-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Saptagiri LLB"


చిత్రం: సప్తగిరి LLB   (2017)
సంగీతం: బుల్గనిన్
సాహిత్యం: సురేష్ బనిశెట్టి
గానం: లోకేశ్వర్ , మంగళి
నటీనటులు: సప్తగిరి, కాసిస్ వహ్రా
దర్శకత్వం: చరణ్ లక్కాకుల
నిర్మాత: డాక్టర్ కె. రవికిరణ్
విడుదల తేది: 07.12.2017

ఏమైంది ఏమైంది అయినా ఇప్పుడు ఏమైంది
ఆటు పోటు లేక పోతే జీవితమేముంది
పోను పోను దారి ఉంది
ముందుకు పోగా ఊపిరుంది
చీకటైన దారుల్లోనే  వేకువ పూస్తుంది
దేవుడంటే ఏడో లేడు నీలో ఉన్న ధర్మమేరా
పారిపోనీకు నీలో ఆశాదీపం
ధైర్యమంటే ఏదో కాదు నీలో ఉన్న న్యాయమేరా
ఒడిపోదులేరా నీ సంకల్పం
ఏ సాయం లేకున్నా నీ తోడు
ఒంటరిగా అందరికై పోరాడు
గెలవాలి నీలాంటి మంచోడు
గెలిచేలా చూస్తాడు పైవాడు

ఏమైంది ఏమైంది అయినా ఇప్పుడు ఏమైంది
ఆటు పోటు లేక పోతే జీవితమేముంది
పోను పోను దారి ఉంది ముందుకు పోగా ఊపిరుంది
చీకటైన దారుల్లోనే  వేకువ పూస్తుంది

ఏ మలుపున ఏమున్నదో మరి ముందుగ తెలిసేనా
ఏ మలుపున ఏమున్నదో మరి ముందుగ తెలిసేనా
వేసే ప్రతి అడుగు అరె చూడదుగా వెలుగు
ఐనా ముందడుగు వెయ్యడమేగా పరుగు
ప్రతిదెబ్బకు నిబ్బరమై నిలబడితే చాలు
నీ గొప్పలే డప్పులుగా పలకవ జేజేలు
విజయం నీదేలేరా ఏనాటికి నిజం
ముమ్మాటికి సందేహం దేనికి

ఏమైంది ఏమైంది అయినా ఇప్పుడు ఏమైంది
ఆటు పోటు లేక పోతే జీవితమేముంది
పోను పోను దారి ఉంది
ముందుకు పోగా ఊపిరుంది
చీకటైన దారుల్లోనే  వేకువ పూస్తుంది
దేవుడంటే ఏడో లేడు నీలో ఉన్న ధర్మమేరా
పారిపోనీకు నీలో ఆశాదీపం
ధైర్యమంటే ఏదో కాదు నీలో ఉన్న న్యాయమేరా
ఒడిపోదులేరా నీ సంకల్పం
ఏ సాయం లేకున్నా నీ తోడు
ఒంటరిగా అందరికై పోరాడు
గెలవాలి నీలాంటి మంచోడు
గెలిచేలా చూస్తాడు పైవాడు


Palli Balakrishna Thursday, December 7, 2017

Most Recent

Default