-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Srikanth Odela"
The Paradise (2026) – Yeshanagula Song Lyrics in Telugu and English

Yeshanagula Song Lyrics in Telugu and English – The Paradise (2026)

MOVIE DETAILS
Lyricist : Kasarla Shyam
Special Appearance : Keerthy Suresh
Director : Srikanth Odela
Banner : SLV Cinemas
Release Date : 24.09.2026

Yeshanagula Song Lyrics in Telugu and English – The Paradise (2026)

'Yeshanagula' song from The Paradise (2026) movie is composed by Anirudh Ravichander and sung by Prabha Bangarigalla and Addula Jangireddy. Lyrics are written by Kasarla Shyam. Starring Natural Star Nani, Keerthy Suresh, and Kayadu Lohar.

SONG INFORMATION
Song : Yeshanagula
Lyricist : Kasarla Shyam

Yeshanagula Song Lyrics in Telugu

Special Note : ఈ పాట పక్కా పాలమూరు / తెలంగాణ జానపదం, (Folk Song) నుండి తీసుకున్న పాట. యాస (Dialect): తెలంగాణ గ్రామీణ మాండలికంలో "వే" అక్షరం పలికేటప్పుడు "ఏ / యే" గా మారుతుంది (ఉదాహరణకు: వేషం → ఏషం, వెలుగు → ఎలుగు, వెళ్ళిపో → ఎళ్ళిపో). ఏష నాగులు (వేష నాగులు): జానపద కథల ప్రకారం రకరకాల రూపాలు (వేషాలు) మార్చే నాగుపాము లేదా నాగ దేవతను "వేష నాగులు / ఏష నాగులు" అంటారు. కట్ట: ఊరి చెరువు కట్ట లేదా వాగు ఒడ్డున నాగ దేవత ప్రతిష్టించిన ప్రదేశాన్ని "ఏష నాగుల కట్ట" అంటారు. గ్రామాల్లో ప్రేమికులు లేదా జంటలు ఏకాంతంగా కలవడానికి ఇలాంటి చెరువు కట్టల వద్దకు వెళ్లడం జానపదాల్లో సాధారణంగా కనిపించే నేపథ్యం. "వేశ్య నాగుల కట్ట" అనే ప్రచారం ఎంతవరకు నిజం? సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా ఇది "వేశ్య" అనే పదం కానే కాదు. తప్పుడు ప్రచారానికి కారణం: "ఏష / వేష" అనే పదాన్ని కొందరు వినేటప్పుడు పొరపాటుగా "వేశ్య" అని భావించి, సినిమా కోసం సెన్సార్ భయంతో మార్చారనే రూమర్ సృష్టించారు. వాస్తవం: పాలమూరు ఒరిజినల్ జానపద గీతంలో కూడా ఇది "ఏష నాగుల కట్ట" (లేదా వేష నాగుల కట్ట) గానే వాడుకలో ఉంది. రచయిత కాసర్ల శ్యామ్ గారు కూడా స్థానిక పాలమూరు జానపద మూలాల ప్రకారమే 'ఏష నాగుల' (Yeshanagula) అని అధికారికంగా పేర్కొన్నారు.
జిమ్మెదరీ పటేలో జిమ్మెదరీ పటేలా.. గల్మకాడ నీకోసం ముగ్గునైతిరో.. జిమ్మెదరీ పటేలో జిమ్మెదరీ పటేలా.. నీతోవల నా సూపులు కావలున్నయో.. అర్రల గుడ్డిదీపమయ్యిందిర పాణం.. ఒర్రిన ఇంట్ల లేదు ఏందీ పాపం.. బుడ్డపరకల కూర ఒండిన నీకోసం.. బుడమట్లబువ్వతోని తిని పో కొంచెం.. ఓ బుజ్జవ్వా - ఓయ్ మరి సద్దికట్టుకొని రారాదు.. - ఎక్కడికో.. ఏష నాగుల... ఏష నాగుల... ఏష నాగుల... ఏష ఏష ఏష ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల... ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల... ఏష నాగుల కట్ట మీద.. ఏష నాగుల కట్ట మీద.. ఏష నాగుల కట్ట మీద.. ఒహో ఏష నాగుల కట్ట మీద.. ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల - మనం ఊగుదమే బాల... ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల - మనం ఊగుదమే బాల... మొన్న నువ్వు సెమటలు తుడుసుకున్న నా వాయిల్ చీర సింగులే సెక్కంగ చిక్కున పడెరో... నిన్న నీ వేలను తలుసుకొని నా జబ్బల రైక హుక్కులే ఉట్టుట్టిగ తెగిపోయినరో... మొన్న గుస గుస ముచ్చటంత గుర్తుకొస్తెరా చెవి సత్తుకమ్మ నొప్పి జామ్మని మొత్తుకుందిరా... నువ్వే దొర్లిపోయిన బొంతనింక సదురలేదురా.. ఇయ్యాల రాకపోతే పక్క మీద నేను సత్తరా... ఘుమ ఘుమ నీ వాసన మోసిన నా ఒళ్లు... ఇనడం మర్చిపాయె ఎచ్చని నీళ్లు... గున గున నువ్ తిరిగిన నా ఇరుకు ఇళ్లు ఏరుకుంటాందిరా నీ ఎంగిలి పూలు నీ రంది తీర్చనీకీ నా దగ్గర మందుందే బుజ్జవ్వా.. ఏందో అది... దొరల్ తాగే దొరల్ తాగే దొరల్ తాగే... దొరల్.. దొరల్.. దొరల్.. దొరల్.. దొరల్ తాగే ఇప్పసారాయి తాగుదమే బాల... - మనం ఊగుదమే బాల... దొరల్ తాగే ఇప్పసారాయి తాగుదమే బాల... - మనం ఊగుదమే బాల... దొరల్ తాగే ఇప్పసారాయి.. దొరల్ తాగే ఇప్పసారాయి.. దొరల్ తాగే ఇప్పసారాయి.. దొరల్ తాగే ఇప్పసారాయి ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల - మనం ఊగుదమే బాల... ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల - మనం ఊగుదమే బాల...

Yeshanagula Song Lyrics in English (Transliteration)

Jimmedharee patelo jimmedharee patelaa.. Galmakaada neekosam muggunaithee ro.. Jimmedharee patelo jimmedharee patelaa.. Neethovala naa soopulu kaavalunnayo.. Arrala guddhidheepamayyindhira paanam.. Orrina intla ledhu yendhee paapam.. Buddaparakala koora ondina neekosam.. Budamatlabuvvathoni thini po konchem.. O bujjavvaa mari saddhikattukoni raaraadhu.. Ekkadiko.. Yesha naagula... yesha naagula... yesha naagula... yesha yesha yesha Yesha naagula katta meedha yesina uyyaala manam oogudhame baala... Yesha naagula katta meedha yesina uyyaala manam oogudhame baala... Yesha naagula katta meedha.. yesha naagula katta meedha.. yesha naagula katta meedha.. oho yesha naagula katta meedha.. Yesha naagula katta meedha yesina uyyaala manam oogudhame baala... Yesha naagula katta meedha yesina uyyaala manam oogudhame baala... Monna nuvvu sematalu thudusukunna naa vaayil cheera Singule sekkanga chikkuna padero... Ninna nee velanu thalusukoni naa jabbala raika Hukkule utthutthiga thegipoyinaro... Monna gusa gusa mucchatantha gurthukostheraa Chevi satthukamma noppi jaammani motthukundhiraa... Nuvve dhorlipoyina bonthaninka sadhuraledhuraa.. Iyyaala raakapothe pakka meedha nenu sattharaa... Ghuma ghuma nee vaasana mosina naa ollu... Inadam marchipaaye yecchani neellu... Guna guna nuv thirigina naa iruku illu Yerukuntaandhiraa nee yengili poolu Nee randhi theerchaneekee naa dhaggara mandhundhe bujjavvaa.. Yendho adhi... Dhoral thaage dhoral thaage dhoral thaage... Dhoral.. dhoral.. dhoral.. dhoral.. Dhoral thaage ippasaaraayi thaagudhame baala... manam oogudhame baala... Dhoral thaage ippasaaraayi thaagudhame baala... manam oogudhame baala... Dhoral thaage ippasaaraayi.. dhoral thaage ippasaaraayi.. dhoral thaage ippasaaraayi.. dhoral thaage ippasaaraayi Yesha naagula katta meedha yesina uyyaala manam oogudhame baala... Yesha naagula katta meedha yesina uyyaala manam oogudhame baala...

Palli Balakrishna Friday, September 4, 2026
The Paradise (2026) – Aaya Sher Song Lyrics in Telugu and English

The Paradise (2026) – Aaya Sher Song Lyrics in Telugu and English

MOVIE DETAILS
Lyricist : Kasarla Shyam
Actors : Nani, Mohan Babu
Director : Srikanth Odela
Producers : Sudhakar Cherukuri
Release Year : 2026

Aaya Sher Song Lyrics in Telugu and English – The Paradise (2026)

'Aaya Sher' song from The Paradise (2026) movie is composed by Anirudh Ravichander and sung by Addula Jangi Reddy, Arjun Candy. Lyrics are written by Kasarla Shyam.

SONG INFORMATION
Song : Aaya Sher
Lyricist : Kasarla Shyam

Aaya Sher Song Lyrics in Telugu

చిత్రం: The Paradise (2026) సంగీతం: అనిరుద్ రవిచంద్రన్ సాహిత్యం: కాసర్ల శ్యాం గానం: అద్దుల జంగి రెడ్డి , అర్జున్ క్యాండీ హే నీ అయ్య జాగీరా చల్ మావాడొచ్చిండ్రా ఇగ జడ్తియ్యాలే జుంబలికే ఆయా షేర్ హే యే దార్ కా సుల్తానే మా ఘర్ కా సైతానే చల్ షికార్ జెయ్యా జుంబలికే ఆయా షేర్ పచ్చ బొట్టు గాయమిది ఆయా షేర్ గుంజుకునే న్యాయమిది ఆయా షేర్ బూడిదల గడ్డ ఇది ఆయా షేర్ మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్ జడలురో జడలురో హడలురో ధడలురో కొడుతారో తొడలురో తీస్తారో తోలురో సవారికి దొరుకు బిడ్డా సేవాలే లేస్తాయి బిడ్డా పెగుల్ దీసి మెడలో యేసి ఆడుతాం బిడ్డా ఆడుతాం బిడ్డా ఆడ ఈడ యెడ జూడు బిడ్డా వణుకే పుట్టలింక పడితేనే నా నీడా బొంద పెట్టుత మాలిక్నైనా గూడా వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడా చల్ ఉడుకుతుంది సారా బట్టిలో మా కంట తడే జుంబలికే ఆయా ఆయా షేర్ ఇగ రాలుతాది బొట్టు బొట్టులో నీ పంచె తడే జుంబలికే ఆయా ఆయా షేర్ జడలురో జడలురో హడలురో ధడలురో కొడుతారో తొడలురో తీస్తారో తోలురో సవారికి దొరుకు బిడ్డా సేవాలే లేస్తాయి బిడ్డా పెగుల్ దీసి మెడలో యేసి ఆడుతాం బిడ్డా ఆడుతాం బిడ్డా హే బరి బత్తలునొన్నిన్రా బర్ బాధే అయినొన్రా నన్ను పీకుతావా జుంబలికే ఆయా షేర్ హే మొల్దారం లేనోన్రా నీ కన్నా మొండోడ్రా ఇగ పీకుతావా జుంబలికాకే ఆయా షేర్ పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్ మెట్టు మెట్టు ఎక్కుతారా ఆయా షేర్ పేరు పతా లేనొన్నిరా ఆయా షేర్ చూస్కో పరడైస్ కే అడ్రస్ ఐతా ఆయా షేర్ పొట్టు పొట్టు ఆకలుంది మెట్టు మెట్టు ఎక్కుతారా పేరు పతా లేనొన్నిరా చూస్కో పరడైస్ కే అడ్రస్ ఐతా

Aaya Sher Song Lyrics in English (Transliteration)

Hey nee ayya jaageeraa Chal maavaadochchindraa Iga jadthiyyaale Jumbalike aayaa sher Hey ye daar kaa sultaane Maa ghar kaa saithaane Chal shikaar jeyyaa Jumbalike aayaa sher Pachcha bottu gaayamidhi aayaa sher Gunjukune nyaayamidhi aayaa sher Boodidala gadda idhi aayaa sher Maatho raayabadda kathe idhi aayaa sher Jadaluro jadaluro hadaluro dhadaluro Koduthaaro thodaluro theesthaaro tholuro Savaariki doruku biddaa Sevaale lestaayi biddaa Pegul deesi medalo yesi Aaduthaam biddaa aaduthaam biddaa Aada eeda yeda joodu biddaa Vanuke puttalinka padithene naa needaa Bonda pettutha maaliknainaa goodaa Vaani saavu raasukochchina devuni kaadaa Chal udukuthundhi saaraa Battilo maa kanta thade Jumbalike aayaa aayaa sher Iga raaluthaadhi bottu Bottilo nee panche thade Jumbalike aayaa aayaa sher Jadaluro jadaluro hadaluro dhadaluro Koduthaaro thodaluro theesthaaro tholuro Savaariki doruku biddaa Sevaale lestaayi biddaa Pegul deesi medalo yesi Aaduthaam biddaa aaduthaam biddaa Hey bari batthalunonninraa Bar baadhe ainonraa Nannu peekuthaavaa Jumbalike aayaa sher Hey moldhaaram lenonraa Nee kanna mondodraa Iga peekuthaavaa Jumbalikaake aayaa sher Pottu pottu aakalundhi aayaa sher Mettu mettu ekkuthaaraa aayaa sher Peru pathaa lenonniraa aayaa sher Choosko Paradise ke address aithaa aayaa sher Pottu pottu aakalundhi Mettu mettu ekkuthaaraa Peru pathaa lenonniraa Choosko Paradise ke address aithaa

Palli Balakrishna Saturday, April 4, 2026



చిత్రం: దసరా (2023)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
నటీనటులు: నాని , కీర్తి సురేష్ 
దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి 
విడుదల తేది: 30.03.2023



Songs List:



ధూం ధాం దోస్తాన్ పాట సాహిత్యం

 
చిత్రం: దసరా (2023)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రాహుల్ సిప్లిగంజ్, గొట్టే కనకవ్వ

ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటం
అంత లావైతే గుంజుకుంటం తింటం పంటం
ఐతై ఐతై ఐతై ఐతై బద్దల్ బాషింగాలైతై

అరె ఏం కొడుతుర్ర బై ఊకోర్రి
నీ యవ్వ మా మావగాడు శెప్పుడు సరే మీరు కొట్టుడు సరే
అరె ఓ నైంటి ఈల్లకు ఇంకో నైంటి పోయ్రా
ఎట్ల కొట్టరో సూత్త నీ యవ్వ్

పవ్వగొట్టు పవ్వగొట్టు
బోటికూర దానంచుకు వెట్టు
బ్యాండు గొట్టు బ్యాండు గొట్టు
వాడకట్టు లేసూగేటట్టు

గుద్దితే సూస్కో ఓ అద్ధశేరు
గజ్జల గుర్రం ఈ సిల్కుబారు
ఇచ్చి పడేద్దాం
చల్ కుచ్చి పడేద్దాం
ఎవ్వడడ్డమొత్తడో జూద్దాం బాంచెత్

ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం

టెక్క టెకం టెక్క టెకం
టెక్క టెకం టిటక్ టిటక్
డింక టకం డింక టకం
డుర్ర డుర్ర డుర్ర

కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్
సుట్టూర దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్
జమ్మిని బొగ్గును బంగారమే అంటం
బంగారంలాంటి మనుషుల్లో ఉంటం

డొక్కలు నింపే ఊరే మా అవ్వ
జేబులు నింపే రైలే మా అయ్య
బర్ల మోత ఆ శెర్ల ఈత
ఇగ కోడి కూత మాకేం ఎరుక బాంచెత్

ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం

ధూం ధాం అరె ధూం ధాం
భలె భలె భలె భలె భలె
హ హు హా హే

సిత్తూ సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారి బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన
రాగి బిందె తీస్క రమణి నీళ్ళకు బోతే
రాములోరెరాయేనమ్మో ఈ వాడలోన

తీట లెక్కల్ జేస్తేనే జోరు
ఘాటుగా ఉండాలిరా బతుకు తీరు
నల్లీ బొక్కల్ జూత్తే ఉషారు
ఏం తింటవ్రా ఉప్పు లేని పప్పు శారు

గోశి గొంగడి మా కట్టుబొట్టు
ఎట్లైతే గట్లైతది సూస్కుందాం పట్టు
అంబలి గట్క మాది రాచ పుటక
పూట పూట మాకే దసరా బాంచెత్

ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం

ధూం ధాం అరె ధూం ధాం
భలె భలె భలె భలె భలె
హు హా హు హే



ఓరి వారి నీది గాదురా పోరి పాట సాహిత్యం

 
చిత్రం: దసరా (2023)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: శ్రీమణి
గానం: సంతోష్ నారాయణ్ 

ఓరి వారి నీది గాదురా పోరి
ఇడిసెయ్ రా ఇంగ ఒడిసెను దారి
ఓపారి అవ్వ ఒడిలో దూరి
మరిసెయ్ రా సిన్న మొల్లిగా మారి

బాల్యమే గొప్పది బాధ మర్షిపోతది
చందమామ రాదనే నిజము నమ్మనంటది
చిన్న పల్లీపట్టీకె ఏడుపాపి చూస్తది
కోడె ఈడు సెడ్డది నిజాన్ని కోడై కూస్తది

ఓరి వారి నీది గాదురా పోరి
బజ్జోరా సంటి బిడ్డగా మారి

హో హో హో హో హో హోహో
హో హో ఓహో హోహో హో
హో హో హో హో హో హోహో
హో హో ఓహో హోహో హో

ప్రేమ నాలో దాచిన
చిన్న బొడ్డెమ్మగానే గావురంగా
నిన్ను నేనే వద్దనీ
గిరిగీసుకున్న గింత దెల్వకుంటా

రగిలి నా వేదనే దీపమోలే వెట్టినా
పేర్చినా బతుకమ్మనే
కన్నీళ్ళలో సాగదోలిన ఇడిచేసి వదిలేశిన

రెక్కలిరిగినట్టి ఈగ
సుడిగాలిలో చిక్కినట్టు
దిక్కు మొక్కు లేని కన్ను
ఎక్కి ఎక్కి ఎడ్శినట్టు

నీకు దగ్గరవ్వలేక
దూరమయ్యే దారిలేక
చితికిపోయే నా బతుకిలా
గుండె పుండు మీద
గొడ్డు కారమద్ది గుద్దుతుంటే
గుక్కపట్టి ఏడవలేని జన్మా

ఓ ఓఓ ఓ ఓఓ ఓ
ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ
హో హో హో హో హో హోహో
హో హో ఓహో హోహో హో



చమ్కీల అంగీలేసి పాట సాహిత్యం

 
చిత్రం: దసరా (2023)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: ధీ, రామ్ మిరియాల 

చమ్కీల అంగీలేసి ఓ వదినే
చాకు లెక్కుండేటోడే ఓ వదినే
కండ్లకు ఐనా బెట్టి
కత్తోలే కన్నెట్ల కొడ్తుండెనే

సినిగిన బనీనేసి ఓ వదినే
నట్టింట్ల కూసుంటడే ఓ వదినే
మాసిన లుంగీ ఏసి ఎప్పుడు
మంచంలనే పంటడే

హే పెండ్లైన కొత్తల అత్తర్లు పూసిన్నే
నీ సీర సింగులువట్టి ఎనకెనక తిరిగిన్నే
ముద్దులిస్తుండే పూలు తెస్తుండే
శెక్కర లెక్క నీ మాటలుంటుండే
మారే నీ తీరు పెరిగే నీ నోరు
మందుకలవాటైతినే

కడుపులో ఇంత వోసి ఓ వదినే
కొడ్తడే బండకేసి ఓ వదినే
అమాస పున్నానికో అట్లట్లా
అక్కరకు పక్కకొత్తాడే

చమ్కీల అంగీలోడే
నాకు జుమ్కీలు అన్న తేడే

వీడు వంటింట్ల నేనుంటే
సాటుంగ వత్తుండె
వంకర నడుము గిచ్చుతుండే
నేడు ఎంత సింగారించిన
వంకలు పెడుతుండే
తైతక్కలాడకంటుండే

కంట నీరన్న వెట్టకుండా
సంటి బిడ్డ లెక్క నిన్ను
అలుగుతుంటే బుదరగియ్యలేదా

నువ్వు సీటికి మాటికి
గింతదాన్ని గంత జేసి
ఇజ్జతంత బజార్లేస్తలేవా

ఏం గాలి సోకేనో ఓ ఓ
వీన్నెత్తి తిరిగెనో ఓ ఓ
పాతబడ్డనేమో శాతనైతలేదో
ఉల్టా నన్నిట్ల మందీ ముంగట్ల
బదనాం జేత్తడే

చమ్కీల అంగీలేసి ఓ వదినే
చాకు లెక్కుండేటోడే ఓ వదినే
కండ్లకు ఐనా బెట్టి
కత్తోలే కన్నెట్ల కొడ్తుండెనే

నోరిడిసి అడగదుర బామ్మర్ది
శెప్పింది చెయ్యదుర బామ్మర్ది
పక్కింట్లో కూసుంటది
నా మీద శాడీలు జెప్తుంటది

నా గొంతు కోసిర్రంటూ బామ్మర్ది
శోకాలు వెడ్తుంటది బామ్మర్ది
ముచ్చట్లు జెప్పబోతే మీ అక్క
మూతంతా తిప్పుతుంటది

శీకట్ల ఉన్నా వాకిట్ల ఉన్నా
కంటికి రెప్పోలే కాస్తడు మొగడు
ఎంత లొల్లైనా నువ్వెంట ఉంటె
ఎదురు నిలిశి వాడు గెలిశి వస్తాడు

గోసల్ని జూస్తా ఉన్నా
ఏదైనా గుండెల్ల దాస్తాడులే
నీ బొట్టు నీ గాజులే ఎంతైనా
వాని పంచ పాణాలులే

Palli Balakrishna Monday, March 20, 2023

Most Recent

Default