Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Punnami Naagu (1980)
చిత్రం: పున్నమి నాగు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, నరసింహారాజు, రతి అగ్నిహోత్రి
దర్శకత్వం: రాజశేఖర్
నిర్మాతలు: యమ్.కుమారన్, యమ్.శరవన్, యమ్.బలసుబ్రహ్మణియన్
విడుదల తేది: 13.06.1980Songs List:అద్దిర బన్నా ముద్దుల గుమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: పున్నమి నాగు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

ఆద్దిరబన్న ముద్దులగుమ్మ -
ముదుగ వున్నాది
అన్నుల మిన్న వెన్నెల కన్న
తస్సా చెక్కా అందాలన్నీ
వెచ్చగ వున్నాది
చెమ్మా చెక్కా లాడేస్తుంటే
అబ్బడి సొత్తు దెబ్బకు
చిత్తు అయ్యిందమ్మాయీ

ఆద్దిరబన్న ఇద్దుర ఉన్న వలపొస్తున్నాది 
నిద్దరలోన మెలకువలోన వాటేస్తున్నాది. 
తస్సా చెక్కా నీ వాటంలో
చెమ్మా చెక్కా కోలాటంలో
అమ్మడిపోకె పిల్లడిసొమ్ము అయ్యిందబ్బాయీ

తేనెల కన్న తీపిగ వున్న వయసొకటున్నది.
మల్లెలకన్న మత్తుగ వున్న మనసొకటున్నది.
రెండిటికన్న రెవరెపమన్న జంటొకటున్నది
నీ జంటొకటున్నది ఆ జంట కౌగిట్లో
ఎన్ని చప్పట్లో
జాతరగున్నాది – ఒక జాతరగున్నాది.
రాతిరి పగలు రమ్మంటున్న చూపొకటున్నాది. 
ఆ చూపు చుక్కై పగలే వెన్నెల కవ్విస్తున్నాది.

కన్ను కన్నూ కలిసిన ముచ్చట కమ్మగ వున్నాది.
ఒక గుమ్ముగ వున్నాది -
ఆ ముద్దు ముచ్చట్లో ఎన్ని చప్పట్లో 
అల్లరిగున్నాది - ఒక అల్లరిగున్నాది.
గడుసు చిన్నది గంగానమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: పున్నమి నాగు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

గడుసు సిన్నది గంగానమ్మ 
గుడిసె సిన్నది అనుకోకమ్మ
బిలుపు సూసినా బులుపు సూసినా 
తలుపు తీసినా పోలేరమ్మ 
దాటిపోలేరమ్మా ఏం ఛాన్సు లేదు.

సుక్క పొడుపుకె పొదు పొడుపులు
అద్దరాతిరే ఆట విడుపులు 
అనుకోమంది అన్ము -సిన్ననాడు మా అమ్మ

సూడవొచ్చిన సుప్పనాతులు
కొంగు పట్టిన కొండ ముచ్చులు
సుట్టాలన్నది అమ్మమ్మ మా అమ్మనుగన్న అమ్మ
ఎన్నెల్లో గుజణాలరై కంఠ గూడెక్కి పోతుంటే
ఎన్నెల్లొ నా యీడు ఏడెక్కి పోతుంటే
ఎట్టాగమ్మా - ఎట్టాగమ్మా దామ్మా

మొగ్గలప్పుడు సిగ్గులొద్దని 
పిందెలప్పుడే పిల్లముద్దవి
అనుకో మన్నది అమ్మ వాడకంత ఒదినమ్మ
మల్లెపువ్వులో మంచువుంటదని
మంచుదులిపితే మాడిపోతదని
ఇనుకోమన్నది ఆమ్మమ్మ రాజమండ్రిరాజమ్మ 
హాయలున్న సోకంతా హరెత్తి పోతుంటే. 
లయలున్న సోగ్గాడు రాకుండ కూకుంటే 
ఎట్టాగమ్మ - ఎట్టాగమ్మా - దామ్మాజలకాలు ఆడేటి పాట సాహిత్యం

 
చిత్రం: పున్నమి నాగు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

జలకాలు ఆడేటి జాబిల్లి మొలకా
నీ సోకే నీ కేందుకలకా
చూపు చూపూ చుట్టాలయితే నన్నే కట్టుకోక 
ఎదలో వున్నా ఎదరే వున్నా ఎలా కట్టుకోక

సరసాలు ఆడేటి నా సామిరంగ
నీ చూపుకే పలికె నాగూటి చిలక
చూపుకు చుక్కలు రగిలేవేళ నన్నే కట్టుకోక 
చీకటి వెలుగుల చీరలు కడితే ఎలా కట్టుకోక

పదహారు పోని పదిహేడు రాని
పరువాల నీ పట్టుకోక
మంచుల్లో తడిసె మల్లెల్లో విరిసే 
అందాలు సరిగంచు రైక

జాజీకుల్లి మాటలన్నీ జాను తెనుగు పాటలల్లీ 
పాడుతుంటె పాలపిట్ట గూడు కట్టింది. 
పాటలాంటి పడుచువాణి తోడురమ్మంది. 

అల్లీ బిల్లీ అందాలన్నీ నన్నే అల్లుకోక 
మల్లీ వస్తానంటూ మాత్రం అపుడే వెళ్లిపోక
నీ జంట లేని నిదురంటు రాని
రేయంత కలలైన రాక
నీ చూపు సాకి సుడిగాలి తాకి
పగలంత రేయైన కాక 

ఈడు ఈడు తోడు పెట్టి గడ్డ పెరుగు మీగడంటే
కొంగుచాటు రంగులన్నీ పొంగుతున్నాయి. 
దాచుకున్నా దోచుకుంటా చూడు అమ్మాయి

హద్దు పద్దూ అన్నీ దాటి నన్నే హత్తుకోక 
అంతో యింతో ఇమ్మని మాత్రం అంతా పుచ్చుకోక
నీదేంపోయే నీ యమ్మ కొడకా పాట సాహిత్యం

 
చిత్రం: పున్నమి నాగు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్. జానకి 

వీదేం పోయె నీ యమ్మ కొడకా 
పోతే పోయె మా వెంట పడకా 
ఆ కాయ నీ సొంతమా.. 
ఈ పండు నీ సొంతమా ... 

నీదేం పోయే నీ యమ్మ కొడకా
పోతే పోయె మా ఎంట పడకా
అల్లిబిల్లి అల్లిబిల్లి అల్లిబిల్లి
అల్లిబిల్లి ఛ ఛ ఛ

తోట నడిగి ఎవరైనా చెరువు నీళ్లు తాగుతారా 
తేటి నడిగి ఎవరైనా తేనె పిండుకుంటారా...? 
ఓ తోటమాలి_నీ మతి మాలి
అ పళ్ళు రాలకంటె నీ పళ్ళు రాలకుండునా

ఆ పళ్ళు రాలకుంటే నీ పళ్ళు రాలకుండునా 

ఆ పువ్వుకోసి ఆడపిల్లకివ్వలేని తోటమాలి 
ఈ తోట నీ సొంతమా ...? నీదేం పోయె |

అల్లిబిల్లి . అల్లిబిల్లి - అల్లిబిల్లి... అల్లిబిల్లి 

పలకమారి పండుఁ టె చిలక కొట్టకుంటుందా
చిలకలాంటి చిన్నదంటె నిలపు రేగ కుంటుందా
ఆ కర్రలేకుంటే నీ బుర్ర రామకీర్తన 
పిందె కోసి పిల్లకింత పెట్టలేని తోటమాలి 
నీ ఆట పట్టించమా...?
పున్నమి రాత్రీ... పాట సాహిత్యం

 
చిత్రం: పున్నమి నాగు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు 

పల్లవి:
ఓ..ఓ..ఓ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
పున్నమి రాత్రీ... పూవుల రాత్రీ...
వెల్లువ నాలో... పొంగిన వెన్నెల రాత్రీ...

పున్నమి రాత్రీ పూవుల రాత్రీ
వెల్లువ నాలో పొంగిన వెన్నెల రాత్రీ

చరణం: 1
మగువ సోకులే మొగలి రేకులయి మత్తుగ పిలిచే రాత్రీ
మరుడు నరుడిపై..మల్లెలు చల్లి మైమరిపించే రాత్రీ
ఈ వెన్నెలలో... ఆ వేదనలో...
ఈ వెన్నెలలో... ఆ వేదనలో...
నాలో వయసుకు నవరాత్రీ కలగా మిగిలే కడ రాత్రీ

పున్నమి రాత్రీ పూవుల రాత్రీ
వెల్లువ నాలో పొంగిన వెన్నెల రాత్రీ

చరణం: 2
కోడెనాగుకై  కొదమనాగిని కన్నులు మూసే రాత్రీ
కామ దీక్షలో కన్నెలందరూ..మోక్షం పొందే రాత్రీ
నా కౌగిలిలో... ఈ రాగిణీతో...
నా కౌగిలిలో... ఈ రాగిణీతో...
తొలకరి వలపుల తొలిరాత్రీ ఆఖరి పిలుపుల తుదిరాత్రీ

పున్నమి రాత్రీ పూవుల రాత్రీ
వెల్లువ నాలో పొంగిన వెన్నెల రాత్రీ

Most Recent

Default