Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Guru (1980)




చిత్రం: గురు (1980)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: కమల్ హాసన్, శ్రీదేవి
దర్శకత్వం: ఐ.వి.సాయి
నిర్మాత: ప్రకాష్ .ఆర్.సి.
విడుదల తేది: 18.07.1980



Songs List:



ఆడండి పాడండి పాట సాహిత్యం

 
చిత్రం: గురు (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు & కోరస్ 

ఆడండి పాడండి
అల్లరి పసిపువ్వులు
మనసులు తెల నిని
తలపులు తీయనివి ఆ దేవుని జేగంటలు

మీరేరా మా దీపాలు
ప్రమిదలూ - మీ బ్రతుకులూ
పెరగనీ అవి వెలుగులు
కోపం వస్తే బాణాలు
కూరిమికిచ్చే ప్రాణాలు
పాపలూ బాబులూ
దేవుని జే గంటలు

చరితంటే మన చేతలని ప్రతిపనీ మన ప్రగతని
అనుకొని మనమొకటని .. పాతేయండి స్వార్థాన్ని
పాలించండి దేశాన్ని --
పాపలూ బాబులూ....దేవుని జే గంటలూ



నేలైనా నింగైనా పాట సాహిత్యం

 
చిత్రం: గురు (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

నేలైనా నింగైనా నీ వెంటే నేనుంటా
నిన్ను నేను విడిచిపెట్టి వెళ్లిపోనులే
నన్ను నీవు తప్పుకుని వెళ్లలేవులే
నీ ఖైదీ నొకనాడు నా ఖైదీ వీనాడు

జరిగేదా కలనైనా - దొరికేదా వలలోనా
గూటిలో రామచిలుక నేను కానులే
వేటలో మేటిదొరా నీవు కావులే
నీ పంతం నెగ్గేదా నా బింకం తగ్గేదా....
తలరాతా తప్పేదా తరువాతా ఏడ్చేదా
హృదయంలో చోటుంది - ఎదురొస్తే చేటుంది
ఇద్దరం చేరితే ఒక కథ
ముద్దు చేస్తే ముద్దబంతి పూయదా నవ్వదా
కథ నువ్వు రాసేదా - తుది నీకు తెలిసేదా
నేనేమీ నీ సొమ్మూ కాలేను కీలుబొమ్మా
కాముకుని మాటలే కవితలా
కళ్లలో కమ్ముకున్నవీ మత్తులా మబ్బులా
నేలైనా....
గూటిలో ....
నీ ఖైదీ ....
జరిగేదా....
నీ వెండే....



కన్నుల కైపు వెన్నెల చూపు పాట సాహిత్యం

 
చిత్రం: గురు (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.జానకి 

కన్నుల కైపు వెన్నెల చూపు
ఉన్నది నీ కోసం
నేనంటే నేను కాను
నాలో నేను లేను 

ఏదో సరికొత్తగా గమ్మత్తుగా
నా దేహమంతా ఎగబాకెను
ఆకాశము భూలోకము
ఒక కౌగిట ఒకటాయెను. ఆ ...

నాలో ఉయ్యాలలూ జంపాలలూ
ఊగేది ఎవరో నువ్వెరగవా ....
నీ ప్రేమనే తాగానురా
ఆ మత్తులో ఊగానురా.... ఆఁ....




నా వందనము... పాట సాహిత్యం

 
చిత్రం: గురు (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.జానకి 

పల్లవి:
నా వందనము...  సరసుల రసికుల సదసుకు
నా వందనము...  సరసుల రసికుల సదసుకు

నా పాట మీరు మెచ్చేందుకు
మీ దీవెనలను ఇచ్చేందుకు
శుభము అందరకు...

నా వందనము...  సరసుల రసికుల సదసుకు

చరణం: 1
తేట తేనియ తెలుగుంది..  తీయ తీయని తలపుంది..
తేట తేనియ తెలుగుంది..  తీయ తీయని తలపుంది..
రాగం ఉందీ.. నాలో వేదం ఉంది..

మాటే పాటై...  పాటే ఆటై..
నీకు తానులోకం ఎదుటనాట్యమాడనా....  ప్రియా

నా వందనము...  సరసుల రసికుల సదసుకు 

చరణం: 2
పాడమన్నది అనురాగం... ఆడమన్నది ఆనందం
పాడమన్నది అనురాగం... ఆడమన్నది ఆనందం

అందాలన్నీ నీకే ఇవ్వాలనీ...  దాచే దాచే వేచే నన్ను
వేల చూసి వచ్చి వేగ స్వీకరించరా....  ప్రియా

నా వందనము...  సరసుల రసికుల సదసుకు
నా పాట మీరు మెచ్చేందుకు
మీ దీవెనలను ఇచ్చేందుకు
శుభము అందరకు...

నా వందనము...  సరసుల రసికుల సదసుకు
నా వందనము...  సరసుల రసికుల సదసుకు




పేరు చెప్పనా పాట సాహిత్యం

 
చిత్రం: గురు (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

పేరు చెప్పనా నీ రూపు చెప్పనా
నీ పేరే అనురాగం
నీ రూపము శృంగారము
నీ చిత్తమూ నా భాగ్యము

పేరు తెలుసునూ నీ రూపు తెలుసును
నీ పేరే ఆనందం
నీ రూపము అపురూపము నీ నేస్తాము నా స్వర్గము

చరణం: 1
పువ్వుల చెలి నవ్వొక సిరి
దివ్వెలెలనె నీ నవ్వు లుండగా
మమతల గని మరునికి సరి
మల్లె లేలారా నీ మమతలుండగా
నీ కళ్ళలో నా కలలనె పండనీ
నీ కలలలో నన్నే నిండనీ
మనసై భువి పై దివి నే దిగనీ

చరణం: 2
నీవొక చలం నేనొక అలా
నన్ను వూగనీ నీ గుండె లోపల
విరి సగముల కురులొక వల నన్ను చిక్కనీ ఆ చిక్కు లోపలా
నీ మెప్పులు నా సొగసులు
ఆ మెరుగులూ వెలగనీ వెలుగులా
మనమే వెలుగు చీకటి జథలూ

చరణం: 3
పెదవికి సుధ ప్రేమకు వ్యధా
అసలు అందమూ అవి కోసారు కుందామూ
చెదరని జత చెరగని కథ
రాసుకుందాము పెన వేసుకుందాము
నీ హృదయమూ నా వెచ్చనీ ఉదయము
నీ ఉదయమూ దిన దినం మాధురమూ
ఎన్నో యుగముల యోగము మనమూ




నిమ్మచెట్టు నీడున్నాది పాట సాహిత్యం

 
చిత్రం: గురు (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.జానకి 

పల్లవి: 
నిమ్మచెట్టు నీడున్నాది నిన్ను నన్ను రమ్మనాది
జున్నులాంటి పిల్లున్నాది - జొన్న చేను చాటున్నాది
ఆకురాయి సోకున్నాది ఆశవుంటే రమ్మన్నాది
ఘల్లు మంటదీ జిల్లు మంటది - వెన్నెలంటిది
ఈడువున్నది వేడివున్నది - జోడుకూడి నిన్నాడనున్నది

చరణం: 1
మంచు ఎన్నెట్లో మనసైన చోట
మల్లెతోటల్లో మత్తెన చోట
వంటిగా వుంటది మావా సందమావా
కళ్లలో కైపంతా వళ్ళంతా పాకింది
గుల్ల చేసి పోయిందిరో

చరణం: 2
వంగ తోటలో ఆ వొంపుకాడ
దొంగలా పన్ను ఎంటాడుతుంటే
గుట్టుగా మట్టుగా పైటే జారుతుంటే
పైరే నవ్వుతుంటే గుండెలో గూడేసి
గువ్వల్లే నవ్వుల్లో ముంచావురో

చరణం: 3
వాగూ వరదంటి వయసున్న దాన్ని
ఏటి మెలికంటి వలుపున్న దాన్ని
పువ్వులా రవ్వలా మడికే మల్లెతీగ
కుడితే కందిరీగ 
నా ఎంట నీవుంటే నీ జంట నేనుంటే
యీ మంటలారాలితో


చిత్రం: గురు (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, జానకి
నటీనటులు: కమల్ హాసన్, శ్రీదేవి
దర్శకత్వం: ఐ. వి.సాయి
నిర్మాత: ప్రకాష్ .ఆర్.సి.
విడుదల తేది: 18.07.1980

పేరు చెప్పనా నీ రూపు చెప్పనా
నీ పేరే అనురాగం
నీ రూపము శృంగారము
నీ చిత్తమూ నా భాగ్యము

పేరు తెలుసునూ నీ రూపు తెలుసును
నీ పేరే ఆనందం
నీ రూపము అపురూపము నీ నేస్తాము నా స్వర్గము


చరణం: 1
పువ్వుల చెలి నవ్వొక సిరి
దివ్వెలెలనె నీ నవ్వు లుండగా
మమతల గని మరునికి సరి
మల్లె లేలారా నీ మమతలుండగా
నీ కళ్ళలో నా కలలనె పండనీ
నీ కలలలో నన్నే నిండనీ
మనసై భువి పై దివి నే దిగనీ

చరణం: 2
నీవొక చలం నేనొక అలా
నన్ను వూగనీ నీ గుండె లోపల
విరి సగముల కురులొక వల నన్ను చిక్కనీ ఆ చిక్కు లోపలా
నీ మెప్పులు నా సొగసులు
ఆ మెరుగులూ వెలగనీ వెలుగులా
మనమే వెలుగు చీకటి జథలూ

చరణం: 3
పెదవికి సుధ ప్రేమకు వ్యధా
అసలు అందమూ అవి కోసారు కుందామూ
చెదరని జత చెరగని కథ
రాసుకుందాము పెన వేసుకుందాము
నీ హృదయమూ నా వెచ్చనీ ఉదయము
నీ ఉదయమూ దిన దినం మాధురమూ
ఎన్నో యుగముల యోగము మనమూ



*****  ******   ******



చిత్రం: గురు (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్.జానకి

పల్లవి:
నా వందనము...  సరసుల రసికుల సదసుకు
నా వందనము...  సరసుల రసికుల సదసుకు

నా పాట మీరు మెచ్చేందుకు
మీ దీవెనలను ఇచ్చేందుకు
శుభము అందరకు...

నా వందనము...  సరసుల రసికుల సదసుకు

చరణం: 1
తేట తేనియ తెలుగుంది..  తీయ తీయని తలపుంది..
తేట తేనియ తెలుగుంది..  తీయ తీయని తలపుంది..
రాగం ఉందీ.. నాలో వేదం ఉంది..

మాటే పాటై...  పాటే ఆటై..
నీకు తానులోకం ఎదుటనాట్యమాడనా....  ప్రియా

నా వందనము...  సరసుల రసికుల సదసుకు 

చరణం: 2
పాడమన్నది అనురాగం... ఆడమన్నది ఆనందం
పాడమన్నది అనురాగం... ఆడమన్నది ఆనందం

అందాలన్నీ నీకే ఇవ్వాలనీ...  దాచే దాచే వేచే నన్ను
వేల చూసి వచ్చి వేగ స్వీకరించరా....  ప్రియా

నా వందనము...  సరసుల రసికుల సదసుకు
నా పాట మీరు మెచ్చేందుకు
మీ దీవెనలను ఇచ్చేందుకు
శుభము అందరకు...

నా వందనము...  సరసుల రసికుల సదసుకు
నా వందనము...  సరసుల రసికుల సదసుకు



Most Recent

Default