Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Jeevana Jyothi (1975)




చిత్రం: జీవన జ్యోతి (1975)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: శోభన్ బాబు , వాణిశ్రీ
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాత: డి. వి.యస్.రాజు
విడుదల తేది: 16.05.1975



Songs List:



ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు పాట సాహిత్యం

 
చిత్రం: జీవన జ్యోతి (1975)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: దాశరథి
గానం: పి.సుశీల

ష్.. ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...ష్..
సద్దు చేసారంటె వులికులికి పడతాడు
ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు
సద్దు చేసారంటె వులికులికి పడతాడు
గోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగు
గోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగు
మా చిన్ని కన్నయ్య లోకానికె వెలుగు

ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు
సద్దు చేసారంటె వులికులికి పడతాడు

చల్లగా నిదరోయే బాబు
నిదురలో మెల్లగ నవ్వుకునే బాబు
ఏమి కలలు కంటున్నాడొ తెలుసా... తెలుసా
ఏ జన్మకు ఈ తల్లే కావాలనీ
ఏ జన్మకు ఈ తల్లే కావాలనీ
ఈ ఒడిలోనె ఆదమరచి వుండాలనీ

జుజుజు జుజు  జుజుజు జుజు

ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు
సద్దు చేసారంటె వులికులికి పడతాడు

దేవుడే నా ఎదురుగ నిలబడితే
ఏమి కావాలి తల్లీ అని అడిగితే
నేనేమని అంటానో తెలుసా...తెలుసా
నీ నీడలో నా వాడు పెరగాలనీ
నీ నీడలో నా వాడు పెరగాలనీ
పెరిగి నీలాగే పేరుతెచ్చుకోవాలని

జుజుజు జుజు  జుజుజు జుజు

ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు
సద్దు చేసారంటె వులికులికి పడతాడు
గోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగు
మా చిన్ని కన్నయ్య లోకానికె వెలుగు

జుజుజు జుజు  జుజుజు జుజు





ఎందుకంటే ఏమీ చెప్పను పాట సాహిత్యం

 
చిత్రం: జీవన జ్యోతి (1975)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: యస్. పి. బాలు, రమోల

ఊ... ఇవన్నీ ఎందుకండీ...

ఎందుకంటే ఏమీ చెప్పను
ఏమిటంటే ఎలా చెప్పను
సద్దుమణిగిన ఈ వేళ
మన మిద్దరమే ఉన్న వేళ
తెల్లచీర తెస్తే మల్లెపూలు ఇస్తే

ఎందుకంటే ఏమీ చెప్పను
అందుకే అని ఎలా చెప్పను

అబ్బ....ఎప్పుడూ అదే....

పిల్లి: మ్యావ్ ..... మ్యావ్

అందాల ఓపిల్లి  అరవకే నాతల్లి
ఇపుడిపుడే కరుణించే చిన్నారి సిరిమల్లి
క్షణముదాటిందంటే మనసుమారునో యేమొ
అంతగా పనివుంటే ఆ పైనరావే 
దయచేసి పోవే 

పిల్లి: మ్యావ్ ..... మ్యావ్

ఇంతకన్నా ఏమిచెప్పను
అందుకే అని ఎలా చెప్పను

అబ్బా .... నిద్దరోస్తోందండీ !

కొత్తగా పెళైన కోడే వయసు జంట
కొన్నేళ్ళవరకైన నిదురే పోరాదంట

మరి....

సుద్దులాడాలంట - పొద్దు గడపాలంట
ముద్దులాడాలంట మోజు తీరాలంట
ఇంతకన్నా ఏమి చెప్పను
ఎందుకంటే ఏమి చెప్పను
అందుకే అని ఎలాచెప్పను ఎలాచెప్పను




సిన్నీ ఓ సిన్నీ! పాట సాహిత్యం

 
చిత్రం: జీవన జ్యోతి (1975)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: పి.సుశీల, యస్. పి. బాలు

సిన్నీ ఓ సిన్నీ! 
ఓ సన్నజాజుల సిన్నీ! 
ఓ వన్నె గాజుల సిన్నీ
తుర్రుమని నువ్వెళ్ళిపోతే
తూరుపు దిక్కూ ఆపేస్తుంది
ఉరిమిరిమి చూశావంటే
ఉత్తరదిక్కూ ఊపేసుంది

కల్లబొల్లి మాటలతో అల్లరి పెడితే
నన్నల్లరిపెడితే
వెల్లువ గోదారిలా కమ్మేస్తాను
నిన్ను కమ్మేస్తాను
గోదారిపొంగల్లే నామీదికి ఉరికొస్తే
రాదారిపడవల్లే తేలితేలి పోతాను

కొమ్మ మీద చిలకమ్మకు కులుకే అందం
ఈ కోనసీమ బుల్లెమ్మకు అలకే అందం
గూటిలోని గోరింకకు చాటు సరసం అందం 
ఈ గుంటూరి పిల్లగానికి ఘాటు సరసం అందం

పూత రేకుల తీయదనం 
నీలేత సొగసులో వుంది
పాల మీగడ కమ్మదనం 
నీ పడుచుదనంలో వుంది
కోడెగిత్త పొగరంతా నీ కొంటె వయసులో వుంది 
అందుకేనేమో
ఊ అందుకేనేమో....

తుర్రుమని నే వెళ్లాలంటే 
తూరుపు దిక్కూ ఆపేస్తుంది
ఉరిమురిమీ చూడాలంటే 
ఉత్తరదిక్కూ ఊపేసింది

సిన్నీ ఓ సిన్నీ.....
సిన్నీ ఈ సిన్నీ  నీ సన్న జాజుల సిన్నీ
నీ వన్నెగాజుల సిన్నీ
పున్నమి చంద్రునిలోనే ఈ సిన్నీ
వెన్నెలై విరబూస్తుంది ఈ సిన్ని

సిన్నీ ఓ సిన్నీ .....





ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో పాట సాహిత్యం

 
చిత్రం: జీవన జ్యోతి (1975)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: పి.సుశీల, వసంత

అమ్మా ... అమ్మా

ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో
ఇక్కడ వెతికీ అక్కడ వెతికి పట్టుకో (2)

లారలల్ల లారలల్ల
లారలల్ల లారలల్ల

అమ్మా - అమ్మా

వస్తున్నాను ఇదిగో వస్తున్నాను 
నా చిన్నారి బాబుకోసం వస్తున్నాను (2)

రా రా రా అమ్మా
రాముని కథలూ చెప్పమ్మా
ఊఁ ఊఁ ఊఁ ఊఁ ఊఁ
కొడుతూ వింటానమ్మా

చెబుతానురా... బాబూ...
ఆ చిరంజీవి కథ నీకు చెబుతానురా
చెబుతానురా... బాబూ...
ఆ చిరంజీవి కథ నీకు చెబుతానురా
బాబూ.... బాబూ.... బాబూ

లారలల్ల లారలల్ల 
లారలల లారలల్ల

అమ్మా - అమ్మా


ఆకాశంలో దాక్కుంటే అక్కడికెట్లా వస్తావు
భూమీలోపల నక్కుంటే ఎట్లా పట్టుకుంటావు
ఆకాశంలో దాక్కుంటే అక్కడికెట్లా వస్తావు
భూమీలోపల నక్కుంటే ఎట్లా పట్టుకుంటావు
తారల నడిగీ... భూదేవి నడిగీ...
నీజాడ తెలుసుకుంటానురా...
నిన్ను నాగుండెలో దాచుకుంటానురా
నాగుండెలో దాచుకుంటానురా




తెలిసిందిలే తెలిసిందిలే పాట సాహిత్యం

 
చిత్రం: జీవన జ్యోతి (1975)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: పి.సుశీల

ఎవరనుకున్నావౌరా నన్నేమనుకున్నావౌరా
ఎవరనుకున్నావౌరా నన్నేమనుకున్నావౌరా
హరివీర భయంకర  హరివీర భయంకర  హరివీర భయంకర  
హరివీర భయంకర  మూర్తిని 
సురలోక వినాశన కీర్తిని 
పది శిరమ్ములున్నవి చూడు 
ఇరువది కరమ్ములున్నవి చూడు 
లంకాదీశుడ శంకర భక్తుడ రావణభీషణ నమదేయుడా
ఎవరనుకున్నావౌరా నన్నేమనుకున్నావౌరా

తెలిసిందిలే  తెలిసిందిలే
నువు మా అమ్మ వే అని తెలిసిందిలే  తెలిసిందిలే
పులి పులిని  బెబ్బులిని
బెబ్బులిని పులి పులిని  అ...
గాండ్రించి తీండ్రించి  దూకేస్తా
పట్టేసి చుట్టేసి దాటేస్తా
పులి పులిని - బెబ్బులిని

తెలిసిందిలే తెలిసిందిలే 
నువు మా అమ్మ వే అని తెలిసిందిలే - తెలిసిందిలే

ఏడమ్మా నా ముద్దుగుమ్మడు ఏడమ్మా
సందెచీకటి ముసురుకున్నా
ఆల మందలింటికి చేరుకున్నా చిన్నిపాపడు రాడాయె
కన్న మనసే చిన్నబోయె
మట్టి తిన్నా వెందుకనినే
కొట్టినందుకు అలిగెనో రోటికి
కట్టిందందుకు అలిగెనో
నా చిట్టి తండ్రీ లేత గుండే
చెదరెనో ఎంతగా బెదరెనో

వీడమ్మా నీ ముద్దుగుమ్మడు వీడమ్మా
ఓ యమ్మా నువు మా అమ్మవే సుమా

ఏడమ్మా 




దెబ్బకు దెయ్యం వదిలించావు పాట సాహిత్యం

 
చిత్రం: జీవన జ్యోతి (1975)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: రమోల, యస్. పి. బాలు

దెబ్బకు దెయ్యం వదిలించావు
అబ్బబ్బబ్బ - అమ్మమ్మమ్మమా
దిమ్మ దిరగ వాయించావూ

చీరగట్టినది చీంబూతైనా
చిమ చిమలాడే చిట్టిబాబులకు
దెబ్బకు దెయ్యం వదిలించావు
అబ్బబ్బబ్బ- అమ్మమ్మమ్మ మా
దిమ్మ దిరగ వాయించావూ

కళ్ళనునమ్మితే పళ్ళురాలెనూ... దేవా... దేవా
ఒళ్ళంతా హూనమాయెనూ.... దేవా.... దేవా
ప్రేమా వద్దూ... పెళ్లి వద్దూ...
పెళ్లాం వద్దూ... పిల్లలు వద్దూ...

అదుగో అదుగో పడకగదీ
ఆసంగతి ఎత్తకు ఎత్తకు
పక్కనవున్నది పట్టెమంచము
హరి హరి నాతో చెప్పకు
ఎన్నాళ్లెన్నాళ్ళీ వైరాగ్యం
చూద్దాం చూద్దాం నీవైభోగం

నాబుద్ధి గడ్డి తిన్నది అనుకో
పప్పులో కాలేశాననుకో
నిను జతలు జతలు కనమన్నానా
యీ గతి పట్టే ననుకున్నానా ? - దేవా
తప్పంతా నామీద నెట్టి నువ్
తప్పించుకొందు ననుకున్నావా ?
ఆలూమగలొక మాటనుకుంటే
అంతా సరిపడిపోయేది
ఇప్పుడనుకుంటే ఫలమేముందీ
ఇకనైనా చెంప లేసుకోండి

దెబ్బకు దెయ్యం వదిలించావు
అబ్బబ్బబ్బ- అమ్మమ్మమ్మ మా
దిమ్మ దిరగ వాయించావూ

Most Recent

Default