Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Rangoon Rowdy (1979)

చిత్రం: రంగూన్ రౌడీ (1979)
సంగీతం: జె. వి. రాఘవులు
నటీనటులు: కృష్ణం రాజు, సావిత్రి, జయప్రద, మోహన్ బాబు, దీప
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: వడ్డే శోభనాద్రి
విడుదల తేది: 1979


(కృష్ణంరాజు 100 వ సినిమా అలాగే బర్మాలో షూటింగ్ జరుపుకున్న మొదటి ఇండియన్ సినిమా)

Songs List:ఓ జాబిలీ వెన్నెలా పాట సాహిత్యం

 
చిత్రం: రంగూన్ రౌడీ (1979)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: పి.సుశీల

ఓ జాబిలీ వెన్నెలా ఆకాశం వున్నదే నీ కోసం
ఎదురు చూసింది నిదుర కాచింది కలువ నీ కోసమే
వెలుగులై  రావోయి వెలుతురే తేవోయి
ఓ జాబిలీ వెన్నెలా ఆకాశం వున్నదే నీ కోసం

ఝుం ఝుం ఝుం ఝం
ఝుం ఝుం ఝుం ఝుం

నువ్వులేక నవ్వలేక  ఎందరున్నా ఎవరూ లేక
జంటగా నీ తోడు లేక ఒంటిగా నేనుండలేను
స్నేహదీపాలూ స్నేహదీపాల
స్నేహదీపాలు వెలగనీ చాలుచీక బే లేదోయీ
వెలుగులై రావోయి వెలుతురే తేవోయీ
ఝుం ఝుం ఝుం ఝం

ఝుం ఝుం ఝుం ఝం
గువ్వలాగ నువ్వురాగ గూడునవ్వే గుండెన వ్వే
వేకువల్లే-వీ పురాగా చీకటంతా చెదిరిపోయి తుడిచి కన్నీళ్ళు
తుడిచి కన్నీళ్ళు కలిసి నూరేళ్ళు జతగా వుందామోయి

వెలుగులే నీవోయీ వెలుతురే కావోయీ
ఓ జాబిలీ వెన్నెలా ఆకాశం వున్నది నీ కోసం

జుం జుం జుం జుం
జాం జుం జుం జుంపుట్టినఊరు పాట సాహిత్యం

 
చిత్రం: రంగూన్ రౌడీ (1979)
సంగీతం: జె. వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి సుందరరామమూరి
గానం: జయప్రద

పుట్టినఊరు చిట్టిగాంగు పెట్టిన పేరు పింగు పాంగ్
ఓడలో వున్నది నన్నాడ మన్నది రంగూన్ రౌడీ గాంగ్
సిగ్గుల్లో సింగారం బుగ్గల్లో మందారం నీచేరే రేపు సింగపూర్
వయసంతా వయ్యారం మనసంతా బంగారం
నాదారే వేరు నేను వేరు 
నా పైట చెంగు-చెంగు చెంగు

మీ పడుచుగుండె డిరగుడింగ్-తగిలింది నా కొంగు అదిరింది హాంకాంగ్
కంగుతిన్నాడు కింగ్ కాంగ్
బర్మాలో బడికెళ్ళా చైనాలో గుడికెళ్ళా
లండన్ లో లవ్ చేసా.
ఇంగ్లీషులో మాటిచ్చా, రష్యన్ లో రాసిచ్చా గుండెల్లోనే ఇల్లేసా
నామాట పాట తేట తెలుగు అది కంటే వింటే తేనెలొలుకు,
నాదారి పూదారి, రాగాల రాదారి ఎన్నెట్లో కన్నెగోదారికాయ్ రాజా కాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: రంగూన్ రౌడీ (1979)
సంగీతం: జె. వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి సుందరరామమూరి
గానం: పి. సుశీల

కాయ్ కాయ్ కాయ్ కాయ్ కాసేయ్-
కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్
ఎరుపో, నలుపో, తెలుపో, పసుపో ఏదో ఒకటి కాయ్ 
కాసిన కొద్దీ కాపుంది పందెం కొద్దీ ఫలముంది
కావాలంటే కాయ్ కాయ్ కాశావంటే హోయి హోయి

పందాలు కాసెయి-పరదాలు తీసెయి
అందాలు చూసెయి సరదాలు చూసెయి
నాకాడవయసుంది పేకా డేమనసుంది
నీకాడ పరుసుంది ఆ పైన కరుసుంది
చల్లారిపోయావంటే తెల్లారిపోతాది
అందకుండ సందమావ అటకెక్కి కూకుంటది 

వెయి  వెయి వెయి  వెయి వేసెయి

గురిచూసి కొట్టెయి సిరిచూసి పట్టేయి
బులుపుంటే వచ్చేయి గెలు పేదో తేల్చేయి
నీ కాడ సొమ్ముంటే నా కాడ సోకుంది
వేటాడే దమ్ముంటే వెంటాడే వయసుంది
అయ్యారే వయ్యారం ఉయ్యాలూగింది
మత్తెక్కి చూశావంటే నెత్తెక్కి కూకుంటాది

వెయి వెయి వెయి వెయి వేసెయిఓ జాబిలీ పాట సాహిత్యం

 
చిత్రం: రంగూన్ రౌడీ (1979)
సంగీతం: జె. వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి సుందరరామమూరి
గానం: పి. సుశీల, ఎస్. పి. బాలు

ఓ జాబిలీ  వెన్నెలా ఆకాశం వున్నదే నీ కోసం
ఎదురు చూసింది నిదురకాచింది కలువ నీ కోసమే
వెలుగువై రావోయి వెలుతురే తేవోయి 

||ఓ జాబిలీ||


నిదురబోయే కాలమంతా నిన్ను నన్ను నిలిచి చూసే
కలలు కన్న కౌగిలంత వలపు తీసి వలలు వేసె
భ్రమరనాదాలూ-భ్రమర నాదాలూ ప్రేమ గీతాలై
పరిమళించేనోయీ పున్న మై రావోయి-నా
పున్నమే నీ వోయి

||ఓ జాబిలీ॥

నవ్వులన్నీ పువ్వులైన నా వసంతం వీకు సొంతం

పెదవిదాటి ఎదిమీటె పేమబంధం నాకు సొంతం
అన్నీ రాగాలూ ఇన్ని రాగాలూ నీకు అందించే
రాగమే నేనోయి అనురాగమే నేనోయి
అదరహో పాట సాహిత్యం

 
చిత్రం: రంగూన్ రౌడీ (1979)
సంగీతం: జె. వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి సుందరరామమూరి
గానం: పి. సుశీల, ఎస్. పి. బాలు

అదరహో అదరహో-నీ అందం చూస్తే అదరహో
నామురిపెంచూస్తే ముదరహా నావయసు, నీ సొగసు కలుసుకుంటే

యమహా, యమహా, యమహా, యమహా

అదరహో అదరహో నీ వాటం చూస్తే అదరహో
నా వైనం చూస్తే ముదరహ నామనసు నీవయసు కలుసుకుంటే
యమహా, యమహా, యమహా, యమహా

అదరహో!

నీకు తక్కువేమున్నది బక్క నడుము ఒక్కటి మినహా
ఆ నడుము లేని నడకలు చూస్తే పడుచువాడి మనసు తహతహ
నీ వయ్యారం దిద్దుకుంది శృంగారపు ఓనమః
గుట్టురట్టు చేయమాకు..గురూ నీకు నమోనమః

పిల్లగాలి పిల్లగాడి  పిచ్చి ముదహ
పిచ్చకాస్త ముదిరిందంటే పిల్లతో పెళ్లి కుదరహ
కోరుకున్న కోడెగాడు కోహినూరు వరహా
ఒకే జంటగా బతకాలని సందమావ సలహా 

అదరహో!
వానొచ్చే వరదొచ్చే పాట సాహిత్యం

 
చిత్రం: రంగూన్ రౌడీ (1979)
సంగీతం: జె. వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి సుందరరామమూరి
గానం: పి. సుశీల, ఎస్. పి. బాలు

వానొచ్చే వరదొచ్చే వురక లేక సావొచ్చే
మెరక లెక్క సాలొచ్చే సరుకుతోట సాచొచ్చె
అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి
వయసు తడిసి మోపెడాయినే ఓలమ్మమ్మో
వణుకుపుట్టి వాటెడాయనే

||వానొచ్చే||

చినుకుమీద చినుకు పడ్డదీ చిన్నదాని
సొగసుమీద మనసు పడ్డది
వణుకుతున్న వయసు చెడ్డదీ చిన్న వాడి
వలపు నన్ను కలుపుకున్న ది
ఈ పులకరింత చూడబోతే చిటికంత
ఆ జలదరింత చూడబోతే జన్మంత
నాకు నువ్వెంతో నీకు నేనంత
నీకు వయసెంతో నాకు మనసంత
వరస కలిపి జంటలాయెనే ఓలమ్మమ్మో
మనసు తెలిసి మంట రేగెనే

చినుకు ముల్లు గుచ్చుకున్నదీ చిన్నదాని
వలపు వాళ్ళూ విరుచుతున్నది..
వానజల్లు వెచ్చగున్నది చిన్న వాడి
వయసు తేనే వెల్లువైనది
కురిసి వెలిసిన వాన వరదంట
మనసు కలిసిన జంట పంటట

నీకు మెరుపెంతో నాకు వురుమంత
వయసు కలిసి జంటలాయెనే ఓలమ్మమ్మో
మనసు తెలిసి మంట రేగేనే

||వానొచ్చే||రాజు లేనపుడు సారంగో పాట సాహిత్యం

 
చిత్రం: రంగూన్ రౌడీ (1979)
సంగీతం: జె. వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

రాజు లేనపుడు సారంగో
నువు రారాదా పోరాదా సారంగా
సిగ్గేందుకంట శ్రీరంగా ఒగ్గెయ్యమాకు సామిరంగా
కోరంగ, చేరంగ, కోపంగ చూడొద్దు కొంగట్టు కొచ్చెయి టింగురంగా

వులుకు వులుకు చూస్తావుంటే
ఒళ్ళు పులకరించి పోతావుంటే
నీ మీసకట్టు చూస్తావుంటే 
నాకు మిణుకు మిణుకు మంటావుంటే
చిలకా పలికిందిరయ్యో సీమ కుట్టిందిరయ్యో
చిచ్చు పెట్టిందిరయ్యో కొంప ముంచిందిర య్యో లకుచికు అక్కయ్యో

మాయరోగ మొచ్చిందంటే
సచ్చినోడ మల్లెపూల మాత్ర వెయ్యనా
ఆడజబ్బు ముదిరిందంటే 
అందగాడ ఈడ నిన్ను పాతరెయ్యనా
జబ్బు పొమ్మందిరయ్యో
దెబ్బ వెయ్యమంది రయ్యో
డబ్బా రమ్మందిరయ్యో లకు చికు బావయ్యో

Most Recent

Default