చిత్రం: Writer పద్మభూషణ్ (2023) సంగీతం: శేఖర్ చంద్ర నటీనటులు: సుహాస్, టీనా శిల్పరాజ్ దర్శకత్వం: షణ్ముఖ ప్రశాంత్ నిర్మాతలు: అనురాగ్ శరత్, చంద్రు మనోహరన్ విడుదల తేది: 03.02.2023
Songs List:
కన్నుల్లో నీ రూపమే పాట సాహిత్యం
చిత్రం: Writer పద్మభూషణ్ (2023)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: ధనుంజయ్ సేపాన
నువ్వూ నేనూ అంతే చాలు ఈ లోకంతో పని లేదు
నువ్వే నాతో ఉంటే చాలు ఏదేమైనా పర్లేదు
నిన్నే చూస్తే చాలూ పగలే వెన్నెలలు
రెక్కలు కట్టుకు వచ్చి వాలినవే
నువ్వే నవ్వితే చాలూ బోలెడు పండుగలూ
దారి దారంతా ఎదురోచ్చినవే
నా కన్నుల్లో నీ రూపమే చూడవే
నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే
నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే
నా ప్రేమంతా పరిచేసా నీ కోసమే
ఓ సారి ఐ యామ్ వెరీ సారీ
క్షమించరాదే నన్ను ఒక్క సారి
ఈ సారి కాదు మరోసారీ
శారిలో భలేగున్నావే ప్యారీ
కొత్త కొత్త ప్రేమలోని గమ్మత్తు గాలి తాకి
పిచ్చి ఆశ రేగుతోంది తుఫానులా
చెప్పుకున్న మాటలన్నీ ఓ సారి గుర్తుకొచ్చి
చిన్న నవ్వు విచ్చుకుంది గులభిలా
పాదం వస్తుందీ నీ వెనకాల
ఇన్నాళ్లూ లేధూ ఏంటివ్వాలా
రోజూ నీ చుట్టూ నే తిరిగేలా
ఎం కదో ఇదీ వయ్యారి బాల
నా కన్నుల్లో నీ రూపమే చూడవే
నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే
నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే
నా ప్రేమంతా పరిచేసా నీ కోసమే
పంచదార మాటలెన్నో పెదాల్లో దాచిపెట్టి
పంచిపెట్టడానికేంటి మొమాటమా
మంచివాడినేగా నేనూ ఓ చిన్న ముద్దుపెట్టి
మంచులగా కరిగిపోతే ప్రమాదమా
నన్నే ఏకంగా నీకొదిలేసా
నువ్వే నాకున్నా ఓ భరోసా
నీలో చేరింది నా ప్రతి శ్వాసా
ఏంటిదీ మరీ బలే తమాషా
నా కన్నుల్లో నీ రూపమే చూడవే
నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే
నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే
నా ప్రేమంతా పరిచేసాలే కోసమే
అయ్యబాబోయ్ గందర గోళం పాట సాహిత్యం
చిత్రం: Writer పద్మభూషణ్ (2023) సంగీతం: కళ్యాణ్ నాయక్ సాహిత్యం: కోటి మామిడాల గానం: లక్ష్మి మేఘన, కావ్య చందన, అపర్ణ, సాయిదేవ్ హర్ష , సాయి చరణ్, హర్ష చావలి అయ్యబాబోయ్ గందర గోళం
బెజవాడ సందుల్లో పాట సాహిత్యం
చిత్రం: Writer పద్మభూషణ్ (2023) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: భాస్కరభట్ల గానం: లోకేస్వర్ ఇదర బెజవాడ సందుల్లో
ఎన్నాళ్ళిలా పాట సాహిత్యం
చిత్రం: Writer పద్మభూషణ్ (2023) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: భాస్కరభట్ల గానం: అనురాగ్ కులకర్ణి ఎన్నాళ్ళిలా
మన్నించవా అమ్మా పాట సాహిత్యం
చిత్రం: Writer పద్మభూషణ్ (2023) సంగీతం: కళ్యాణ్ నాయక్ సాహిత్యం: కోటి మామిడాల గానం: కార్తీక్, కళ్యాణ్ నాయక్ మన్నించవా అమ్మా

No comments
Post a Comment