Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Devanthakudu (1984)


చిత్రం: దేవాంతకుడు (1984)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: జ్యోతిర్మయ్
గానం: యస్.పి.బాలు, జానకి
నటీనటులు: చిరంజీవి , విజయశాంతి
దర్శకత్వం: యస్.ఏ.చంద్రశేఖర్
నిర్మాత: నారాయణ రావు
విడుదల తేది: 12.04.1984

పల్లవి:
ఆకేసి.. పీటేసి.. ముంగిట్లో ముగ్గేసి సోగ్గాడికి
ఆకేసి.. పీటేసి.. ముంగిట్లో ముగ్గేసి సోగ్గాడికి
ఏకంగా రమ్మంటే లగ్గానికి...  ఏపాటి దమ్ముంది పోరగాడికి

చెయ్యెత్త కడియాలు... కాలెత్త తోడాలు
చెయ్యెత్త కడియాలు... కాలెత్త తోడాలు
కన్నెత్త చెదిరేటి సింగారాలు .. కసికసిగా కాజేస్తా వయ్యారాలు
ఆకేసి.. పీటేసి.. ముంగిట్లో ముగ్గేసి సోగ్గాడికి

చరణం: 1
ఓరకళ్ళ తోటకెళ్లి.. ఎళ్లి...
దోరపళ్ళు మూటగట్టి.. కట్టి..
నే మొయ్యలేకపోయ్య.. అడుగెయ్యలేకపొయ్య
మొయ్యగలగ బుల్లోడెవడున్నాడయ్య...

కత్తిలాంటి.. ఆ.. మొనగాన్ని.. ఆ..
కండబలుపు .. అహా.. కలవాన్ని
నువ్వెత్తలేని బరువు నేనెత్తిపెట్టలేనా
నా సత్తా చూపిస్తానే అత్తకూతురా

ఆకేసి.. పీటేసి.. ముంగిట్లో ముగ్గేసి సోగ్గాడికి
అరెరె.. చెయ్యెత్త కడియాలు... కాలెత్త తోడాలు
ఏకంగా రమ్మంటే లగ్గానికి...  ఏపాటి దమ్ముంది పోరగాడికి
హా.. చెయ్యెత్త కడియాలు... కాలెత్త తోడాలు

చరణం: 2
ఏరు నిండి ఎల్లువయ్యే... అయ్యే
నోరు ఎండి దాహమయ్యి.. అయ్యి
నాఏటవాలు తెలుసా... ఆ తేట నీకు తెలుసా
ఏపాటి నీకు జ్ఞానమయ్యా మావకొడకా
పంట చేను... కోతకొచ్చే..
జంట పిట్ట కూతకొచ్చే...
నీ పట్టు నాకు తెలుసు... లోగుట్టు కూడా తెలుసు
ఓ పట్టు పట్టి చూస్తానే పిట్ట మరదలా

చెయ్యెత్త కడియాలు... కాలెత్త తోడాలు
ఆకేసి.. పీటేసి.. ముంగిట్లో ముగ్గేసి సోగ్గాడికి
కన్నెత్త చెదిరేటి సింగారాలు .. కసికసిగా కాజేస్తా వయ్యారాలు
లాలాల.. లాలాలా.. లలలలలాలలాలాలా ...


*********  *********  *********


చిత్రం: దేవాంతకుడు (1984)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, శైలజ

పల్లవి:
స్వస్తిశ్రీ చాంద్రమాన రుధిరోద్గారి నామ సంవత్సరము..
మార్గశిర పౌర్ణమి బుద్ధవారం పుష్యమి నక్షత్రయుక్త శుభలగ్నమందు

చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట
చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట
ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంటా

చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట
ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంటా
చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట

చరణం: 1
ఎదపై ఆడిన నా చిట్టి చెల్లి... వధువుగ మారే సమయంలో
ఎదపై ఆడిన నా చిట్టి చెల్లి... వధువుగ మారే సమయంలో
నింగినంతగా పందిరి వేసి... నేల నిండుగా వేదిక వేసి
పూలరథంలో పంపిస్తా.. ఆ.. ఆ.. నలుగురిలోనే గర్విస్తా

చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట
చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట
ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంటా
చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట

చరణం: 2
ఆ దేవుడు దిగి వస్తే వరమొక్కటి ఇమ్మంటా
ఆ దేవుడు దిగి వస్తే వరమొక్కటి ఇమ్మంటా
మరు జన్మనేదే ఉంటే ఈ అన్నే కావాలంటా
ఆ దేవుడు దిగి వస్తే వరమొక్కటి ఇమ్మంటా

చరణం: 3
కొంగుముడితో నే వెళ్లిపోతే ఏమౌతుందో నీ పేద మనసు
కొంగుముడితో నే వెళ్లిపోతే ఏమౌతుందో నీ పేద మనసు
ఎక్కడ ఉన్నా.. నేనేమైనా కోరేదేమిటి నీ బాగు కన్నా
పెద్ద మనసుతో దీవిస్తున్నా.. .. ఆ.. ఆ.. వయసుకు నీకు చిన్నైనా

చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట
ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంటా
చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట


*********  *********  *********


చిత్రం: దేవాంతకుడు (1984)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, సుశీల

పల్లవి:
ఘడియకో కౌగిలింత... గంటకో పులకరింత..
ఘడియకో కౌగిలింత.. గంటకో పులకరింత
జతపడితే జంటగ ముడిపడితే
జతపడితే జంటగ ముడిపడితే...
అందాక ఆగేదెట్టా.. ఒంటరిగా వేగేదెట్టా
భామా.. అయ్యో రామా
ఇందాక వచ్చాక సందేల పడ్డాక కాదంటే ఏమౌదునే

ఘడియకో కౌగిలింత.. గంటకో పులకరింత

చరణం: 1
వెంటాడె వయ్యారి రూపు దీపాలు పెట్టేటి వేళా
వేధించె నీ కొంటె చూపు వెన్నెల్లు కాసేటి వేళా
దరికొచ్చి దయ చూసి ముద్దిచ్చి ముద్దందుకోవే
దరికొచ్చి దయ చూసి ముద్దిచ్చి ముద్దందుకోవే
నీ ఒడి చేర్చి కోరిక తీర్చి లాలించవే పాలించవే...
లాలించవే పాలించవే

ఘడియకో కౌగిలింత... గంటకో పులకరింత..
జతపడితే జంటగ ముడిపడితే
జతపడితే జంటగ ముడిపడితే...
అందాక ఆగేదెట్టా.. ఒంటరిగా వేగేదెట్టా
భామా అయ్యో రామా
ఇందాక వచ్చాక సందేల పడ్డాక కాదంటే ఏమౌదునే
ఘడియకో కౌగిలింత గంటకో పులకరింత

చరణం: 2
సన్నాయి మోగింది నాలో చినుకల్లె నే తాకగానే
చలిమంట రేగింది నాలో వెచ్చంగ చేయ్ సోకగానే
ఇపుడైనా ఎపుడైనా ఈ సోకు నీ కోసమేగా
ఇపుడైనా ఎపుడైనా ఈ సోకు నీ కోసమేగా
కౌగిట చేర్చి వేడుక తీర్చి లాలించనా పాలించనా...
లాలించనా పాలించనా...

వానలో కౌగిలింత మేనిలో పులకరింత
ఒకటైతే ఇద్దరమొకటైతే...
ఆ... ఒకటైతే.. ఇద్దరమొకటైతే... ఆ..ఆ

కళ్ళల్లో కాంతుల వానా..
పెదవులపై నవ్వుల వానా..
వలపే పువ్వుల వానా..
నీపైన నా పైన కురిసింది జడివాన..
పరువాల పెదవానగా...

వానలో కౌగిలింత మేనిలో పులకరింత
వానలో కౌగిలింత మేనిలో పులకరింత

Most Recent

Default