చిత్రం: మధుమాసం (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: రంజిత్ , రీటా
నటీనటులు: సుమంత్, స్నేహ , పార్వతి మెల్టన్
దర్శకత్వం: చంద్ర సిద్దార్ధ
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 09.02.2007
పల్లవి:
వసంతం వాయిదా పడైనా రాదుగా
కనీసం కమ్మగా కలైనా కావుగా
ఈ కాంత కోకిలా వలచినా పిలిచినా ప్రియతమా
వసంతం వాయిదా పడైనా రాదుగా
చరణం: 1
విరజాజి పూలే విరహాన రాలే
మలిసందే వేళే తెలవారి పోయే
పొడి ఇసుక దారులలో
మన అడుగు జాడలలో
గతము తలచి కలిసి నడిచి
వలపు కలయిక కలా
నిదుట నిలచి ఎదను తెరచి
క్షణము దొరకవు కదా
వసంతం వాయిదా పడైనా రాదుగా
కనీసం కమ్మగా కలైనా కావుగా
చరణం: 2
బస్తీల నిండా బృందావనాలే
ముస్తాబు మీద హస్తాక్షరాలే
ఎదురసలు చూడనిది
మనము అనుకోనిదిది
మనసు అలుపు మమత అలుకు
జతను కలిపెను కదా
ఎవరికెవరు ఒకరికొకరు
ఇపుడె తెలిసెను కదా
వసంతం వాయిదా పడైనా రాదుగా
కనీసం కమ్మగా కలైనా కావుగా
ఈ కాంత కోకిలా వలచినా పిలిచినా ప్రియతమా
వసంతం వాయిదా పడైనా రాదుగా