Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Agnyaathavaasi (2017)





చిత్రం: అజ్ఞాతవాసి (2017)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
నటీనటులు: పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్ , అనుఇమాన్యుయేల్
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: రాధాకృష్ణ (చినబాబు)
విడుదల తేది: 2018



Songs List:



బయటకొచ్చి చూస్తే పాట సాహిత్యం

 
చిత్రం: అజ్ఞాతవాసి (2017)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సాహిత్యం: శ్రీమణి
గానం: అనిరుద్ రవిచంద్రన్

బయటకొచ్చి చూస్తే టైమేమో 3 O'Clock
ఇంటికెళ్లే 12 B రూటు మొత్తం రోడ్ బ్లాక్
బయటకొచ్చి చూస్తే టైమేమో 3 O'Clock
ఇంటికెళ్లే 12 B రూటు మొత్తం రోడ్ బ్లాక్

ఓయ్
నీ చేతికున్న బేంగిల్సే తాలమేసె నా శాండిల్సే
వాక్ వే లో చూస్తే పువ్వులా రెక్కలు ఫుల్ గా కప్పేసే
కార్నర్ లో కాఫీ షాప్ వేడి వేడిగా విజిలేసే
బస్ కిటికీ దగ్గర కాలేజ్ స్టూడెంట్స్ ఫోన్లో మోగే
FM లో ఎవరో పాడితే ఒళ్ళంత ఎందుకో ఊగెనే
ఆపిల్ పండులా సూరీడె
యారోప్లైన్ లా నాగుండే
తేలిందె గాలిలో మబ్బులా
జారిందే నేలపై నీడలా
ముల్లై గుచ్చెనే షడెన్ గా చల్లగాలే విలన్ల

బయటకొచ్చి చూస్తే టైమేమో 3 O'Clock
ఇంటికెళ్లే 12 B రూటు మొత్తం రోడ్ బ్లాక్
బయటకొచ్చి చూస్తే టైమేమో 3 O'Clock
ఇంటికెళ్లే 12 B రూటు మొత్తం రోడ్ బ్లాక్

నీ పక్కనున్న వేళ కార్ హార్న్ కూడా
క్లాసికల్ మ్యూజిగ్గా
ఈ మండుటెండ కూడా ఏసి జల్లుతోంది
నీ నవ్వులోని మేజిక్కా
టాక్సీ హైర్ చేసి నువ్వు బేరమాడుతుంటే
క్యూట్ గుందే బేసిగ్గా
బ్రేక్స్ వేసినప్పుడల్లా నీ బుగ్గనన్నుతాకి
సారి చెప్పె నాజూగ్గా
నువ్వున్న కిటికీ ఏవైపొ వెతికి
వాట్స్ ఆప్ చేస్తావా
మబ్బుల్ని కదిపి మొహమాట పెట్టి
చంద్రుణ్ణి తెస్తాగా

బయటకొచ్చి చూస్తే టైమేమో 3 O'Clock
ఇంటికెళ్లే 12 B రూటు మొత్తం రోడ్ బ్లాక్
బయటకొచ్చి చూస్తే టైమేమో 3 O'Clock
ఇంటికెళ్లే 12 B రూటు మొత్తం రోడ్ బ్లాక్




గాలివాలుగా పాట సాహిత్యం

 
చిత్రం: అజ్ఞాతవాసి (2017)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అనిరుద్ రవిచంద్రన్

గాలివాలుగా ఓ గులాభి వాలి 
గాయమైనదీ నా గుండెకు తగిలి 
తపించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీకోసం 
తరించిపోనా చెలీ ఇలా దొరికితె నీ స్నేహం 
ఏం చేశావే మబ్బులను పువ్వుల్లో తడిపీ 
తేనెజడిలొ ముంచేసావే గాలులకు గందం రాసి 
పైకి విసురుతావే 
ఏం చేస్తావె మెరుపు చురకత్తుల్నీ దూసి 
పడుచు యెదలో దించేశావే 
తలపునే తునకలు చేసీ తపన పెంచుతావే

నడిచే హరివిల్లా నను నువ్విల్ల గురు పెడుతుంటే యెల 
అణువణువున విలవిలమనదా ప్రాణం నిలువెల్లా 
నిలు నిలు నిలు నిలబడు పిల్ల గాలిపటంలా ఎగరకె అల్లా 
సుకుమారి సొగసునలా ఒంటరిగా వదలాలా చూస్తేనే 

గాలివాలుగా ఓ గులాభి వాలి 
గాయమైనదీ నా గుండెకు తగిలి 
తపించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీకోసం 
తరించిపోనా చెలీ ఇలా దొరికితె నీ స్నేహం...హుమ్...

కొరా కొరా కోపమేలా చురా చురా చూపులేలా 
మనోహరి మాడిపోనా అంత ఉడికిస్తే 
అరె అనీ జాలిపడవేం పాపం కదే ప్రేయసీ 
సరే అని చల్లబడవే మోసీ పిసాచీ 
ఉహూ అలా తిప్పుకుంటూ ఊలిపోకే ఊర్వసీ 
అహొ అలా నవ్వుతావే మీసం మెలేసీ 
ఎన్నాళ్ళింకా ఊరికే ఊహల్లో ఉంటాం పెంకి పిల్లా 
చాల్లే ఇంకా మానుకో ముందూ వెనక చూసుకోని పంతం 
ఆలొచిద్దాం చక్కగా కూర్చొని చర్చిద్దాం 
చాలు యుద్ధం రాజీకొద్దాం వద్దిగా కలిసొస్తే 
నీకేమిటంట కష్టం 

నడిచే హరివిల్లా ననువ్ నువ్విల్ల గురు పెడుతుంటే యెల 
అణువణువున విలవిలమనద ప్రాణం నిలువెల్లా 
నిలు నిలు నిలు నిలబడు పిల్ల గాలిపటంలా ఎగరకె అల్లా 
సుకుమారీ సొగసునలా ఒంటరిగా వదలాలా 
ఏం చెయ్యాలోలే 

గాలివాలుగా ఓ గులాభి వాలి 
గాయమైనదీ నా గుండెకు తగిలి 
తపించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీకోసం 
తరించిపోనా చెలీ ఇలా దొరికితె నీ స్నేహం హూఁ...



ధగ ధగమనే పాట సాహిత్యం

 
చిత్రం: అజ్ఞాతవాసి (2017)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సాహిత్యం: శ్రీమణి
గానం: అనిరుద్ రవిచంద్రన్

ధగ ధగమనే తూరుపు దిశా 
పడమర నిశై ముగిసనే 
గల గలమనే నది పదనిసా 
కన్నిరులో తడిసనే 
కొడవలి బుజమున వేసీ 
కొడుకే కోతకు కదిలే 
కర్మను తనువుగ విసిరే 
భార్గవ రాముడు వీడె 
సాదువు కలే వెలుగున పడి 
సత్యం ఇలా మెరిసనే 
అగ్ఞాతమే మెరుగున పడీ 
ఆయుదమెగసనే 

ఎర్రగ తడిపెనే ఏ రాచ రక్తమో నింగిని 
కోరగా మెరిసెనే పసి కరిగనంచునో కిరనమె 
మెరుపుల దీపం చమురల్లె చీకటి ఒంపి 
మబ్బుల్లొ వెలుతురు నింపి చిరు చినుకులు కురిపిస్తాడే 
చినుకుల దారం చివరంచుకు నిగిని చుట్టి 
చిగురించె నేలకు కట్టీ రెండిటిని కలిపేస్తాడే 
రాముని వరం నీరేదని అయ్యోరినే అడిగనే 
అమ్మా అని అనలేదనీ పసి దూడనే నలిపనే 

కొడవలి బుజమున వేసీ 
కొడుకే కోతకు కదిలే 
కర్మను తనువుగ విసిరే 
భార్గవ రాముడు వీడె 

సిద్ధుడి ప్రణవంలా వీడు 
బుద్ధుడి శ్రవణంలా వీడూ 
యుద్దమంత శబ్ధం వీడు 
వీడొక ప్రమానం 
రణములా నినదీస్తుంటాడు 
శరములా ఎదురొస్తుంటాడు 
మరణ శరణ దోరనమితడు 
వీడొక ప్రమాదం 
రివ్వంచున కలా 
అడుగడుగున నిజమై కనిపించేలా 
వీడో విడుదలా 
ఎన్ని ప్రాణాల మౌనాల కీవేల 

మెరుపుల దీపం చమురల్లె చీకటి ఒంపి 
మబ్బుల్లొ వెలుతురు నింపి చిరు చినుకులు కురిపిస్తాడే 
చినుకుల దారం చివరంచుకు నిగిని చుట్టి 
చిగురించె నేలకు కట్టీ రెండిటిని కలిపేస్తాడే 
ఎర్రగ తడిపెనే ఏ రాచ రక్తమో నింగిని 
కోరగా మెరిసెనే పసి కరిగనంచునో కిరనమే 

కుళ్ళిందనీ వివరించదే పువ్వుల యదే ఎన్నడు 
కన్నిల్లనే వడబోయదే మేఘం ఎప్పుడూ 



స్వాగతం కృష్ణా.. పాట సాహిత్యం

 
చిత్రం: అజ్ఞాతవాసి (2017)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సాహిత్యం: శ్రీ  వెంకట  సుబ్బయ్యర్  కృతి
గానం: పద్మలత, నిరంజన రామన్ 

మధురాపురి సదనా మృధు వదనా మధుసూదన 
ఇహ స్వాగతం కృష్ణా...చరణాగతం కృష్ణా... 
మధురాపురి సదనా మృధు వదనా మధుసూదన 
ఇహ స్వాగతం కృష్ణా...శరణాగతం కృష్ణా... 
మధురాపురి సదనా మృధు వదనా మధుసూదన 
ఇహ స్వాగతం కృష్ణా...శరణాగతం కృష్ణా... 
మధురాపురి సదనా మృధు వదనా మధుసూదన 
ఇహ స్వాగతం కృష్ణా... 
కృష్ణా... 

ముష్ఠికాసూర చానూర మల్ల 
మల్లవిషాదత మధుసూదనా 
ముష్ఠికాసూర చానూర మల్ల 
మల్లవిషాదత మధుసూదనా 
ముష్ఠికాసూర చానూర మల్ల 
మల్లవిశారద కువలయపీట 
మర్దన కలింగ నర్తన గొకుల రక్షణ సకల సులక్షన దేవా... 
మర్దన కలింగ నర్తన గొకుల రక్షణ సకల సులక్షన దేవా... 
శిస్ఠగనపాల సంకల్పకల్ప 
కల్ప శతకోటి అసమపరాభవ. 
శిస్ఠగనపాల సంకల్పకల్ప 
కల్ప శతకోటి అసమపరాభవ. 
ధీర మునిజన విహర మధన సుకుమార దైత్య సం.హర దేవ. 
ధీర మునిజన విహర మధన సుకుమార దైత్య సం.హర దేవ. 

మధుర మధురరథి సాగస సాగస 
వ్రజ యూవ్తీజనమానసపూజిత 
మధుర మధురరథి సాగస సగస 
వ్రజ యూవ్తీజన మానస పూజిత 

స ద ప గ రి ప గ రి స గ సా 
స రి గ ప ద స గ ప గ రి ప గ రి స గ సా 
స స రి రి గ గ ప గ స స ద ప ప గ రి రి 
ప గ రి స గ సా 
స రి గ రి గ ప గ ప ద 
స ద ప గ రి ప గ రి స గ సా 
స ద ప గ రి ప గ రి స గ సా 
స ద ప గ రి ప గ రి స గ సా 

తకదరి తుకుంతన కిటతకదీం 
తకదరి తుకుంతన కిటతకదీం 
తకదరి తుకుంతన కిటతకదీం 
తకదరి తుకుంతన కిటతకదీం 
తకదరి తుకుంతన కిటతకదీం 
తకదరి తుకుంతన కిటతకదీం 
తకదరి తుకుంతన కిటతకదీం 
తకదరి తుకుంతన కిటతకదీం 

కృష్ణా.... 




AB యవరో నీ బేబి పాట సాహిత్యం

 
చిత్రం: అజ్ఞాతవాసి (2017)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సాహిత్యం: శ్రీమణి
గానం: నకాష్ అజీజ్ , అర్జున్ చాండి

AB యవరో నీ బేబి 
మిల మిల ఇటు మెరుపుల రాతిరీ 
అటు వలపుల వైఖరీ 
ఓ నారి నారి నడుమ మురారి ఏటు నీ దారి 
చంద్రుడె చుక్కల్లొ చిక్కెరో...మబ్బుల్లో నక్కెరో 
ఓ ప్రేమ విహారి ఎటు రా నీ గురీ 
ఓ వైపు volcano...ఓ వైపు cyclone 
వొనికెను తడిసిన నగరంలా 
కునుకే చెదిరిన హ్రుదయం 
ఓ వైపు cyanide ఓ వైపు ఉరితాడు 
వలపుల జైల్లొ ఖైదీలా 
ఇది దారి లేని తరుణం 

బాజొ దేవుడ పువ్వులతో ప్రళయమా 
కౌగిలి కలహమా నవ్వులతో నరకమే న్యాయమా 
ఓ లా దేవుడ వెన్నెలతో వినయమా 
ఆయుద పూజలే అందంతో చెయ్యడం భావ్యమా 

మిల మిల ఇటు మెరుపుల రాతిరీ 
అటు వలపుల వైఖరీ 
ఓ నారి నారి నడుమ మురారి ఏటు నీ దారి 

AB యవరో నీ బేబి 

ఇరు నడకల నాట్యం ఏ పాదం తన సొత్తంటుందో 
చిరు నగవుల లాస్యం ఏ పెదవికి సొంతం 
కనుపాపల స్వప్నం ఏ కన్ను తన హక్కంటుందో 
ఇరు తీరపు సంద్రం ఏ ఒడ్డుకి సొంతం 

AB యవరో నీ బేబి 
కన్నుల్లొ ఆగీ ఆగీ 
పదవుల అంచును దాటను అందో 
AB యవరో నీ బేబి 
మదిలోనె దాగీ దాగీ బయటకి రానందో 

బాజొ దేవుడ పువ్వులతో ప్రళయమా 
కౌగిలి కలహమా నవ్వులతో నరకమే న్యాయమా 
ఓ లా దేవుడ వెన్నెలతో వినయమా 
ఆయుద పూజలే అందంతో చెయ్యడం భావ్యమా 

మిల మిల ఇటు మెరుపుల రాతిరీ 
అటు వలపుల వైఖరీ 
ఓ నారి నారి నడుమ మురారి ఏటు నీ దారి 

AB యవరో నీ బేబి 




కొడకా కోటేశ్వర రావు పాట సాహిత్యం

 
చిత్రం: అజ్ఞాతవాసి (2017)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: పవన్ కళ్యాణ్


కొడకా కోటేశ్వర రావు 

Most Recent

Default