Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ee Abbai Chala Manchodu (2003)





చిత్రం: ఈ అబ్బాయి చాలా మంచోడు (2003)
సంగీతం: యం. యం.కీరవాణి
నటీనటులు: రవితేజా, సంగీత, వాణి (తొలి పరిచయం)
దర్శకత్వం: అగస్త్యన్
నిర్మాత: బి.వి.యస్.యన్.ప్రసాద్
విడుదల తేది: 14.01. 2003



Songs List:



ఓ సారి నీ చెయ్యే తాకి పాట సాహిత్యం

 
చిత్రం : ఈ అబ్బాయి చాలా మంచోడు (2003)
సంగీతం : యం. యం.కీరవాణి
సాహిత్యం : చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఓ సారి నీ చెయ్యే తాకి ఓ సారి నీ చెంపేనొక్కి
ఓ సారి ఇంకేదో చెయ్యాలా
ఓ సారి నీ కాలేతొక్కి ఓ సారి నీ ఒళ్ళే రక్కి
ఓ సారి ఏదేదో కావాలా
పొగరే... దిగనీ 
సొగసే... కందనీ
అనుభూతి మనదైన వేళ
ఏహే.. హేహే.. ఏహేహే.. ఏ హెహే

ఓ సారి నీ చెయ్యే తాకి ఓ సారి నీ చెంపేనొక్కి
ఓ సారి ఇంకేదో చెయ్యాల

ముద్దాడనా...
పెదవిని వలదని నడుమును ముద్దాడుకో
వాటేయ్యనా...
ఎదురుగ వలదని వెనకగ వాటేసుకో

చిన్నంగ నీ చెవిని స్పృశియించనా
నున్నంగా నీ వేళ్ళు నిమిరేయనా
ఆ పై లంఘించి విజృంభించి వివరించనా

నిదురా... వద్దులే 
బెదురు... లేదులే
చూడాలి శృంగార మేళా
 
ఓ సారి నీ చెయ్యే తాకి ఓ సారి నీ చెంపేనొక్కి
ఓ సారి ఇంకేదో - చెయ్యాల

వేధించనా...
సరసపు సగమున విడిపడి వేధించుకో
వడ్డించనా...
అడగని క్షణమున ఎగబడి వడ్డించుకో

నా పట్టు వస్త్రాలు వదిలెయ్యనా
నీ గట్టి ఒత్తిళ్ళు థరియించనా
అంతా అయిపోతే తెగ సిగ్గేసి తలవంచనా

ఏహే - లాలా
ఏహేహేహే - లాలలా

వ్రతమే... చెడనీ 
ఫలమే... అందనీ
చేరాలి స్వర్గాల మూల

ఓ సారి నీ చెయ్యే తాకి ఓ సారి నీ చెంపేనొక్కి
ఓ సారి ఇంకేదో చెయ్యాలా
ఓ సారి నీ కాలే తొక్కి ఓ సారి నీ ఒళ్ళే రక్కి
ఓ సారి ఏదేదో కావాలా




చందమామ కధలో చదివా పాట సాహిత్యం

 
చిత్రం: ఈ అబ్బాయి చాలా మంచోడు (2003)
సంగీతం: యం. యం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కళ్యాణి మాలిక్, సునీత

చందమామ కధలో చదివా రెక్కల గుర్రాలుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
బాలమిత్ర కధలో చదివా పగడపు దీవులు వుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో

నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని
పగడపు దీవికి నన్నే నీతో  తీసుకెల్తావని
ఇక ఏనాటికీ అక్కడే మనం వుంటామని
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో
నువ్వే నాకు ముద్దొస్తావని
నేనే నీకు ముద్దిస్తాననీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

వరహాల బాటలోనా ముత్యాల తోటలోన
వజ్రాల మేడలోన బంగరు గదిలోన
విరితేనెల్లో పాలల్లో తానాలాడేసి,
నెల వంకల్లో వెన్నెల్లే భోంచేసి
నలుదిక్కుల్లో చుక్కల్నే చిలకలు చుట్టేసి
చిలకే కొరికి దరికే జరిగి మురిపెం పెరిగి
మరి నువ్వే నాకు ముద్దిస్తావని
ముద్దుల్లోన ముద్దాడతావని
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

చందమామ కధలో చదివా రెక్కల గుర్రాలుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

ఎగిరేటి ఏనుగొచ్చి పలికేటి జింకలొచ్చి
నడిచేటి చేపలొచ్చి అడవికి రమ్మనగా
ఆ కోనల్లో కొమ్మల్లో ఉయ్యాలూగేసి
ఆ కొమ్మల్లో పళ్లన్నీ రుచిచూసి
ఆ పళ్లల్లో మైకంతో మోహం కమ్మేసి
చలిగా గిలిగా తొలిగా త్వరగా అటుగా యిటుగా
మరి నువ్వే నాకు ముద్దిస్తావని
తడి వేదాలు ముద్రిస్తావనీ
నమ్మడానికి ఎంత బాగుందో

నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని
పగడపు దీవికి నన్నే నీతో  తీసుకెల్తావని
ఇక ఏనాటికీ అక్కడే మనం వుంటామని
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో




ఒక మనసుతో పాట సాహిత్యం

 
చిత్రం: ఈ అబ్బాయి చాలా మంచోడు (2003)
సంగీతం: యం. యం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: గంగ , యం. యం.కీరవాణి

ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు
ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవు
ప్రేమా... ఆ...ఆ...ఆ...ఆ...ఆ

ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు
ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవు
ప్రేమా... ఆ...ఆ...ఆ...ఆ...ఆ

చరణం: 1
పసి పాపలో ముసినవ్వులా కపటాలు లేని ప్రేమా
మునిమాపులో మరుమల్లెలా మలినాలు లేని ప్రేమా
అరచేతిలో నెలవంకలా తెరచాటు లేని ప్రేమా
నది గొంతులో అల పాటలా తడబాటులేని ప్రేమా
మనసుల కలిమిడి ఫలితం ప్రేమ
తనువుల తాకిడి కాదు సుమా
అనంత జీవ యాత్రలోన తోడు ప్రేమా
ప్రేమా... ఆ...ఆ...ఆ...ఆ...ఆ

ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు
ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవు

చరణం: 2
అధరాలలో తడి మెరుపులా మెరిసేది కాదు ప్రేమా
హృదయాలలో ధృవతారలా అలరారుతుంది ప్రేమా
పరువాలతో కరచాలనం చేసేది కాదు ప్రేమా
ప్రాణాలలో స్థిరబంధనం నెలకొల్పుతుంది ప్రేమా
మమతల అమృత వర్షిణి ప్రేమ
కోర్కెల అలజడి కాదు సుమా
నిశీధిలోను వీడిపోని నీడ ప్రేమా
ప్రేమా... ఆ...ఆ...ఆ...ఆ...ఆ

ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు
ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవు
ప్రేమా... ఆ...ఆ...ఆ...ఆ...ఆ




నవమల్లికనేనై పూచానోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఈ అబ్బాయి చాలా మంచోడు (2003)
సంగీతం: యం. యం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: స్మిత

నవమల్లికనేనై పూచానోయ్
నా పరిమళమంతా దాచానోయ్
గ్రహించే గాలివి నువ్వై
స్పృశించే చినుకువి నువ్వై
ధరించే సిగవై చేరుకోరా సుందరా...

నువ్వే ముఖ చిత్రం అయ్యిన పుస్తకమై వున్నాను
ప్రతీ ఒక పేజీ వదలక చదువుకుపొమ్మన్నాను

నవమల్లికనేనై పూచానోయ్
నా పరిమళమంతా దాచానోయ్

శ్వాస పెరిగినదోయ్ ఆశ తరిమినదోయ్
ఘోష గుండెల చాటున పెరిగిందోయ్
పైట నిలబడదోయ్ మాట తడబడెనోయ్
పూట గడవని పరువం అలిగిందోయ్
రోజు నీపేరే రామనామంలా ఆలపించాను నమ్మరా
ఒక్క రోజైనా సీతలా నన్ను స్వీకరిస్తేనే చాలురా 

నువ్వే ముఖ చిత్రం అయ్యిన పుస్తకమై వున్నాను
ప్రతీ ఒక పేజీ వదలక చదువుకుపొమ్మన్నాను

నవమల్లికనేనై పూచానోయ్
నా పరిమళమంతా దాచానోయ్

పువ్వు పూజకని పండు విందుకని
నీకు తెలుసును కదరా సుందరుడా
నేను మగువనని నాది సొగసు అని 
అంత తెలిసిన మీదట ఎందుకిలా
పరులకో న్యాయం నాకు ఓ న్యాయం 
ప్రియతమా నీకు ఓ న్యాయమా
నేను మగ అయితే నువ్వు మగువైతే
తక్షణం నిన్నే ఏలనా...

నువ్వే ముఖ చిత్రం అయ్యిన పుస్తకమై వున్నాను
ప్రతీ ఒక పేజీ వదలక చదువుకుపొమ్మన్నాను

నవమల్లికనేనై పూచానోయ్
నా పరిమళమంతా దాచానోయ్





చదవడానికెందుకురా తొందరా పాట సాహిత్యం

 
చిత్రం: ఈ అబ్బాయి చాలా మంచోడు (2003)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి. బాలు

తలకు కొబ్బరి నూనెతో 
ఫుల్ హాండ్ షర్ట్ తో
చేతిలో విక్రమ్ గైడ్ తో 
జేబులో సిటీబస్సు పాసుతో
కదలి వస్తున్న ఓ తెలుగు విద్యార్థి

చదవడానికెందుకురా తొందరా
లవ్వు చేయడమే నేర్చుకోరా ముందరా

ఫస్ట్ పీరియడ్ లవ్ తెలుగు ఇందులో
అమ్మాయిని మాటలోకెట్టా దించాలో
అమ్మాయి అందాన్ని ఎట్టా పొగడాలో
ఎట్టా దించాలో ఎట్టా పొగడాలో
ఆ పిల్లకు ప్రేమలేఖ ఎట్టా రాయాలో
ఫస్ట్ పీరియడ్ లోన నువ్వు తెలుసుకో
ఫస్ట్ సైట్లోనే లవ్వు చేసుకో

సెకండ్ పీరియడ్ లవ్ మాథమాటిక్స్
అమ్మాయితో అనుబంధం కూడేదెట్టాడో
అమ్మాయిలో మొహమాటం తీసేదెట్టాగో
కూడేదెట్టాడో తీసేదెట్టాగో
ఆ పిల్ల ఫెండ్స్ ని భాగించేదెట్టాగో
సెకండ్ పీరియడ్ లోన నువ్వు తెలుసుకో
సెకండ్ థాటే లేక దూసుకెళ్లిపో

థర్డ్ పీరియడ్ లవ్ హిస్టరీ
అమ్మాయి నాన్నగారు ఏంచేస్తుంటాడో
అమ్మడికి ఆస్తిపాస్తులెంతెంతునాయో
ఏంచేస్తుంటాడో  ఎంతెంతున్నాయో
ఆ పిల్లకు పెళ్లికాని అక్కయ్యలు ఎందరో
థర్డ్ పీరియడ్ లోన నువ్వు తెలుసుకో
హార్డ్ వర్కే చేసి లవ్వు గెలుచుకో

బాబు చదవడానికెందుకురా తొందరా
లవ్వు చేయడమే నేర్చుకోరా ముందరా

ఫోర్త్ పీరియడ్ లవ్ ఫిజిక్స్
మాగ్నెట్ మనవైపు ఎట్టా లాగాలో
తనఒంట్లో కరెంటును ఎట్టా పెంచాలో
ఎట్టా లాగాలో ఎట్టా పెంచాలో
యాక్షనుకు రియాక్షను ఎట్టా యివ్వాలో
ఫోర్త్ పీరియడ్ లోన నువ్వు తెలుసుకో
గుర్తువుండేలాగా వర్క్ చూపుకో

ఫిఫ్ట్ పీరియడ్ లవ్ కెమిస్ట్రీ
విడిపోని లవ్ బాండ్ ఎట్టా వెయ్యాలో
ఒకటయ్యే ఈక్వేషన్ ఎప్పుడు రాయాలో
ఎట్టా వెయ్యాలో ఎప్పుడు రాయాలో
ఆపైన ప్రాక్టికల్స్ ఏమేం చెయ్యాలో
ఫిఫ్ట్ పీరియడ్ లోన నువ్వు తెలుసుకో
డెప్త్ పెంచేసుకో డేర్ చేసుకో

లాస్ట్ పీరియడ్ లవ్ స్పోర్ట్స్
అమ్మాయి యింటిగోడ ఎట్టా దూకాలో
ఎవడైనా అడ్డాస్తే ఎట్టా కొట్టాలో
ఎట్టా దూకాలో ఎట్టా కొట్టాలో
అమ్మాయిని తీసుకొని ఎట్టా వురకాలో
లాస్ట్ పీరియడ్ లోన నువ్వు తెలుసుకో
లాస్ట్ దాకా తనతో లైఫ్ పంచుకో

బాబు చదవడానికెందుకురా తొందరా
లవ్వు చేయడమే నేర్చుకోరా ముందరా

తలకు కొబ్బరి నూనెతో 
ఫుల్ హాండ్ షర్ట్ తో
చేతిలో విక్రమ్ గైడ్ తో 
జేబులో సిటీబస్సు పాసుతో
కదలి వస్తున్న ఓ తెలుగు విద్యార్థి

చదవడానికెందుకురా తొందరా
లవ్వు చెయ్యడమే నేర్చుకోరా ముందరా

చదువుకు వద్దురా తొందర
లవ్వు  నేర్చుకోరా ముందరా



కనిపించవమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: ఈ అబ్బాయి చాలా మంచోడు (2003)
సంగీతం: యం. యం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి బి. చరణ్

కనిపించవమ్మా ఓ పూల కొమ్మ
వస్తున్నా... నీకోసం
వినిపించుకోమ్మా... ఓ జాబిలమ్మ
యిస్తున్నా... సందేశం
చీకటే మూసిన ఆకసం నేనని
జరిగిన కథ ఈరోజు వివరించనీ

కనిపించవమ్మా ఓ పూల కొమ్మ
వస్తున్నా... నీకోసం

నాలో... లోలో...
నీమమతల నీగురుతుల 
దేవతకళ కొలువుందనీ

ఏన్నో... ఎన్నెన్నో...
విధిరాతలు చెడుచేతల 
విషజ్వాలలు రగిలాయనీ

నీ చూపు నిప్పుల్లో దూకేసిన
నా కంటి నీళ్లల్లో నేతేలనా
మదినే తెరచి ప్రమిదే చేసి 
మన వలపుల దీపాన్ని వెలిగించనా

కనిపించవమ్మా ఓ పూల కొమ్మ
వస్తున్నా... నీకోసం

నేనే... విన్నా...
అనురాగపు తెరచాటున 
అనుమానం వుంటుందనీ

నేడే... అంటున్నా... 
అనుమానపు తెర వీడగ 
అనుబంధం బిగిసేననీ

మేఘాన దాగున్న ముత్యానిగా
శిశిరాన దాగున్న చైత్రానిగా
ఎదుటే పడని మసకే విడని
నువ్వు నిలిచిన హృదయాన్ని చూపించనీ

కనిపించవమ్మా ఓ పూల కొమ్మ
వస్తున్నా... నీకోసం
వినిపించుకోమ్మా... ఓ జాబిలమ్మా
యిస్తున్నా... సందేశం
చీకటే మూసిన ఆకసం నేనని
జరిగిన కథ ఈరోజు వివరించనీ




థిల్లాన పాట సాహిత్యం

 
చిత్రం: ఈ అబ్బాయి చాలా మంచోడు (2003)
సంగీతం: యం. యం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కల్పన

థిల్లాన





విడ్డూరం...! పాట సాహిత్యం

 
చిత్రం: ఈ అబ్బాయి చాలా మంచోడు (2003)
సంగీతం: యం. యం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యం. యం.కీరవాణి

ఒలంపిక్ క్రీడల్లో పేకాటకే పెద్ద పీట వేస్తే
ఒసామా బిన్ లాడెన్ అన్నమయ్య వి.సి.డి. చూస్తుంటే
మడోన్న మావుళ్ళమ్మ జాతరకొచ్చి ఫోక్ సాంగ్ కొడితే
సహారా ఎయిర్‌లైన్సేకే సత్తెనపల్లి సంతలోన ఆఫీసే తెరిచేస్తే

విడ్డూరం...! విడ్డూరం...! విడ్డూరం...!


గులాబి రేకులతో గుండె జబ్బుకే మందే కనిపెడితే
జిలేబి పానకంతో నడిచే కార్లు ఇండియాకు వస్తే
మసాలా దోసెల మీద పచ్చడి మీద
పి.హెచ్.డి. చేస్తే
పొలంలో దుక్కిని దున్నే రైతుకి సైతం 
లక్షల్లోనే సెల్లు బిల్లు వస్తే

విడ్డూరం...! విడ్డూరం...! విడ్డూరం...!

సినీ తారలు వాన పాటలో నాభి చూపకుంటే బొడ్డూరం
సిటీ రోడ్లపై యమా స్పీడులో పడవలు వెళుతుంటే తెడ్డూరం
బందరు లోని మిటాయి కొట్లో స్వీటే లేకుంటే . లడ్డూరం
బాడీలోని రక్తం రంగు బ్లాకే అయిపోతే
రెడ్డూరం
తెలుగు ఫిల్మ్ లో తెలుగు పాటలు 
తెలుగు తెలిసిన తెలుగు వాళ్లతో
ఈ రోజుల్లో పాడించారంటే

విడ్డూరం...! విడ్డూరం...! విడ్డూరం...!

కరెంటు బల్బులపై మిణుగురు పురుగులు యుద్ధం ప్రకటిస్తే
సిమెంటు రేకులతోటి కాకులు చిలకలు గూళ్లు కట్టుకుంటే
కొమ్మపై కోకిల గోంతుకు జలుబే చేసి విక్స్ వాడుతుంటే
నాన్‌వెజ్ తినడం నేను మానేసానని పులి కుందేలుకి ఫోన్ చేసి చెబితే

విడ్డూరం...! విడ్డూరం...! విడ్డూరం...!

పుంజు పెట్ట సరసమాడగా ఆమ్లెట్ పుడుతుంటే గుడ్డూరం
తెలుగు భాషలో అక్షరాలుగా ఎక్స్ వైలే వుంటే జెడ్డూరం
ఉగాది పచ్చడి చిల్లి చికెన్ కలిపే వడ్డిస్తే
ఫుడ్డూరం
డన్లప్ కంపెనీ తాటాకులతో చాపలు చేస్తుంటే బెడ్డూరం
సోమవారము మొదలు పెట్టిన చిత్రహింసల టీ.వీ. సీరియల్
మంగళవారమే ముగింపుకొచ్చేస్తే

విడ్డూరం...! విడ్డూరం...! విడ్డూరం...!

Most Recent

Default