Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Leon James"
GOAT (2024)



చిత్రం: G.O.A.T (2024)
సంగీతం: లియోన్ జోన్స్ 
నటీనటులు: సుదీర్, ఆనంద్ బాయన, దివ్య భారతి 
దర్శకత్వం: నరేష్ కుప్పిలి
నిర్మాత: మోగుల్ల చంద్రశేఖర్ రెడ్డి 
విడుదల తేది: 16.02.2024



Songs List:



అయ్యో పాపం సారు పాట సాహిత్యం

 
చిత్రం: G.O.A.T (2024)
సంగీతం: లియోన్ జోన్స్ 
సాహిత్యం: సురేష్ బనిశెట్టి 
గానం: సీన్ రోల్దేన్ 

ఏ, సండేలాంటి లైఫు
మండేలా మండుతోంది
ఈ గుండెల్లోన బీటు
సావు డప్పై మోగుతోంది

ఏ, సండేలాంటి లైఫు
మండేలా మండుతోంది
ఈ గుండెల్లోన బీటు
సావు డప్పై మోగుతోంది

గ్రహచారం గాడ్జిల్లాలా
గదిలోకి దూరిందే
దురదృష్టం దుషమన్ లా
దుంపంత తెంచిందే

అయ్యో పాపం సారు
ఎట్టా బుక్కయ్యారు
లారీ గుద్దిన ఆటోలా
దెబ్బై పోయారు
అయ్యో పాపం సారు
ఇట్టా లాకయ్యారు
3డీ లో చూస్తున్నారు
హారర్ పిక్చరు

ఏ, సండేలాంటి లైఫు
మండేలా మండుతోంది
ఈ గుండెల్లోన బీటు
సావు డప్పై మోగుతోంది

గ్రహచారం గాడ్జిల్లాలా
గదిలోకి దూరిందే
దురదృష్టం దుషమన్లా
దుంపంత తెంచిందే

వయోలెంటుగా ఉండేటి సారు
సైలెంటుగా వయోలినే వాయిస్తున్నారు
వాల్కోనోలా రోజు బ్లాస్ట్ అయ్యే వారు
బాల్కనీలో రోజాలా చిగురిస్తున్నారు

సుకుమారీ కళ్ళల్లోకే చూస్తూ
చేతుల్లో చెయ్యేస్తు స్మైలే ఇస్తున్నారు
తొలిసారీ గుండెకి తలుపే తీస్తూ
వెల్కమ్ బోర్డే రాస్తూ
కం కం అంటున్నారు

అయ్యో పాపం సారు
పుట్టేసిందా ప్యారు
ఇస్రో ఇసిరిన రాకెట్లా ఎగిరేస్తున్నారు
అబ్బో మేడమ్ గారు
నచ్చిందంటున్నారు
ఇస్త్రీ చేసిన చొక్కాలా
మెరుస్తు ఉన్నారు

తేదీలన్నీ మరిచి నీ మైకంలోనా
ఖైదీలా కూర్చోడం చాలా బాగుంది
నా లోకాన్ని విడిచి ఈ లోకంలోనా
మా లోకాన్ని అయిపోవడం ఇంకా బాగుంది

నా మనసే నీ ఊహల్లో నుంచి
ఎగిరి పోతున్న క్లిప్పే పెట్టేసావే
నా కలనే ఎప్పుడు చూడనని
రంగుల్లోన ముంచి, రెక్కలు తెప్పించావే

అయ్యో పాపం సారు
ఊర మాసుగుండేవారు
అంద్ధంలో ఫస్ట్ టైమ్
క్లాసిగా కనిపిస్తున్నారు

లుంగీ కట్టే వారు, కాలర్ ఎత్తే వారు
గుండీలు మొత్తం పెట్టేసి
గుడ్ బాయ్ అయ్యారు

ఏ సండేలాంటి లైఫు
మండేలా మండుతోంది
ఈ గుండెల్లోన బీటు
సావు డప్పై మోగుతోంది

Palli Balakrishna Tuesday, February 13, 2024
Das Ka Dhamki (2023)



చిత్రం: దాస్ కా ధమ్కీ (2023)
సంగీతం: లియోన్ జేమ్స్, రామ్ మిరియాల 
నటీనటులు: విశ్వక్ సేన్, నివేత పేతురాజ్
దర్శకత్వం: విశ్వక్ సేన్
నిర్మాతలు: కరాటే రాజు, విశ్వక్ సేన్
విడుదల తేది: 22.03.2023



Songs List:



ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: దాస్ కా ధమ్కీ (2023)
సంగీతం: లియోన్ జేమ్స్ 
సాహిత్యం: పూర్ణాచారి 
గానం: ఆదిత్య RK, లియోన్ జేమ్స్ 

ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పిల్లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పిల్లా పిల్లా
సునూరే జాను చేజారేను
అదిరే కన్ను కొంటె పిల్లా పిల్లా
ఓ ఫుల్ మూనుకున్నా
నే క్లౌడ్ నయను
వోడ్కా వైను నువ్వే పిల్ల పిల్లా
హే సావరియా చెలియా
కొంటెగా నవ్వేస్తుంటే
నా దునియా రెండుగా అయిపోతున్నాదే
నా మానియా సాథియా
మాయలో మనసు పడ్డానా
నాలో నేనే లేనా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
చెంపకు పింపిలా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
కళ్ళకు రేబాన్ లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
ముందుకు మంచింగ్ లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పిల్లా పిల్లా

లే లే లే మజా… లే లే లే మజా
లే లే లే మజా… పిల్లా జిల్లా
లే లే లే మజా… లే లే లే మజా
లే లే లే మజా… పిల్లా జిల్లా

నీ చుట్టే తిరుగుతూ
కరుగుతూ ఇపుడు మరి
నా టైము చేతికి దొరకట్లేదే
నీ వెనకే ఉరుకులు పరుగులు పెడుతూ మరి
నా హార్టు వేగమే తెలియట్లేదే
రోజొక్క సీజను ఏదో ఓ రిజను
చెప్పేస్తూ కప్పేస్తున్నానే
నువ్వుంటే రాజును
నువ్వే ఆక్సీజెను
నో అంటే నో మోరే నే నే
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
చెంపకు పింపిలా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
కళ్ళకు రేబాన్ లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
ముందుకు మంచింగ్ లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పిల్లా పిల్లా

లే లే లే మజా… లే లే లే మజా
లే లే లే మజా… పిల్లా జిల్లా
లే లే లే మజా… లే లే లే మజా
లే లే లే మజా… పిల్లా జిల్లా



మావా బ్రో పాట సాహిత్యం

 
చిత్రం: దాస్ కా ధమ్కీ (2023)
సంగీతం: రామ్ మిరియాల 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రామ్ మిరియాల 

సందమామ రావే అంటే వచ్చిందా
కోరస్: రాలే రాలే
బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా
కోరస్: తేలే తేలే
మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటాదా
కోరస్: చాల్లే చాల్లే
ఇన్‌స్టాలో కష్టాలు చూపించుకుంటారా
కోరస్: నిజమే నిజమే

పైకి నువు చూసేదొకటి
లోపల ఇంకోటి గోవిందా

కోరస్: జిందగిని ఆడో ఈడో
ఇంకొకడెవడో ఆడిస్తుంటడు బ్రో
అందులో నీతోనే ఒక ఐటెం సాంగ్ ని
పాడిస్తుంటడు బ్రో

కోరస్: 
జిందగీ అంతే అంతే అంతే అంతే 
అంతే మావా బ్రో
లైఫంతా ఇంతే ఇంతే ఇంతే ఇంతే
ఇంతే మావా బ్రో

సందమావ రావే అంటే వచ్చిందా
కోరస్: రాలే రాలే
బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా
కోరస్:హోయ్ హోయ్ హోయ్

వంటిలో ఫుల్లు షుగరున్నోడు, ఆహ
స్వీట్ షాపులో కూసున్నట్టు, ఆహ
అన్నీ ఉంటయ్ అందెటట్టు
ఏది కాదు నీది ఒట్టు
మంది ఉంటరు నీకు సుట్టు
రోజు ఫంక్షనే జరిగినట్టు
సేవలెన్నైన జేసి పెట్టు
వాల్ల తిట్లే నీకు గిఫ్టు

నీ స్టోరీలో హీరోలా 
ఫీలైపోతు బతికేస్తుంటవ్ మావా బ్రో
జరా టైరో… మావా బ్రో
జోకర్ల నిన్ను వాడేసుకుంటూ షో కొట్టేస్తారో

కోరస్: 
జిందగీ అంతే అంతే అంతే అంతే 
అంతే మావా బ్రో
లైఫంతా ఇంతే ఇంతే ఇంతే ఇంతే
ఇంతే మావా బ్రో

కోరస్: 
జిందగీ అంతే అంతే అంతే అంతే 
అంతే మావా బ్రో
లైఫంతా ఇంతే ఇంతే ఇంతే ఇంతే
ఇంతే మావా బ్రో

మబ్బులెన్ని అడ్డే వచ్చినా
డ్యూటీ చేసే సూర్యున్నాపునా
డబ్బు సుట్టు గ్లోబే తిరిగినా
మనిషి విలువ మాత్రం తరుగునా ఆ ఆఆ

ఏ దునియా పైసామే డూబుగయా
పైసా పైసా పైసామే డూబుగయా



ఓ డాలరు పిలగా పాట సాహిత్యం

 
చిత్రం: దాస్ కా ధమ్కీ (2023)
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం: పూర్ణా చారి 
గానం: మంగ్లీ, దీపక్

ఓ దారువాలా దిల్లువాలా
గోళీసోడారా నేను
థౌసండ్ వాలా పేలినట్టు
ఓపెన్ చేసెయ్రా నన్ను

రిమి జిమి జిమి హై
రిమ్మి జిమి హై
రిమి జిమి జిమి హై డీలు ఒకే
రిమి జిమి జిమి హై
రిమ్మి జిమి హై
రిమి జిమి జిమి హై నాతో కేకే

ఓ దారువాలా దిల్లువాలా
గోళీసోడారా నేను
థౌసండ్ వాలా పేలినట్టు
ఓపెన్ చేసెయ్రా నన్ను

హే ముస్తాబై నే వచ్చాను గానీ
ముచ్చట్లు ఏందయ్యా హోయ్
ఏ మూమెంటు లేదయ్యా హోయ్
ఈ ఈవెంటు నాదయ్య

ఆ ఆఆ ఆజా లడికి
నే తీర్చేస్తా బాకీ
నీ నీకిస్తా ధమ్కీ కోలో కిడికి

ఓ డాలరు పిలగా
జిల్ జిలగ నే జంగల్ జింకనురా
హే ముందు వెనక లేదనక
చల్ బూమ్ బూమ్ బద్దలిక

ఓ డాలరు పిలగా
జిల్ జిలగ నే జంగల్ జింకనురా
హే ముందు వెనక లేదనక
చల్ బూమ్ బూమ్ బద్దలిక

రిమి జిమి జిమి హై
రిమ్మి జిమి హై
రిమి జిమి జిమి హై డీలు ఒకే
రిమి జిమి జిమి హై
రిమ్మి జిమి హై
రిమి జిమి జిమి హై నాతో కేకే

రేసుగుర్రం ఉరికినట్టు
డోసుపెంచి దూకి రారా
పట్టు అందం పట్టానే నీకే రాసిస్తా

ఆన్ ద రాక్ మందు పైన
వైల్డ్ ఫైరు అంటినట్టు
ఉక్కపోతే పెంచేసి నీ తిక్కే తీరుస్తా

నీ రసికతకు నే చెలికత్తెనై
ఊ అంటాను ప్రతి నిమిషం
నీ సరసములో నే చేరి సగమై
ఆడిస్తాను చదరంగం

ఆ ఆఆ ఆజా లడ్కి
నే తీర్చేస్తా బాకీ
నే నీకిస్తా ధమ్కీ
కోలో కిడికి

ఓ డాలరు పిలగా
జిల్ జిలగ నే జంగల్ జింకనురా
హే ముందు వెనక లేదనక
చల్ బూమ్ బూమ్ బద్దలిక

ఓ డాలరు పిలగా
జిల్ జిలగ నే జంగల్ జింకనురా
హే ముందు వెనక లేదనక
చల్ బూమ్ బూమ్ బద్దలిక





ఎవరిని ఎవరితో పాట సాహిత్యం

 
చిత్రం: దాస్ కా ధమ్కీ (2023)
సంగీతం: లియోన్ జేమ్స్ 
సాహిత్యం: పూర్ణా చారి 
గానం: హరిచరణ్ 

ఎవరిని ఎవరితో కలుపునొ
విధి విలాసం
మనసుతో ముడిపడే మనిషిగా తోలి ప్రయాణం
ఏ తోదలు తెలియని మొదలిదా
ఏ బదులు దొరకని ప్రశ్న ఇదా
నేనుపుడు అడగని వరమీదా
నా నిజముగా నిజమిదా
కథగా మలిచాడో
పరిచయం చేసాడో
ప్రతి అడుగు వెనకాల
ఏ మలుపు రాశాడో
ఇది మరు జన్మ తెలిసెను ప్రేమ
పెదవులపైనా చిరునవ్వులు ఏమైనా
ముసుగున ఉన్నా నటన అనుకున్న
తెలియని అమ్మ ఎదురు నిలవదా
ఎద తాడిచెనుగా

ఎవరిని ఎవరితో కలుపునొ
విధి విలాసం
మనసుతో ముడిపడే మనిషిగా తోలి ప్రయాణం హ్మ్…

Palli Balakrishna Monday, April 3, 2023
Paagal (2021)



చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: లియోన్ జేమ్స్
నటీనటులు: విశ్వక్ సేన్, నివేత పేతురాజ్, భూమికా చావ్లా
దర్శకత్వం: నరేష్ కుప్పిలి
నిర్మాత: బెక్కం వేణుగోపాల్
విడుదల తేది: 14.08.2021



Songs List:



పాగళ్ పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: చంద్ర బోస్
గానం: రామ్ మిరియాల, మామా సింగ్

కాలేజీ సందులు తిరిగాడు
కోవెల్లు కేఫులు తిరిగాడు
సినిమా హాళ్లకు వెళ్ళాడు
ప్రతి ఒక సీటును వెతికాడు
అమ్మాయి గాని కనబడగానే
లవ్ యూ అంటాడు
ఆ పిల్ల నుండి రిప్లే రాక మొదటికి వస్తాడు
గూగులు గూగులు గూగులు
గర్ల్ ఫ్రెండును వెతికే గూగులు
వీడు పాగళ్ పాగళ్ పాగళ్
ప్రేమ కోసం బతికే పాగళ్
గూగులు గూగులు గూగులు
గర్ల్ ఫ్రెండును వెతికే గూగులు
వీడు పాగళ్ పాగళ్ పాగళ్
ప్రేమ కోసం బతికే పాగళ్

పిల్ల నువ్వు సై అంటే చాలు
రై అని వచ్చేస్తాను
నై అని చెప్పోదే పిల్ల
కై అని ఏడుస్తాను
మేర జేసే ప్రేమికుడు
మళ్ళి నీకు దొరకడు
ప్రేమించి చూడవే పిల్ల
పండగే నీకు అమ్మతోడు
ప్రేమించే పాగళ్ పంచిస్తా కాదల్
తోడు లేని సింగిల్ జన్మకెన్నీ బాదల్
నవ్విస్తా నవ్వుల్ రోజిస్తా పువ్వుల్
ఒప్పుకుంటే జిందగీ మొత్తం నీకు జిల్ జిల్
నిను పువ్వులోన పెట్టి చూసుకుంటా రావే ఇల్లా
నీ కోసం కడతా కత్తి లాంటి పాలరాతి ఖిల్లా
నువ్వు ఎట్టా ఉన్న ఏంచేస్తున్నా
పరవలేదే మళ్ళా
నువ్వు ఒప్పుకుంటే మోత మోగి పోతది
మొత్తం జిల్లా…. జిల్లా…

అమ్మాయి కనబడగానే సగం ప్రేమిస్తాడు
అమ్మాయి ఒప్పుకుంటే మన పాగళ్ సారూ
మొత్తం ప్రేమిస్తాడు
ప్రపంచం పెద్దది అంటాడు
ప్రయత్నం చేస్తూ ఉంటాడు
ఈ ఊళ్ళో వర్కౌట్ అవ్వకుంటే
పక్కూరికి పోతానంటాడు
టెలిస్కోపు కన్నులతోటి గాలిస్తుంటాడు
హారోస్కోపు కలవకపోయిన ఆరాధిస్తాడు
అమ్మయిలో అమ్మను చూస్తాడు
ఆ ప్రేమను అన్వేషిస్తాడు
తెగించి ముందుకు పోతాడు
ముగింపు ఈ కథకి ఏనాడూ





సరదాగా కాసేపైనా పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: కార్తీక్, పూర్ణిమ

ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావే
ఇవ్వాళా ఎవ్వరు పంపారే
ఇన్నేళ్ల చీకటి గుండెల్లో…
వర్ణాలా వెన్నెల నింపారే
దారిలో పువ్వులై వేచెనే ఆశలు
దండగా చేర్చెనే నేడు నీ చేతులు
గాలిలో దూదులై ఊగెనే ఊహలు
దిండుగా మార్చెనే ఈడనీ మాటలు
కొత్తగా కొత్తగా పుట్టిన ఇంకోలా
కాలమే అమ్మగా కన్నాదే నన్నిలా
సరదాగా కాసేపైనా సరిజోడై నీతో ఉన్న
సరిపోదా నాకీ జన్మకి
చిరునవ్వై ఓసారైనా చిగురించా లోకంలోనా
ఇది చాల్లే ఇప్పుడీ కొమ్మకి

చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదన
సంచిలో పోగు చేసి నీకియ్యనా
చిందులేసి సంబరాన్ని ఈ రోజునా
కొంచెము దాచుకోక పంచేయనా
కలలోనే సంతోషం కలిగించే ఊపిరి
ఉదయాన్నే నీకోసం ఉరికిందే ఈ పరి
తల నిమిరే వేళా కోసం వెర్రోడినై
వానలకై నేలలాగా వేచా మరి
వందేళ్ల జీవితానికి అందాల కానుక
అందించినావు హాయిగా వారాలలోనే
చుక్కానిలా నువీక్షణం ముందుండి లాగగా
సంద్రాన్ని దాటిననుగా తీరాలలోనే
చెంతనే చెంతనే నిన్నిలా చూస్తూనే
ఆకాసం అంచునే తాకనే నించునే

సరదాగా కాసేపైనా సరిజోడై నీతో ఉన్న
సరిపోదా నాకీ జన్మకి
చిరునవ్వై ఓసారైనా చిగురించా లోకంలోనా
ఇది చాల్లే ఇప్పుడీ కొమ్మకి
చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదన
సంచిలో పోగు చేసి నీకియ్యనా
చిందులేసి సంబరాన్ని ఈ రోజునా
కొంచెము దాచుకోక పంచేయనా



ఈ సింగల్ చిన్నోడే పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: బెన్నీ దయాళ్

ఈ సింగల్ చిన్నోడే
న్యూ లవ్ లో ఫ్రెష్ గా పడ్డాడే
సిగ్నల్ గ్రీనే చూసాడే
పరుగులు పెట్టాడే
అరెరే ఈ సింపుల్ చిన్నోడే
తన లవ్వులో డీపుగా మునిగాడే
ఎక్కడ ఉన్న చంటోడై చిందులు వేసాడే
బేబీ గర్ల్ బేబీ గర్ల్
నిద్దరంది లేదులే కంటికి రెప్పకి మధ్య నువ్వొచ్చి
ఆకలి దప్పిక అస్సలంటూ ఉండదే
పంపవే మత్తు చూపుల మందిచ్చి
హార్టులో మోగేలే నీదే రింగ్టోన్
ఒక కిస్ ఇచ్చి పోరాదే జాను
స్మైలూతో అవ్వదా లైఫ్ కామ్ డౌన్
పక్కనుంటూనే చూస్తావా నన్ను
చేరావ్ ఇలా నా గుండెకి ఇలా
నా ఫేటే ఇలా మారి తిరిగేనా
చూడే పిల్లా నా కల్లే ఇలా
పైపైన మబ్బులో ఎగిరిన

ఈ సింగల్ చిన్నోడే
న్యూ లవ్ లో ఫ్రెష్ గా పడ్డాడే
సిగ్నల్ గ్రీనే చూసాడే
పరుగులు పెట్టాడే
అరెరే ఎటిఎం అయ్యాడే
ఎయి లవ్వులో డీపుగా మునిగాడే
క్యాషు కార్డు నిల్ అయినా పడి పడి నవ్వాడే

కొండల్లా కష్టాలంటే నమ్మనే లేదు చెప్పాలంటే
ఓర్చుకో కాసింత వెయిటే నీ డ్రీములో హాఫె పట్టే బ్యూటే బేబీ
కన్నులు చాలని అలుగుతూ చూపెను కోపమే
గుడ్డిదేరో డౌట్ ఇక తీరేరో
ఈ కాదల్ నీ
క్యూట్ క్యూట్ చిన్నది ట్రై చేయమన్నది
స్పీడ్ ఒద్దు అన్నది ఏం పాపం
ఫాలో మీ అన్నది పోజ్ ఒద్దు అన్నది
స్పేస్ ఇవ్వమన్నది ఎం శాపం
నచ్చేసాడు ఓ స్కెచ్ ఎసాడు
నే వే లోకి బాగానే వచ్చేసాడు
నీ అందం తోనే ఫ్లాట్ అయిపోయాడు
నీ గుండెల్లో జండానే పాతేసాడు




ఆగవే నువ్వాగవే పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సిద్ శ్రీరాం, 

ఆగవే నువ్వాగవే




అమ్మ అమ్మా నీ వెన్నెల పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సిద్ శ్రీరాం, వేద వాగ్దేవి

కనుపాప నువ్వై వెలిగిస్తు
నా కలకు రంగుల మెరిపిస్తు
అడుగుడుగు నీడై నడిపిస్తు
ప్రతి మలుపులో నను గెలిపిస్తు
అండగా ఉండవే ఎప్పుడు నువ్విలా
పండుగై నిండవే లోపల వెలుపల
నువ్వు నాతోడై లేనిదే నేనిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా

అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
తలను మురిచె చెయ్యి చాలు
తనువంత హాయి స్వరాలు
లాలన సాకనా అన్నీ నీవే
ఆసరా పంచిన ఆనాటి నీ కొనవేలు
దీవనై నడపదా
నిండు నూరేళ్లు
నా మోదటి నేస్తమా
నీ తీపి గురుతులు వేలు
రేపనే రోజుకు దారి దీపాలు
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా

లోకాన అమ్మలంతా
అంధించు ప్రేమనంత
ఒక నువ్వే వరముగా పంచినావు
చిన్నదే ఆకాశం అనిపించు
మమతవు నీవు
నన్నిల పెంచగా ఎంచుకున్నావు
ఎన్ని మరు జన్మలు
నాకేదురు పడిన గాని
నీ ఓడి పాపగా నన్నుండనీ అమ్మ
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
ఆ… ఆ… అమ్మా…




ఎన్నో ఎన్నో విన్నాం గాని పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: అనంత్ శ్రీరాం 
గానం: అంటోని దాసం 

ఎన్నో ఎన్నో విన్నాం గాని 




యు ఆర్ మై లవ్ పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: సిమ్రాన్ 
గానం: రాహుల్ సిప్లిగంజ్

యు ఆర్ మై లవ్ 




కనపడవా కనపడవా పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం: ప్రసన్న కుమార్ బెజవాడ
గానం: ఆనంద్ అరవిందాక్షన్

వెళ్లిపోతోంది ప్రాణమే
కనబడుతొంది శూన్యమే
వదిలేలుతోంది గాయమే
కన్నీటి జ్ఞాపకమే
వెలివేసింది కాలమే
ఉరి తీసింది ప్రేమనే
ముసిరేసింది మౌనమే
ఒంటరినై మిగిలానే

కనపడవా కనపడవా
కన్నీరై మిగిలేలతావా
చిరునవ్వై ఎదురొచ్చి
చితిలోకే నెడతావా
కనపడవా కనపడవా
శిథిలం చేసి పోతావా
గుండెను కోసే కథ నువ్వై 
కడ దాకా వస్తావా




కనపడవా కనపడవా పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం: ప్రసన్న కుమార్ బెజవాడ
గానం: సమీరా భరద్వాజ్

Palli Balakrishna Tuesday, August 31, 2021

Most Recent

Default