్నా
కాలేదే ఒక పూటైనా ఈలోగా వింతలు ఇన్నా
తెలిసి తెలిసి వలపుల వలలో పడిపోతున్నా

ప్రేమ మొదలైతే హృదయంలో 
ఏదో కొత్త సుప్రభాత సూచన

పుస్తకాలలో చదువుకున్నది 
మెదడు నుంచి నా మదికి దిగినది
నన్ను నన్నుగా ఉంచనన్నది 
నీకు నీడగా ఉండమన్నది
ఆణువణువూ నిన్నే నింపిందో...
నాలోనే నేనుండే చోటేదో
మెరుపులనే దారం చేసి తారలతో పూలను గుచ్చి
నా మెడలో హారం వేసి దురాన్నే దూరం చేసి
నిన్ను నన్ను ఏకం చేసే బంధం ప్రేమ 

ప్రేమ మొదలైతే హృదయంలో 
ఏదో కొత్త సుప్రభాత సూచన
ఏమైందంటే తెలిసేనా 
లోలో కలిగే చెప్పలేని యాతన
ఏం చేస్తూ ఉన్నా ఏదో ఒక లోపం
ఏం చూస్తూ ఉన్నా ఒకటే ఒక రూపం
మనసిక మన అదుపున ఉండదు ఎంత ఆపిన

ప్రేమ మొదలైతే హృదయంలో 
ఏదో కొత్త సుప్రభాత సూచనఓ ప్రియా వసుందర - ప్రియా ప్రియా పాట సాహిత్యం

 
చిత్రం: సుప్రభాతం (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: షణ్ముఖ శర్మ
గానం: యస్. పి. బాలు, చిత్ర

ఓ ప్రియా వసుందర - ప్రియా ప్రియా
ప్రేమనే వరించిరా - ప్రియా ప్రియా
ఓ ప్రియా మనోహర - ప్రియా ప్రియా
స్వాగతం స్వయంవర - ప్రియా ప్రియా
మనిషి కన్న ముందర మనసు చేసే తొందర
కనుల గడప దాటుతూ స్వప్నమెదుట పడెనురా
కలలలోని కలికి తార చిలుకుతోంది కాంతిధార

ఓ ప్రియా వసుందర - ప్రియా ప్రియా
ఓ ప్రియా మనోహర - ప్రియా ప్రియా

అరవిరిసిన కన్నులే మీటుతున్నవి
అరమరికలు వద్దని చాటుతున్నవి
తెరమరుగులు ఇప్పుడే తొలగుతున్నవి
మన మనసుకి రెక్కలే తొడుగుతున్నవి
నా మిణుకు మిణుకు ఆశలే నిజమయ్యేలా
నీ వెలుగు తగిలి లోకమే మారె ఈవేళ
నీ చిలిపి కనుల గూటిలో నేనే ఉండేలా
నా బ్రతుకు జతగ చేయగా వచ్చా గోపాలా
కౌగిల్ల సంకెళ్లు వేయన 
నిన్ను శృంగార ఖైదీగచెయ్యన
ఈ శిక్ష చాలంటు చాటన
ఒప్పుకుంటాను ఈ తీపి దండన
అలక తీరి అసలు దారి తెలిసి నడిచె రాకుమారి

ఓ ప్రియా మనోహర - ప్రియా ప్రియా
ప్రేమనే వరించిరా - ప్రియా ప్రియా

రెప రెప మని రెప్పలే విప్పుకున్నవి
తపనల ఎద తాళమే తప్పుతున్నది
ఎపుడెపుడని ఆత్రమే అడుగుతున్నది
అపుడిపుడని వాయిదా వేయనన్నది
నా దొరకు దొరుకుతున్నవి నాలో సింగారం
ఇక తరిగి కరుగు తున్నవి ఇన్నాళ్ల దూరం
ఈ కళికి కులుకు కదలికే కన్యాకుమారం
నా ఉడుకు దుడుకు గుండెలో మోగే అలారం
క్రిష్ణయ్య తీరున్న రాముడు
సిగ్గు గిలుక్కు పెట్టాడు వీరుడు
కాలాలు కనిపెట్టి కాముడే 
తన కనికట్టు చూపాడు భీముడే
ముంచుతున్న మంచు కరిగి 
పొద్దు పొడుపు వెలుగు తాకె

ఓ ప్రియా వసుందర - ప్రియా ప్రియా
ప్రేమనే వరించిరా - ప్రియా ప్రియా
ఓ ప్రియా మనోహర - ప్రియా ప్రియా
స్వాగతం స్వయంవర - ప్రియా ప్రియా
మనిషి కన్న ముందర మనసు చేసే తొందర
కనుల గడప దాటుతు స్వప్నమెదుట పడెనురా
కనులలోని కలికి తార చిలుకుతోంది ప్రేమధార

ఓ ప్రియా వసుందర - ప్రియా ప్రియా
స్వాగతం స్వయంవర - ప్రియా ప్రియాసింగరాయ కొండ ఈ చిన్నోడిది పాట సాహిత్యం

 
చిత్రం: సుప్రభాతం (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి. బాలు, స్వర్ణలత

సింగరాయ కొండ ఈ చిన్నోడిది
ఆకు పచ్చ జండా ఈ అందానిది
నీ చూపులోనే చిత్తూరు ఉంది
నీ కొంగు లోనే ఒంగోలు ఉంది
ప్యాకేజిలోన ఉన్న మనసు నీకయ్యింది
మ్యారేజి దాక ఆగనంటు దూకేస్తుంది

సింగరాయ కొండ ఈ చిన్నోడిది
ఆకు పచ్చ జండా ఈ అందానిది

బందరు నుంచి బాజాలొచ్చి 
మోగించాలి పెళ్లి పాటలు
అత్తిలి నుంచి అతిధులు వచ్చి 
అందించాలి శుభాకాంక్షలు
గుంతకల్లు పొలిమేర దాకా బంతిపూలు చల్లాలంటా
తాడేపల్లి నడిబొడ్డుదాకా తోరణాలు కట్టాలంటా
అహ లక్షల కొద్ది అక్షింతలు పడగా
ఒహొ లెక్కకు మించి కానుకలేరాగ
ఎంతో ఇదిగా పెళ్లి జరగాలి
ఏమి ముహూర్తం తెల్లబోవాలి

సింగరాయ కొండ ఈ చిన్నోడిది
ఆకు పచ్చ జండా ఈ అందానిది

అరకువేలిలో చెరకుపొదల్లో పరిచెయ్యాలి పట్టెమంచము
పాపి కొండల్లో పండు వెన్నెల్లో జరిపించాలి జంట యుద్ధము
జన్మభూమి శ్రమదానమల్లే శోభనాలు సాగాలంట
కొరకురాయి కంప్యూటరల్లే కాపురాలే చెయ్యాలంటా
అహ వారంలోగ వేసెయ్యి పాగా
ఒహో సూపర్ ఫాస్ట్ సీమంతం కాగా
రెండను మాటే మూడు కావాలి
మళ్ళి మళ్ళి మూడు రావాలి

సింగరాయ కొండ ఈ చిన్నోడిది
ఆకు పచ్చ జండా ఈ అందానిది
నీ చూపులోనే చిత్తూరు ఉంది
నీ కొంగు లోనే ఒంగోలు ఉంది
ప్యాకేజిలోన ఉన్న మనసు నీకయ్యింది
మ్యారేజి దాక ఆగనంటు దూకేస్తుంది

సింగరాయ కొండ ఈ చిన్నోడిది
ఆకు పచ్చ జండా ఈ అందానిది

చందమామ రావే పాట సాహిత్యం

 
చిత్రం: సుప్రభాతం (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అశోక్ ఖోస్లా (ముంబాయి)

చందమామ రావే కన్నా నీ కనులకు పాట సాహిత్యం

 
చిత్రం: సుప్రభాతం (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర, హరిణి 

కన్నా నీ కనులకు తాడే పామైతే పాట సాహిత్యం

 
చిత్రం: సుప్రభాతం (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అశోక్ ఖోస్లా (ముంబాయి)

తాడే పామైతే

Most Recent

Default