చిత్రం: దేవదాసు (1974)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు
నటీనటులు: కృష్ణ , విజయనిర్మల
దర్శకత్వం: విజయనిర్మల
నిర్మాత: యస్.రమానంద్
విడుదల తేది: 06.12.1974
పల్లవి:
మేఘాల మీద సాగాలి
అనురాగాలరాశిని చూడాలి
నే పదం పాడుతూ ఉరకాలి
నువు కదం తొక్కుతూ ఎగరాలి
అహహా...అహా... ఓహోహో... హోహో...
చల్‌రే బేటా చల్ చల్ చల్‌రే బేటా చల్
చల్‌రే బేటా చల్ చల్ చల్‌రే బేటా చల్
చరణం: 1
చిన్ననాటి ఆ చిలిపితనం కన్నెవయసులో పెరిగిందా
వన్నెల చిన్నెల పడుచుదనం వాడిగా పదును తేరిందా
చిన్ననాటి ఆ చిలిపితనం కన్నెవయసులో పెరిగిందా
వన్నెల చిన్నెల పడుచుదనం వాడిగా పదును తేరిందా
తెలుసుకోవాలి కలుసుకోవాలి పారును నా పారును
మేఘాల మీద సాగాలి
అనురాగాల రాశిని చూడాలి
నే పదం పాడుతూ ఉరకాలి
నువు కదం తొక్కుతూ ఎగరాలి
అహహా... అహా... ఓహోహో... హోహో...
చల్‌రే బేటా చల్ చల్ చల్‌రే బేటా చల్
చల్‌రే బేటా చల్ చల్ చల్‌రే బేటా చల్
చరణం: 2
ఆమెకు ఎంతో అభిమానం అయినా నేనే ప్రాణం
నా మొండితనంలో తీయదనం ఆ చెవులకు మురళీగానం
ఆమెకు ఎంతో అభిమానం అయినా నేనే ప్రాణం
నా మొండితనంలో తీయదనం ఆ చెవులకు మురళీగానం
ఏడిపించాలి కలసి న వ్వాలి పారుతో నా పారుతో
మేఘాల మీద సాగాలి
అనురాగాల రాశిని చూడాలి
నే పదం పాడుతూ ఉరకాలి
నువు కదం తొక్కుతూ ఎగరాలి
అహహా... అహా... ఓహోహో... హోహో...
చల్‌రే బేటా చల్ చల్ చల్‌రే బేటా చల్
చల్‌రే బేటా చల్ చల్ చల్‌రే బేటా చల్
******* ******* *******
చిత్రం: దేవదాసు (1974)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు
పల్లవి:
జీవితం... ఏమిటి?
వెలుతురూ... చీకటి.. అంతే
జీవితం ఏమిటి... వెలుతురూ చీకటి అంతే
వెలుతురంతా చీకటైతే... అందులోనే సుఖము ఉన్నది
అవును.. జీవితం ఏమిటి... వెలుతురూ చీకటి
చరణం: 1
మనసు విరిగి తునకలైతే.. ఏ.... ఏ
తునక తునకలో... నరకమున్నది
మనసు విరిగి తునకలైతే.. ఏ.... ఏ
తునక తునకలో... నరకమున్నది
లేదు లేదనుకున్న శాంతి చేదులోనే ఉన్నది
ఈ చేదులోనే ఉన్నది... హా... హా... హా...
జీవితం ఏమిటి... వెలుతురూ చీకటి
చరణం: 2
రామచిలక ఎగిరిపోతే... రాగబంధం సడలిపోతే
రామచిలక ఎగిరిపోతే... రాగబంధం సడలిపోతే
మూగ హృదయం... గాయమైనది
ఆ గాయమే ఒక గేయమైనది...
ఆ గాయమే ఒక గేయమైనది...
జీవితం ఏమిటి... వెలుతురూ చీకటి అంతే
వెలుతురంతా చీకటైతే... అందులోనే సుఖము ఉన్నది
జీవితం ఏమిటి... వెలుతురూ చీకటి
వెలుతురూ.... చీకటి
వెలుతురూ.... చీకటి
******* ******* *******
చిత్రం: దేవదాసు (1974)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
పొరిగింటి దొరగారికి పొగరు ఎక్కువ
ఇరుగింటి చినదానికి తగని మక్కువ
ఇద్దరికీ.. ఇద్దరికీ కుదిరితే ఏమి తక్కువ ?
చరణం: 1
ఈ మదికీ ఆ మదికీ అడ్డు గోడ లేదు
ఈ ఇంటికి ఆ ఇంటికి అడ్డుగోడ వుంది
ఈ మదికీ ఆ మదికీ అడ్డు గోడ లేదు
ఈ ఇంటికి ఆ ఇంటికి అడ్డుగోడ వుంది
గోడ నడుమ ఒక మూయని తలుపు ఉందిలే ఆ..
తలుపు వెనుక రా రమ్మను పిలుపు ఉందిలే
పొరిగింటి దొరగారికి పొగరు ఎక్కువ
ఇరుగింటి చినదానికి తగని మక్కువ
ఇద్దరికీ ఇద్దరికీ కుదిరితే ఏమి తక్కువ ?
చరణం: 2
చదవేస్తే ఉన్నమతి జారిందేమో?
మది నిండా వలపుంటే చదువు ఎందుకు
చదవేస్తే ఉన్నమతి జారిందేమో?
మది నిండా వలపుంటే చదువు ఎందుకు
దొరవేషం వేసినా దుడుకుతనం పోదా.. ఏయ్
ఇంత ఎదిగినా నీలో పిరికితనం పోదా
పొరిగింటి దొరగారికి పొగరు ఎక్కువ..
ఇరుగింటి చినదానికి తగని మక్కువ
ఇద్దరికీ ఇద్దరికీ కుదిరితే ఏమి తక్కువ ?
******* ******* *******
చిత్రం: దేవదాసు (1974)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు
పల్లవి:
కల చెదిరిందీ... కథ మారిందీ
కన్నీరే ఇక మిగిలిందీ.. కన్నీరే ఇక మిగిలిందీ
కల చెదిరిందీ.. కథ మారిందీ
కన్నీరే ఇక మిగిలిందీ... కన్నీరే ఇక మిగిలిందీ
చరణం: 1
ఒక కంట గంగ.. ఒక కంట యమునా
ఒక్కసారే కలసి ఉప్పొంగెనూ.. ఒక్కసారే కలసి ఉప్పొంగెనూ
ఆ...ఆ....ఆ....ఆ... ఆ...ఆ....ఆ....ఆ...
కన్నీటి వరదలో నువు మునిగినా
చెలి కన్నుల చెమరింపు రాకూడదూ
చెలి కన్నుల చెమరింపు రాకూడదూ
కల చెదిరిందీ... కథ మారిందీ..
కన్నీరే ఇక మిగిలిందీ కన్నీరే ఇక మిగిలిందీ
చరణం: 2
మనసొక చోట మనువొక చోట మమతలు
పూచిన పూదోట మమతలు పూచిన పూదోట
ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
కోరిన చిన్నది కుంకుమ రేఖల కుశలాన ఉండాలి ఆ చోట
కుశలాన ఉండాలి ఆ చోట
కల చెదిరిందీ.. కథ మారిందీ...
కన్నీరే ఇక మిగిలిందీ... కన్నీరే ఇక మిగిలిందీ
******* ******* *******
చిత్రం: దేవదాసు (1974)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు
పల్లవి:
ఇది నిశీధ సమయం అది తిరుగులేని పయనం ఊ..
తిరిగి రాని పయనం తిరిగి రాని పయనం
ఇది నిశీధ సమయం.. అది తిరుగులేని పయనం
తిరిగి రాని పయనం.. ఇది నిశీధ సమయం
ఈ సమయం భ్రాంతి సుమా.. ఆ పయనం మాయ సుమా..
అంటున్న నేను.. వింటున్న నీవు
అంతా మాయసుమా.. అంతా భ్రాంతి సుమా
చరణం: 1
అయిదు సరుకుల మేళవింపుతో.. తొమ్మిది తలుపుల భవనం
అందులోన నివాసం మాని హంస చేరురా గగనం
తానే లేని సదనంలో తలుపులు ఎందుకురా..
తిరిగి రానే రాని పయనంలో పిలుపులు ఎందుకురా
ఇది నిశీధ సమయం.. అది తిరుగులేని పయనం
తిరిగి రాని పయనం.. ఇది నిశీధ సమయం...
చరణం: 2
మరలా పుట్టుక.. మరలా చచ్చుట ఇరుసే లేని చక్రం
వచ్చేవారూ పొయేవారూ జగతి పురాతన సత్రం
రాకడకైనా పోకడకైనా కర్తవు కావుర నీవు
అన్ని అంచెలు దాటిన పిదప ఉన్నది కడపటి రేవు
ఇది నిశీధ సమయం.. అది తిరుగులేని పయనం
తిరిగి రాని పయనం.. ఇది నిశీధ సమయం