చిత్రం: ఒక రాధ ఇద్దరు కృష్ణులు (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి (All Songs)
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: కమల్ హాసన్ , శ్రీదేవి
దర్శకత్వం: ఏ. కోదండ రామిరెడ్డి
నిర్మాణం: శ్రీ సారసా మూవీస్
విడుదల తేది: 10.08.1986
పల్లవి:
మధుర మురళి హృదయ రవళి
అధర సుధల యమున పొరలి పొంగే ఎద పొంగే
ఈ బృందావిహారాలలోన
నా అందాలు నీవేరా కన్నా
ఈ బృందావిహారాలలోన
నా అందాలు నీవేరా కన్నా
మధుర మురళి హృదయ రవళి
ఎదలు కలుపు ప్రణయ కడలి సాగే సుడిరేగే
ఈ బృందావిహారాలలోన
ఎవరున్నారు రాధమ్మ కన్నా
ఈ బృందావిహారాలలోన
ఎవరున్నారు రాధమ్మ కన్నా
చరణం: 1
గోధూళి వేళల్లో గోపెమ్మ కౌగిట్లో
లేలేత వన్నె చిన్నె దోచే వేళల్లో
పున్నాగ తోటల్లో సన్నాయి సందిట్లో
నాజూకులన్నీ నాకే దక్కే వేళల్లో
పగలో అవతారం రాత్రో శృంగారం
ఎదలో తారంగం శ్రీవారికి
రాగాలెన్నైనా వే ణువు ఒకటేలే
రూపాలెన్నైనా హృదయం ఒకటేలే
నాదే నీ గీతమూ ఇక నీదే ఈ సరసాల సంగీతం
మధుర మురళి హృదయ రవళి
అధర సుధల యమున పొరలి పొంగే ఎద పొంగే
ఈ బృందావిహారాలలోన
నా అందాలు నీవేరా కన్నా
ఈ బృందావిహారాలలోన
ఎవరున్నారు రాధమ్మ కన్నా
చరణం: 2
హేమంత వేళల్లో లేమంచు పందిట్లో
నా వీణ ఉయ్యాలూగే నీలో ఈనాడే
కార్తీక వెన్నెల్లో ఏకాంత సీమల్లో
ఆరాధనేదో సాగే అన్నీ నీవాయె
ముద్దే మందారం మనసే మకరందం
సిగ్గే సిందూరం శ్రీదేవికి
అందాలెన్నైనా అందేదొకటేలే
ఆరు ఋతువుల్లో ఆమని మనదేలే
పాటే అనురాగము మనబాటే ఓ అందాల అనుబంధం
మధుర మురళి హృదయ రవళి
అధర సుధల యమున పొరలి పొంగే ఎద పొంగే
ఈ బృందావిహారాలలోన
ఎవరున్నారు రాధమ్మ కన్నా
ఈ బృందావిహారాలలోన
నా అందాలు నీవేరా కన్నా
Oka Radha Iddaru Krishnulu (1986)
Palli Balakrishna
Friday, August 11, 2017
