Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Dubai Seenu (2007)
చిత్రం: దుబాయ్ శీను (2007)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: రవితేజ, నయనతార, జె.డి.చక్రవర్తి
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాత: డి.వి.వి దానయ్య
విడుదల తేది: 08.06.2007Songs List:Once Upon a time పాట సాహిత్యం

 
చిత్రం: దుబాయ్ శీను (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తిక్ , రీటా

Once Upon a timeలో ఆ లైలా మజ్ఞూ రా
మళ్ళీ అంతటి రేంజ్‌లో లవ్ స్టోరి మనదేరా
ఏ... అనగనగా ఓ రోజు అబుదాబి వెళుతున్నా
నా ఎ సి కార్లోనేను ఏదో పన్లో ఉన్నా
బ్రేకేసిన సౌండయ్యిందిరా ఏమైందని చూసారా
ఓ లేడి రౌడి అప్సర You Hands Up అన్నదిరా
నను కిడ్నాప్ చేస్తందేమో అనుకున్నా ఆ జిగిరి
మైండ్ బ్లాంకైపొయేలాగా I Love You అంది మరి...
బాబోయ్... దు దుబాయ్ శీను
వామ్మో... దు దు దుబాయ్ శీను
డ్రీంబాయ్... దు దు దు దుబాయ్ శీను

చరణం: 1
నా స్టైలుకి పడిపోయిందిరా నేనంటే పడిఛస్తోందిరా
పోగడద్దన్నా వినుకోదుగా ఓ...
నా మాచో బాడి ముందర... మైక్ టైసన్ ఆఫ్ట్రాల్ చిల్లర
అంటుంటే సిగ్గేస్తోందిరా ఓ...
బిన్‌లాడెన్ మా బాబాయిరా మా డాడిగారో దుబాయ్ డానురా
నే కో అన్నానో కొంటెగా కొన్ని వందల షేకులు క్యూలు కట్టరా
అయినా మరి సుందరి నన్నే వలచిందిర హాపిగా
మైకంలో ముంచి నన్నే నలిపిందిర నాజూగ్గా
బాబోయ్... దు దుబాయ్ శీను
వామ్మో... దు దు దుబాయ్ శీను
డ్రీంబాయ్... దు దు దు దుబాయ్ శీను

చరణం: 2
ఏ ట్విస్టు లేనిదే ఎప్పుడు లవ్‌స్టోరి హిస్టరి కాదుగా
మా లవ్వు మెలికలు తిరిగెరా ఓ...
మా ఇద్దరి గుండెల చప్పుడు వాళ్ళయ్యకు బి పి పెంచెరా
మరి విలనంటే అంతే కదా ఓ...
మా పెట్రోల్ బావుల ఫాదరు నా శీను ప్రేమపై నిందలేసెరా
ఎస్కేపై ఈ వైపుగా ఇండియా వచ్చాడని కథలు చెప్పెరా
అది నమ్మిన బంగరు చిలక నను వెతుకుతు వచ్చెరా
నా జంటను వెతికే పనిగా నేనిక్కడ తేలారా
బాబోయ్... దు దుబాయ్ శీను
వామ్మో... దు దు దుబాయ్ శీను
డ్రీంబాయ్... దు దు దు దుబాయ్ శీను
దివాళి హొలీ పాట సాహిత్యం

 
చిత్రం: దుబాయ్ శీను (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: టిప్పు , కారుణ్య , కౌశల్య

దివాళి హొలీ కలిసిమెరిసే ఖుషీ మాది ఓ
పువ్వుల దారి రమ్మని పిలిచే తొలి ఉగాది
ఏదో వైపుగా సాగే జీవితం మళ్ళీఇ హాయిగా నవ్విందీ క్షణం
దూరం కాని ఆనాటి స్నేహం కదా
చేయందించి మాతోడు నడిచిందిలా
గుండెలలో ఈ సరదా పండుగలా ఉంది కదా

తియ్యని కలత్తె నాచిరుచేదు తియ్యని స్వరమైన దీనాడు
వేసవి వడగాలి దరిరాదు వెన్నెల కలిసింది మాతోడు
ఇప్పుడు మొదలైన సంతోషాలు ఇకపైన ఉంటేచాలు
నిన్నలు కలగన్న ఆనందాలు రేపటిలో మానేస్తాలు

ఎందరువున్న ఎవరు లేని ఒంటరి తనమింక కనరాని
కోరిన తీరం ఎదురు పడని అడుగు తడబాటు ఇకలేదు
కొమ్మకు చిగురైన కొత్త ఉగాది సందడిగా రాబోతుంటే
రెప్పలు బరువైన నిమిషాలన్ని వేడుకగ మారాలంతే
కోల్ కోల్ కోట పాట సాహిత్యం

 
చిత్రం: దుబాయ్ శీను (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రంజిత్ , సైంధవి

కోల్ కోల్ కోట దాటుకుని కోకచాటు పేత చేరుకుని
కోలా సరసం ఆడుకోన చిలకా
డోలు డోలు మేళ మెట్టుకుని ఉంగరాలు వేలు పెట్టుకుని
కలగా పులగం చేసుకోర పిల్లగ
సకల కల్ల మహరాణి అమిత సాగ సాంబ్రణి
పురుష మెళి పడనీ చూపుల్లో
కొస వరకు ఉసిపోని రసికరత రుచులన్నీ
కసిగ తలబడనీ కౌగిల్లో

సుందరి సైరంధరీ ముద్దిచుకోవె ఓసారి
నడవదిక సోసారి విడువు నన్ను ఈసారి
ఓపరి నీలాహిరి నాలైఫ్ చాలే వయ్యారి
ముడిపడక బ్రహ్మచారి వద్దంట ఈనారీ
ఓ చిమ చిమ వయసుల కిలికిరి చిరుసెగలెగిసెనె మరిమరి
నిలువు నతడపవే సొగసరి నీలుకురుల జల్లుల్లో
గడసరి పిడుగుల మగసిరి ఎగబడు చొరవల తెగువరి
తెరలిక తెరవని తొలకరి సిరులు దాచకు వెళ్ళయ్యో

పిల్లడ ఇంతల్లుడా ఇల్లందు వేసెర చెలికాడ
ఎదురగానె నిను చూడ నిలువదిక నానీడ
పోరడ ఎడాపెడా లాగేయ మాకు వాలుజడ
కులికిపో తొడివాడ సలపని రగడ
ఓ మదనుడి వరసకు మనవడ మరువపు దవనపు తలగడ
మణిగిన అడుగులు జతపడ మావ కొడుకువి నా ఒళ్ళో
పెదవికి అదిఒక అలజడ నడమది నిగనిగ చలివిడ
అదిమితె నిను ఇటు సరిపడ అత్తకొడుకుని పొత్తిల్లో

శీను గాడేన సినిమా పాట సాహిత్యం

 
చిత్రం: దుబాయ్ శీను (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: నవీన్

శీను గాడేన సినిమా హీరోన వాడె వీడేమో ఏమొ ఏమొ ఏమొ ఏ
రోజులా లేడే తేడాగున్నాడే చాలా మారాడే
బాబోయ్ బాబోయ్ బాబోయ్ రే
శీను శీను శీను మన కందుంత శీను లవ్‌లీగ లవ్‌లో పడిపోతున్నావే
పోను పోను పోను నీ లయనే క్లియరై పోను
అరె లక్కీబేబికి ఫ్రెండ్ పోయవే
నిన్న మొన్న నువ్విట్టా వున్నావ ఉస్సూరంటూ తిరిగావే
ఇవ్వాలేమొ బ్రేకుల్లేని బండిలాగ మబ్బుల్లొంచి దిగిరానంటావే
కాలం చేసే జాదు మనకేవ్వరి కర్ధం కాదు ఏడేయైన ప్లేటే మారిందే
అదృష్టం సరిహద్దు ఇంకెంతో దూరంలేదు
ఓ జానెడు దూరం జరిగావొ నీదే

లవ్వుతొ ఇదేగ పరిచయం నవ్వుతూ
ఖుషీగ హల్లో అంటూ ద్రిల్లెపొయావా
అందుకో వరాల స్వాగతం అందమే
స్వయాన రమ్మంటున్న నువ్వే రాలేవా
ఎంత మాత్రము నీమీద ఎలాంటి ముచ్చట లేకుండా
ఆ బంగారు జింక సిగ్గనుకొక చెంగున దూకిందా
నట్టి రాకరు నీ మీద కాదంటు చెప్పడం తప్పేగ
తను కోరిన సాయం అంతో చేసెయ్యాలి కదా

ఊరికే ఎలార ఉండటం కోరికే
ఇదంటు చెప్పేసై టైం ఎప్పుడు వస్తుందో
ఆపినా ఆగేన కలవరం అందుకే
ఇవాలే చెప్పాలంటూ తొందర పెడుతుందొ
కోటిమందిలో నువ్వున్న తన కంటిపాప ఏంచూసిందో
నువ్వడిగే ముందే అందే పదమై సరసన చేరింది
ముందు ముందుగ రాసుంది తెలిసేందుకే ఇలా జరిగింది
ఈ మలుపులు చూసి మనసే మాత్రం ఆగను అంటోంది
కన్యా రాశి కలువా పాట సాహిత్యం

 
చిత్రం: దుబాయ్ శీను (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: విజయ్ యేసుదాసు, చుచిత్ర

కన్యా రాశి కలువా వయ్యారాలు బరువా
సాయంగా రమ్మంటావా...
అంతే లేని గొడవా  హద్దే లేని చొరవా
అడగందే తొడై రావా...
ఏమో ఏమంటాయో నీ అందాలు నేనేం చేసినా
అమ్మో అనుకుంటాలె ఆనందంగా నువ్వేం దోచినా
కాదంటానా... రానంటానా
వూరిస్తున్నా... ఊ కొడుతున్నా
లాలిస్తున్నా... దారిస్తున్నా

చరణం: 1
ఆగే వీలుందా అవకాశం కుదిరాక
ఇంకో దారుందా ఇందాకా వచ్చాక
అంతే నిజమంతే అనుకోనా
నా చెంతే నువ్వుంటే చలిమంటే నా లోలోన
ఇంతై కోరికింతై నిను కవ్వించేసెయ్ నా

చరణం: 2
నీరే నిప్పవదా నీచెయ్ తగిలాక
నువ్ కోరే ఉప్పెనగా కౌగిలికే వస్తాగ
కంచే తొలిగించే చొరవుంది నీలో
ముంచే శృతిమించే మెరుపుంది నీ సైగలో
అనుకో అవుననుకో సుఖపడిపో నా రెక్కల రెపరెపలో
చుప్పనాతి పాట సాహిత్యం

 
చిత్రం: దుబాయ్ శీను (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మానిక్క వినయగం, అనురాధ శ్రీరామ్

కజకిస్థాన్ కాలేష బాబాక ఇనాం కాసర్లపూడి పైడితల్లి
పెద్దమ్మపుణ్యం ఇష్టపడ్డ పిట్టను బుట్టలో పెట్టుకున్నావ బాయా
అట్టాకాదని ఏడబ్బగా డెదిరొచ్చినఆ డబ్బగాడొచ్చిన
నీ దెబ్బకు అప్పుడమప్పడమై పోతారు
చుప్పనాతి బుల్లిరొ సూది గుచ్చుతొందిరో సుర్రుమంది వేడి
కత్తిలాంటి పిల్లరో కాకరే పుతోందిరో కోరుకుంది దాడి
పేకనాది కోకనీది కూతనాది కోతనీది ఏకమైతే తప్పేముంది
లయోలయో లజ్జనక లగ్గాలె పెట్టాలె
వెయ్యాలయ్యొ ముద్దల ముళ్ళే
లబొ దిబొ బాచీకి పప్పన్నం పెట్టాలె మళ్ళి మళ్ళి పుల్లంటే
చిప్పన్నం పెట్టాలె ఎడా పెడా అప్పడ మేలే

అ ఆ లో అందాలు ఇ ఈ లొ ఇల్లరికాలు ఇస్తా ఇందా
ఆహా ఓహో మత్తే చల్లాలే ఆడో ఈడో నన్నే గిచ్చావే
ఇదిగొ ఇవ్వాలె విధిగా నవ్వాలే అది కూడా నీవల్లే
చెరుకే పిండాలే, సరుకే దించాలే సరిగా తేల్చలగాలే

ఆ చంప ఈ చంప ఆరా రా గిల్లుకుపొన కూన జాన
లేలొ లేలొ లేలొ ఏమైన అన్నీ నీకై దాచానంటున్న
చొరవ చూశాలే బరిలో దూకానె ఎరనం దూనలగాలే
గడియే తీశాతే తలుపే మూసాలే గడియైన ఆగనులే


Most Recent

Default