Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Indira (1995)

చిత్రం: ఇందిర (1995)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఆశా భోస్లే యస్.పి.బాలు
నటీనటులు: అరవింద్ స్వామి, అణు హసన్
దర్శకత్వం: సుహాసిని మణిరత్నం
నిర్మాత: జి. వెంకటేశ్వరన్
విడుదల తేది: 11.05.1995

పల్లవి:
లాలీ లాలి అనురాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే
చిన్న పోదా మరీ చిన్న ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుటపడదే
అంతచేదా మరీ వేణుగానం
కళ్ళుమేలుకుంటే కాలం ఆగుతుందా భారమైన మనసా...ఆ
పగటి బాధలన్నీ మరిచిపోవుటకు ఉంది కదా ఈ ఏకాంతం వేళా
లాలీ లాలి అనురాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే
చిన్న పోదా మరీ చిన్న ప్రాణం

చరణం: 1
ఎటో పోతుంది నీలిమేఘం వర్షం మెరిసిపోదా
ఏదో అంటుంది కోయిల శోకం రాగం మూగపోగా
అన్నీ వైపులా మధువనం మధువనం ఎండిపోయెనే ఈ క్షణం
అణువణువునా జీవితం అడియాసకే అంకితం

చరణం: 2
లాలీ లాలి అనురాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే
చిన్న పోదా మరీ చిన్న ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుటపడదే
అంతచేదా మరీ వేణుగానం
కళ్ళుమేలుకుంటే కాలం ఆగుతుందా భారమైన మనసా...ఆ
పగటి బాధలన్నీ మరిచిపోవుటకు ఉంది కదా ఈ ఏకాంతం వేళా
లాలీ లాలి అనురాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే
చిన్న పోదా మరీ చిన్న ప్రాణం

**********  **********  **********

చిత్రం: ఇందిర (1995)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు

పల్లవి:
పచ్చబొట్టూ ఉగ్గపట్టూ వల్లకట్టూ తీసికట్టూ
చెమ్మా చెక్కా ఆడుకుంటూ గట్టువెంట నడచుకుంటా
జానపదం పాడుకుంటూ చుట్టూ చేమ పుట్టా పుట్టా ఆమని ఏమని జల్...

ఏ బల్ల కట్టూ బుల్లబ్బాయీ మెల్లకళ్ళ బుల్లబ్బాయీ
ఊరిలోని పడుచు పిల్లలు సౌఖ్యమా
హే చిల్లర కొట్టూ సత్తయ్య పిల్లా
అప్పులు ఇచ్చే అంకమ్మా పిల్లా
చెవిటి మేళం మాణిక్యం పిల్లా సౌఖ్యమా
పల్లెపిట్టలు చూడగా..మనసు పుట్టెను పిల్లడా
పల్లెపిట్టలు చూడగా..మనసు పుట్టెను పిల్లడా
పట్టణాల స్టైలు కన్నా..పల్లెటూరు సొగసు సుమా
పల్లెకూడు రుచి మరిగీ మరిచిపోలేరు సుమా
పట్టుపావడాకి గుండె ఝల్లుమంది
రెండు జళ్ళ అందం కంటే ముందు ఉంది
బల్ల కట్టూ బుల్లబ్బాయీ మెల్లకళ్ళ బుల్లబ్బాయీ
ఊరిలోని పడుచు పిల్లలు సౌఖ్యమా
హే చిల్లర కొట్టూ సత్తయ్య పిల్లా
అప్పులు ఇచ్చే అంకమ్మా పిల్లా
చెవిటి మేళం మాణిక్యం పిల్లా సౌఖ్యమా

చరణం: 1
గండు పిల్లి కోమల వల్లీ ఏమైందీ ఏమైందీ
రెండు పిల్లి పిల్లల్ని కనీ చుచల్లే చిక్కిందీ
పొగరుబోతు టీచరు కనకా
అయ్యో మరుపు రాదే పెద్దమ్మ చురకా
పప్పు రుబ్బు పంతులు పిల్లా పై చదువు గట్టెక్కిందా
ముచ్చటగా మూడు మార్కుల్లో ఫెయిలైందీౙ్ ఫెయిలైందీౙ్
పిల్లికళ్ళ రత్నమాలా లేచిపోయి ఎక్కడుందీ
పూర్తిగా మునిగిపోయి తిరిగి వచ్చింది
ఏ బల్ల కట్టూ బుల్లబ్బాయీ మెల్లకళ్ళ బుల్లబ్బాయీ
ఊరిలోని పడుచు పిల్లలు సౌఖ్యమా
ఓయ్ చిల్లర కొట్టూ సత్తయ్య పిల్లా
అప్పులు ఇచ్చే అంకమ్మా పిల్లా
చెవిటి మేళం మాణిక్యం పిల్లా సౌఖ్యమా

చరణం: 2
శివుడి గుళ్ళో వేపమానూ ఎట్టుందీ ఎట్టుందీ
జాతుల రగడంలో రెండైందీ రెండైందీ
పెద్ద వీధి రామయ్య వెంటా
చిన్న వీధి చిట్టెమ్మా వెళ్ళీ
జొన్న చేల మంచె నీడా జోడు చేరు సంగతేందీ
పాతబడి పోయిందయ్యా ఆ వార్తా ఈనాడూ
వాళ్ళ సోది నాకెందుకూ నా గువ్వ కబురు చెప్పూ
ఏపుకొచ్చి ఎపుడెపుడని ఎదురుచూస్తోందీ

ఏ బల్ల కట్టూ బుల్లబ్బాయీ మెల్లకళ్ళ బుల్లబ్బాయీ
ఊరిలోని పడుచు పిల్లలు సౌఖ్యమా
హ చిల్లర కొట్టూ సత్తయ్య పిల్లా
అప్పులు ఇచ్చే అంకమ్మా పిల్లా
చెవిటి మేళం మాణిక్యం పిల్లా సౌఖ్యమా
పల్లెపిట్టలు చూడగా..మనసు పుట్టెను పిల్లడా
పల్లెపిట్టలు చూడగా..మనసు పుట్టెను పిల్లడా
పట్టణాల స్టైలు కన్నా..పల్లెటూరు సొగసు సుమా
పల్లెకూడు రుచి మరిగీ మరిచిపోలేరు సుమా
పట్టుపావడాకి గుండె ఝల్లుమంది
రెండు జళ్ళ అందం కంటే ముందు ఉంది
బల్ల కట్టూ బుల్లబ్బాయీ మెల్లకళ్ళ బుల్లబ్బాయీ
ఊరిలోని పడుచు పిల్లలు సౌఖ్యమా
హే చిల్లర కొట్టూ సత్తయ్య పిల్లా
అప్పులు ఇచ్చే అంకమ్మా పిల్లా
చెవిటి మేళం మాణిక్యం పిల్లా సౌఖ్యమా

**********  **********  **********

చిత్రం: ఇందిర (1995)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర

పల్లవి:
తొలి తొలి బిడియాల పువ్వా తొరపడీ పరుగేలా
తొలి తొలి బిడియాల పువ్వా తొరపడీ పరుగేలా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై పరవశాన పసి పరువానా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై పరవశాన పసి పరువానా
తొలి తొలి బిడియాల పువ్వా తొరపడీ పరుగేలా

చరణం: 1
చిన్నదానీ వయసే చెంతచేర పిలిచే
తాకితే తడబడుతూ జారేందుకా
నిలవని అలలా నిలువున అల్లితే
మృదువైన పూల ప్రాయం ఝల్లుమనదా
ఆశల తీరానా మోజులు తీర్చేనా
హద్దుమరి తెంచేస్తే యవ్వనం ఆగేనా
తొలి తొలి బిడియాన పువ్వే సొగసుగ నలిగేనా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై నరములు వీణ మీటే తరుణమిదే
తొలి తొలి బిడియాన పువ్వే సొగసుగ నలిగేనా

చరణం: 2
మధువులు కురిసే పెదవుల కొరకే
ఇరవై వసంతాలూ వేచి ఉన్నా
మదిలోని అమృతం పంచడానికేగా
పదహారు వసంతాలూ కాచుకొన్నా
ఇకపైన మన జంటా కలనైనా విడరాదే
మరీ కొంటె కలలెన్నో కన్నె ఎద తీర రాదే
తొలి తొలి బిడియాన పువ్వే సొగసుగ నలిగేలా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై పరవశాన పసి పరువానా
తొలి తొలి బిడియాల పువ్వా తొరపడీ పరుగేలా

**********  **********  **********

చిత్రం: ఇందిర (1995)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: అనురాధ శ్రీరామ్, శ్వేతా

వెలుగన్నదే రాని రాతిరుందా
ముగిసేది కాదన్న కలత ఉందా..
కరి మబ్బు జల్లు పడి కరిగిపోదా
ఆశలకు అదుపంటూ లేదు కదా..

జై అందమంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే..
జై అందమంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే..
కాలం మారిపోయే మన కథలే మారిపోయే
కష్టాలన్నీ కరిగేనన్న నమ్మకం వచ్చిందోయ్
కాలం మారిపోయే మన కథలే మారిపోయే
కష్టాలన్నీ కరిగేనన్న నమ్మకం వచ్చిందోయ్
జై అందమంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే..

చేతికిలా ఇలా ఇలా ఇలా ..చంద్రుడందేనులే
జుంజుం జుంజుం జుంజుం జుం జుంజుంజుం జుంజుం
ఇంకా ఇలా ఇలా ఇలా ఇలా..నవ్వు చిందేనులే
తరుణం పోనీ చూద్దాం మనదయ్యే లోకం కొద్దాం
అరె ఇంకా కొంచెం పైపైకెళితే మనదే నీలాకాశం
పంతం పోనీ చూద్దాం మనదయ్యే లోకం కొద్దాం
అరె ఇంకా కొంచెం పైపైకెళితే మనదే నీలాకాశం

వన్నె చిన్నెల చిలకా..వన్నె చిన్నెల చిలకా
అవకాశం వచ్చేనమ్మా వెళ్ళి అందుకో
అమ్మ అందాల చిట్టెమ్మా..అమ్మా అందాల చిట్టెమ్మా
నీ జన్మభూమి ఒడి చేరి ఆడుకో
జై అందమంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే..
జై అందమంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే..
కాలం మారిపోయే మన కథలే మారిపోయే
కష్టాలన్నీ కరిగేనన్న నమ్మకం వచ్చిందోయ్
కాలం మారిపోయే మన కథలే మారిపోయే
కష్టాలన్నీ కరిగేనన్న నమ్మకం వచ్చిందోయ్
కష్టాలన్నీ కరిగేనన్న నమ్మకం వచ్చిందోయ్

గత పంజరాల శతబందనాలు వీడి
మోసం ద్వేషం దోషంలేని దేశం నిర్మిద్దాము
గత పంజరాల శతబందనాలు వీడి
మోసం ద్వేషం దోషంలేని దేశం నిర్మిద్దాము
స్వేచ్చ దొరికే మనకు ఇక మనసుపై మంచు పొరలు ఎందుకు
స్వేచ్చ దొరికే మనకు ఇక మనసుపై మంచు పొరలు ఎందుకు
జై అందమంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
జై అందమంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే..

అంబరంలో వాసంతం ఎటుదాక్కున్నా పిలిపిద్దాం
పిలిపిద్దాం పిలిపిద్దాం పిలిపిద్దాం పిలిపిద్దాం
మంచిని పూలుగా పూయిద్దాం మనిషిని మనిషిగా బ్రతికిద్దాం
బ్రతికిద్దాం బ్రతికిద్దాం బ్రతికిద్దాం బ్రతికిద్దాం
అంబరంలో వాసంతం ఎటుదాక్కున్నా పిలిపిద్దాం
మంచిని పూలుగా పూయిద్దాం మనిషిని మనిషిగా బ్రతికిద్దాం
లోకం మొత్తం కరిగిద్దాం సౌఖ్యం చిగురులు తొడిగిద్దాం
వాడా వాడా వెలిగిద్దాం వాడని వనమై వికసిద్దాం
వాడా వాడా వెలిగిద్దాం వాడని వనమై వికసిద్దాం
విశ్వాన్నేలే విజయదీతరం రెప రెపమంటూ ఎగరదాం
మేధస్వరమై వందేమాతరం బంగరు భవితను పిలవగా...

Most Recent

Default