Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Prakash Raj"
Alludu Adhurs (2021)


 









చిత్రం: అల్లుడు అదుర్స్ (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జస్ప్రిత్ జస్ట్
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మానుయేల్
దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్
నిర్మాత: గొర్రెల సుబ్రహ్మణ్యం
విడుదల తేది: 14.01.2021

హోలా చిక హోలా హోలా చికా... 
హోలా చిక హోలా హోలా చికా

హోలా చిక నా... ?? వాట్ నాన్సెన్స్... ??
హలో పిల్లా... ఇట్ మేక్ సెన్స్

హోలా అంటే హలో... చిక అంటే పిల్ల
ఈ మాత్రం దానికి తెలుగులో అంటే పోలా..?
తెలుగులో ఈ వర్డు చాలా వాడేశారు... 
అందుకని సారు, స్పానిష్ లో దిగారు.

హోలా చిక హోలా హోలా చికా...
హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా... 
హోలా చిక హోలా హోలా చికా

ఐదేళ్ళ వయసప్పుడు... 
ఐశ్వర్యరాయ్ అంటే ఇష్టం

హోలా చిక హోలా హోలా చికా... 
హోలా చిక హోలా హోలా చికా

తర్వాత ఇంకెప్పుడు... చూళ్ళేదు నేనంత అందం
హోలా చిక హోలా హోలా చికా...
హోలా చిక హోలా హోలా
ఇన్నాళ్లకు చూసినాను నిన్నే... 
హోలా చిక హోలా హోలా చికా
స్టాచ్యులా స్టన్నైంది కన్నె... 
హోలా చిక హోలా హోలా చికా
ఇట్టా ఎట్టా పుట్టినావే అబ్బో అబ్బో... 
నిన్ను పట్టకుంటే గుండె లబ్బో దిబ్బో

హోలా చిక హోలా హోలా చికా... 
ఓలమ్మో నువ్వేలే నా మ్యాజిక్కా
హోలా చిక హోలా హోలా చికా...
హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా... 
పట్టెయ్ వే నా లవ్వునే క్యాచ్ ఇకా
హోలా చిక హోలా హోలా చికా...
హోలా చిక హోలా హోలా చికా

హ... రేటింగ్ లోన ఫైవ్ స్టార్ ఉన్నవాణ్ణి
ఫైటింగ్ లోన ఫస్ట్ ర్యాంకు పొందినోన్ని
డేటింగ్ లోకి ఫస్ట్ టైం వచ్చినానే... డేట్ ఇవ్వవే
ఓటిటి యాప్స్ డౌన్లోడ్ చేసినానే... 
ఊళ్ళోని పబ్స్ టచ్ లోన ఉన్న వాన్నే
న్యూ ట్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే నేనే... 
లేటు చెయ్యకే
ఆవారా లాంటి వాణ్ని నేనే... 
హోలా చిక హోలా హోలా చికా
వాలెంటైన్ చేసినావే నన్నే... 
హోలా చిక హోలా హోలా చికా
ఒక్క చిన్న తప్పు చాలు ఒప్పో అప్పో... 
నీ నవ్వు నాకు ఇవ్వనంటే లబ్బో దిబ్బో

హోలా చిక హోలా హోలా చికా... 
ఓలమ్మో నువ్వేలే నా మ్యాజిక్కా
హోలా చిక హోలా హోలా చికా... 
హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా... 
పట్టెయ్ వే నా లవ్వునే క్యాచ్ ఇకా

అవెంజర్స్ థార్... మెరుపు షాట్ కొట్టినట్టు
మ్యాచ్ లాస్ట్ బాలు... సిక్సరేసి బాదినట్టు
నా దిల్లుతోటి ఆడుకోకే... ఇష్టమొచ్చినట్టు, 
ప్రేమ పంచవే
ప్లగ్గులోన వేలుపెడితే... ఒక్కసారి షాకు
ఓరచూపు తోటి... వంద షాకులివ్వమాకు
నాలాంటి వాడు... ఇంక దొరకడంట నీకు, 
నన్ను నమ్మవే

స్కూల్లోనే ఈల నేర్చినానే... 
హోలా చిక హోలా హోలా చికా
నీకోసం వెయ్యడానికేనే... 
హోలా చిక హోలా హోలా చికా
నువ్వు ఎస్సు అంటే లైఫు అబ్బో అబ్బో... నువ్వుగాని నో అంటే లబ్బో దిబ్బో
హోలా చికహోలా హోలా చికా... 
ఓలమ్మో, నువ్వేలే నా మ్యాజిక్కా

హోలా చిక హోలా హోలా చికా... 
హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా... 
పట్టెయ్ వే నా లవ్వునే క్యాచ్ ఇకా
హోలా చిక హోలా హోలా చికా... 
హోలా చిక హోలా హోలా చికా








చిత్రం: అల్లుడు అదుర్స్ (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: మంగ్లి, హేమచంద్ర

హే... సిల్క్ స్మిత, జయమాల్ని జ్యోతి లచ్చిమి
అందంలో చందంలో రిలేటెడ్ టు మీ
హే... కత్తిరీనా, కర్రీనా సన్నీ లియోనీ
అందరూ నా సిస్టర్సే ప్లీజ్ బిలీవ్ మీ

హే కోకారైకా నేనేసాక  నాసాటి రాలేదు ఏ తారక
కుర్రాలింకా ఈలెయ్యక  ఎట్టాగ ఆగేది నేనొచ్చాక

రంభ ఊర్వశి మేనకా అందర్నీ కలిపేస్తే నేనిక
హే రంభ ఊర్వశి మేనకా అందర్నీ కలిపేస్తే నేనిక

హే... సిల్క్ స్మిత, జయమాల్ని  జ్యోతి లచ్చిమి
అందంలో చందంలో  రిలేటెడ్ టు మీ
కక కత్తిరీనా, కర్రీనా  సన్నీ లియోనీ
అందరూ నా సిస్టర్సే  ప్లీజ్ బిలీవ్ మీ

హెయ్... దినక్కుతా కసక్కురో
దినక్కుతా... కసక్ కసక్ కసక్
దినక్కుతా కసక్కురో
దినక్కుతా... ఫసక్ ఫసక్ ఫసక్ 
దినక్కుతా కసక్కురో
దినక్కుతా... ఫసక్ ఫసక్ ఫసక్ 

హే... ఫస్టు ఫస్టు ఆడబొమ్మ చెక్కినోడికి
రోల్ మోడలేదంటే నీ పిక్చరే
నా సొంపాపిడి లాంటి సోయగానికి
సూటబుల్ మ్యాచ్ అంటే నీ స్ట్రక్చరే
హెయ్ పోరి... నా షర్టు పైన పూల ప్రింట్
నీ వల్లే సెంటల్లే మారిందే...
నీ స్మైలే ఇష్టయిలుగొచ్చి... తాకగానే
నా ఒళ్ళే తెగ ఊగిపోతుందే

రంభ ఊర్వశి మేనకా అందర్నీ కలిపేస్తే నేనిక
రంభ ఊర్వశి మేనకా అందర్నీ కలిపేస్తే నువ్విక

హే... లిక్కరంటి నీ పెదాల్లో నక్కి ఉంటదే
చెక్కరంటే నీ పదాల్లో చిక్కి ఉంటదే
నీ ఉక్కులాంటి ఒంటి తీరు గ్రీకు శిల్పమే
మాట తేనె పూసుకున్న కత్తి వాటమే
నీ షేపే కొత్తందాలకే బెస్ట్ షాప్ 
ఏ స్ట్రీటే నీ కేరాఫ్ అడ్రస్సు
నా పేరే నువ్వు జస్ట్ చెప్పు చాలు బాసు
ఈ ఊళ్ళో నేను చాలా ఫేమస్సు

రంభ ఊర్వశి మేనకా అందర్నీ కలిపేస్తే నేనిక
హా హా
హెయ్ రంభ ఊర్వశి మేనకా పూనకమే వస్తుంది మాకిక


Palli Balakrishna Sunday, January 17, 2021
Abaddham (2006)



చిత్రం: అబద్ధం (2006)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, శంకర్ మహదేవన్, చిత్ర, సుజాత, టిప్పు, హరిణి, షాలిని, రంజిత్, శ్రీరామ్ పార్థసారథి, డా. కె.నారాయనన్
నటీనటులు: ఉదయ్ కిరణ్, విమలా రామన్ (తొలి పరిచయం), కె.బాలచందర్
దర్శకత్వం: కె.బాలచందర్
నిర్మాత: ప్రకాష్ రాజ్
విడుదల తేది: 23.12.2006



Songs List:



అందాల అబద్ధం పాట సాహిత్యం

 
చిత్రం: అబద్ధం (2006)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి
గానం: రంజిత్

అందాల అబద్ధం



హిట్లర్ పిల్ల పాట సాహిత్యం

 
చిత్రం: అబద్ధం (2006)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి
గానం: టిప్పు, సుజాత

హిట్లర్ పిల్ల



చిట్టి చిట్టి కవిత నేనై పాట సాహిత్యం

 
చిత్రం: అబద్ధం (2006)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి
గానం: షాలిని

చిట్టి చిట్టి కవిత నేనై




కంటపడలే పాట సాహిత్యం

 
చిత్రం: అబద్ధం (2006)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి
గానం: కార్తీక్

కంటపడలే



ఇచ్చటే ఇచ్చటే పాట సాహిత్యం

 
చిత్రం: అబద్ధం (2006)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి
గానం: శంకర్ మహదేవన్

ఇచ్చటే ఇచ్చటే



ల ల ల ఇది రావాలి పాట సాహిత్యం

 
చిత్రం: అబద్ధం (2006)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు 

ల ల ల ఇది రావాలి




దర్శకుడా పాట సాహిత్యం

 
చిత్రం: అబద్ధం (2006)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి
గానం: శ్రీరామ్ పార్థసారథి, అనురాధ శ్రీరామ్

దర్శకుడా

Palli Balakrishna Wednesday, February 13, 2019
Gouravam (2013)


చిత్రం: గౌరవం (2013)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిచరన్ , సుచిత్ర
నటీనటులు: అల్లు శిరీష్ , యామి గౌతమ్
దర్శకత్వం: రాధామోహన్
నిర్మాత: ప్రకాష్ రాజ్
విడుదల తేది: 19.04.2013

హే చెయ్యి చెయ్యి చ్చెయ్యి ఏకం చేసేచెయ్యి
చెయ్యి చెయ్యి ఏదైనా సాధించెయ్యి
ఒకటై  ఒకటై ఒకటై ఓ కొత్త బాట చూసేయ్
దిక్కులన్ని దాటగా అడుగేసేయ్ చుక్కలన్ని తాకగ
నిగ్గుతున్న నింగి ఎక్కి మన శక్తి చాటగా

ఎన్నో తేడాలు బేదాలు వాదాలు మాని
అందరం మనమందరం
ఎవేవో దూరాలు తీరాలు  భారాలు
వీడి ఈ క్షణం కిలిశాం మనం
లోలోన పంతాలు కోపాలు భావాలు
అన్ని ఈ దినం మన ఇంధనం
ఎగిరెగిరిన అలలకు అలసట రాదు వెను తిరుగుట రాదు
వడుదుడుకులలోన విసుగే రాదు
అనుమానమే రాదు అపజయమను మాటే రాబోదు
నిగ నిగ నిప్పు రవ్వలకు నిధురిక రాదు
నిషి ఎదురుగ రాదు మన మనసుకు మసకిక కనరాదు
కరువు రాదు మన పరుగుకు పరిమితి రాబోదు

ఒకటై  ఒకటై ఒకటై ఓ కొత్త బాట చూసేయ్
దిక్కులన్ని దాటగా అడుగేసేయ్ చుక్కలన్ని తాకగ
నిగ్గుతున్న నింగి ఎక్కి మన శక్తి చాటగా

ఒకటై  ఒకటై ఒకటై ఓ కొత్త బాట చూసేయ్
దిక్కులన్ని దాటగా అడుగేసేయ్ చుక్కలన్ని తాకగ
నిగ్గుతున్న నింగి ఎక్కి మన శక్తి చాటగా

నిగ్గుతున్న నింగి ఎక్కి మన శక్తి చాటగా
ఓ కొత్తబాట చూసేయ్ దిక్కులన్ని దాటగా
నిగ్గుతున్న నింగి ఎక్కి మన శక్తి చాటగా
ఓ కొత్తబాట చూసేయ్ దిక్కులన్ని దాటగా

కలపాలి చెయ్యి చెయ్యి ఏదైనా సాధించెయ్యి
నిన్న మొన్నంత కేరింత తుళ్ళింతల్లోన
జీవితం గడిపాం మనం
నేడే సై అంటూ రై అంటూ హుయ్ అంటూ
చెలరేగదాం కొనసాగుదాం
ఇక ఇంటర్నెట్ కేఫుల్లోన కబురులు చాలు
కాలక్షేపం చాలు
ఒక లక్ష్యం కోసం తెరిచేయ్ ఫైల్  పంపించెయ్ మెయిల్
నీ తెలివికి తీసేయ్ తాళాలు
సిటీ సెంటర్లోన సందుల్లోన సందడి చాలు
చిరు విందులు చాలు అరచేతిలో ఆపేయ్ ఘోరాలు
అదే చాలు రెండు చేతులెత్తి మొక్కును లోకాలు

ఒకటై  ఒకటై ఒకటై ఓ కొత్త బాట చూసేయ్
దిక్కులన్ని దాటగా అడుగేసేయ్ చుక్కలన్ని తాకగ
నిగ్గుతున్న నింగి ఎక్కి మన శక్తి చాటగా

ఒకటై  ఒకటై ఒకటై ఓ కొత్త బాట చూసేయ్
దిక్కులన్ని దాటగా అడుగేసేయ్ చుక్కలన్ని తాకగ
నిగ్గుతున్న నింగి ఎక్కి మన శక్తి చాటగా

హే చెయ్యి చెయ్యి చ్చెయ్యి



Palli Balakrishna Monday, March 19, 2018
Konchem Ishtam Konchem Kashtam (2009)



చిత్రం: కొంచం ఇష్టం కొంచం కష్టం (2009)
సంగీతం: శంకర్ - ఇహషాన్ - లోయ్
నటీనటులు: సిద్దార్ధ్ , తమన్నా
దర్శకత్వం: కిషోర్ కుమార్
నిర్మాత: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)
విడుదల తేది: 05.02.2009



Songs List:



ఎగిరే... ఎగిరే పాట సాహిత్యం

 
చిత్రం: కొంచం ఇష్టం కొంచం కష్టం (2009)
సంగీతం: శంకర్ - ఇహషాన్ - లోయ్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రామన్ మహదేవన్, క్లింటన్ సిర్జియో, హేమచంద్ర

ఎగిరే... ఎగిరే ఎగిరే... ఎగిరేచూపే ఎగిరెనే 
చీకటి ఎదగని దారిలో 
పాదం ఎగిరెనే భయమే తెలియని బాట లో 
ప్రాయం ఎగిరెనే 
పరిచయ మవ్వని త్రోవలో 

Fly high in the sky 

ఎగిరే... ఎగిరే పైకెగిరే 
కలలే ...అలలై... పైకెగిరే
పలుకే స్వరమై పైకెగిరే
ప్రతి అడుగూ స్వేచ్ఛ కోరగా 

మనసే అడిగేను ప్రశ్నకే బదులొచ్చెను కదా ఇప్పుడే 
ఎప్పుడూ చూడని లోకమే ఎదురొచ్చేను కదా ఇచ్చటే
ఓ  ఈ క్షణమే సంబరం ఈ క్షణమే శాశ్వతం 
ఈ క్షణమే జీవితం తెలిసిందీ ఈ క్షణం 
మౌనం కరిగేనే మాటల సూర్యుడి ఎండలో 

స్నేహం దొరికేనే 
నవ్వుల చంద్రుడి నీడలో 
ప్రాణం పొంగెనే మెరుపుల తారల నింగి లో 

Fly high in the sky 

ఎగిరే... ఎగిరే పైకెగిరే 
కలలే ...అలలై... పైకెగిరే
పలుకే స్వరమై పైకెగిరే
ప్రతి అడుగూ స్వేచ్ఛ కోరగా 

తెలుపు నలుపే కాదురా 
పలు రంగులు ఇలా సిధ్ధం 
మదిలో రంగులు అద్దగా మన కధలకు 
ఓ సరిపొదొయి బ్రతకడం 
లేచే జీవించడం 
గమనం గమనించడం పయనంలో అవసరం 
చేసే సంతకం నడిచే కాలపు నుదిటిపై 
రాసే స్వాగతం రేపటి కాలపు పెదవిపై 
పంచె సున్నితమ్ 
కాలం చదివే కవితపై 

Fly high in the sky

ఎగిరే... ఎగిరే పైకెగిరే 
కలలే ...అలలై... పైకెగిరే
పలుకే స్వరమై పైకెగిరే
ప్రతి అడుగూ స్వేచ్ఛ కోరగా 




ఆనందమా..ఆరాటమా.. పాట సాహిత్యం

 
చిత్రం: కొంచం ఇష్టం కొంచం కష్టం (2009)
సంగీతం: శంకర్ - ఇహషాన్ - లోయ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్, శ్రేయా గోషల్

ఆనందమా..ఆరాటమా..ఆలోచనా ఏవిటో
పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి
దాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏవిటో
తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి
ఓ...పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా
స్వప్నమే సత్యమై రెప్ప దాటి చేరే సమయానా
ఓ...కంటీకే దూరమై గుండెకే ఇంతగా చేరువైనా
నమ్మవేం మనసా కనబడినది కదా ప్రతి మలుపున

ఆ...ఓ....
ఎద సడిలో చిలిపి లయ
తమ వలనే పెరిగెనయా
కనుక నువ్వే తెలుపవయా
ప్రేమంటారో ఏమంటారో ఈ మాయ
ప్రియా..ప్రియా
ఒక క్షణము తోచనీవుగా
కాస్త మరుపైన రావుగా

ఇంత ఇదిగా వెంట పడక అదే పనిగా
ఓ..నిన్నలా మొన్నలా నేను లేను నేనులా నిజమేనా
ముందుగా చెప్పక మంత్రమేశావే న్యాయమేనా
ఓ..అందుకే ఇంతగా కొలువయ్యున్నా నీలోనా
కొత్తగా మార్చనా నువ్వు నువ్వు అను నిను మరిపించనా

ఆనందమా...ఆరాటమా...ఆలోచనా ఏవిటో
పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి
దాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏవిటో
తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి
ఓ...పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా
చుట్టుకో చుట్టుకో ముడిపడిపోయే మురిపాన
ఓ...ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా
కళ్ళల్లో పెట్టుకో ఎదురుగ నిలవనా ఎటుతిరిగినా 
ఏకాంతమే నీ సొంతమై
పాలించుకో ప్రణయమా
కౌగిలే కోటలాఏలుకో బంధమా 




అబ్బచ పాట సాహిత్యం

 
చిత్రం: కొంచం ఇష్టం కొంచం కష్టం (2009)
సంగీతం: శంకర్ - ఇహషాన్ - లోయ్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శిల్పారావ్, మహాలక్ష్మీ అయ్యర్

అమ్మమ్మా.. అమ్మమ్మా.. అమ్మమ్మమోయ్.. 
జామురేయి వేళల్లో వీరుడల్లే వస్తాడు 
భామలున్నా వీధుల్లో ఓరకంట చూస్తాడు 
అందమైన మాటల్తో హే.. ఆశ రేపుతుంటాడు 
కొంచెమైన నమ్మారో అంత దోచుకెల్తాడు 
ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే మన పడుచు యదలకెదురుపడిన ముదురు మదనుడు 
పోరా పోకిరి రాజా ఆ రాజా.. 
పోరా దూకుడు రాజా ఏ రాజా.. 
జా జా వంకరరాజా ఏ రాజా.. 
పోరా జింకల రాజా రాజా రాజా.. 
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బబ్బచ 
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ హే అబ్బబ్బచ 

ఎంత పనీ పనులొదిలేసి సొగసులకేసి గుటకలువేసే పెద్ద పనీ.. 
మా రూపు రేఖ పొగిడే నీ పెదవికెంత కష్టం 
మా చుట్టు తిరిగి అరిగే నీ కాళ్ళ కెంత నష్టం 

చెవిలోన పువ్వులెట్టు చేతి వేళ్ళ నొప్పి నరకం 
అయినా గాని అలుపే మాని మన కులుకు గెలికి పులుపు దులుపు చిలిపి కృష్ణుడు 
పోరా మాయల రాజా ఆ రాజా.. 
పోరా మర్కట రాజా ఏ రాజా.. 
జా జా తిమ్మిరి రాజా ఏ రాజా.. 
పోరా తికమక రాజా రాజా రాజా.. 
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ  అబ్బబ్బచ 
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ  హే అబ్బబ్బచ 

కొంటె పని వలలను వేసీ నలుగురిలో మా విలువను పెంచే మంచి పనీ 
నీ గాలి సోకలేనీ మా మబ్బుకేది వర్షం 
నీ వేడి తాకలేని మా పసిడి కాదు హారం 
నీ కంటి ఘాటు తగలలేని ఒంటికేది గర్వం 
కనుకే వినుకో కబురే అనుకో ఇది మగువనెపుడు బయటపడని మనసు చప్పుడు 
హే రా రా మబ్బుల రాజా రాజా.. 
రా రా రంగుల రాజా రాజా.. 
ఆజా అల్లరి రాజా ఏ రాజా.. 
రా రా అందరి రాజా.. 
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ  అబ్బబ్బచ 
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ  హే అబ్బబ్బచ





కొంచెం ఇష్టం కొంచెం కష్టం పాట సాహిత్యం

 
చిత్రం: కొంచం ఇష్టం కొంచం కష్టం (2009)
సంగీతం: శంకర్ - ఇహషాన్ - లోయ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్

భజభజరా ప్రేమికా పట్టుకో చెలి పాదం 
బాపురే బాలికా...తీయకే నా ప్రాణం 
అనుకుంటే సరా..ఒకటే ఊదరా 
చెబితే వినదా ఉరికే తొందర 
కొంచెం ఇష్టం ఉంటే...కొంచెం కష్టం అంటే 
ఒప్పుకోక తప్పదంటూ తగువే తగునా 
ఎంతో ఇష్టం ఉన్నా...ఎంతో కష్టం ఉన్నా 
పూటకో కొండెత్తమంటే సరే అననా... 

అనగనగా జాలిగా సాగెనీ మన గాథ 
ఎంతకీ తేలదా...ఏమిటీ యమ బాధ 
ప్రతి సారి ఇలా మొదలైతే ఎలా 
సుడిలో పడవై కడ తేరేదెలా 
కొంచెం ఇష్టం ఉంటే...కొంచెం కష్టం అయినా 
కంచి దాకా చేర్చలేనా నిను నా వెనుక.. 
ఎంత ఇష్టం ఉంటే...అంత కష్టం ఉందే 
ఆగిపోని హంస పాదం ఆపకే చిలకా 

ఎన్నడూ చేరమే తిన్నగా తుది తీరం 

ఆపే ఆపదా కాదే పూపొద 
బెదురెందుకట నేనున్నా కదా... 
కొంచెం ఇష్టం వెంట...కొంచెం కష్టం వెంట 
ప్రేమ దేశం చేరాల్సిందే అనుకో సజనా 
ఎంతో దూరం ఉన్నా...ఎంత కాలం అయినా 
ప్రేమ కోసం పరుగులు తీద్దాం పదవే లలనా 

రాజునే బానిసా...చెయ్యదా చెలి బంధం 
సమయంతో సదా...సమరం చేయదా 
వలచే హృదయం...గెలిచే తీరదా 
కొంచెం ఇష్టం పుడితే...కొంచెం కష్టం నెడితే 
అంతు చూసే పంతం అవదా పొంగే ఆశ 
కోరే మజిలీ దాకా పోరే గజనీ లాగా 
ఓటమంటే కోట చేరే బాటనుకోరా 

మతి చెడితే భామరో మనది కాదిక లోకం 
మునిగితే ప్రేమలో తేలనీయదు మైకం 
మెడలో ఈ ఉరి...పడుతున్నా మరి... 
ఇది పూదండే అనదా ఊపిరి 
కొంచెం ఇష్టం ఉన్నా..కొంచెం కష్టం అయినా 
తేనెపట్టై రేపుతుంది ఈ అల్లరి 
ఇంతకు ముందే ఉన్న ఎందరి హిస్టరి విన్నా 
నువ్వు నేనే ఈవ్ అండ్ ఆడం అంతే 




ఎవడే సుబ్రమణ్యం పాట సాహిత్యం

 
చిత్రం: కొంచం ఇష్టం కొంచం కష్టం (2009)
సంగీతం: శంకర్ - ఇహషాన్ - లోయ్
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: శంకర్ మహదేవన్

కనులే కలిపింది కలలే చూపింది
ఏమయిందో ఏమో గాని అంతా మారింది
మాటే వినకుంది మంటే రేపింది
నన్నే మరిచి నాన్నే రైటని ఇంట్లో కూర్చుంది
చేతిలోన చెయ్యేసింది చెలిమి నాకు నేర్పింది
ఎంత హాయిలే ప్రేమంటే అనుకొని మది మురిసింది
ఇంతలోనే ఏమయ్యిందో నన్ను గాలికొదిలింది
అబ్బ సుబ్రమణ్యం వల్లే నా గీత మారింది
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
కొంపముంచాడే సుబ్రమణ్యం
కొంపముంచాడే సుబ్రమణ్యం
అరె ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం

అందరిలో నన్నే అందంగా చెలి
పలకరించగా సరికొత్తగా మళ్ళీ జన్మించాగా
అల్లరిగా తిరిగే నే కూడా ప్రేమించగలనని
తనతో కలిసాకే గుర్తించాగా
వంద ఏళ్ళ ఆనందాలు ఒక్కనాడే చూపింది
కన్ను మూసి తెరిచే లోగా కథ మొత్తం మారింది
చందమామలా నవ్వింది నన్ను వీడలేనంది
మధ్యలో అబ్బ రాగానే తను మాట మార్చింది

అరె ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే సుబ్రమణ్యం
సుబ్రమణ్యం సుబ్రమణ్యం సుబ్రమణ్యం
ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే సుబ్రమణ్యం
అరె కొంపముంచాడే సుబ్రమణ్యం
కొంపముంచాడే సుబ్రమణ్యం
అరె ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం

ఏయ్ ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
అరె ఎవడే... సుబ్రమణ్యం 
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
కొంపముంచాడే సుబ్రమణ్యం
కొంపముంచాడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం

ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
సుబ్రమణ్యం ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
హా కొంపముంచాడే సుబ్రమణ్యం 
కొంపముంచాడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం



అంతా సిద్ధంగా ఉన్నది పాట సాహిత్యం

 
చిత్రం: కొంచం ఇష్టం కొంచం కష్టం (2009)
సంగీతం: శంకర్ - ఇహషాన్ - లోయ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సోనునిగమ్, శ్రేయా గోషల్

అంతా సిద్ధంగా ఉన్నది... 
మనసేంటో సంతోషమన్నది 
ఆలస్యమెందుకన్నది...ఇలా రా మరి... 
అబ్బాయిగారి పద్ధతి హద్దు మీరేట్టుగానే ఉన్నది 
అల్లాడిపోదా చిన్నది..చాల్లే అల్లరి 
కథలో.... తదుపరి...పిలిచే... పద మరి 
మనువే కుదిరి..మురిపెం ముదిరీ 
మనకిష్టమైన కష్టమైన ఊగిపోదా మరి 
అంతా సిద్ధంగా ఉన్నది... 
హద్దు మీరేట్టుగానే ఉన్నది
ఆలస్యమెందుకన్నది...సరేలే మరి... 

పైట పడి ఎదిగిన వయసా... 
ఓయ్ ఏంటి కొత్త వరస.... 
బయటపడకూడదు సొగసా 
పోవోయ్ చాల్లే నస 
పైట పడి ఎదిగిన వయసా... 
బయటపడకూడదు సొగసా..తెలుసా
మండిపోదా ఒళ్ళు పరాయి వాళ్ల కళ్లు 
నిన్నంతలాగ చూస్తే అలా 

ఎందుకంత కుళ్లు 
నువ్వైనా ఇన్నాళ్ళు 
నన్ను కొరకలేదా అచ్చం అలా 
కనుకే కలిశా..బంధమై బిగిశా 
నీకు ఇష్టమైనా కష్టమైనా వదలనంది అది... 
అబ్బాయిగారి పద్ధతి హద్దు మీరేట్టుగానే ఉన్నది 
ఆలస్యమెందుకన్నది...ఇలా రా మరి... 

చెంపలకు చెప్పవే సరిగా 
సిగ్గూపడమని ఒక సలహా 
హో...ఓ...చెంపలకు చెప్పవే సరిగా 
సిగ్గూపడమని ఒక సలహా 
చెలియా కన్నె పిల్ల బుగ్గ కాస్తైన కందిపోక 
పసిపాపలాగ ఉంటే అలా 
ముందరుంది ఇంకా ఆ ముద్దు ముచ్చటంతా
కంగారు పెట్టకపుడే ఇలా 
ఉరికే సరదా...చెబితే వింటదా 
నీకు ఇష్టమైనా...కష్టమైనా...ఒప్పుకోదు అది 
అంతా సుఖంగా ఉన్నది... 
మనసెంతో సంతోషమన్నది 
ఆలస్యమెందుకన్నది...ఇలా రా మరి...





ఎందుకు చెంతకి వస్తావో పాట సాహిత్యం

 
చిత్రం: కొంచం ఇష్టం కొంచం కష్టం (2009)
సంగీతం: శంకర్ - ఇహషాన్ - లోయ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉన్ని కృష్ణన్

ఎందుకు చెంతకి వస్తావో ఎందుకు చేయొదిలేస్తావో 
స్నేహమా చెలగాటమా
ఎప్పుడు నీ ముడి వేస్తావో ఎప్పుడెలా విడదీస్తావో

ప్రణయమా పరిహాసమా 
శపించే దైవమా దహించే దీపమా 
ఇదే నీ రూపమా ప్రేమా
ఫలిస్తే పాపమా కలిస్తే లోపమా గెలిస్తే నష్టమా ప్రేమా

ఈ కలత చాల్లే మమత 
మరపురాని స్మృతులలోనే రగిలిపోతావా

మరలి రాని గతముగానే మిగిలిపోతావా 
రెప్పలు దాటవు స్వప్నాలు చెప్పక తప్పదు వీడ్కోలు 
ఊరుకో హృదయమా 
నిజం నిష్ఠూరమా తెలిస్తే కష్టమా కన్నీటికి చెప్పవే ప్రేమా
ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా గెలిస్తే నష్టమా ప్రేమా

వెంటరమ్మంటూ తీసుకెళ్తావు నమ్మి వస్తే నట్టడవిలో విడిచిపోతావు 
జంటకమ్మంటూ ఆశపెడతావు 
కలిమి ఉంచే చెలిమి తుంచే కలహమవుతావు 
చేసిన బాసలు ఎన్నంటే చెప్పిన ఊసులు ఏవంటే 
మౌనమా మమకారమా
చూపుల్లో శూన్యమా గుండెల్లో గాయమా మరీ వేధించకే ప్రేమా
ఎందుకు చెంతకి వస్తావో ఎందుకు చేయొదిలేస్తావో 
స్నేహమా చెలగాటమా
ఎప్పుడు నీ ముడి వేస్తావో ఎప్పుడెలా విడదీస్తావో ప్రణయమా పరిహాసమా




పంచీరే పాట సాహిత్యం

 
చిత్రం: కొంచం ఇష్టం కొంచం కష్టం (2009)
సంగీతం: శంకర్ - ఇహషాన్ - లోయ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కీర్తి సంగతియ , సాధన సర్గం 

పంచీరే 

Palli Balakrishna Tuesday, July 25, 2017

Most Recent

Default