Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Venky Atluri"
Lucky Baskhar (2024)



చిత్రం: లక్కీ భాస్కర్ (2024)
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి
దర్శకత్వం: అట్లూరి వెంకీ
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
విడుదల తేది: 31.10. 2024



Songs List:



శ్రీమతి గారు పాట సాహిత్యం

 
చిత్రం: లక్కీ భాస్కర్ (2024)
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
సాహిత్యం: శ్రీమణి
గానం: విషాల్ మిశ్రా, శ్వేతా మోహన్ 

కోపాలు చాలండి శ్రీమతి గారు
కొంచెం కూల్ అవ్వండి మేడమ్ గారు
చామంతి నవ్వే విసిరే మీరు
కసిరేస్తూ ఉన్నా బావున్నారు
సరదాగా సాగే.. సమయంలోన మరిచిపోతే బాధ కబురు
వద్దు అంటూ ఆపేదెవరు

కోపాలు చాలండి శ్రీమతి గారు
కొంచెం కూల్ అవ్వండి మేడమ్ గారు

పలుకే నీది.. ఓ వెన్నె పూస
అలకే ఆపే మనసా
మౌనం తోటి మాట్లాడే భాష.. అంటే నీకే అలుసా
ఈ అలలా గట్టు.. ఆ పూల చెట్టు.. నిన్ను చల్లబడవే అంటున్నాయే
ఏం జరగనట్టు నీవ్వు కరిగినట్టు.. నే కరగనంటూ చెబుతున్నాలే
నీతో వాదులాడి.. గెలువలేనే వన్నెలాడి
సరసాలు చాలండి ఓ శ్రీవారు.. ఆఖరికి నెగ్గేది మీ మగవారు

హాయే పంచే ఈ చల్లగాలి.. మళ్లీ మళ్లీ రాదే
నీతో ఉంటే ఏ హాయికైనా.. నాకే లోటేం లేదే

అదుగో ఆ మాటే.. ఆంటోంది పూటే.. సంతోషమంటే మనమేనని
ఇదిగో ఈ ఆటే.. ఆడే అలవాటే మానేయవేంటో కావాలని
నువ్వే.. ఉంటే చాల్లే.. మరిచిపోనా ఓనమాలే

బావుంది.. బావుంది.. ఓ శ్రీవారు
గారాబం మెచ్చిందే శ్రీమతి గారు



లక్కీ భాస్కర్ పాట సాహిత్యం

 
చిత్రం: లక్కీ బాస్కర్ (2024)
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
సాహిత్యం: ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి
గానం: ఉషా ఉతుప్

షబాషు సోదర కాలర్ ఎత్తి తిరగర
కరెన్సీ దేవి నిను వరించేరా
తమాష చూడరా నీ గ్రహాలు సర సరా
అదృష్టరేఖ పైనే కదిలెరా
నిన్ను ఆపేవాడే లేడే
నీదైన కాలం నీదే
మొదలురా మొదలురా మొదలురా…..

యు  లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్

శక్తి నీదిర యుక్తి నీదిర
కోటి విద్యలేవైనా కూటి కోసమేలేరా
లెగర నరవర మెదడుకే పదును పెట్టరా
దిగర ధీవర లాకెర్లు కొల్లగొట్టరా
ఎగుడుదిగుడుగా ఇన్నాళ్ల రొస్టు చాలుర
బెరుకునోదలరా మారాజులాగ బతకరా
మబ్బుల్లో తేలే చోర డబ్బుల్తో నాట్యం చేయరా
గల గల గల గల గల గల

యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్

గీత దాటర రాత మార్చరా
సగటు మానవా సైరా నగదు పోగు చేసేయరా
మనను నమ్మిన నలుగురి మంచి కొరకెర
మంచి చెడునల మనసులోనే దాచర
మెతుకు పరుగులు ఈ పైన నీకు లేవురా
బతుకు బరువుని దించేసి కాస్త నవ్వరా
ఆర్చేది వారా వీర నీ యుద్ధం నీదేలేరా
చెగువరా చెగువరా చెగువరా

యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్




నిజామా కలా పాట సాహిత్యం

 
చిత్రం: లక్కీ బాస్కర్ (2024)
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
సాహిత్యం: శ్రీమణి
గానం: కృష్ణ తేజస్వి 

నిజామా కలా

Palli Balakrishna Wednesday, November 13, 2024
Rang De (2021)



Movie Details



Songs List:



రంగులే పాట సాహిత్యం

 
చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: శ్వేతా మూహన్ 

రంగులే 



ఊరంతా వెన్నెలా పాట సాహిత్యం

 
చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: మంగ్లీ

ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః

ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి
రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి
జగమంతా వేడుక మనసంతా వేధన
పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి
మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే
ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు

ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి
రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి

ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః

ఎవరికీ చెప్పవే ఎవరినీ అడగవే
మనసులో ప్రేమకే మాటలే నేర్పవే
చూపుకందని మచ్చని కూడా
చందమామలో చూపిస్తూ
చూపవలసిన ప్రేమను మాత్రం
గుండె లోపలే దాచేస్తూ
ఎన్నో రంగులున్నా బాధ రంగే బతుకులో ఒలికిస్తూ

ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి
రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి

ఎవరితో పయనమో ఎవరికై గమనమో
ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో
ఎన్ని కలలుగని ఏమిటి లాభం
కలలు కనులనే వెలివేస్తే
ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం
సొంత కథను మది వదిలేస్తే
చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్ళను

ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి
రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి

ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః




చూసి నేర్చుకో కు పాట సాహిత్యం

 
చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సాగర్

పొద్దున్నే లేవడాన్ని కోడ్ని చూసి నేర్చుకో
అంటారు కోడ్ని కోసే పెద్దలెందుకో
శుభ్రంగ ఉండటాన్ని వాడ్ని చూసి నేర్చుకో
కంపేరు చేయడాన్ని ఆపరెందుకో
ఫస్ట్ ర్యాంకు కొట్టడాన్ని వీడ్ని చూసి నేర్చుకో
ఫస్ట్ క్లాస్ నుంచి ఈ టార్చరెందుకో
టైం కొచ్చి పోయే పిల్లగాన్ని చూసి నేర్చుకో
పంక్చువాలిటీ లేని ఈ పంచ్ లెందుకో

ఆడ్ని చూసి ఈడ్ని చూసి నేర్చుకుంటూ పోతూ
ఉంటే జిరాక్స్ లాగ జీవితాలు మారవా సో 
చూసి నేర్చుకో కు ఎవడ్ని చూసి నేర్చుకో కు
లెక్క చెయ్యమా కు ఎవడ్ని లెక్క చెయ్యమా కు

సన్ లైట్ ని చూసి నేర్చుకొని ఉంటే
ఫుల్ మూన్ కూల్ గా ఉండే వాడా
క్లాసుమేట్ ని చూసి నేర్చుకుని ఉంటే
ఐన్ స్టీన్ సైంటిస్టు అయ్యేవాడా

మంకీలనుంచే మనిషి పుట్టకంటారు 
మరి మంకీల ఉంటే తట్టుకోరు ఎందుకో
డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తుంది మరి
డాంకీ ని చూసి నేర్చుకోరు ఎందుకో

వాడి లాగ వీడి లాగ ఉండటాన్ని
కాపీ చేసి, పేస్ట్ చేస్తే.... లైఫ్ వేస్ట్ అవ్వదా - సో 

చూసి నేర్చుకో కు, కో కు...
ఎవన్ని చూసి నేర్చుకోకు, కో కు
లెక్క చెయ్యమా కు, మాకు...
ఎవన్ని లెక్క చెయ్యమా కు, మాకు

జింక లాగే నేను క్యూట్ గా ఉండాలి అంటూ
సింహం జూలే ట్రిమ్ చేస్తుందా
ఫిష్ లాగే నేనూ ఈత కొట్టాలి అంటూ
ఎలిఫెంట్ స్విమ్ సూట్ వేసేస్తుందా

ఓన్ స్టైల్ మార్చుకోవు ఆనిమల్స్ ఎప్పుడూ
వాటి క్లారిటీ మనకు లేదు ఎందుకో
కంక్లూషన్ ఏంటి అంటే కన్ఫ్యూస్ వద్దురో
నీకు లాగే నువ్వు ఉంటే దిగులు దేనికో

వాడి లాగో వీడి లాగో సిగ్నేచర్ ఇచ్చుకుంటే
ఫ్యూచరే ఫోర్జరీ అవ్వదా... సో
చూసి నేర్చుకో కు, ఎవన్ని చూసి నేర్చుకో కు
లెక్క చెయ్యమా కు, ఎవన్ని లెక్క చెయ్యమా కు
చూసి నేర్చుకో కు,




నా కనులు ఎపుడూ పాట సాహిత్యం

 
చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సిద్ శ్రీరామ్

నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా

నా మనసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణాన
చేదుపై తీపిలా రేయిపై రంగులా
నేలపై నింగిలా
గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళా

నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా

నామనసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణాన

ఎపుడూ లేని ఈ సంతోషాన్ని
దాచాలంటే మది చాలో లేదో
ఎపుడో రాని ఈ ఆనందాన్ని
పొందే హక్కే నాకుందో లేదో

నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం
నాకివాళ సొంతమై అందేనే
గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ

నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా

నన్నే నేనే కలిసానో ఏమో
నాకే నేనే తెలిసానో ఏమో
నీలో నన్నే చూశానో ఏమో
నాలా నేనే మారానో ఏమో
నా గతంలో నీ కథెంతో
నీ గతంలో నా కథంతే
ఓ క్షణం పెంచిన
గుప్పెడు గుండెకు పండుగ ఆవేళా

నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా

నా మనసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణాన



బస్టాండే బస్టాండే పాట సాహిత్యం

 
చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సాగర్

బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే

ఊ - సింపుల్గుండె లైఫు
ఊ - టెంపుల్ రన్ లా మారే,
ఊ - ఈ రంగురంగు లోకం
ఊ - చీకట్లోకి జారే

ఊ - లవ్ లేకుండ కలలే
ఊ - లైఫే లేనిదాయే, హ్మ
ఊ - స్మైలీ లాంటి పేసే
ఊ -  స్మైలే లేనిదాయే

నీళ్ళు లేని బావిలోన కప్పలాగ తేలిపోయే
జాలరేదో గాలమేస్తే చేపలాగ దొరికిపోయే
తీసుకున్న గొయ్యిలోన కాలుకాస్త జారిపోయే

బస్టాండే బస్టాండే  ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
అబ్సకాండే అబ్సకాండే సంతోషం అబ్సకాండే
అబ్సకాండే అబ్సకాండే సంతోషం అబ్సకాండే

ఊ - సింపుల్గుండె లైఫు
ఊ - టెంపుల్ రన్ లా మారే
ఊ - ఈ రంగురంగు లోకం
ఊ -  చీకట్లోకి జారే

సలసల కాగు నీట్లో
వేళ్ళే పెట్టినానురో
కారమంటుకున్న చేత్తో
కళ్ళే నలిపినానురో

ఊ - ఎవరులేని చోట
ఊ - గావుకేకైంది లైఫే
ఊ - ఫ్రెండులా ఉండే ఫేటే
ఊ - ఫుట్ బాల్ ఆడే నాతోటే

బస్టాండే బస్టాండే  ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
అబ్సకాండే అబ్సకాండే సంతోషం అబ్సకాండే
అబ్సకాండే అబ్సకాండే సంతోషం అబ్సకాండే

స్లేటే పక్కనుంటదే
కానీ చాక్ పీస్ చిక్కనంటదే, యే
ప్లేట్ లో ఫుడ్డు ఉంటదే
కానీ నోటికి తాళముంటదే

ఊ - లైటు స్విచ్చెయ్యగానే
ఊ - బల్బ్ మాడిపోయినట్టు
ఊ - లైఫు స్టార్టవ్వగానే
ఊ - నా ఫ్యూచర్ పంక్చరయ్యనే

బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
అబ్సకాండే అబ్సకాండే సంతోషం అబ్సకాండే
అబ్సకాండే అబ్సకాండే సంతోషం అబ్సకాండే



ఏమిటో ఇది పాట సాహిత్యం

 
చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: కపిల్ కపిలన్, హరిప్రియ

ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువగానన్నది
భాష లేని ఊసులాట సాగుతున్నది
అందుకే ఈ మౌనమే భాష అయినది
కోరుకోని కోరికేదో తీరుతున్నది

ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువగానన్నది

అలలా నా మనసు తేలుతుందే...
వలలా నువు నన్ను అల్లుతుంటే...
కలలా చేజారిపోకముందే...
శిలలా సమయాన్ని నిలపమందే...

నడక మరిచి నీ అడుగు ఒడిన
నా అడుగు ఆగుతుందే
నడక నేర్చి నీ పెదవి పైన
నా పెదవి కదులుతుందే
ఆపలేని ఆట ఏదో సాగుతున్నదీ ఓ ఓ ఓ

ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువగానన్నది

మెరిసే ఒక కొత్త వెలుగు నాలో....
కలిపే ఒక కొత్త నిన్ను నాలో...
నేనే ఉన్నంత వరకు నీతో....
నిన్నే చిరునవ్వు విడవదనుకో...

చినుకు పిలుపు విని నెమలి పింఛమున
రంగులెగసినట్టు
వలపు పిలుపు విని చిన్ని మనసు చిందేసే
ఆగనంటూ
కోరుకున్న కాలమేదో చేరుతున్నది ఓ ఓ ఓ

ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువగానన్నది

Palli Balakrishna Sunday, March 7, 2021

Most Recent

Default