చిత్రం: Baby (2023) సంగీతం: విజయ్ బుల్గానిన్ నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి దర్శకత్వం: సాయి రాజేష్ నిర్మాత: SKN విడుదల తేది: 2023
Songs List:
ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాట సాహిత్యం
చిత్రం: ఓ రెండు ప్రేమ మేఘాలిలా (2023) సంగీతం: విజయ్ బుల్గానిన్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: శ్రీరామ్ చంద్ర ఏం మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మయమా వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే తుళ్ళే ఆశల్లో ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది మెల్లగా మెల్లగా ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా తోచిందే ఈ జంట కలలకే ఏ ఏ ఏఏ నిజముగా ఆ ఆ సాగిందే దారంతా చెలిమికే ఏ ఏ ఏ రుజువులా ఆ ఆ కంటీ రెప్ప కనుపాపలాగ ఉంటారేమో కడదాక సందామామ సిరివెన్నెల లాగ వందేళ్ళయినా విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా ఏం మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మయమా వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే తుళ్ళే ఆశల్లో ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది మెల్లగా మెల్లగా
దేవరాజ పాట సాహిత్యం
చిత్రం: ఓ రెండు ప్రేమ మేఘాలిలా (2023) సంగీతం: విజయ్ బుల్గానిన్ సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: ఆర్య దయాల్ తదుమ్ తనిక తకుమ్ తనీయ తకదును తదుమ్ తనిక తదుమ్ తనిక తా తదుమ్ తనక తధిమ్ తనక తకధిను తదుమ్ తనిక తదుమ్ తనక తా దేవ రాజ సేవ్య మూర్ధనే కీర్ణలోచనే, ఆ ఆ భావ బీజ గణ్య వాహిని నిత్య నూతనే, ఆ ఆ మలయజ హాస హాస్య వినిమయముగ లలిత సాధ్వితే సరసిజ వీక్ష నాక్ష విభజిత కావ్య కధన నాయికే ప్రభవ ప్రభకలిత విభవ శుభ జలిత విభుధ సంస్తుత్య భూమికా మలుపు కనపడని మునుపు ఎదురవని జగతి చేరింది తెలియక ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ నిజమనుకోనే క్రీనీడలే అడుగడుగున ఉంటాయని తెలుపదు కదా ఓ పాఠమై, చదువే నిలకడ అనే ఆ మాటకే నిలబడమనే అర్ధం అని అతి సులువుగ అనిపించదే బ్రతుకే భ్రమలమై కాన భ్రమణమే చేసి భ్రమరమౌతుంది కాలమే అడుగు తడబడగా నేర్చుకొను నడక దాటుకొస్తుంది కాలమే వెలుగు చినుకుల్లో వెలిగి పోలేక వెలిగి వస్తుంది చీకటే కలుసుకున్నంత కలిసిపోకంటూ మనకు చూపేను బాసటే జారే జారే నెర్రలపై ప్రయాణమే ఈ జీవితం పరాకనే తెర దాటితే జయం సదా (సదా) ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆఆ దేవ రాజ సెవ్య మూర్ధనే కీర్ణలోచనే ఏ ఏ ఏ ఏ
ప్రేమిస్తున్నా పాట సాహిత్యం
చిత్రం: Baby (2023) సంగీతం: విజయ్ బుల్గానిన్ సాహిత్యం: సురేష్ బనిశెట్టి గానం: PVNS రోహిత్ ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా మనసున దాచుకుంటనే మన కథలాంటి మరో కథా చరితలో ఉండదంటనే ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ నువ్వు ఎదురే నిలబడితే వెలిగెనులే నా కంటి పాపలు ఒక నిమిషం వదిలెలితే కురిసేనులే కన్నీటి ధారలు అపుడెపుడో అల్లుకున్న బంధమిది చెదరదుగా చెరగదుగా మురిపెముగా పెంచుకున్న ప్రేమ నీది కరగదుగా తరగదుగా మరణము లేనిదొక్కటే అది మన ప్రేమ పుట్టుకే ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ నను ఎపుడూ మరువనని పరిచావులే చేతుల్లో చేతిని నను వదిలి బ్రతకవనీ తెలిసిందిలే నీ శ్వాస నేనని నువ్వు తరచూ నా ఊహల్లో ఉండిపోడం మనసుకదే వరము కదా అణువణువు నీలో నన్నే నింపుకోడం పగటికలే అనవు కదా మలినము లేని ప్రేమకి నువ్వు ఒక సాక్ష్యమౌ చెలి ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా మనసున దాచుకుంటనే మన కథలాంటి మరో కథా చరితలో ఉండదంటనే ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ
No comments
Post a Comment