Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Chitti Chellelu (1970)




చిత్రం: చిట్టి చెల్లెల్లు (1970)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు: యన్.టి.రామారావు, వాణిశ్రీ
దర్శకత్వం: ఎమ్. కృష్ణన్
నిర్మాణ సంస్థ: ఏ.వి.యం. ప్రొడక్షన్ 
విడుదల తేది: 29.07.1970



Songs List:



అందాల పసిపాప పాట సాహిత్యం

 
చిత్రం: చిట్టి చెల్లెల్లు (1970)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే.. నీకన్నా నాకెవరే
అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప

ఆ చల్లని జాబిలి వెలుగు  ఆ చక్కని చుక్కల తళుకు
ఆ చల్లని జాబిలి వెలుగు  ఆ చక్కని చుక్కల తళుకు
నీ మనుగడలో నిండాలమ్మా 
నీ మనుగడలో నిండాలమ్మా  నా కలలన్ని పండాలమ్మా

అందాల పసిపాప  అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి  నేనున్నది నీ కొరకే  నీకన్నా నాకెవరే
అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప

మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే
మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే
తోడై నీడై లాలించునులే
తోడై నీడై లాలించునులే  మనకే లోటు రానీయదులే

అందాల పసిపాప  అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి  నేనున్నది నీ కొరకే  నీకన్నా నాకెవరే
అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప
ల ల లాలి ..ల ల లాలి
ల ల లాలి ..ల ల లాలి





ఈ రేయి తీయనిది పాట సాహిత్యం

 
చిత్రం : చిట్టి చెల్లెల్లు (1970)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, సుశీల

(ఈ పాట యొక్క బాణీ ని, కొంతమేరకు సాహిత్యాన్ని పవన్ కళ్యాణ్ నటించిన జానీ (2003) సినిమాలో ఉపయోగించారు, దానికి సంగీతం, సాహిత్యం రమణ గోగుల సమకూర్చారు)

ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది

ఏవేవొ కోరికలు ఎదలో
ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు
అల్లన దాగి వింటున్నవి

పన్నీటి తలపులు నిండగా
ఇన్నాళ్ళ కలలే పండగా
పన్నీటి తలపులు నిండగా
ఇన్నాళ్ళ కలలే పండగా
చిన్నారి చెలియ అపరంజి కలువ
చేరాలి కౌగిట జిలిబిలి నగవుల

ఏవేవొ కోరికలు ఎదలో
ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు
అల్లన దాగి వింటున్నవి
ఆఆఅ..ఆఅహహ..ఆహా..

పరువాలు పల్లవి పాడగా
నయనాలు సయ్యాటలాడగా
పరువాలు పల్లవి పాడగా
నయనాలు సయ్యాటలాడగా
నిను చేరుకోగ నునుమేని తీగ
పులకించి పోయెను తొలకరి వలపుల

ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది

ఎన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పుణ్యమో
ఎన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పుణ్యమో
నిను నన్ను కలిపె నీ నీడ నిలిపె
అనురాగ సీమల అంచులు దొరికే

ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది




ఝుం ఝుం తుమ్మెద పాడింది పాట సాహిత్యం

 
చిత్రం: చిట్టి చెల్లెల్లు (1970)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల, పి.సుశీల

ఝుం  ఝుం ఝుం  ఝుం తుమ్మెద పాడింది 





వన్ టు త్రి పాట సాహిత్యం

 
చిత్రం: చిట్టి చెల్లెల్లు (1970)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

వన్ టు త్రి 



మంగళ గౌరి పాట సాహిత్యం

 
చిత్రం: చిట్టి చెల్లెల్లు (1970)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. సుశీల 

మంగళ గౌరి




అందాల పసిపాప... (2) పాట సాహిత్యం

 

చిత్రం: చిట్టి చెల్లెల్లు (1970)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

అందాల పసిపాప...




అందాల పసిపాప... (Sad Version) పాట సాహిత్యం

 

చిత్రం: చిట్టి చెల్లెల్లు (1970)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల 

అందాల పసిపాప...




పట్టాలి అరక దున్నాలి మెరక పాట సాహిత్యం

 

చిత్రం: చిట్టి చెల్లెల్లు (1970)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు

పట్టాలి అరక దున్నాలి మెరక

Most Recent

Default