Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Paadi Pantalu (1976)
చిత్రం: పాడిపంటలు (1976)
సంగీతం: కె. విమహాదేవన్
నటీనటులు: కృష్ణ , విజయనిర్మల, లత
దర్శకత్వం: పి.చంద్రశేఖర రెడ్డి
నిర్మాత: జి. ఆది శేషగిరిరావు
విడుదల తేది: 14.01.1976Songs List:ఇరుసులేని బండి పాట సాహిత్యం

 
చిత్రం: పాడిపంటలు (1976)
సంగీతం: కె. విమహాదేవన్
సాహిత్యం: శ్రీ శ్రీ , ఆత్రేయ, కొసరాజు, సి.నారాయణ రెడ్డి, మోదుకూరి జాన్సన్
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యల్. ఆర్.ఈశ్వరి, వసంత

పల్లవి:
ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి
ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి
తొట్టిలో ఉన్నాడు జగమొండి
వాడిదూకుడికి ఆగలేదు తప్పుకోండి

ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి

చరణం: 1
వయసులోనే ఉన్నది దూకుడన్నది
దాన్ని ఎగదోసే చిన్నది పక్కనున్నది
వయసులోనే ఉన్నది దూకుడన్నది
దాన్ని ఎగదోసే చిన్నది పక్కనున్నది
చిన్నదాని చేతిలో చిరతలున్నవి
ఎంత చెలరేగిన నీకు హద్దులున్నవి
చిన్నదాని చేతిలో చిరతలున్నవి
ఎంత చెలరేగిన నీకు హద్దులున్నవి
హద్దులన్ని సద్దులన్ని ముద్దులతో చెరిగిపోతవి

తందాన తన నన తందనాన
తందాన తన నన తందనాన

ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి

చరణం: 2
ఎగిరెగిరి పడుతున్న కోడె గిత్తలు
అవి ఏనాడో మోయాలి మోపెడంతలు
ఎగిరెగిరి పడుతున్న కోడె గిత్తలు
అవి ఏనాడో మోయాలి మోపెడంతలు
ఎత్తుపల్లాలు చూస్తేనే ఇన్ని గంతలు
మనది మెత్తనైన దారైతే ఏల పంతాలు
పగ్గాలు లేని నాడు పంతాలు గెలవలేవు

దసరి గరి సనిద ద ద ద
పనిస రిస రిద ప ప ప ప

చరణం: 3
పచ్చని వరిచేను పరువంలో ఉన్నది
పైరుగాలి తగలగానే పులకరించుచున్నది
పులక పులక లో వలపు గిలిగింత ఉన్నది
వలవు పంట ఎప్పుడని కలలు గంటున్నది
సంకు రేత్రి సండుగ కే సంబరాలు కాసుకున్నవి


ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి
ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి
తొట్టిలో ఉన్నాడు జగమొండి
వాడిదూకుడికి ఆగలేదు తప్పుకోండి

ఆడుతూ పాడుతూ పాట సాహిత్యం

 
చిత్రం: పాడిపంటలు (1976)
సంగీతం: కె. విమహాదేవన్
సాహిత్యం: కొసరాజు
గానం: సుశీల, ఎస్. పి. బాలు

సాకీ:
ప్రాజెక్టువచ్చి మన పిల్ల కాలువలు
నురుగులు గ్రక్కుతూ వరుగులు తీయాలి
వన్నె చిన్నెల పైరు కన్నె సింగారించి
నును సిగ్గుతో తలవంచుకోవాలి

పల్లవి:
ఆడుతూ పాడుతూ ఆనందంగా వసంతమాడాలీ
జోరుగ వసంతమాడాలి
వెల వెల బోయె బ్రతుకుల్లోన వెన్నెలగాయాలీ
చల్లని వెన్నెల గాయాలీ

చరణం: 1
పాడిపంటలు పల్లెసీమలను
పచ్చపచ్చగా చెయ్యాలి
ధాటి మీరగా గిత్తలజోడు
పోటురంకె లెయ్యాలి
ముసి ముసి నవ్వులు ముఖాలలోన
గుస గుసలాడాలి
కష్టజీవి తన కలలు ఫలించి
మీసం పై చెయ్యి వెయ్యాలి

చరంణం: 2
నీ ఒయ్యారం ధాన్యలక్ష్మికి
వంపులు సొంపులు దిద్దాలి
సిగలో చెక్కిన పూలచెండు
భూదేవికి హారం కావాలి
ఓరచూపులతో తియ్యని తలపులు
ఉక్కిరి బిక్కిరి చెయ్యాలి
ఏటేటా ఈ వసంతాలలో
తడిసి ముద్దై  తీరాలి
మనం తడిసి ముద్దై తీరాలి
మన జన్మ భూమి పాట సాహిత్యం

 
చిత్రం: పాడిపంటలు (1976)
సంగీతం: కె. విమహాదేవన్
సాహిత్యం: మోదుకూరి జాన్సన్
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

పల్లవి:
మన జన్మ భూమి  బంగారుభూమి
పాడిపంటలతో పపడి సులతో కళకళలాడే

చరణం: 1
రైతు లేనిదే రాజ్యం లేదని
ఎద్దుల గంటలు మోగినప్పుడే
నీలాకాశం నుదిటిన తిలకం నిండుగా దిద్దుకుంటుంది
రెతు పాద మే రామపాదమై
పిల్ల గాలులు పాడినంతనే
అణువు అణువూ అన్న పూర్ణయై
ప్రేమతో పులకరిస్తుంది
మమతల మాగాణి మన జననీ 'మనజన్మభూమి

చరణం: 2
నాగలితో నమస్కరించి
పారలతో  ప్రణమిల్లి
గుండె  గుప్పెట బట్టి
గుప్పెడు ప్రాణం చల్లితే
గంగ, యమున, గోదావరి, కృష్ణ లే
పాలపొంగులై ప్రవహించి
కుప్ప తెప్పలుగ పురులు పొర్లగ ప్రాణం పంటగ
ప్రసవించే జననీ
పచ్చిబాలింతరాలు మన జననీ

చరణం: 3
నల్లని రాముని అల్లరికృష్ణుని పాదాలతో చల్లబడిన నల్లరేగడ భూమి
భోసు, భగత్ సింగ్ , బాపూ, నెహ్రూ త్యాగాలతో
ఊపిరి పీల్చన భూమి
అలూరి సీతారామరాజు రకంతో
వీర రక్తంతో
తడిసి తరించి రత్నగర్భగా రాణ కెక్కన జననీ
రతనాల గన్న జననీ
భాష ఏదెనా  వేష మేదేనా
భారతీయులందరు ఒకటేనంటూ
బిడ్డలందరికి ఒకే బావుటా
నీడగ నిల్చిన జననీ
విశ్వనివాళులందిన జననీ
మాతలకు మాత మన భరతమాత

ఆట్ల తద్దోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: పాడిపంటలు (1976)
సంగీతం: కె. విమహాదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. సుశీల, వసంత

ఆట్ల తద్దోయ్ ఆట్ల తద్దోయ్
ముద్దపప్పోయ్ మూడట్లోయ్
ముద్దుగుమ్మ పట్నం బొమ్మకు
వడ్డిదాం వేడట్లోయ్

చరణం: 1
కమ్మని కొబ్బరినీళ్ళను
కల్తీ చేసే దెందుకూ
కైపున మునిగే దెందుకూ
చిగురాకంటి పెదవులను
పొగతో మాడ్చేదెందుకు
పూతలు పెట్టే దెందుకు
మాగాలి వెలుగు నీరు
కావలి స్తేంత కైపెక్కిస్తాయ్
పాలు వన్నె మీగడలు
పడుచుదనానికి వన్నెలు తెస్తాయ్

చరణం: 2
బట్టలు వేసే దెందుకు
ఒంటిని కప్పేటందుకు
కంటికి నచ్చేటందుకు
బట్ట బయలుగా బయ పెట్టేవి - బట్టలుగా లేవు
పిడికిలి మూసి పెట్టినప్పుడే
అందానికి అందం వచ్చేది

చరణం: 3
కట్టు బొట్టు జుట్టు
పుట్టుక తెలిపేవి
పెట్టని నగలే అవి
హద్దు వద్దు అణకువలు 
విద్యను మించేవి
ముద్దులు పెంచేవి
చేతికిపెట్టు గోరింటాకు 
కళ్ళకు దిద్దు కాటుకరేకు
తెలుగుతనాన్ని పుణికి పుచ్చుకో
తెలుగు పిల్ల గా పేరు తెచ్చుకో
నీతి న్యాయం మంచీ మమత పాట సాహిత్యం

 
చిత్రం: పాడిపంటలు (1976)
సంగీతం: కె. విమహాదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణ రెడ్డి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

పలవి:
నీతి న్యాయం మంచీ మమత
నీటి మీది రాతలు రా!
అనురాగాలు ! అనుబంధాలు
అన్నీ గాలిమూటలురా

చరణం: 1 
రతనాలను పండించిన హృదయం
రాళ్ళలోన నిట్టూర్చింది.
అనుబంధాలను తెంచిన స్వార్థం
అందలాలపై ఊరేగింది ,
తెల్లని వెలుగూ చీకటి రొదలో నీతి న్యాయం
నల్లని చీకటి నడి బజారులో
ఒళ్ళు విరుచుకొని తిరుగుతున్నది

చరణం: 2
పిల్లికి బిచ్చం వేయని లోభి
ఇల్లంతా సిరి మూల్గింది !
లేదనకుండా పెట్టేతల్లి
లోగిలి బావురుమంటుంది
కొమ్మా గూడూ కోరిన చిలకమ్మ
తుమ్ము ముళ్ల పై నిలిచింది !

చరణం: 3
మట్టికి ఉండే సహనగుణం
మనసులలోన లేదురా !
పశువులకుండే విశ్వాసం
మనుషులలో కనరాదురా !
కమ్మని మమతలు పంచేవారికి
కడకు దొరికేది చేదురా!
ఆత్మబలముంటే ఆ చేదైవా
అమృతం కాకపోదురా
పని చేసే రైతన్నా పాట సాహిత్యం

 
చిత్రం: పాడిపంటలు (1976)
సంగీతం: కె. విమహాదేవన్
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

పల్లవి: 
పని చేసే రైతన్నా
పాటుబడే కూలన్నా
రండోయ్ - రారండోయ్
మన కలలు పండే రోజొచ్చింది

చరణం: 1
చేతినిండ పని ఉంది
చేతులో బలం ఉంది
కొండ, పిండిచేసి 
వరదలకు కరువులకు
అనకట్ట కట్టేద్దాం
జలాలతో పొలాలనే పండిద్దాం
జనాలలో ఆనందం నిండిద్దాం

చరణం: 2
నేలమనది నిరిగి మనది
గాలి, నీరు, వెలుగు మనవి
అదును చూసి, పదును చేసి
అన్నిటిని అదుపు జేసి
మనదారికి మళ్ళీదాం
తరుగు లేని సంపదలే కురిపిద్దాం
చెరిగిపోని చరితనే సృష్టిద్దాం
పనిచేసే
పని చేసే రైతన్నా పాట సాహిత్యం

 
చిత్రం: పాడిపంటలు (1976)
సంగీతం: కె. విమహాదేవన్
సాహిత్యం: ఆశ్రేయ
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి, వసంత

పల్లవి: 
చేసుకుందాం గాలా నెట్
వేసుకుందాం బ్లాక్ అండ్ వైట్
చెప్పుకుందాం తెల్లారాక
హల్లో హల్లో గుడ్ నైట్

చరణం: 1
ఈ రోజు పుట్టింది ఈ బ్యూటి
తానిస్తుంది మీకు వెబ్ పార్టీ
తాగుతా చూస్కో నీతోటి
దీం తస్సదియ్య నాటకంటె ఘాటేంటి
నాటం కె నీకంత ఇష్ట మేమిటి
చాలకుంటే వేసుకో, నీటొకటి
అబ్బో | ఆగల్లే దిగుతుంది. కడుపులోకి
ఇది ఇసమల్లే ఎక్కుతోంది తలలోకి చేసుకుందాం!

చరణం: 2
గుక్కెడు సుక్కా ఏసుక చూడూ
రెక్కకు రెక్కలు వస్తాయి
రెక్కలువచ్చి రేత్రికి రేత్రి 
చుక్కలలో నిను చేరుస్తాయి
చుక్కలతోటి, కలిసి మెలిసి
ఆడుకుందాం రాక్ ఎండ్ రోల్
చక్కని చంద్రుని క్రిందకు పిలిచి
చేసేద్దాం ఏప్రిల్ ఫూల్

Most Recent

Default