Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Nalugu Stambhalata (1982)




చిత్రం: నాలుగు స్థంభాలాట (1982)
సంగీతం: రాజన్ - నరేంద్ర
నటీనటులు: నరేష్, పూర్ణిమ, ప్రదీప్
దర్శకత్వం: జంధ్యాల
నిర్మాత: యన్. కృష్ణంరాజు
విడుదల తేది: 15.05.1982



Songs List:



చినుకులా రాలి పాట సాహిత్యం

 
చిత్రం: నాలుగు స్థంభాలాట (1982)
సంగీతం: రాజన్ - నరేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
చినుకులా రాలి
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలైపోయి కడలిగాపొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ 
నదివి నీవు కడలి నేను 
మరిచిపోబోకుమా హా మమత నీవేసుమా 

చినుకులా రాలి నదులుగా సాగి
వరదలైపోయి కడలిగాపొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ 

చరణం: 1
ఆకులురాలె వేసవిగాలి నా ప్రేమ నిట్టూర్పులే 
కుంకుమపూసె వేకువ నీవై తేవాలి ఓదార్పులే 
ప్రేమలుకోరె జన్మలలోని నేవేచి ఉన్నానులే 
జన్మలుదాటె ప్రేమను నేనై నేవెల్లువౌతానులే 
ఆ చల్లనీ గాలులే...

హిమములా రాలి సుమములై పూసి
రుతువులై నవ్వి మధువులై పొంగి 
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ 
శిశిరమైన  సిధిలమైన
విడిచిపోబోకుమా విరహమై పోకుమా

చరణం: 2
తొలకరికోసం తొడిమనునేనై అల్లాడుతున్నానులే
పులకరమూదె పువ్వులకోసం వేసారుతున్నానులే 
నింగికినేల అంటిసలాడె  ఆ పొద్దురావాలిలే 
నిన్నలు నేడై  రేపటి నీడై నాముద్దు తీరాలిలే
ఆ తీరాలు చేరాలిలే...

మౌనమై మెరిసి గానమై పిలిచి
అలలతో అలిసి  గగనమై ఎగసి
నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ 
భువనమైనా  గగనమైనా
ప్రేమమయమే సుమా... ప్రేమ మనమే సుమా...

చినుకులా రాలి  నదులుగా సాగి
వరదలైపోయి  కడలిగాపొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ 
నదివి నీవు కడలి నేను 
మరిచిపోబోకుమా... మమత నీవేసుమా...




దొరలనీకు కనులనీరు పాట సాహిత్యం

 
చిత్రం: నాలుగు స్థంభాలాట (1982)
సంగీతం: రాజన్ - నరేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం:  పి. సుశీల

దొరలనీకు కనులనీరు దొరలదీలోకం
మగదొరలదీలోకం
కనులలోనే దాచుకోవే కడలిలా శోకం
కన్నెపడుచులా శోకం

నాల్గు దిక్కుల నడుమ పుట్టి నలిగిపోయే జగతిలో
నాల్గు దిక్కుల నడుమ పుట్టి నలిగిపోయే జగతిలో
నాలుగు పాదాల ధర్మం నడువలేని ప్రగతిలో
నాలుగు స్తంభాల ఆట ఆడబ్రతుకు తెలుసుకో

దొరలనీకు కనులనీరు దొరలదీలోకం
కనులలోనే దాచుకోవే కడలిలా శోకం

వెన్నెలే కరువైననాడు నింగినిండా చుక్కలే
వెన్నెలే కరువైననాడు నింగినిండా చుక్కలే
కన్నెగానే తల్లివైతే కంటినిండా చుక్కలే
నాల్గు మొగముల బ్రహ్మరాసిన
ఖర్మనీకిది తెలుసుకో

దొరలనీకు కనులనీరు దొరలదీలోకం
కనులలోనే దాచుకోవే కడలిలా శోకం

కలవని తీరాల నడుమ గంగలాగా కదిలిపో
కలవని తీరాల నడుమ గంగలాగా కదిలిపో
అమ్మగా ఒక జన్మనిచ్చి అవని నీవై మిగిలిపో
నాలుగు వేదాలసారం అనుభవంలో తెలుసుకో

దొరలనీకు కనులనీరు దొరలదీలోకం
మగదొరలదీలోకం
కనులలోనే దాచుకోవే కడలిలా శోకం
కన్నెపడుచులా శోకం




కలికీ చిలకరా పాట సాహిత్యం

 
చిత్రం: నాలుగు స్థంభాలాట (1982)
సంగీతం: రాజన్ - నరేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

పల్లవి:
కలికీ చిలకరా కలిసీ కులకరా
ఉలికీ పడకురా ఉడికే వయసురా
హే తద్దీ తలాంగ్ లవ్లీ లతాంగి నువ్వే జతందిరా
లివ్ టు లవ్ అందిరా

కలికీ చిలకరా కలిసీ కులకరా
హే హే ఉలికీ పడకురా ఉడికే వయసురా

చరణం: 1
చలిలోన జొరబడక చెలితోనా జతపడగా
ఏరా మోమాటమా ఏరా రారా నీదేలే ఛాన్స్ రా
కవ్వింత నువ్వడుగా నీకింత వెనకడుగా
ఆగే అరటమా రారా కుమారా నీదే రొమాన్స్ రా
యవ్వనమే రివ్వుమనే నవ్వులతో వసి బిసిగా

కలికీ చిలకరా కలిసీ కులకరా
రారా ఉలికీ పడకురా ఉడికే వయసురా

చరణం: 2
లాలా లలలా లాలా లలలా
లలలా టర టర ట్టర టర టర ట్టర
ముదిరిందా ప్రేమ కథ నిదురంటూ రాదుకదా
కొంగే కోలాటమై ఈడే కోడై కొక్కొరొకో అందిరా
పెదవులతో మధుపాత్ర వెదకడమే నీపాత్ర
వలపే నీ వాటమై ఈడో జోడో దక్కిందే నీదిరా
మత్తులలో వత్తిడిగా హత్తుకుపో నంద సందాగా

కలికీ చిలకరా కలిసీ కులకరా
రారా ఉలికీ పడకురా ఉడికే వయసురా
హే తద్దీ తలాంగ్ లవ్లీ లతాంగి నువ్వే జతందిరా
లివ్ టు లవ్ అందిరా

కలికీ చిలకరా కలిసీ కులకరా



కొబ్బరాకు గాలి పాట సాహిత్యం

 
చిత్రం: నాలుగు స్థంభాలాట (1982)
సంగీతం: రాజన్ - నరేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు

కొబ్బరాకు గాలి 




రాగమో అనురాగమో పాట సాహిత్యం

 
చిత్రం: నాలుగు స్థంభాలాట (1982)
సంగీతం: రాజన్ - నరేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, యస్.జానకి 

రాగమో అనురాగమో 

Most Recent

Default