Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Varsha Bollamma"
Ooru Peru Bhairavakona (2023)



చిత్రం: ఊరుపేరు భైరవకోన (2023)
సంగీతం: శేఖర్ చంద్ర 
నటీనటులు : సందీప్ కృష్ణ, వర్ష బొల్లమ్మ , కావ్య థాపర్
దర్శకత్వం: వీఐ ఆనంద్‌
నిర్మాత: రాజేశ్‌ దండా
విడుదల తేది: 2023



Songs List:



నిజమే నే చెబుతున్న పాట సాహిత్యం

 
చిత్రం: ఊరుపేరు భైరవకోన (2023)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: శ్రీమణి 
గానం: సిద్ శ్రీరామ్ 

తానానే నానానే నానానేనా
తానానే నానానేనే
తానానే నానానే నానానేనా
తారారే రారారరే

నిజమే నే చెబుతున్న జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్నా 
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా 

వెళ్లకే వదిలెళ్ళకే
నా గుండెని దొచేసిలా
చల్లకే వెదజల్లకే
నా చుట్టూ రంగుల్నిలా

తానారే రారారె రారారెనా
తారారె నానారెరే
తానారే నానారె తానారెనా
తారారే రారారరే

వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే
నిను కలిసాకే వెన్నెలవర్షం తెలుసే
మౌనం తెలుసే నాకు మాట తెలుసే
మౌనంలో దాగుండె మాటలు తెలుసే

కన్నుల్తో చూసేది కొంచమే
గుండెల్లో లోతే కనిపించెనే
పైపైన రూపాలు కాదులే
లోలోపలి ప్రేమే చూడాలిలే

నిజమే నే చెబుతున్న జానే జాన
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా...

పెదవులతోటి పిలిచే పిలుపులకన్నా
మనసారా ఓ సైగే చాలంటున్న
అడుగులతోటి దూరం కొలిచేకన్నా
దూరాన్ని గుర్తించని పయణంకానా

నీడల్లే వస్తానే నీ జతై
తోడల్లే ఉంటానే నీ కథై
ఓ ఇనుప పలకంటి గుండెపై
కవితల్ని రాసావు దేవతై

నిజమే నే చెబుతున్న జానే జాన
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్న ఆ హా హా

Palli Balakrishna Tuesday, May 23, 2023
Stand Up Rahul (2022)



చిత్రం:  Stand Up Rahul (2022)
సంగీతం: స్వీకర ఆగస్తి 
నటీనటులు: రాజ్ తరుణ్, వర్ష బోల్లమ్మ 
దర్శకత్వం: సంతూ మోహన్ వీరంకి 
నిర్మాతలు: నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి
విడుదల తేది: 2022



Songs List:



అలా ఇలా పాట సాహిత్యం

 
చిత్రం:  Stand Up Rahul (2022)
సంగీతం: స్వీకర ఆగస్తి 
సాహిత్యం: అనంత్ శ్రీరాం
గానం: సత్య యామిని , స్వీకర ఆగస్తి 

అలా ఇలా అనాలని ఇలా ఎలా ఉందే
అవీ ఇవీ వినాలని ఇవ్వాళ తోచిందే
పెదవులపైనా మెరిసే ఈ నవ్వులే
ఇది వరకైతే ఎపుడు కనిపించలే
ఇన్నాళ్ళీ వెన్నెల్లన్నీ లోలోపలే

ఎంతో ఎంతో సంతోషంతో ఉన్నా నే నీక్షణం
అంతో ఇంతో వింతే నీతో సాగే సహజీవనం

అలా ఇలా అనాలని ఇలా ఎలా ఉందే
అవీ ఇవీ వినాలని ఇవ్వాళ తోచిందే

పని తెలియని పసితమట నాది
అది తెలిసిన పెద మనసట నీది
అనువుగ మరి జరగదు కద ఏది
అనుకువగల మగువకు తిరుగేదీ

నీ వలనే అవుతుందేమో నేనెపుడూ కోరే పని
నీ జతగా ఉండె గుండె అంటుందే ఇంతే చాలని
వందేళ్ళీ వర్ణాలన్నీ తోడుండనీ

ఎంతో ఎంతో సంతోషంతో ఉన్నా నీ నీక్షణం
అంతో ఇంతో వింతే నీతో సాగే సహజీవనం

అలా ఇలా అనాలని ఇలా ఎలా ఉందే
అవీ ఇవీ వినాలని ఇవ్వాళ తోచిందే




పదా పాట సాహిత్యం

 
చిత్రం:  Stand Up Rahul (2022)
సంగీతం: స్వీకర ఆగస్తి 
సాహిత్యం: రెహ్మాన్ 
గానం: యాజిన్ నిజార్

పదా…
పదమంటోంది పసి ప్రాయం
సదా…
నిను చేరేటి ఆరాటం

ఆగే వీల్లేదు కదా
నా… కలా నిజాల మెలకువలోన
నిన్ను చూపే వేళ
పాడెలే పెదాలు కదలక పాటలే

నా అడుగులు ఉరుకులు
పరుగులు తీస్తుంటే
మైమరపులు మెరుపులు
ఎ హే హేహే హే

ఆ వలపులు తలపులు
తపనలు పెంచేస్తుంటే ఆశలే

పదా…
పదమంటోంది పసి ప్రాయం
సదా…
నిను చేరేటి ఆరాటం

బయటికి రాకున్నా
నీవేనా లోలోన
ఎదురుగ నువ్వున్న
జారేనా ఓ మాటైనా

అనుమానం లేదింకా
అనుకోని ఏదో వైఖరి
మార్చిందే ఈరోజే కధలన్నీ
సందేహం బంధించి పెంచిందే
లోలో అలజడి
వివరించే దారేదో మరీ

ఏమిటో క్షణాలు కదలక
ఆగిపోయే ఆరాదీస్తే
ఊపిరే తపించి అడిగెను నీ జతే

ఈ పలుకులు పదములు
మెలికలు వేస్తుంటే
ముందెనకలు మునకలు
ఈ చొరవలు చనువులు
కబురులు ఊపేస్తుంటే ఊగెలే



తప్పా..? పాట సాహిత్యం

 
చిత్రం:  Stand Up Rahul (2021)
సంగీతం: స్వీకర ఆగస్తి 
సాహిత్యం: రఘురాం 
గానం: బెన్నీ దయాల్ 

మా ఇంటి గేటు పక్కన
ఎవడో స్పోర్ట్స్ కారు పార్కు చేస్తే
ఫోజులిచ్చి సెల్ఫీ కోసం దానికానుకుంటే
ఇంతలోనే డ్రైవరొచ్చి గేరు వేసి తొక్కితే
నా తప్పా..?

అమాయకంగా రెండు పెగ్గులేసి
సొంత స్ట్రీటు బైటే
చిన్ననాటి దోస్తు తోటి బైక్ రైడుకెల్తే
పట్టపగటి పూట డ్రంకన్ డ్రైవ్ పెట్టి
దొరికిపోతే తప్పా..?

వెకేషనే వచ్చేసినా
లొకేషనే చేంజ్ అవ్వని
పోసిషనే శపించనే
అయ్యయ్యో ఏమిటీ జిందగీ
డెస్టినీ తప్పా..?

జాలీగా బ్యాచ్ తోటి మేడ మీద
పార్టీ ప్లాన్ చేస్తే టెన్ టు ఫైవ్
డీజే పెట్టి మస్తు మస్తు స్వింగులోన ఉంటే
వేళకాని వేళలోన వర్షమొచ్చి వెక్కిరిస్తే
తప్పా..?

ఆన్లైన్ లో ఆఫర్ ఏదో చూసి
నేను టెంప్ట్ అయిపోయి
బెస్ట్ ప్రైస్ తోటి కొత్త స్మార్టు ఫోన్ కొంటే
జస్ట్ ఎ వీక్ గ్యాప్ లోనే
నెక్స్ట్ మోడల్ వస్తే నాది తప్పా..?

పిల్ల నాకు నచ్చి లవ్వు చెప్పబోతే
బెస్ట్ ఫ్రెండే వచ్చి
వాడి గర్ల్ ఫ్రెండంటే తప్పా, తప్పా..??

సెల్ ఫోన్ నుంచు పేటిఎం చేస్తూ
బిల్లు కట్టే లోపు స్విఛాప్ ఐపోతే
తప్పా, నా తప్పా..?

రెంటు కట్టలేక పెంట్ హౌస్ వదిలి
టెంటు వేసుకుంటే నా తప్పా..?
జంట అంటూ లేక మెంటలెక్కి పోయి
కంటనీరు వస్తే నా తప్పా..?

ప్రమోషనే కొట్టేసిన
ఎమోషనే చేంజ్ అవ్వని
కండిషనే వచ్చేసెనే
అయ్యయ్యో ఏమిటీ జిందగీ
ట్రాజెడీ తప్పా..?

జూమ్ కాల్ లోనా ఫేసు కాస్త చూపి
నచ్చినట్టే నాకు కింద నిక్కరేస్తే
నా తప్పా, తప్పా..?
రివ్యూలన్నీ చూసి సినిమాకి వెళ్తే
రేటింగ్ ఉన్నా గాని రొట్టలాగ ఉంటే
తప్పా, నా తప్పా..?

ఛాన్స్ వస్తే తప్పా
డాన్స్ వస్తే తప్పా
ఫాన్స్ ఉంటే తప్పా, నా తప్పా
బ్యాండ్ ఉంటె తప్పా
బ్రాండ్ ఉంటే తప్పా
డిమాండ్ ఉంటే తప్పా, నా తప్పా





షాలో కలల వ్యాలీలో పాట సాహిత్యం

 
చిత్రం:  Stand Up Rahul (2021)
సంగీతం: స్వీకర ఆగస్తి 
సాహిత్యం: శ్రీమణి 
గానం: షాన్

షాలో కలల వ్యాలీలో నడిచే మనసురో
ఫ్లోలో ఫాంటసీల మారెరో
హైలో హార్టు బీటే రిథమేదో పెంచెరో
లైవ్ లో లైఫ్ మ్యూజిక్ మార్చెరో

మారుతున్న ఒంటరి నేనే నీతో
జంటవ్వాలని ఒక లవ్లీ డేట్ లా సాగిపోనా
ఈ క్షణం నీతో ఆకాశాలే తాకుతూ
ఒక ఫ్లైయింగ్ ఫ్లైటులా

షాలో కలల వ్యాలీలో నడిచే మనసురో
ఫ్లోలో ఫాంటసీల మారెరో
హైలో హార్టు బీటే రిథమేదో పెంచెరో
లైవ్ లో లైఫ్ మ్యూజిక్ మార్చెరో

మారుతున్న ఒంటరి నేనే
నీతో జంటవ్వాలని
ఒక లవ్లీ డేట్ లా సాగిపోనా
ఈ క్షణం నీతో ఆకాశాలే తాకుతూ
ఒక ఫ్లైయింగ్ ఫ్లైటులా, షాలో

మౌనం పలికిందా తానె మాటలే మలిచి
ప్రాణం నిండా సంగీతం కురిసేలా
తీరం వచ్చిందా తానే వద్దకే నడిచి
నీతో అడుగేస్తే హాయిగా ఇలా

నిదురెరుగని మదిలోన
గతిచెదిరిన గమనములోన
శృతికుదిరిన సమయాన
నీతో సాగే సావాసానా

షాలో కలల వ్యాలీలో నడిచే మనసురో
ఫ్లోలో ఫాంటసీల మారెరో
హైలో హార్టు బీటే రిథమేదో పెంచెరో
లైవ్ లో లైఫ్ మ్యూజిక్ మార్చెరో

మారుతున్న ఒంటరి నేనే
నీతో జంటవ్వాలని
ఒక లవ్లీ డేట్ లా సాగిపోనా
ఈ క్షణం నీతో ఆకాశాలే తాకుతూ
ఒక ఫ్లైయింగ్ ఫ్లైటులా, షాలో




ఉండి లేనట్టుండి పాట సాహిత్యం

 
చిత్రం:  Stand Up Rahul (2021)
సంగీతం: స్వీకర ఆగస్తి 
సాహిత్యం: శ్రీ సాయి కిరణ్ 
గానం: అనురాగ్ కులకర్ణి 

ఉండి లేనట్టుండి అందంగా
ఎదురైన బంధం నాకడ్డంగా
వెంటే వెంటే ఉండి ఏ దారి
పోయిందో అర్ధం కానట్టుందా

ఉన్నన్నాళ్ళు ఎన్నో ఆశల్ని చూపించి
సొంతం కానంటుందా
గాయాలెన్నో నిండి నీ లోకం
నీ నుండి దూరం అయినట్టుందా

సందేహంగా సాగే దారంతటా
సంతోషంగా ఉండే వీలంటూ లేదట

కలో అవునో బదులు అడుగు మనసుని
ఉందో లేదో మనసుపడిన ప్రేమ జాడనీ

పొందేనేదో పోయెనేదో తేలిందా నీకీనాడైనా
పోనీ నీలో మిగిలేదేదో తెలిసిందా కొంతైనా

ఆగేదేనా ఆలోచనా ఆపేయ్
నీ పంతంనే అంటున్నా
తీరేదేనా ఈ వేదన
దూరంగా ఉంటూ ఏ తీరం చేరినా

కలో అవునో బదులు అడుగు మనసుని
ఉందో లేదో మనసుపడిన ఆ క్షణాలనీ

Palli Balakrishna Wednesday, January 19, 2022
Middle Class Melodies (2020)



చిత్రం: మిడిల్ క్లాస్ మేలోడీస్ (2020)
సంగీతం: స్వీకర్ అగస్తి
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ
దర్శకత్వం: వినోద్ అనంతోజు
నిర్మాత: వెనిగళ్ళ ఆనందప్రసాద్
విడుదల తేది: 20.11.2020



Songs List:



ది గుంటూరు పాట సాహిత్యం

 
చిత్రం: మిడిల్ క్లాస్ మేలోడీస్ (2020)
సంగీతం: స్వీకర్ అగస్తి
సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ
గానం: అనురాగ్ కులకర్ణి

తెల్లారే ఊరంతా తయ్యారే
ముస్తాబై పిలిచింది గుంటూరే
రద్దీలో యుద్ధాలే మొదలాయే
తగ్గేదే లేదంటే ప్రతివాడే

మరుపే రాని ఊరేగుంటూరే
అలుపంటూ లేదంటే సూరీడే
పగలంతా తడిసేలే సొక్కాలే
ఎన్నెన్నో సరదాలే కొలువుంటే
కారాలే నూరేది అంటారే

బేరం సారం సాగే దారుల్లోన
నోరూరించే మిర్చి బజ్జి తగిలే
దారం నుంచి సారె సీరల దాక
గాలం ఏసి పట్నం బజారు పిలిసే

యే పులిహోర దోశ - బ్రాడీపేట
బిర్యానికైతే - సుభాని మామ
వంకాయ బజ్జి - ఆరో లైను
గోంగూర చికెన్-బృందావనం
మసాల ముంత-సంగడిగుంట
మాలు పూరి - కొత్తపేట
చిట్టి ఇడ్లీ - లక్ష్మి పురం
అరె... చెక్క పకోడీ - మూడొంతెనలూ

గుటకే పడక కడుపే తిడితే
సజ్జా గింజల సోడా బుస్సందే
పొడి కారం నెయ్యేసి పెడుతుంటే
పొగ చూరే దారుల్లో నోరూరే
అడిగిందే తడువంటా ఏదైనా
లేదన్నా మాటంటూ రాదంటా
సరదాపడితే పోదాం గుంటూరే




సంధ్యా పదపద పదమని పాట సాహిత్యం

 
చిత్రం: మిడిల్ క్లాస్ మేలోడీస్ (2020)
సంగీతం: స్వీకర్ అగస్తి
సాహిత్యం: సనపతి భరద్వాజ్ పాత్రుడు
గానం: స్వీకర్ అగస్తి

సంధ్యా పదపద పదమని 
అంటే సిగ్గే ఆపిందా
బావా అని పిలిచేందుకు
మొహమాటంతో ఇబ్బంద
నువు వణక్క, తొనక్క, బెరక్క
సరిగ్గ ఉంటే చాలే కథ వెనక్కి జరక్క
చురుగ్గ కొలిక్కి త్వరగా వస్తాదే
ఇది వయస్సు విపత్తు
ఒకింత తెగించి ఉంటే మేలే
విధి తరించి తలొంచి
కరెక్టు ముగింపు ఇపుడే ఇస్తాదే

మధ్యలో ఉన్నది దగ్గరో దూరమో
కాస్తయినా తెలిసిందా
ఎంతకీ తేలనీ ప్రేమలో తేలడం
ఏమైనా బాగుందా
మాటలని కుక్కేశావే మనసు నిండా
వాటినిక పంపేదుందా పెదవిగుండా
బిడియంతో సహవాసం ఇక చాలు బాలిక
అది ఎంతో అపచారం అని అనుకోవే చిలకా

సంధ్యా పదపద పదమని
అంటే సిగ్గే ఆపిందా
బావా అని పిలిచేందుకు
మొహమాటంతో ఇబ్బందా

ఏం సరిపొద్దే నువు చూపే ప్రేమా
ఓ తెగ చూస్తే పనులేవీ కావమ్మా
పైకలా అవుపిస్తాడే ఎవరికైనా
వాడికీ ఇష్టం ఉందే తమరిపైనా

విసిరావో గురిచూసి 
వలపన్న బాణమే
పడిపోదా వలలోన
పిలగాడి ప్రాణమే

సంధ్యా  పదపద పదమని 
అంటే సిగ్గే ఆపిందా
బావా అని పిలిచేందుకు
మొహమాటంతో ఇబ్బంద
నువు వణక్క, తొనక్క, బెరక్క
సరిగ్గ ఉంటే చాలే కథ వెనక్కి జరక్క
చురుగ్గ కొలిక్కి త్వరగా వస్తాదే
ఇది వయస్సు విపత్తు
ఒకింత తెగించి ఉంటే మేలే
విధి తరించి తలొంచి
కరెక్టు ముగింపు ఇపుడే ఇస్తాదే



కీలుగుర్రం పాట సాహిత్యం

 
చిత్రం: మిడిల్ క్లాస్ మేలోడీస్ (2020)
సంగీతం: స్వీకర్ అగస్తి
సాహిత్యం: సనపతి భరద్వాజ్ పాత్రుడు
గానం: అనురాగ్ కులకర్ణి, స్వీకార్ అగస్తి , రమ్య బెహరా

కీలుగుర్రం




సాంబ శివ పాట సాహిత్యం

 
చిత్రం: మిడిల్ క్లాస్ మేలోడీస్ (2020)
సంగీతం: స్వీకర్ అగస్తి
సాహిత్యం: పలనాడు జానపదం
గానం: రామ్ మిరియాల

సాంబ శివ 



మంచిదో చెడ్డదో పాట సాహిత్యం

 
చిత్రం: మిడిల్ క్లాస్ మేలోడీస్ (2020)
సంగీతం: స్వీకర్ అగస్తి
సాహిత్యం: సనపతి భరద్వాజ్ పాత్రుడు
గానం: విజయ్ ఏసుదాస్

మంచిదో చెడ్డదో రెంటికి మద్యేదో 
అంతుచిక్కలేదా కాలం ఎటువంటిదో
కయ్యామో నెయ్యమో ఎప్పుడేం చెయ్యునో
లెక్కతేలలేదా దాని తీరు ఏమిటో

ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం
వేచి ఉంటె రాదారి చూపించదా
చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం
తప్పకుండ బదులైరాదా

మదిలోని చిరునవ్వు జన్మించగా
కలతే పోదా కనుమూయదా
నడిరేయి దరిచేరి మసి పూయగా
వెలుగేరాదా చెరిపేయదా
అరచేతి రేఖల్లో లేదంట రేపు
నిన్నల్ని వదిలేసి రావాలి చూపు
చూడొద్దు ఎదంటూ ఓదార్పు

వచ్చిపోయే మేఘాలే ఈ బాధలన్నీ
ఉండిపోవు కడదాకా ఆనింగిలా
అంతమైతే కారాదు లోలోని దైర్యం
అంతులేని వ్యధలే ఉన్నా

సంద్రాన్ని పోలింది ఈ జీవితం
తెలిసి తీరాలి ఎదురీదడం
పొరపాటు కాదంటపడిపోవడం
ఉండాలో లేచే గుణం

ఎటువంటి ఆటంకమెదురైన గాని
మునుముందు కెల్లేటి అలవాటు మాని
కెరటాలు ఆగేటి రోజేదని
గంథాలన్నీ ఓనాడూ తీసేటి కాలం
వాస్తవాన్ని కళ్లారా చుపించదా
కమ్ముకున్న భ్రమలన్నీ కావలి మాయం
కిందపడ్డ తరువాతైనా

తన్నెనా తన్నెనా తన్నెనా తన్నెనా
తానే నానా నానా తానే నానా నానేనా (2)




వెచ్చని మట్టిలో పాట సాహిత్యం

 
చిత్రం: మిడిల్ క్లాస్ మేలోడీస్ (2020)
సంగీతం: స్వీకర్ అగస్తి
సాహిత్యం: సాయికిరణ్
గానం: స్వీకర్ అగస్తి

వెచ్చని మట్టిలో నాటిన విత్తనం
ఊపిరందుకోదా చుక్క నీరు పట్టిన
రాతిరే కప్పిన దారులే తప్పిన
తెల్లవారనంద చీకటెంత కమ్మిన

తురుపింట మొదలైన కిరణాల వేడి
లోకమంత అందాలు అందించదా
దారిలోన ఎదురైన గ్రహణాలు వీడి
రంగులద్దుకుంటూ రాదా

చిగురాకు పిలిచింది రారమ్మని
నీలాకాశాన మేఘలని
అటు నుండి బదులేది రాలేదని
అలిగిందా ఆ ఆమని

జరిగింది గమనించి ఆ చల్లగాలి
జోలాలి పాడింది తన చెంత చేరి
చినబోయిన ఆ చిన్న ప్రాణానికి

వేకువింట మొదలైన కిరణాల వేడి
లోకమంత అందాలు అందించదా
దారిలోన ఎదురైన గ్రహణాలు వీడి
రంగులద్దుకుంటూ రాదా

Palli Balakrishna Tuesday, February 9, 2021
Choosi Choodangaane (2020)








చిత్రం: చూసీ చూడంగానే (2020)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: చిన్మయి శ్రీపద
నటీనటులు: శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ
దర్శకత్వం: శేష సింధు రావు
నిర్మాణ సంస్థ: దర్మపత క్రియేషన్స్
విడుదల తేది: 31.01.2020

వెనకనే ఉన్నా నీ కోసం ఒక క్షణమైనా చూశావా
నీ ఎదురుగా ఓ బెదురుగా నిలబడలేక వెనకే
నే మసలితే నువ్వసలిటు తిరిగావా తిరిగావా
అలసిన చూపులే నీ వీపుని అనువైనా తాకలేదా
ఎగసిన ఆశలే నీ శ్వాసలా  అడుగైనా వెయ్యలేదా కనుగొనవా..!

వెనకనే ఉన్నా.. నీ కోసం
ఒక క్షణమైనా చూశావా

నీ వెంట ఉండేవాళ్ళు  నాకు మరి స్నేహితులే
నీతోటి స్నేహం కుదరదెలా
మాటల్లో ఎన్నో సార్లు  నీ చిలిపి సంగతులే
మాటైన నీతో కలవదెలా

తలచే పేరు పిలిచే తీరు తెలిసేది ఎన్నడీ-పెదవికి
కొలిచే నాకు.. వలచి కిటుకు
నేర్పేది ఎవ్వరీ-జన్మకి ఎంతైనా ఎంతైనా
చెలియను రా.. చెలియను రా
చొరవగ ఎగబడి చెబుతానా

వెనకనే ఉన్నా.. నీ కోసం
ఒక క్షణమైనా చూశావా...

పోగేసుకున్నానిప్పుడు నీ గురుతులెన్నిటినో
నేన్నీకు చూపే ఋజువులుగా...
వెంటాడుతున్నానిప్పుడు నీ కళలనెందుకనో
నీడైనా రావా నిజములుగా...

పగలు రేయి చదువు మాని తెగ వేచి వేచి వేసారినా
నలకంతైనా ఆలాకె రాని హృదయాన్ని చేయకోయి చులకన ఏదోలా ఏదోలా
తలుపులనీ తెలుసుకొని..
తడబడు మనసుకి ముడిపడవా...

వెనకనే ఉన్నా నీ కోసం ఒక క్షణమైనా చూశావా
నీ ఎదురుగా ఓ బెదురుగా నిలబడలేక.. వెనకే
నే మసలితే నువ్వసలిటు తిరిగావా.. తిరిగావా

అలసిన చూపులే నీ వీపుని అనువైనా తాకలేదా
ఎగసిన ఆశలే నీ శ్వాసలా అడుగైనా వెయ్యలేదా కనుగొనవా..

వెనకనే ఉన్నా నీ కోసం..
ఒక క్షణమైనా చూశావా..







చిత్రం: చూసీ చూడంగానే (2020)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: సిద్ శ్రీరామ్

నీ పరిచయముతో నా మదిని గెలిచా 
నీ పలకరింపుతో నా దిశను మార్చినా
అడుగు నీతో కలిపి అలసటలెన్నో మరిచా
నలుగురితో నేనున్నా విడిపడి నీకై నడిచా

నీ పరిచయముతో నా మదిని గెలిచా

ఏ గతము ఎదురవధిక నీ తలపే జతపడితే
ఏ గురుతు నిలబడదిక నీ పిలుపే వినపడితే
నాలోని లోతు చూపిన 
నీ పరిచయముతో నిలువునా నే వెలిగి వెలుగులలో నే మునిగా
పదనిసలేవో తడిమి పరవశమై పైకెగిరా

నీ చెలిమే ప్రతిక్షణముని నా వరకు నడిపినదీ
నీ మహిమే ప్రతి మలుపుని తీరముగ మలిచినది
నాలోని నన్ను చేర్చిన 

నీ పరిచయముతో
నీ పరిచయముతో నా కళను కలిశా
నీ వెలుగు వానలో నే తడిసిపోయిన
అడుగు నీతో కలిపి అలసటలెన్నో మరిచా
నలుగురితో నేనున్నా విడిపడి నీకై నడిచా
చివరిదాకా నిలిచే హృదయమునే నే కలిశా
చెరగని ప్రేమై మిగిలే మనసుని నేనై మురిశా



Palli Balakrishna Saturday, January 16, 2021

Most Recent

Default