-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sarvadaman Banerjee"
Sirivennela (1986) Telugu Songs Lyrics Album Cover

Sirivennela (1986) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Sirivennela (1986)
Banner : Prasad Art Pictures
Music : K. V. Mahadevan
Director : K. Viswanath
Producers : CH. Ramakrishna Reddy, N. Bhaskara Reddy, U. China Veerraju
Actors : Sarvadaman Banerjee
Actresses : Suhasini
Supporting Cast : Moon Moon Sen, Meena, Subhalekha Sudhakar
Release Date : 20 May 1986
MOVIE HIGHLIGHTS

• Sirivennela (1986) is a cinematic masterpiece by K. Viswanath that beautifully explores the relationship between a blind flutist and a mute painter.

• This film marked the historic debut of legend Sirivennela Seetharama Sastry, who penned all 10 songs and won his first Nandi Award.

• The legendary track "Vidhata Thalapuna" is a masterpiece of Telugu literature and music, perfectly blending philosophical depth with classical beauty.

• Music Maestro K. V. Mahadevan delivered a divine soundtrack, with flute contributions by the legendary Hariprasad Chaurasia, making the album timeless.

• The film was a huge success and remains a benchmark for artistic storytelling and poetic excellence in Indian cinema.

Adibhikshuvu Vadinedi Koredhi Song Lyrics in Telugu – Sirivennela (1986)

'Adibhikshuvu Vadinedi Koredhi' song from Sirivennela (1986) movie is composed by K. V. Mahadevan, written by Sirivennela Seetharama Sastry, and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Sirivennela (1986)
ఆది బిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చె వాడినేది అడిగేది ఆది బిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చె వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేదీ వాడినేది అడిగేది తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది కరకు ఘర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేదీ వాడినేది అడిగేది తేనెలొలికే పూల బాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది తేనెలొలికే పూల బాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది బండ రాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేదీ వాడినేది అడిగేది గిరిబాలతో తనకు కళ్యాణ మొనరింప దరిచేరు మన్మధుని మసి చేసినాడు వాడినేది కోరేది వర గర్వమున మూడు లోకాల పీడింప తలపోయు ధనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది ముఖ ప్రీతి కొరేటి ఉక్కు శంకరుడు వాడినేది కోరేది ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కొపి తిక్క శంకరుడు ఆది బిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చె వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది

Chandamama Raave Song Lyrics in Telugu – Sirivennela (1986)

'Chandamama Raave' song from Sirivennela (1986) movie is composed by K. V. Mahadevan, written by Sirivennela Seetharama Sastry, and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Sirivennela (1986)
Music : K. V. Mahadevan
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : S. P. Balasubrahmanyam
చందమామ రావె జాబిల్లి రావె కొండెక్కి రావె గొగుపూలు తేవె చందమామ రావె జాబిల్లి రావె కొండెక్కి రావె గొగుపూలు తేవె చలువ చందనములు పూయ చందమామ రావె జాజిపూల తావినీయ జాబిల్లి రావె చలువ చందనములు పూయ చందమామ రావె జాజిపూల తావినీయ జాబిల్లి రావె కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావె కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావె గగనపు విరితోటలోని గోగుపూలు తేవె మునిజన మానస మోహిని యోగిని బృందావనం మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం మునిజన మానస మోహిని యోగిని బృందావనం మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం రాధమాధవ గాధలు రంజిలు బృందావనం గోపాలుని మృదు పద మంజీరము బృందావనం గోపాలుని మృదుపద మంజీరము బృందావనం బృందావనం... బృందావనం... హే... కృష్ణా ముకుందా మురారి కృష్ణా ముకుందా మురారి జయకృష్ణా ముకుందా మురారి జయ జయ కృష్ణా ముకుందా మురారి

Chinuku Chinuku Song Lyrics in Telugu – Sirivennela (1986)

'Chinuku Chinuku' song from Sirivennela (1986) movie is composed by K. V. Mahadevan, written by Sirivennela Seetharama Sastry, and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Sirivennela (1986)
Music : K. V. Mahadevan
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : S. P. Balasubrahmanyam
చినుకు చినుకు చినుకు చినుకు తొలి తొలి తొలకరి చిలికిన చినుకు పిలుపు పిలుపు పిలుపు పిలుపు పుడమికి పులకల మొలకల పిలుపు ఆషాఢ మాసాన ఆ నీలి గగనాన మేఘాల రాగాల ఆలాపన ఆషాఢ మాసాన ఆ నీలి గగనాన మేఘాల రాగాల ఆలాపన మేఘాల రాగాల ఆలాపన

Ee Gali Ee Nela Song Lyrics in Telugu – Sirivennela (1986)

'Ee Gali Ee Nela' song from Sirivennela (1986) movie is composed by K. V. Mahadevan, written by Sirivennela Seetharama Sastry, and sung by S. P. Balasubrahmanyam and P. Susheela.

SONG INFORMATION
Movie : Sirivennela (1986)
Music : K. V. Mahadevan
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : S. P. Balasubrahmanyam, P. Susheela
ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరూ ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరూ ననుగన్న నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు ననుగన్న నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు చిన్నారి గొరవంక కూసేను ఆ వంక నా రాక తేలిసాక వచ్చేను నా వంక చిన్నారి గొరవంక కూసేను ఆ వంక నా రాక తేలిసాక వచ్చేను నా వంక ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను నింగి దాక ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను నింగి దాక ఎగసేను నింగి దాక ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళలు ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళలు ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను ఈ రాళ్ళే జవరాలై ఇక నాట్యాలాడేను ఈ రాళ్ళే జవరాలై ఇక నాట్యాలాడేను కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై తళుకుమన్న తార చిలుకు కాంతి చినుకులై కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై తళుకుమన్న తార చిలుకు కాంతి చినుకులై గగన గళమునుండి అమర గానవాహిని గగన గళమునుండి అమర గానవాహిని జాలువారుతోంది ఇలా అమృతవర్షిణీ అమృతవర్షిణీ అమృతవర్షిణీ ఈ స్వాతి వానలో నా ఆత్మ స్నానమాడే నీ మురళిలో నా హృదయమే స్వరములుగా మారే

Merise Taraladeroopam Song Lyrics in Telugu – Sirivennela (1986)

'Merise Taraladeroopam' song from Sirivennela (1986) movie is composed by K. V. Mahadevan, written by Sirivennela Seetharama Sastry, and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Sirivennela (1986)
Music : K. V. Mahadevan
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : S. P. Balasubrahmanyam
మెరిసే తారలదే రూపం విరిసే పూవులదే రూపం అది నా కంటికి శూన్యం మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా గానం పుట్టుక గాత్రం చూడాలా ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా గానం పుట్టుక గాత్రం చూడాలా వెదురును మురళిగ మలచి ఈ వెదురును మురళిగ మలచి నాలో జీవన నాదం పలికిన నీవే నా ప్రాణ స్పందన నీకే నా హృదయ నివేదన

Patallo Padalenidi Song Lyrics in Telugu – Sirivennela (1986)

'Patallo Padalenidi' song from Sirivennela (1986) movie is composed by K. V. Mahadevan, written by Sirivennela Seetharama Sastry, and sung by Prakash Rao and P. Susheela.

SONG INFORMATION
Movie : Sirivennela (1986)
Music : K. V. Mahadevan
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Prakash Rao, P. Susheela
పాటల్లో పాడలేనిది నోటి మాటల్లో చెప్పలేనిది నీ గుండెల్లో నిండి ఉన్నది ఈ బండల్లో పలుకుతున్నది అహ పాటల్లో పాడలేనిది నోటి మాటల్లో చెప్పలేనిది నీ గుండెల్లో నిండి ఉన్నది ఈ బండల్లో పలుకుతున్నది ఈ ఆర్టు చూసి హార్ట్ బీటు రూటు మార్చి కొట్టుకుంటు ఆహా ఓహో అంటున్నది అది ఆహా ఓహో అంటున్నది ఈ ఇలలోన శిలపైన కొలువైన రాణి ఈ ఇలలోన శిలపైన కొలువైన రాణి వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి నల్లనయ్యా పిల్లన గ్రోవినూద వెల్లువై ఎద పొంగి పోద నల్లనయ్యా పిల్లన గ్రోవినూద వెల్లువై ఎద పొంగి పోద పాట వింటూ లోకమంత రాతి బొమ్మై నిలిచిపోదా పాట వింటూ లోకమంత రాతి బొమ్మై నిలిచిపోదా నల్లనయ్యా అందమైన సుందరాంగులు ఎందరికొ నెలవైన రాణివాసము ఈ కొటలోన దాగి ఉన్నది నాటి ప్రేమగాధలెన్నొ కన్నది అందమైన సుందరాంగులు ఎందరికొ నెలవైన రాణివాసము ఈ కొటలోన దాగి ఉన్నది నాటి ప్రేమగాధలెన్నొ కన్నది హిస్టరీల మిస్టులోని మిస్టరీని చాటి చెప్పి ఆహా ఓహో అంటున్నది అది అహ అహ ఒహొ ఒహొ అంటున్నది రాసలీలా రాగహేలా రాసలీలా రాగహేలా రసమయమై సాగు వేళ తరుణుల తనువులు వెన్నెల తరగలుగ ఊగువేళా నురుగుల పరుగులు సాగె యమునా నది ఆగు వేళా నింగి నేల వాగు వంక చిత్రంగ చిత్తరువాయె నింగి నేల వాగు వంక చిత్రంగ చిత్తరువాయె నల్లనయ్యా పిల్లన గ్రోవినూద వెల్లువై ఎద పొంగి పోద

Prakruthi Kanthaku Song Lyrics in Telugu – Sirivennela (1986)

'Prakruthi Kanthaku' song from Sirivennela (1986) movie is composed by K. V. Mahadevan, written by Sirivennela Seetharama Sastry, and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Sirivennela (1986)
Music : K. V. Mahadevan
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : S. P. Balasubrahmanyam
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో పదము కదిపితె ఎన్నెన్ని లయలో ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో పదము కదిపితె ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో సిరివెన్నెల నిండిన ఎదపై సిరి మువ్వల సవ్వడి నీవై నర్తించగ రావేలా నిను నే కీర్తించే వేళ అలల పెదవులతో శిలల చెక్కిలిపై కడలి ముద్దిడు వేళ పుడమి హృదయంలో అలల పెదవులతో శిలల చెక్కిలిపై కడలి ముద్దిడు వేళ పుడమి హృదయంలో ఉప్పొంగి సాగింది అనురాగము ఉప్పెనగ దూకింది ఈ రాగము

Polimeradhatipothunna Song Lyrics in Telugu – Sirivennela (1986)

'Polimeradhatipothunna' song from Sirivennela (1986) movie is composed by K. V. Mahadevan, written by Sirivennela Seetharama Sastry, and sung by S. P. Balasubrahmanyam and S. P. Sailaja.

SONG INFORMATION
Movie : Sirivennela (1986)
Music : K. V. Mahadevan
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : S. P. Balasubrahmanyam, S. P. Sailaja
పొలిమేర దాటిపోతున్నా ఓ గువ్వల చెన్న పొరుగూరికి చేరిపోతున్న ఓ గువ్వల చెన్న కథమారే రోజులు కోరేరూ ఓ గువ్వల చెన్న కలతీరే దారులు వెతికేనూ ఓ గువ్వల చెన్న గుళ్ళో నిను చూడలేకున్న ఓ గువ్వల చెన్న గుండెల్లో దాచుకున్నాలే ఓ గువ్వల చెన్న ఏ సీమలొ తిరుగాడిన ఓ గువ్వల చెన్న నీ దీవెనలందిచాలన్న ఓ గువ్వల చెన్న

Vidhata Thalapuna Song Lyrics in Telugu – Sirivennela (1986)

'Vidhata Thalapuna' song from Sirivennela (1986) movie is composed by K. V. Mahadevan, written by Sirivennela Seetharama Sastry, and sung by S. P. Balasubrahmanyam and P. Susheela.

SONG INFORMATION
Movie : Sirivennela (1986)
Music : K. V. Mahadevan
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : S. P. Balasubrahmanyam, P. Susheela
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం ఓం కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించివిపంచి గానం సరసస్వరసురఝరీగమనమౌ సామవేద సారమిది సరసస్వరసురఝరీగమనమౌ సామవేద సారమిది నేపాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం ప్రాగ్దిస వేనియ పైన దినకర మయూఖ తంత్రులపైన జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన ప్రాగ్దిస వేనియ పైన దినకర మయూఖ తంత్రులపైన జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ విశ్వకార్యమునకిది భాష్యముగా విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం జనించు ప్రతిశిశు గలమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హ్రుదయమృదంగధ్వానం జనించు ప్రతిశిశు గలమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హ్రుదయమృదంగధ్వానం అనాదిరాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునె విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం నా ఉఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వరసురఝరీగమనమౌ సామవేద సారమిది నేపాడిన జీవన గీతం ఈ గీతం

Kanne Mooga Manasu Song Lyrics in Telugu – Sirivennela (1986)

'Kanne Mooga Manasu' song from Sirivennela (1986) movie is composed by K. V. Mahadevan, written by Sirivennela Seetharama Sastry, and sung by P. Susheela.

SONG INFORMATION
Movie : Sirivennela (1986)
Music : K. V. Mahadevan
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : P. Susheela
కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై తళుకుమన్న తార చిలుకు కాంతి చినుకులై కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై తళుకుమన్న తార చిలుకు కాంతి చినుకులై గగన గళమునుండి అమర గానవాహిని గగన గళమునుండి అమర గానవాహిని జాలువారుతోంది ఇలా అమృతవర్షిణీ అమృతవర్షిణీ అమృతవర్షిణీ ఈ స్వాతి వానలో నా ఆత్మ స్నానమాడే నీ మురళిలో నా హృదయమే స్వరములుగా మారే

Palli Balakrishna Saturday, July 29, 2017

Most Recent

Default