Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Golconda High School (2011)చిత్రం: గోల్కొండ హైస్కూలు (2011)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అనురాధ, హేమచంద్ర
నటీనటులు: సుమంత్ , స్వాతి రెడ్డి
దర్శకత్వం: మోహన్ కృష్ణ ఇంద్రగంటి
నిర్మాత: రామ్మోహన్. పి
విడుదల తేది: 14.01.2011

అడుగేస్తే అందే దూరంలో..హలో
అదిగో ఆ తారతీరంలో..చలో
అటు చూడు ఎంత తళుకో
అది వచ్చి వాలేననుకో
కనుల ఇంత ఎంత వెలుగో చూసుకో
ఇది నేటి ఆదమరుపో
మరునాటి మేలుకొలుపో
వెనువెంట వెళ్ళి ఇప్పుడే తేల్చుకో

కొండంత భారం కూడా తెలికగా అనిపిస్తుంది
గుండెల్లో సందేహలు ఎమి లేకుంటే
గండాలు సుడిగుండాలు ఉండే ఉంటాయి అనుకుంటే
సంద్రంలో సాగే నావ నాట్యం చేస్తునట్టు ఉంటుందే
ధీమగా పోతుంటే..ఏ మార్గం నిన్ను ఏనాడు ఆపదని
సరదగా దూసుకెళ్ళిపో..కడదాక ఆగననుకో
కలగన్న రేపుని ఇప్పుడే కలుసుకో

ఉత్సాహాం పరుగులు తీస్తూ విశ్రాంతే కొత్తనుకుంటే
ఆయాసం కూడా ఎంతో హాయేలే
పోరాటం కూడ ఎదో ఆటలే కనపడుతుంటే
గాయాలు గట్రా చాలా మాములే అనిపిస్తాయి అంతే
నీ గమ్యం ఎదైనా..వెళ్ళాలే గాని
రమ్మంటే రాదు కదా
ప్రతి పాటకొక్క మలుపే
ప్రతి పూట ఆశ మెరుపే
ప్రతి చోట గెలుపు పిలుపే
తెలుసుకో


********  ********   ********


చిత్రం: గోల్కొండ హైస్కూలు (2011)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: గీతామాధురి , శ్రీకృష్ణ

ఇది అదేనేమో అలాగే ఉంది
తెలుసునో లేదో తెలీడం లేదే
ఫలనా అని అనుకోమని
ఏ రోజు చెబుతుందో ఎమో

ఇది అదేనేమో అలాగే ఉంది
తెలుసునో లేదో తెలీడం లేదే
ఫలనా అని అనుకోమని
ఏ రోజు చెబుతుందో ఎమో

మొగవాళ్ళకు కూడ ఇంత మొహమాటముంటుందా
అనుకోనే లెదే ఏనాడు
బిడియానికి కూడ ఇంత దుడుకొచ్చే తుళ్ళింత
బహుశా నీ వల్లే ఈనాడు
అవకాశం ఇస్తునా..అడిగేసే వీలున్నా
అనుమానం ఆపింది అనేందుకు
కుడి కొంచం ఎడమైనా..మనలోని ఒకరైనా
అనుకుందాం అవునో కాదో
ఫలనా అని అనుకోమని
ఏ రోజు చెబుతుందో ఎమో

ఏకాంతం ఎరుపెక్కేలా..అంత ఇదిగా చూడాలా
నీతో మాకష్టం మాస్టారు
చలిగాలికి చెవటెట్టెలా..కవ్విస్తూ నవ్వాలా
ఉడికిస్తూ ఉందే నీ తీరు
ఇది ఇలా ఉండాలో..ఇంకోలా మారాలో
???? ఇబ్బంది ఎమిటో
దూరంగా ఆగాలో..దగ్గరగా చేరాలో
ఎమి చేస్తే బాగుంటుందో
ఫలనా అని అనుకోమని
ఏ రోజు చెబుతుందో ఎమో


********  ********   ********


చిత్రం: గోల్కొండ హైస్కూలు (2011)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హేమచంద్ర

ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం
నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పెందుకు అది తొలి పాఠం
మునివేలతొ మెఘాలనే మీటెంతగా ఎదిగాం మనం
పసివాళ్ళగా ఈ మట్టిలొ ఎన్నాళిలా పడిఉంటాం
కునికే మన కను రెపల్లొ వెలిగిద్దాం రంగుల స్వప్నం
ఇదిగొ నీ దారి ఇటు ఉందని సూరిడిని రా రమ్మందాం
జాగో జాగొరే జాగొ జాగొ
జాగో జాగొరే జాగొ జాగొ
జాగో జాగొరే జాగొ జాగొ

ఆకాశం నుండి సూటిగా..దూకేస్తే ఉన్నపాటుగా
ఎమౌతానంటూ చినుకు అలా ఆగిందా బెదురుగా
కనుకే ఆ చినుకు ఏరుగా..ఏరే వరద హోరుగా
ఇంతింతై ఎదిగి ఎదిగి అంతగా తరగని సంద్రమైందిగా
సందేహిస్తుంటే అతిగా..సంకల్పం నెరవేరదుగా
ఆలోచన కన్న త్వరగా..అడుగేద్దాం ఆరంభంగా
జాగో జాగొరే జాగొ జాగొ
జాగో జాగొరే జాగొ జాగొ

ఎ పని మరి ఆసాద్యమే కాదే
ఆ నిజం మహా రహస్యమా
వేసే పదం పదం పదే పదే పడదొసే
సవాలనే ఎదురుకొమా
మొదలెట్టక ముందే ముగిసే కధ కాదే మన ఈ పయనం
సమరానికి సై అనగలిగే సంసిద్దత పేరే విజయం
జాగో జాగొరే జాగొ జాగొ
జాగో జాగొరే జాగొ జాగొ
జాగో జాగొరే జాగొ జాగొ

Most Recent

Default