Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sneham Kosam (1999)

చిత్రం: స్నేహం కోసం (1999)
సంగీతం: ఎస్. ఏ.రాజ్ కుమార్
నటీనటులు: చిరంజీవి, మీనా
దర్శకత్వం: కె.యస్. రవికుమార్
నిర్మాత: ఏ. యమ్.రత్నం
విడుదల: 01.01.1999Songs List:కైకలూరి కన్నె పిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: స్నేహం కోసం (1999)
సంగీతం: ఎస్. ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: వేటూరి
గానం: ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి

పల్లవి:
కైకలూరి కన్నె పిల్లా కోరుకుంటె రానా మల్లా
గుమ్మ ముద్దు గుమ్మా గుండె నీదేనమ్మా
కోరుకున్నా కుర్రవాడా కోరి వచ్చా సందా కాడా
యమ్మా యమ్మా యమ్మో బుగ్గ కందేనమ్మో
సల్ల కొచ్చినమ్మా ఇక లొల్లిపెట్టకమ్మా
కోరింది ఇచ్చి పుచ్చుకోవె గుంతలకడి గుమ్మా

కైకలూరి కన్నె పిల్లా
కోరుకుంటె రానా మల్లా

చరణం: 1
వలపే పెదాలలో పదాలు పాడే
కదిలే నరాలలో స్వరాలు మీటే
తనువే తహా తహా తపించిపోయే
కనులే నిషాలతో కవాలి పాడె
సు సు సుందరీ పూల పందిరీ
పో పో పోకిరి చాలిక అల్లరీ
నీ ఈడు దాగదమ్మా నేనెట్ట వేగనమ్మా
నీ వంటి గుట్టు బైట పెట్టి బెట్టు చేయకమ్మా

కోరుకున్నా కుర్రవాడా కోరి వచ్చా సందా కాడా

చరణం: 2
మనసే అరేబియా ఎడారి ఎండై
నడుమే నైజీరియా నాట్యము చేసే
హే మల్లె పూలు వలే మంచే కురిపిస్తా
పారే సెలయేటిలో స్నానం చేయిస్తా
రా రా సుందరా నీకే విందురా
జా జా జాతరా ఉందీ ముందరా
నీటైన పోటు గాడ చాటుంది తోటకాడ
నా కట్టు బొట్టు తేనె పట్టు ఎమా ఎమా ఎమ్మా

కైకలూరి కన్నె పిల్లా కోరుకుంటె రానా మల్లా
యమ్మా యమ్మా యమ్మో బుగ్గ కందేనమ్మో
సల్ల కొచ్చినమ్మా ఇక లొల్లిపెట్టకమ్మా
కోరింది ఇచ్చి పుచ్చుకోవె గుంతలకడి గుమ్మా


కైకలూరి కన్నె పిల్లా కోరుకుంటె రానా మల్లా
గుమ్మ ముద్దు గుమ్మా - బుగ్గ కందేనమ్మోగుండెల్లో గుబులు పాట సాహిత్యం

 
చిత్రం: స్నేహం కోసం (1999)
సంగీతం: ఎస్. ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: ఏ ఎమ్. రత్నం
గానం: సౌమ్య

గుండెల్లో గుబులు వళ్ళంత జిగులు
నా మైక్ టైసన్
నీ కైపు స్ట్రోక్ వళ్ళంత షేక్ నా హోలి ఫీల్డ్ ను
నీ వంటి స్పీడు మజిల్ పవరు సూపరు
నీ నడక జోరు కంటి నజరు లేజరు

హే హీమాన్ హీమాన్ నీవే నాలో
హే హీమాన్ హీమాన్ నీవే నాలో

Heman you're a hero

హే హీమాన్ హే హీమాన్ 

జాజి మళ్ళి లాంటి వళ్ళు నాదిరా
ఒక్కసారి నన్ను కౌగిలించరా
హే హీమాన్ 
క్లియో పాత్ర లాంటి కళ్ళు నావిరా
మెరుపు లాగ వచ్చి ముచ్చటించరా
హే హీమాన్ 
చంగిస్తా చమకు నీకుందిరా కవ్వించు కొత్త రాజ్యం
హార్మోని గ్రేస్ నీకుందిరా పాలించు ప్రేమ రాజ్యం
మగధీర నన్నే చేరుకోవేరా

హే హీమాన్ హీమాన్ నీవే నాలో
హే హీమాన్ హీమాన్ నీవే నాలో

గుండెల్లో గుబులు వళ్ళంత జిగులు
నా మైక్ టైసన్
నీ కైపు స్ట్రోక్ వళ్ళంత షేక్ నా హోలి ఫీల్డ్ ను

లుక్ లోనే యమ కిక్ ఉందిరా
ఒక్కమారు నన్ను చుట్టివేయరా
హార్ట్ లోన లవ్ బీటు ఉందిరా
మాటు వేసి నన్ను కాటు వేయరా

హెర్కులస్ బండ నెత్తాడురా ఎత్తెయ్ రా వెండి కొండ 
అలగ్జాండర్ భువిని గెలిచాడు రా గెలిచెయ్ రా గోల్కొండ
రణధీర సరే పోరు చేసెయ్ రా

హే హీమాన్ హీమాన్ నీవే నాలో
హే హీమాన్ హీమాన్ నీవే నాలో

గుండెల్లో గుబులు వళ్ళంత జిగులు
నా మైక్ టైసన్
నీ కైపు స్ట్రోక్ వళ్ళంత షేక్ నా హోలి ఫీల్డ్ ను
నీ వంటి స్పీడు మజిల్ పవరు సూపరు
నీ నడక జోరు కంటి నజరు లేజరు

హే హీమాన్ హీమాన్ నీవే నాలో
హే హీమాన్ హీమాన్ నీవే నాలోఅయ్యగారు అవునండి పాట సాహిత్యం

 
చిత్రం: స్నేహం కోసం (1999)
సంగీతం: ఎస్. ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: ఏ ఎమ్. రత్నం
గానం: మనో, పి. జయ చంద్రన్

చంపెత్తాను నిన్ను ఎదురు తిరిగి మాట్లాడావంటే
ఏరా ఆడు చేసింది తప్పే కదూ
అవును అవును పెద్దయ్య

ఆ అవును కొబ్బరి చెట్టుకి చేసిన ముచ్చట
మన అమ్మాయి గారికి చేస్తే తప్పేంటి
చెప్పండ్రా
అవును అవును చిన్నయ్య

అరేయ్ ఆగరా
ఆగనండి
అగమంటుంటే
ఆగనండే
అరేయ్ ఓరెరేయ్ - అయ్యా
వత్తినే నాటకమాడాను 

అయ్యో

ఒరేయ్ తెలివితక్కువ దద్దమ్మా
ప్రేమ మాత్రమే ఉంటే సరిపోదు కూసింత రోషం కూడా ఉండాలి

ఏమైనా నువ్వా ఇంటికి ఎల్లడం తప్పు తప్పే

అవును అవును పెద్దయ్య

ఊర్లో అందరికి అన్నీ చేస్తారు
మన ఇంట్లో ఆడబిడ్డ కంటతడి పెట్టుకోవడం
మంచిదేంటి
ప్రేమకన్నా రోషం గొప్పదా చెప్పండ్రా
అవును అవును చిన్నయ్య

అయ్యగారు అవునండి
భలే మంచివారు అవునండి
మరి కోపమొస్తే అవునండి
భలే రోషగాడు అవునండి
మాయదారి రక్తపోటు అది చేసే పొరపాటు
మాయదారి రక్తపోటు అది చేసే పొరపాటు
అయ్యగారు మాటంటే కరకట్టు మాట
అవునంటే ఆ పూట పంచదార పాట
చిన్నయ్య గారంటే చిక్కులేని మాట
వినకుంటే ఆ పూట తైతక్కలాట

రోషమున్న వంశమురా నువు కాకా పట్టకురా
రోషమున్న వంశమురా నువు కాకా పట్టకురా

మాట వినకపోతే చంపేస్తా
తుపాకీతో నిన్ను కల్చేస్తా - అయ్యో
అవునండి అది చెయ్యండి
కాల్చడం వల్ల కాదండి
తుపాకిలో గుళ్ళు లేవండి
అవునండి అది చెయ్యండి
నూరు ఆరైన రేయి పగలైన
నేను మారేది లేదు
రోషమే లేని పౌరుషం లేని
మీసమే ఎందుకంట

అయ్యయ్యో పెద్దయ్య ఈ పంతా లేలయ్య
కోపాలే ఇంటికి వంటికి మంచిది కాదయ్యా

అయ్యగారు అవునండి
భలే మంచివారు అవునండి
మరి కోపమొస్తే అవునండి
భలే రోషగాడు అవునండి

ఏవండోయ్ కొంచం ఆగండి
తువ్వాలు నడుమున కట్టండి
అవునండి అది చెయ్యండి
వాడి మాటలు మీ కేలండి
తేడాలిక్కడ లేనే లేవండి
అవునండి అది నిజమండి

పెద్దవారిని గౌరవించడం మీరు నేర్పినది కాదా
చిన్నవారిని మంచి మనసుతో మీరు మన్నించ లేరా

దారికొచ్చాడు

ఓరయ్యో చిన్నయ్య మనసెరిగిన వాడివయా
మీసాన్ని మెలివేసిమన కీర్తిని పెంచవయా

అయ్యగారు అవునండి
భలే మంచివారు అవునండి
మరి కోపమొస్తే అవునండి
భలే రోషగాడు అవునండి

మాయదారి రక్తపోటు అది పోనే పోయింది
మాయదారి రక్తపోటు అది పోనే పోయింది

ఎడ్డెమంటే తెడ్డెమంటు ఏర్రెత్తి పోయె
అయ్యగారి కోపమిట్ట కొండెక్కి పోయె
లాలించి పాలించి తెల్లారిపోయె
చిన్నయ్య మనసంత సంతోషమాయే

రోషమున్న వంశమురా రారాజుగ బ్రతికేయ్ రా
రోషమున్న వంశమురా రారాజుగ బ్రతికేయ్ రామీసమున్న నేస్తమా పాట సాహిత్యం

 
చిత్రం: స్నేహం కోసం (1999)
సంగీతం: ఎస్. ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్

మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా
మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా
రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా
కోపమెక్కువా కాని మనసు మక్కువ
స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా
ఏల్లెదిగిన పసివాడా ఎన్నటికి నినువీడా

మీసమున్న నేస్తమా హొయ్

ఏటి గట్టు చెపుతుంది అడుగు మన చేప వేట కధలు
మర్రిచెట్టు చెపుతుంది పంచుకొని తిన్న సద్ది రుచులూ
చెరుకు తోట చెపుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు
టెంట్ హాలు చెపుతుంది ఏన్ టి ఆర్ స్టంటు బొమ్మ కధలూ
పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈతకొడుతూ 
ఏన్నేలో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి
వయసంత మరచికేరింతలాడె ఆ తీపిగ్నాపకాలూ
కలకాలం మనతోటే వెన్నంటే వుంటాయి 
మనలాగే అవికూడా విడిపోలేదంటాయి

మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా
రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా

ఒక్క తల్లి సంతానమైన మన లాగ ఉండగలరా
ఒకరు కాదు మనమిద్దరంటె ఎవరైన నమ్మగలరా
నువ్వు పెంచినా పిల్లపాపలకు కన్నతండ్రినైనా
ప్రేమ పంచినా తీరులోన నేనిన్ను మించగలనా
ఏ పుణ్యం చేసానో నే నీస్నేహం పొందాను 
ఆ ప్రాణం నీదైనా నీ చెలిమి రుణం తీరేనా 
నీకు సేవ చేసెందుకైన మరుజన్మ కోరుకోనా
స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా
ఏల్లెదిగిన పసివాడా ఎన్నటికి నినువీడా

మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా
రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా
కోపమెక్కువా కాని మనసు మక్కువా
స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా
ఏల్లెదిగిన పసివాడా ఎన్నటికి నినువీడాఊహలలో ఊపిరిలో పాట సాహిత్యం

 
చిత్రం: స్నేహం కోసం (1999)
సంగీతం: ఎస్. ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: భువన చంద్ర
గానం: ఎస్.పి. బాలు, సుజాతా మోహన్

జనకు జనకు జన జన్నా జన్నా
జనకు జనకు జన జన్నా

ఊహలలో ఊపిరిలో ఉన్నది నీవేలే
నా మనసూ నా వయసూ అన్నీ నీకేలే
నన్ను గెలిచినా సుందరివే
మనసు దోచినా మంజరివే
అణువు అణువునా నీవేలే
అంతరాత్మలో నీవేలే
కొండా కోనా ఎండా వానా అన్నీ మనవేలే

జనకు జనకు జన జన్నా జన్నా
జనకు జనకు జన జన్నా

భూగోలపు అంచుల వెంటా తిరిగే వద్దాం
ఏడేడు సంద్రారైనా దాటే వద్దాం
గగనంలో గోళాలన్ని గాలించేద్దాం
మన ప్రేమల జండా నొక్కటి నాటే వద్దాం
ఆ నింగీ ఈ నేలా మన స్వేచ్చ కేమొ ఎల్లలూ
హరి విల్లు చిరు జల్లు మన ప్రేమ కేమొ సాక్షులూ
చంద్రుడెరుగని పున్నమి రాత్రులు ప్రేమలోనె ఉన్నాయిలే

ఊహలలో ఊపిరిలో ఉన్నది నీవేలే
ఊసులలో బాసలలో ఉన్నది నీవేలే

ప్రేమస్త్రం సందిస్తేనె తిరుగే లేదూ
అణ్వస్త్రాలెన్నున్నా చెల్లా చెదురూ
లోకంలో శాస్వతమైనది ప్రేమేనంటా
ఆ ప్రేమకి కావలసినదీ మనసేనంటా
ఆ నాడు ఈ నాడు గెలిచేది ప్రేమ ఒక్కటే
ఎవరన్నా ఏమన్నా నిలిచేది ప్రేమ ఒక్కటె
కాలమెరుగని గాదలు ఎన్నో
ప్రేమలోనే ఉన్నాయిలే

జనకు జనకు జన జన్నా జన్నా
జనకు జనకు జన జన్నా

ఊహలలో ఊపిరిలో ఉన్నది నీవేలే
నా మనసూ నా వయసూ అన్నీ నీకేలే
నన్ను గెలిచినా సుందరివే
మనసు దోచినా మంజరివే
అణువు అణువునా నీవేలే
అంతరాత్మలో నీవేలే
కొండా కోనా ఎండా వానా అన్నీ మనవేలే

జనకు జనకు జన జన్నా జన్నా
జనకు జనకు జన జన్నా

Most Recent

Default