Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: జైలర్ (2023)
సంగీతం: అనిరుద్ రవిచందర్ 
నటీనటులు: రజినీకాంత్, మోహన్ లాల్, మిర్నా మీనన్ , తమన్నా 
దర్శకత్వం: నెల్సన్
నిర్మాత: SUN Pictures
విడుదల తేది: 2023



Songs List:



# పాట సాహిత్యం

 
చిత్రం: జైలర్ (2023)
సంగీతం: అనిరుద్ రవిచందర్ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: దినకర్ కల్వల

కోరస్: హుకుమ్ టైగర్ కా హుకుమ్ (2)

ఉరుముకి మెరుపుకి పుట్టాడురా
పిడుగుని పిడికిట పట్టాడురా
అడుగడుగున గుడి కట్టాలిరా
తరతర తరముల సూపర్ స్టారురా

మనిషిని మనిషిగ చూస్తాడురా
మనసుకి మనసుని ఇస్తాడురా
గడబిడ జరిగితే లేస్తాడురా
మొరిగిన మెడలకి ఉరితాడురా

తలైవా నవ్వేస్తే… స్టైల్
తలైవా చిటికేస్తే… స్టైల్
తల ఎగరేస్తుంటే… స్టైల్
వయసుకి దొరకని ఇతనొక బాలుడు

తలైవా వాకింగే స్టైల్
తలైవా వార్నింగే స్టైల్
తలపడు డేరింగే స్టైల్
ఎముకలు విరవక ఎవడిని వదలడు

రేయ్ లేదు ఖాతరా
వేస్తాడు ఉప్పు పాతరా
రేయ్ పట్టుకోకురా
పేలే మందుపాతరా

హే, జైలే వీడికున్న ఇల్లే
అస్సలు నిదరపోవు కళ్ళే
నకరాల్ చెయ్యమాకు సాలే
కడతడు డొక్కచించి డోలే

కోరస్: హుకుమ్ టైగర్ కా హుకుమ్

ఉరుముకి మెరుపుకీ
పిడుగుని పిడికిటా, హహహ

నువు మంచిగుంటె మంచి, ఏయ్
నువు చెడ్డగుంటె చెడ్డ
నీకేది ఇష్టమైతే, ఏయ్
అది తేల్చుకోర బిడ్డా

మట్ట గిడసలా ఎగరకు కొడకా, ఏయ్
పొట్టు తీసి పులుసెడతా
కన్నుగప్పుతు పారిపోతే ఎలక, ఏయ్
తప్పదంటే కొండ తవ్వుతా

తలైవా అడుగుగేస్తే… స్టైల్
తలైవా విజిలేస్తే… స్టైల్
తల తల డ్రెస్సేస్తే… స్టైల్
అనిగిన ప్రజలకి దొరికిన దేవుడు

తలైవా డాన్సింగే… స్టైల్
తలైవా స్మోకింగే… స్టైల్
తల నెరిసిన గాని… స్టైల్
చెరగని చరితలో నిలిచిన ఒక్కడు

రేయ్ లేదు ఖాతరా
వేస్తాడు ఉప్పు పాతరా
రేయ్ పట్టుకోకురా
పేలే మందుపాతరా

హే, జైలే వీడికున్న ఇల్లే
అస్సలు నిదరపోవు కళ్ళే
నకరాల్ చెయ్యమాకు సాలే
కడతడు డొక్కచించి డోలే

ఉరుముకి మెరుపుకీ
పిడుగుని పిడికిటా
ఉరుముకి మెరుపుకీ
పిడుగుని పిడికిటా, - హుకుమ్
టైగర్ కా హుకుమ్
అర్థమైందా రాజ..!

No comments

Most Recent

Default