చిత్రం: వెంకీ మామ (2019)
సంగీతం: ఎస్. తమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: పృద్వి చంద్ర, ఎస్. తమన్
నటీనటులు: వెంకటేష్, నాగ చైతన్య, రాశిఖన్న, పాయల్ రాజ్పుత్
దర్శకత్వం: కె. ఎస్. రవీంద్ర
నిర్మాతలు: డి. సురేష్ బాబు, టీ. జి. విశ్వప్రసాద్
విడుదల తేది: 13.12.2019
ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో
ఒంటికాయ సొంటికొమ్ము సెంటు కొట్టెరో
ఏ ఊహలు లేని గుండెలో
కొత్త కలల విత్తనాలు మొలకలేసెరో
ఎడారిలో గోదారిలా
కుడికాలు పెట్టి, అలలు జల్లుతోందిరో
ఏదారికో ఏతీరుకో
ఈ కొంటె అల్లరెళ్ళి ఆగుతుందిరో
ఈఎంకి మామ గుండె
పెంకులెగరగొట్టె టీచరమ్మా
ఈ పెంకి మామ మంకు పట్టు
సంగతేంటో చూడవమ్మా
హే ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో
ఒంటికాయ సొంటికొమ్ము సెంటు కొట్టెరో
ఏ ఊహలు లేని గుండెలో
కొత్త కలల విత్తనాలు మొలకలేసెరో
హియర్ వి గో
హీ ఈజ్ ద బ్రాండ్ న్యూవెంకి మామ
వాటె చేంజ్ మామ
హే భామా మామ భామ మామ
హే మీసకట్టు చూడు చీరకట్టు తోటి
సిగ్గే పడుతూ స్నేహమేదొ చేసే
పైరగట్టు చూడు పిల్లగాలి తోటీ
ఉల్లాసంగా కబురులాడెనే
వానజల్లు వేళ గొడుగు కిందచోటు కూడా
ఒక్కో అడుగూ తగ్గిపోతు ఉంటే
మండు వేస వేళ వెన్నెలంటి ఊసు వింటు
ఉల్లాసాలే పెరిగిపోయెనే
హే ఎడారిలో గోదారిలా
కుడికాలు పెట్టి అలలు జల్లుతోందిరో
హే ఏదారికో ఏతీరుకో
ఈ కొంటె అల్లరెళ్ళి ఆగుతుందిరో
ఈఎంకి మామ గుండె
పెంకులెగరగొట్టె టీచరమ్మా
ఈ పెంకి మామ మంకు పట్టు
సంగతేంటో చూడవమ్మా
హే ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో
ఒంటికాయ సొంటికొమ్ము సెంటు కొట్టెరో
ఏ ఊహలు లేని గుండెలో
కొత్త కలల విత్తనాలు మొలకలేసెరో...
మొలకలేసెరో...
No comments
Post a Comment