చిత్రం: బెంగాల్ టైగర్ (2015)
సంగీతం: భీమ్స్ సెసిరోలె
సాహిత్యం: శ్రీమణి
గానం: విజయ్ ప్రకాష్
నటీనటులు: రవితేజ , తమన్నా, రాశిఖన్నా
దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కె.కె.రాధా మోహన్
విడుదల తేది: 2015
చూపులతో దీపాల దేహముతో ధూపాల
చంపయ్యకే నన్ను చంపయ్యకే
నవ్వులతో చెరసాల నడుముతో మధుశాల
చంపయ్యకే నన్ను చంపయ్యకే
ఓ కలముకు అందానికి అక్షరమా
కవితకు తెలపని లక్షణమా
బాపుకే దొరకని బొమ్మవే
బ్రహ్మకే వన్నె తెచ్చిన వెన్నెలమ్మవే
నీ చక్కని చిత్రానికి కాగితాన్ని ఇచ్చుకున్నా
ప్రతి కొమ్మా ప్రతి రెమ్మా జన్మ ధన్యమే
నీ చక్కని దేహానికి హత్తుకున్న చీర రైక నేసిన
ఆ చేతులది గొప్ప పుణ్యమే
నిధురకు మెళుకువ తెచ్చే అందం నీవే లేవే
నిన్ను మరవడం అంటే మరణములే
చూపులతో దీపాల దేహముతో ధూపాల
చంపయ్యకే నన్ను చంపయ్యకే
ఏ ఋతువో ఏ రుణమో వేల వేల ఏళ్ల వేచి
ఈ తెలుగు నేలనిలా ఎంచుకుందిలే
ఆ నదులు ఈ సుధలు కోరి కోరి తపసు చేసి
నీ పాదాలకు నడకనిల పంచుకున్నావే
ఏమిటి చంద్రుడు గొప్ప
అది నీ వెలుగే తప్ప
ఇలకే జాబిలివై జారావే