-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Prasad Devineni"



చిత్రం: ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య (2020)
సంగీతం: బిజిబల్
నటీనటులు: సత్యదేవ్ కంచరాన, హరిచందన, నరేశ్‌, సుహాస్‌, రూప, కుశాలిని, రవీంద్ర విజయ్‌
దర్శకత్వం: వెంకటేశ్‌ మహా
నిర్మాత: శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, విజయప్రవీణ పరుచూరి
విడుదల తేది: 30.07.2020



Songs List:



నింగి చుట్టే మేఘం పాట సాహిత్యం

 
చిత్రం: ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య (2020)
సంగీతం: బిజిబల్
సాహిత్యం: విశ్వా
గానం: విజయ్ ఏసుదాస్

నింగి చుట్టే మేఘం ఎరుగదా
ఈ లోఖం గుట్టు 
మునిలామెదలదు నీ మీదొట్టు

కాలం కదలికలతో జోడి కట్టు 
తొలిగా తారావాసాల ఊసుల్ని వీడి
చూసింది ఓసారి సగటుల కనికట్టు

నింగి చుట్టే  మేఘం యెరుగదా
ఈ లోఖం గుట్టు 
మునిలా మెదలదు నీ మీదొట్టు

కాలం కదలికలతో జోడి కట్టు 
తొలిగా తారావాసాల ఊసుల్ని వీడి
చూసింది ఓసారి సగటుల కనికట్టు

తమదేదో తమదంటూ 
మితిమీర తగదంటూ
తమదైన తృణమైన చాలను వరస

ఉచితాన సలహాలు పగలేని కలహాలు
యెనలేని కదనాలు చోటిది బహుశా

ఆరాటం తెలియని జంజాటం
తమదిగ చీకు చింత తెలియదుగా
సాగింది ఈ తీరు కథ సగటుల చుట్టూ

నింగి చుట్టే మేఘం ఎరుగదా
ఈ లోఖం గుట్టు
మునిలా మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో జోడి కట్టు

సిసలైన సరదాలు పడిలేచే పయణాలు
తరిమేసి తిమిరాలు నడిచేలే మనస

విసుగేది ధరిరాని విధిరాత కదిలేని
శతకోటి సహనాల నడవడి తెలుసా

చిత్రంగా కలివిడి సుతారంగా
కనపడే ప్రేమ పంతం తమ సిరిగా
సాగింది ఈ తీరు సగటుల కనికట్టు

నింగి చుట్టే - చుట్టే 
మేఘం యెరుగద - యెరుగదా 
ఈ లోఖం గుట్టు 
మునిలా మెదలదు నీ మీదొట్టు

కాలం కదలికలతో జోడి కట్టు 
తొలిగా తారావాసాల ఊసుల్ని వీడి
చూసింది ఓసారి సగటుల కనికట్టు




ఆనందం పాట సాహిత్యం

 
చిత్రం: ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య (2020)
సంగీతం: బిజిబల్
సాహిత్యం: రెహ్మాన్
గానం: గౌతం భరద్వాజ్, సౌమ్యా రామకృష్ణన్

ఆనందం ఆరాటం
ఆనందం అంటే అర్ధం చూపించేటి ఓ అద్భుతం
ఆరాటం అంచుల్లోనే నిత్యం సాగే ఈ సంబరం
చిగురై పుడమి కడుపున మొదలయ్యేటి
మధనమే మధురమై
ఉదయం కోసం ఎదురె చూసే నిమిషాలే నిజమైన
వేడుక కాదా
ఫలితం మరిచి పరుగు తీసే పయనం ఇక
ప్రతిపూటోక కానుక అయిపోదా
నీరు ఆవిరిగా ఎగిసిందే
తపన పెరిగి అది కడలినొదిలినది
కారుమబ్బులుగా మెరిసింది
అణువు అనువుగా ఒక మధువుగా మారి తానే...
వానై...
అడుగు అడుగు కలిపి కదిలిపోయే కదలింటి
దారే
మలుపేదైనా గెలుపే చూసే అడుగుల్లో అసలైన ఆ
ఆనందం
నదిలో ఎగిసే అలల ఏదోలోపల క్షణమాగాని
సంగీతం కాదా
ఇంద్ర ధనస్సులో వర్ణములే పుడమి ఒడిలో పడి
చిగురు తొడిగినవి
శరదృతువులో సరిగమలే తొడిమె తడిమే తొలి
పిలుపుగా మారి


దాహం తీరే వీరుల సిరులు విరిసి మురిసిపోయే
సరికొత్త మాయే
ఉబికే మౌనం ఊరికే ప్రాణం తనకోసం దిగివస్తే ఆ
ఆకాశం
కరిగే దూరం తెరిచే ద్వారం జగమంతట
పులకింతలు పూసే వసంతం
ఆనందం ఆరాటం
ఆనందం అంటే అర్ధం చూపించేటి ఓ అద్భుతం
ఆరాటం అంచుల్లోనే నిత్యం సాగే ఈ సంబరం
చిగురై పుడమి కడుపున మొదలయ్యేటి ఆ
మధనమే మధురమై
ఉదయం కోసం ఎదురె చూసే నిమిషాలే నిజమైన
వేడుక కాదా
ఫలితం మరిచి పరుగు తీసే పయనం ఇక
ప్రతిపూటోక కానుక అయిపోదా





రేపవలు పాట సాహిత్యం

 
చిత్రం: ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య (2020)
సంగీతం: బిజిబల్
సాహిత్యం: రెహ్మాన్
గానం: బిజిబల్, రఘుకుల సంగీత, మొకిరాల శ్రీకాంత్

లలాలలల
లలలాలాలా
లాలల
రేపవలు వెకనుల
నిన్నే చూస్తున్న
లలలలాలల
నా తనివి తీరదుగా ఎన్నాలైన
రావాలల నీవే లల
మరల కురిసే వరములు తేవ ఆ...
లోకాన ప్రేమంతా రూపాన వేరైనా
చేరేటి తీరాన నీవా ల ల ల ల
కాలనాపి నాతో ఉండి పోవా
రేపవలు వెకనుల
నిన్నే చూస్తున్న
నా తనివి తీరదుగా ఎన్నాలైన
సమయం పరుగున కదిలే
మలుపులు తిరిగే చక చక ఎన్నో మారేలే
అయినా తొలకరి చెలిమె తొనకని ణమే
చెరగని నవ్వాయి తాకేలే
నీ చూపు నా వైపు చూస్తుంటే
చూసాను నీలోని కేరింతే
ఇంకా అలాగే ఎలాగో ఈ పసితనం
ఎదలో తొలి పరవశమే

కలిగిన క్షణమే కరగక కాలంతో పాటే
ఎదిగే ప్రతి ఒక దినమే గురుతుల వనమే
పెరిగెను దురంతో పాటే
ఏమైనా మారేనా నా నిన్న
నాలానే నేడున్న రేపైనా
ఇంతే ప్రపంచం సమస్తం ఈ మనిషికి
నా మనసు నీ కొరకు శిల్పంలా ఉన్న
నీ తలపులో మునిగి జీవిస్తున్న
నిన్న నేడై కలిసి మురిసే క్షణములలోన
ఈ దూర భారాలు ఇన్నాళ్ల మౌనాలు
తీరేటి దారేదో చూపి
ప్రాణంలోనా పాటై నిండిపోవా




నువ్వేమో రెక్కలు చాచి పాట సాహిత్యం

 
చిత్రం: ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య (2020)
సంగీతం: బిజిబల్
సాహిత్యం: రెహ్మాన్
గానం: కాలభైరవ, సితార కృష్ణ కుమార్

నువ్వేమో రెక్కలు చాచి
రివ్వున లేచిన పక్షయ్యి పైకి ఎగిరి పోయావే
నెనేమో మట్టిలో వేర్లు చుట్టుకుపోయిన
చెట్టె ఇక్కడనే ఉన్నానే
కోరుకున్న లోకాలు చూడ ఈ కొనను విడిచి పోతే
ఎలా
కొమ్మలన్నీ శోకాలు తీస్తూ
కుంగాయి లోలోపల
ఇక నా లోకమొ నీ లోకమో
ఒకటెట్టా అవుతాది
కసిగా కసిరే ఈ ఎండలే
నీ తలపులుగా ఈ కలతలుగా
నిసిగా ముసిరే నా గుండెనే
పగటి కళలు ముగిసేలా
వెలుగే కరిగిపోయింది లే
ఉసిరే నలిగి పోయింది లే
ఆశలల్లే ఆకులే రాలి మనసే పెళుసై విరిగిపోయేలే
మాటలన్నీ గాలి మూటలై పగిలి పోయాయిలే
చేతిలో గీతలు రాతలు మారిపోయే
చూడు మాయదారినే
ఊగే కొమ్మకు సాగే పిట్టకు
ఒంటె ఎలికి పేరేంటనా
పూసే పులకి వీచే గాలికి స్నేహం ఎన్నాలట
నేనేమో ఎల్లలు ధాటి నచ్చిన దారిన ముందుకు
సాగేటి
ఓ దాహం...
నువ్వేమో మచ్చలు లేని మబ్బులు పట్టని
అద్దంలా మెరిసే
ఓ స్నేహం...
తప్పదంటూ నీతోనే ఉండి
నీ మనసు ఒప్పించలేను మరి
తప్పలేదు తప్పని సరై ఎంచాను ఈ దారిని
నిన్ను నీలాగానే చూడడని దూరంగా వెళ్తున్న

Palli Balakrishna Saturday, February 6, 2021



చిత్రం: పల్లకిలో పెళ్ళికూతురు (2004)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: గౌతమ్, రతి
దర్శకత్వం: సుచిత్ర చంద్రబోస్
నిర్మాత: ప్రసాద్ దేవినేని
విడుదల తేది: 30.07.2004



Songs List:



పల్లకిలో పెళ్ళికూతురు పాట సాహిత్యం

 
చిత్రం: పల్లకిలో పెళ్ళికూతురు (2004)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, చిత్ర

చంపకు చుక్కను పెట్టి పాదాలకి పారాణి పూసి
చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి
మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో

పల్లకిలో...

పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది
రాణి గారికి సిగ్గుల వచ్చే రాజుగారికి చిరునవ్వొచ్చే
ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిధిగా వచ్చే
పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది

మా గూటిలో ఎదిగిన బంగరు బొమ్మా
బంగరు బొమ్మా బంగరు బొమ్మా 
మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మా
వెన్నెల బొమ్మా  వెన్నెల బొమ్మా 
పరిమళాల గంధపు బొమ్మా సున్నితాల గాజు బొమ్మా
పుట్టినింట లేతబోమ్మా మెట్టినింట సీతవమ్మా
ఈ బొమ్మని అత్తింటికి పంపించే ఆనందంలో మాటరాని బొమ్మలమయ్యాము
మాటరాని బొమ్మలమయ్యాము

పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది

నా పెళ్ళిలో అతిధులు మీరేకదా
అతిధులంటే దేవుళ్ళనే అర్ధం కదా
ఈ పందిరి మీ రాకతో మందిరమే అయ్యింది
నాపై మీ చల్లని చూపే వరముల వరదయింది
ఈ అతిధి దేవుడు ఆ దేవుణ్ణే కోరేది సౌఖ్యాంగా నువ్వుండాలని
నీ బ్రతుకంతా బాగుండాలనీ...

పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది
రాణి గారికి సిగ్గులు వచ్చే రాజుగారికి చిరునవ్వొచ్చే
ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిధిగా వచ్చే





స ఒక చినుకు పాట సాహిత్యం

 
చిత్రం: పల్లకిలో పెళ్ళికూతురు (2004)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చక్రి, గంగ 

స ఒక చినుకు 




ముద్దు లేని ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: పల్లకిలో పెళ్ళికూతురు (2004)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కళ్యాణి మాలిక్, సుమంగళి 

ముద్దు లేని ప్రేమ 




నా పేరు చెప్పుకోండి పాట సాహిత్యం

 
చిత్రం: పల్లకిలో పెళ్ళికూతురు (2004)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: సునీత ఉపాద్రష్ట

చిత్రం: పల్లకిలో పెళ్ళికూతురు (2004)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: సునీత ఉపాద్రష్ట

నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా 
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా 
చల్లగాలి, చందమామ, మల్లెతీగ, చిలకమ్మ, మీలో ఒకరైనా
నా పేరు చెప్పుకోండి 
నా  నా  నా పేరు చెప్పుకోండి

కవిత, సరిత , మమత, నిఖిత, రెండు జళ్ళ సీత
ప్రతిమ, ఫాతిమ, మహిమా, ఉమ, సత్యభామ
నీలిమేఘాలతోటి ఆడుకుంటాను గాని
నా పేరు నీలిమ కాదు
అన్ని రాగాలబాణి పాడుకుంటాను గాని
నా పేరు రాగిణి కాదు
బంగారమంటి మనసుంది గాని నా పేరు కనకం కాదు
భోగాలు పంచే సొగసుంది గాని నా పేరు భాగ్యం కాదు
హొ హొ హ్హో....హొ హొ హొ హ్హొ.....
ఓటమంటు వొప్పుకోను విజయను కాను వొట్టిమాట చెప్పలేను సత్యను కాను
మీ ఊహకే వదిలేస్తున్నాను ఊహను కాను.. కల్పన కాను

నా పేరు,  నా నా  నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా
 
చిన్ని చెక్కిళ్ళలోనా కొన్ని గులాబిలున్న నా పేరు రోజా కాదు
అన్ని పుష్పాలు చేరి నను అర్చించుతున్న నా పేరు పూజిత కాదు
ఏ కన్ను సోకని కన్యను ఐనా నా పేరు సుకన్య కాదు
అమవస చీకటి అంటదు ఎపుడు నా పేరు పూర్ణిమ కాదు
హొ హొ హ్హో....హొ హొ హొ హ్హొ
బోలేడంత జాలి ఉంది కరుణను కాను
అంతులేని పేరు ఉంది కీర్తిని కాను
మీరే మీరే తేల్చాలండి మీరా నసలే కానే కాను

నా పేరు చెప్పుకోండి  
నా  నా  నా పేరు చెప్పుకోండి
మీలో ఎవరైనా  నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా ..
చల్లగాలి  చందమామ  మల్లెతీగ  చిలకమ్మ మీలో  ఒకరైనా
నా పేరు  రాణి  రాణి  రాణి



చీరలోని గొప్పతనం తెలుసుకో పాట సాహిత్యం

 
చిత్రం: పల్లకిలో పెళ్ళికూతురు (2004)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఎమ్.ఎమ్.కీరవాణి

చీరలోని గొప్పతనం తెలుసుకో
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
సింగారమనే దారంతో చేసింది చీర
ఆనందమనే రంగులునే అద్దింది చీర
మమకారమనే మగ్గంపై నేసింది చీర

చీరలోని గొప్పతనం తెలుసుకో
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో

చరణం: 1
మడికట్టుతో నువ్వు పూజచేస్తే గుడి వదిలి దిగివచ్చును దేవుడు
ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే సిరిలక్ష్మిని కురిపించును పంటలు
జారుకట్టుతో పడకటింట చేరితే గుండె జారి చూస్తాడు పురుషుడు
నిండు కట్టుతో నువ్వు నడిచెళుతుంటే దండాలే పెడతారు అందరూ
అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది
కన్నీరై ఉన్నప్పుడు నీ చెంపను తడిమేది
చిన్న చీరకొంగులోన కన్నతల్లి ఉన్నది
 
చీరలోని గొప్పతనం తెలుసుకో
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో

చరణం: 2
పసిపాపలా నిదురపోయినప్పుడు అమ్మ చీరే మారేను ఊయలగా
పువ్వై నువ్వు విచ్చుకున్నప్పుడు ఈ చీరేగా అందాలకు అడ్డుతెర
గాలి ఆడకా ఉక్కపోసినప్పుడు ఆ పైటేగా నీ పాలిట వింజామర
ఎండా వాన నీకు తగిలినప్పుడు ఆ కడకొంగే నీ తలపై గొడుగు
విదేశాల వనితలకు సారె పోసి పంపేది
భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది
మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది
 
చీరలోని గొప్పతనం తెలుసుకో
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
సింగారమనే దారంతో చేసింది చీర
ఆనందమనే రంగులనే అద్దింది చీర
మమకారమనే మగ్గంపై నేసింది చీర

చీరలోని గొప్పతనం తెలుసుకో
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో




నువు 'ప్రే' నేను 'మా' పాట సాహిత్యం

 
చిత్రం: పల్లకిలో పెళ్ళికూతురు (2004)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఎస్.పి.బి.చరణ్ , నిత్య సంతోషిని 

నువు  'ప్రే' నేను 'మా'

Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default