Home Movies / Albums Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Lorry Driver (1990)


చిత్రం: లారీ డ్రైవర్  (1990)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, జానకి
నటీనటులు: బాలకృష్ణ, విజయశాంతి
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: యస్.జయరామా రావు
విడుదల తేది: 21.12.1990

తల్లి దండాలే... ఓ...
కాళి జేజేలే... ఓ...
దసరా వచ్చిందయా... సరదా తెచ్చిందయా
దశమే వచ్హిందయా... దశనే మార్చిందయా
జయహో దుర్గా భవాని హొయ్
వెయ్యరో పువ్వుల హారాన్ని హొయ్
ఓ...... ఓ...... ఓ...... ఓ......
రాతిరిలో సూర్యుడిని చూడాలా.....
జాతరతో స్వాగతమే పాడాలా.....

ఈ జోరు పైగేరు తొక్కాలా చుక్కలు చేతుల్లో చిక్కాలా
అమ్మోరి దీవెన్లు దక్కేలా ముమ్మారు చెయ్యెత్తి మొక్కాలా
నింగి నేలా ఉప్పొంగేలా
సంతోషాలే చిందెయ్యాలా
గుళ్ళో దేవుడు సారధికాగా
లారి డ్రైవరు ఓనరు కాడా
ఓ.... ఓ...... ఓ..... ఓ
ముచ్చటగా ముందుకురా తొందరగా....
పచ్చదనం పంచుకునే పండుగరా....

వాకిట్లొ చీకట్లు తొలిగేలా చూపుల్లో దీపాలు వెలగాలా
దాగున్న దయ్యాలు జడిసేలా తెల్లార్లు జాతర్లు జరగాల
మచ్చేలేని జాబిలి నేడు
ఇచ్చిందమ్మా చల్లని తోడు
నిన్నా మొన్నటి పేదల పేట
నేడో పున్నమి వెన్నెల కోట
ఓ.... ఓ...... ఓ..... ఓ
బంజరులో బంగరులే పండెనురో...
అందరిలో సంబరమే నిండెనురో...


Most Recent

Default