Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Katamarayudu (2017)





చిత్రం: కాటమరాయుడు (2017)
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ 
నటీనటులు: పవన్ కళ్యాణ్, శృతి హాసన్
దర్శకత్వం: కిషోర్ కుమార్ పార్థసాని
నిర్మాత: శరత్ మరార్
విడుదల తేది: 24.03.2017



Songs List:



మిర మిరా మీసం పాట సాహిత్యం

 
చిత్రం: కాటమరాయుడు (2017)
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనురాగ్ కులకర్ణి

రాయుడో.... 
నాయకుడై నడిపించేవాడు 
సేవకుడై నడుమొంచేవాడు 
అందరి కోసం అడుగేశాడు 
రాయుడో...

హె మిర మిరా మీసం 
హె మిర మిరా మీసం
హె మిర మిరా మీసం 
మెలితిప్పుతాడూ జనం కోసం 
డన డన డంటడడం 
డన డన డంటడడం 
డన డన డం 
కర కరా కండల రోషం 
కర కరా కండల రోషం
పోటెత్తుతాదీ జనం కోసం 
డన డన డంటడడం 
డన డన డం 
మండె ఆవెశం 
వీడుండే నివాసం 
వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం 
అసలు సిసలు చురుకు సరుకు
అణువణువున సెగ రగిలెలా...

సూరీడల్లే
హే సూరీడల్లే వచ్చాడూ 
మన అందరి కాటమరాయుడూ 
పంచే కట్టిన మంచితనం 
నిలువెత్తు కాటమరాయుడు

మిర మిరా మీసం 
మిర మిరా మీసం 
మెలి తిప్పుతాడూ జనం కోసం 

రాయుడో...

ఒకడే వీడు రక రకములవాడూ 
యే రంగు కళ్ళకు ఆ రంగై ఉంటాడు 
రెప రెపలాడే జండాలా పొగరున్నోడు 
తలవంచక మిన్నంచుల పైనే ఉంటాడు 
చిగురు వగరు తగిన పొగరు
కలగలసిన ఖడ్గం వీడై
సూరీడల్లే వచ్చాడూ మన అందరి కాటమరాయుడూ 
అమ్మతోడు మా చెడ్డ మంచోడు కాటమ రాయుడు 

అసలు సిసలు చురుకు సరుకు 
అణువణువున సెగ రగిలెలా...
సూరీడల్లే హే సూరీడల్లే వచ్చాడూ 
మన అందరి కాటమరాయుడూ 
పంచే కట్టిన మంచితనం 
నిలువెత్తు కాటమరాయుడు 

డన డన డన డన డానాన డననననా 
డన డన డన డన డానాన డననననా 
రాయుడో...



లాగే లాగే పాట సాహిత్యం

 
చిత్రం: కాటమరాయుడు (2017)
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ 
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్‌
గానం: నకాష్‌ అజీజ్‌

లాగే మనసు లాగే నీవైపే ననులాగే 
ఊగే మనసు ఊగే నీ కోసం తనువూగే

నీ నవ్వులోన ఉందే ఓ మైకం 
నీ మాటలోన ఉందే ఓ రాగం 
నీ నడకలోన ఉందే ఓ తాళం 
చక్కర కలిపిన పెదవులతోటీ 
ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావే 

నీ కళ్లలోన ఉందే ఓ కావ్యం 
నీ నడుములోన ఉందే ఓ నాట్యం 
నీ చుట్టూ ఉందే నా ప్రపంచం 
జంతర్‌ మంతర్‌ జాదూ చేసీ
మంతరమేదో వేసీ లాగే లాగే
ఓ లాగే లాగే లాగే లాగే 
లాగే లాగే మనసు లాగే నీవైపే 
లాగే లాగే లాగే  ప్రాణం లాగే నీ వైపే
లాగే లాగే లాగే  నన్ను లాగే నీ వైపే

లాగే మనసు లాగే నీ వైపే ననులాగే 
ఊగే...

చరణం: 1
ఏమాత్రం కుదురే ఉండదు ప్రేమాతురాణాం 
కాబట్టే అయిపోతున్నా గాల్లో విమానం 
ఏది మధ్యాహ్నం ఏది సాయంత్రం 
తేలనంత మత్తుగుంది కొత్త ఉద్యోగం 
ఓ పిల్లా... ఓ పిల్లా...
అరె కాటమరాయుడి గుండెని ఎట్టా
కాటా వేసి పట్టుకుపోయావే

ఓ లాగే లాగే ఓ లాగే లాగే 
లాగే లాగే మనసు లాగే నీవైపే 
లాగే లాగే లాగే  ప్రాణం లాగే నీ వైపే
లాగే లాగే లాగే  నన్ను లాగే నీ వైపే

చరణం: 2
హే ఈడొచ్చిన సీతాకోకై నా మీద వాలి 
మనసంతా ఆడేశావే రంగేళీ హోలీ 
చేతికందొచ్చీ చేపమందిచ్చీ 
వయసుకేమో నేర్పినావే కోతి కొమ్మచ్చి 
చిన్నారీ... పొన్నారీ...
ఆహా ఇప్పటికిప్పుడు ఏం చేశావే 
ఎక్కేశాను ఏనుగు అంబారీ

ఓ లాగే లాగే ఓ లాగే లాగే 
లాగే లాగే మనసు లాగే నీవైపే 
లాగే లాగే లాగే  ప్రాణం లాగే నీ వైపే
లాగే లాగే లాగే  నన్ను లాగే నీ వైపే

లాగే మనసు లాగే నీ వైపే ననులాగే 



జివ్వు జివ్వూ పాట సాహిత్యం

 
చిత్రం: కాటమరాయుడు (2017)
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ 
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: దనుంజయ

రాజులైనా బంటులైనా  -  ఆ.. ఆ
కూలిలైనా వ్యాపారులైనా  - ఓ...ఓ
సీకటైతే  సుక్కోసం  - ఆ.. ఆ
జివ్వు జివ్వూ ఆగునా  - ఆగదు ఆగదు

రాజులైనా బంటులైన సుక్కాకోసం నాయన
జివ్వు జివ్వూ ఆగునా  - జివ్వు జివ్వు ఆగునా
యెవ్వడైనా యాడ ఉన్నా సీకటైతే నాయన
జివ్వు జివ్వు ఆగునా  - జివ్వు జివ్వు ఆగునా
కల్లైనా సారైనా  - జివ్వు జివ్వు ఆగునా
అరె ఇంగిలీసూ మందైనా  -  జివ్వు జివ్వూ ఆగునా
అరె కల్తీ సరుకె ఐనా  - జివ్వు జివ్వూ ఆగునా
ఏదైనా ఏమైనా  - జివ్వు జివ్వు ఆగునా
తాగకుంటే జివ్వు జివ్వూ లోనా
తాగితేనే తందాననా
రంగు రంగు  - ఓయ్...
రంగు రంగు  - ఓయ్...
రంగు రంగూల మందెయ్ రా
ఓరబ్బా మత్తెక్కి సిందెయ్ రా

రంగు రంగూల మందెయ్ రా
ఓరబ్బా మత్తెక్కి సిందెయ్ రా

రంగు రంగు  - ఓయ్...
రంగు రంగు  - ఓయ్...
రంగు రంగూల మందెయ్ రా
ఓరబ్బా మత్తెక్కి సిందెయ్ రా
ఓరబ్బా వెయ్యేనుగుల బలమొస్తదిరా

అది లెక్క ...



ఏమో ఏమో ఏంటో పాట సాహిత్యం

 
చిత్రం: కాటమరాయుడు (2017)
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రేయ ఘోషల్, అర్మాన్ మాలిక్

ఓ ఏమో ఏమో ఏంటో ఏమైందో ఏమో ఏంటో 
ముళ్ళ తీగ మీద మల్లె పూసేసిందేంటో
ఓ ఏమో ఏమో ఏంటో మొత్తం దారి మారిందేంటో
నల్ల రాతి గుండె మీద సీతాకోకేంటో
చిర చిర లాడే కంట్లో చెక్కెర దారేంటో
చినుకులు చూడని ఇంట్లో తేనెల వానేంటో
ప్రతి దానికింక కారణంగా 
నిన్ను చూపుతుంది ఈ లోకం 

నీ కయ్యిందేంటో నే చేసిందేంటో ఏమో ఏంటో హో
నే చెప్పిందేంటో నా తప్పసలేంటో ఏమో ఏంటో 

ఓ ఏమో ఏమో ఏంటో ఏమైందో ఏమో ఏంటో 
ముళ్ళ తీగ మీద మల్లె పూసేసిందేంటో 

మండేటి సూర్యుడినైన చల్లార్చే చందమామై 
నువ్వొచ్చావా నాకోసం ఈ అదృష్టం ఏంటో
గర్జించే మేఘాన్నైనా కరిగించే చల్లగాలి 
నువ్వు కలిసావ ఈ నిమిషం నా అదృష్టం ఏంటో 
పేలే శబ్దాలెన్నైనా ఏం చెయ్యలేదే ఇన్నాళ్లు
ఇవ్వాలే నిశ్శబ్దంలో హాయిగ వచ్చే వణుకేంటో

నాలో ఉండే పడుచుదనం 
నీలో ఉందే పదునుగుణం 
ఒకటైపోతే మన పయణం 
అటుకో ఇటుకో ఎటుకో ఏంటో 

ఓ ఏమో ఏమో ఏంటో ఏమైందో ఏమో ఏంటో 
ముళ్ళ తీగ మీద మల్లె పూసేసిందేంటో
ఓ ఏమో ఏమో ఏంటో మొత్తం దారి మారిందేంటో
నల్ల రాతి గుండె మీద సీతాకోకేంటో

శత్రువుల గుండెల్లోన నిద్రిస్తు ఉందే నాకే 
నిన్ను చూస్తే నిద్దుర పాడై ఈ గుండె గుబులేంటో
కత్తుల్లా కదిలే నువ్వే మెత్తంగా మునిగావంటే
చంటోడైన చెబుతాడే అరే దానర్థం ఏంటో 
అందరిలోన హుందాగా నిన్నా మొన్నా ఉన్నాగా
ఈపై ఎట్టాగుంటానో ఆపై జరిగే కధలేంటో
అక్కడితోనే గడపకురో కంచె పట్టు పరికిణిలో
నీకై వచ్చే నిలిచుంటే అరరె అరెరే తెలుసా ఏంటో




యేలొ యెడారిలొ వాన పాట సాహిత్యం

 
చిత్రం: కాటమరాయుడు (2017)
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ 
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: దనుంజయ , మాళవిక

హో యేలొ యెడారిలొ వాన 
గాల్లొ గులాబి పూసేన 
గుబురు మీసం మెలేస్తున్నా... 
గుండె పాపం ఎలా ఉందో... 
బైటికి బైటికి ఆతడు చూపించె ధీమా ఓ ఓ ఓ ఓ... 
లోపల లోతున అంతగ ఉంటుందా నిజమా... 
ఎ చెలియ కనుల మెరుపు తగిలి 
నిలువు మనసు మెలిక పడితె 
నిలబడడం ఇక మనుషుల తరమా

యెన్నాలొ ఏమిటొ యెన్నాల్లీ బడాయితొ 
ఏంచెస్తాడొ మనోడు 
మారారొయ్ వీరులు మారారొయ్ మహర్షులె 
మారేన ఈ మగాడు 

హో యేలొ యెడారిలొ వాన 
గాల్లొ గులాబి పూసేన 
గుబురు మీసం మెలేస్తున్నా... 
గుండె పాపం ఎలా ఉందో... 

సైగతొ సైన్యం నడిపించె వాడిపై 
సిగ్గొచి వాలెనోలమ్మొ 
బల్లెం పాకుతొ పువ్వుల బణాలపై 
గెలిచెదెట్టాగొ ఏమొ 
సవాలే అయ్యొ అయ్యొ ఇదేం సవారీ 
హొయ్యరే... అయొమయం కదా దారి 
వలపు మలుపు తిరిగినపుడు
సొగసు మడుగు ఎదురు పడితె 
కదలడం ఇక రధముల తరమ 

యెన్నలొ ఎమిటొ యెన్నాల్లీ బడాయితొ
ఏంచెస్తాడొ మనోడు 
మారారొయ్ వీరులు మారారొయ్ మహర్షులె 
మారేన ఈ మగాడు...




నేత చీర కట్టుకొచ్చి పాట సాహిత్యం

 
చిత్రం: కాటమరాయుడు (2017)
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సాయి చరణ్, సహిత, స్మిత

అలా అలా గలా గలా జలా జలా 
పారేటి నది లా 
పరుగులే తీసేసే చిన్నదీ 
నవ్వుతు నా గుండె దోచేసింది 
ఆహా   ఓహూ 

నేత చీర కట్టుకొచ్చి ఓ నాయికా 
సిలకలాగ నవ్వుతుంటె ఓ నాయికా 
మీసం ఎగిరి కన్ను కొట్టె 
కాలరెగిరి కేక పెట్టె 
ఎర్ర తుండు ఈల కొట్టెనె 
నువ్వు చెనేత పంచ కట్టిన ఓ నాయక 
సంకురాత్రి పుంజువేర ఓ నాయక 
గాజులెమొ గోల పెట్టె 
మోజులెమొ లేవబట్టె 
సిట్టి నడుము సెమట పట్టెనె 
అహ వయ్యరం బుట్టలొ 
బుగ్గమీద సొట్టలొ 
ఏరుకుంతె ఏడు వింతలో 
నువ్వు అలగలగె పొగిడి పొగిడి 
కలకలమె రేపుతావు 
నీసంగతి నాకు ఎరుకరొ 

ఓరి దేవుడొ ఓరోరి దేవుడొ 
ఏం పిల్లది ఎంత మాటన్నది 
ఓరి దేవుడొ ఓరోరి దేవుడొ 
ఏం పిల్లది ఎంతా బాగున్నది 

నేత చీర కట్టుకొచ్చి ఓ నాయికా 
సిలకలాగ నవ్వుతుంటె ఓ నాయికా 

ఊరి చివర చెరువు కాడ ఓ నాయికా 
నీల్ల బిందె ముంచుతుంటె ఓ నాయికా 
సన్న సన్న నడుము చూసి 
దానికున్న బెండు చూసి 
నా మనసు బెనికిపోయెనె 
హె అంతలేసి కల్లతొటి ఓ నాయకా 
అంతలాగ సూడకుండ ఓ నాయకా 
చేతి సాయమేదొ చెసి నీల్ల బింద నింపుకొస్తె 
నీకు ఇన్ని తిప్పలుండవే... 
అరె నువ్వట్ట సెప్పకే నీల్ల బిందెతోపాటు 
నిన్నెత్తి మోసుకెల్తనే 
అభో గిలగిలగిల దొరికినాక 
కలబడకుడ ఉంటవేమి 
నీ ఏషాల్ నాకు తెలుసులే 

ఓరి దేవుడొ ఓరోరి దేవుడొ 
ఏం పిల్లది ఎంత మాటన్నది 
ఓరి దేవుడొ ఓరోరి దేవుడొ 
ఏం పిల్లది ఎంతా బాగున్నది 


నువ్వు కోడి కూర వొండనీకి ఓ నాయిక 
కట్టె పొయ్యి వూదుతుంటె ఓ నాయిక 
పొయ్యి కన్న ముందుగానె 
గుప్పు గుప్పు గుప్పుమంటు 
నా ఈడు అంటుకున్నదె 
హె అంటుకుంటదంటుకుంటది ఓ నాయక 
అంటుకోక ఎందుకుంటది ఓ నాయక

పొయ్యి కాడ ఆకు మడె పిల్ల నీకు దొరికినాక 
అంతకన్న పనేం ఉంటదే ఎ ఎంచెస్తాం తప్పదే 
ఒంటరిగా ఒప్పదే  నీ అందం అంత గొప్పదే 
అరె ఇలగిలగే కాలికేస్తె అలగలగే మెడకు వేస్తి 
మసిపూసి మాయ చెస్తవే 

ఓరి దేవుడొ ఓరోరి దేవుడొ 
ఏం పిల్లది ఎంత మాటన్నది 
ఓరి దేవుడొ ఓరోరి దేవుడొ 
ఏం పిల్లది ఎంతా బాగున్నది

Most Recent

Default