Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Baba (2002)చిత్రం: బాబా (2002)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: శివ గణేష్
గానం: సాధన సర్గం
నటీనటులు: రజినీకాంత్ , మనీషా కొయిరాలా
దర్శకత్వం: సురేష్ కృష్ణ
నిర్మాత: రజినీకాంత్
విడుదల తేది: 15.08.2002

పల్లవి:
బాబా నీకు మొక్కుతా
నా భారాలన్నీ నీపై వేస్తా మోస్తావా
బాబా ఓ పువ్విస్తా
ఈ భక్తురాలి బాధ కాస్త వింటావా
తుళ్ళెనె గిల్లెనె నుదిటిపై నీ కురులు
గడ్డమె అడ్దమోయ్ శాంతంగ మారాలోయ్
కాస్త నువ్ మారితే సూరీడై వెలుగుదువోయి
గిచ్చొద్దే గుచ్చొద్దే బాధా గాధా చెప్పొద్దే
నువ్ మారమంటె మారిపోడీ బాబా బాబా
నాలాగ నేనుంటేనే నలుగురికీ నయమంటానె
తగువేదీ రాదంటానే ఆహా హా హా

చరణం: 1
బాబా నిన్నే బావా అంటే
బాబోయ్ నన్నొదిలెయ్ అంటూ
పరుగేలా
పులకించు వేళ మొలకెత్తు వలపే
బాగుంది బాగుంది బాబా
పులకించు వేళ మొలకెత్తు వలపే
బాగుంది బాగుంది బాబా
పిల్లేమొ గోరంత అహ పులకింత కొండంత
ఈ మోహం ఈ మైకం నాకో వింత
ప్రేమల్ని పంచావంటె బాబా ఒక పిల్లాడే
కొమ్ముల్ని విసిరావంటె....

చరణం: 2
బాబా వాకిట వాలాలంటూ వేవేల
జనులున్నా నన్నే ఎన్నుకున్నావెందుకో
నీ రంగు మల్లె నారంగు మారే
వరమివ్వ గలవా బాబా
నీ రంగు మల్లె నారంగు మారే
వరమివ్వ గలవా బాబా
మనసార నే రాలేదు విధిగారు కలిపేశారు
ఏం చేసేదమ్మాయ్ గారు ఆహాహాహా
రంగంటే రంగా ఇది వరం వల్ల వచ్చిందిది
నా తల్లి ఇచ్చిందిది ఆహాహాహా


*********  *********  *********


చిత్రం: బాబా (2002)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: శివ గణేష్
గానం: శంకర్ మహదేవన్

పల్లవి:
బాబా...బాబా....
బాబా... కో: సినిమా సినిమా
బాబా... కో:  ఆటేరా
బాబా... కో: సినిమా సినిమా
బాబా...

టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు సుందరి
మంచిమాట చెప్పనీవే టిప్పు సుందరి (2)
జీవితమె కో:సినిమా సినిమా
మూడే మూడు కో:గంటలు లే
మూడే మూడు కో: గంటలు అంటే
మూడే మూడు కో: ప్రాయాలే
శిశువు ప్రాయం ఒకటి
పడుచు ప్రాయం రెండు
ముసలి ప్రాయం మూడు వినరా

మూడుదశలు ముగియ మునుపే
ముల్లోకాలు గెలవరా

టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు సుందరి
మంచిమాట చెప్పనీవే టిప్పు సుందరి

చరణం: 1
పిల్లల తెల్లని మనసు అ:
అది దైవం వెలిసే మనసు
పున్నమి చంద్రుని ఎగిరి పట్టి
బంతులాడేటి వయసు
బలంపెంచి భయము తుంచి
భవితనెంచి ఎదగరా
తల్లి నీడై మెదులు పెద్దపులివై కదులు
బుద్ధి ఎరిగి మసలూ.....
టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు ఓకే

చరణం: 2
అల్లరి చేసే వయసు
అది యవ్వనానికే సొగసు
చెట్టు సైతం చీరకట్టి
తాకి చూసే మనసు
ఉద్యోగాలు కోరి రావు
కోరి నువ్వే తరలిపో
నువ్వు కోరే ప్రేమ
ప్రేమ కాదోయ్ రామ
ప్రేమకర్ధం చెప్పనా
కో: స్వచ్చమైన ప్రేమ అంటే కోరివచ్చు ప్రేమరో

చరణం: 3
వృద్ధుల వంగిన వయసు
అది సిద్ధిని పొందే వయసు
నెమ్మది కోరే వయసు
కుటుంబ భారం మరచిపోయి
కోర్కె విడిచి బ్రతకవోయ్
మౌనమందే నిలచి
ధ్యానమంతా తరచి
విధికి తలనే వంచి
కో: వెలుగుతున్న యువతరాన్ని
వెన్నుతట్టి నిలిచిప


**********  **********  **********


చిత్రం: బాబా (2002)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: శివ గణేష్
గానం: ఉదిత్ నారాయణ్ , సుజాత

పల్లవి:
మాయ మాయ మాయ అంతా మాయ
ఛాయ ఛాయ ఛాయ అంతా ఛాయ
మాయ మాయ మాయ అంతా మాయ
ఛాయ ఛాయ ఛాయ అంతా ఛాయ
సంతోషి సంతోషి సంతోషి
నువ్వు సంతోషంలో తేలే సన్యాసి
సంతోషి సంతోషి సంతోషి నీ
సంతోషి నీతోటి సహవాసి
పట్టీ పట్టనట్టుగా ఉండీ లేనట్టుగా
తామరు ఆకుల్లో నీరల్లె నువ్వు
అంటీ అంటక ఉండు

చరణం: 1
వాసన అందం వాడితె అంతం
పువుల చందం మనుషు ల జన్మం
భువిలో మనకు శాశ్వతమేదీ
పవళింపు వరకు స్వతంత్రమేదీ
విషయం చెబితె అతనిది సోది
విషమం పేరే రాజకీయ వాది
అందులో ఏమున్నది అది ఓ పదవుల వ్యాధి
మనిషికి కాలు చెయ్యే మరవని నేస్తాలయ్యే
సంద్రాలపై నూనె బిందువుమల్లె
నువ్వు అంటీ అంటక వుండు

చరణం: 2
గాలమ్మా గాలమ్మా నా చెలినికిదీ తెలుపమ్మా
కన్నీరే కన్నీరు నా మనసే చదువమ్మా
మాయల్లే చాయల్లే కన్నె వలపు
ఏ నాడు మారదులే
ప్రాణంలో ప్రాణంగా ఉన్న సొగసు
వసివాడి పోనిదిలే
గాలమ్మా గాలమ్మా
నా చెలునికిదీ తెలుపమ్మా
పట్టీ పట్టనట్టుగా
పట్టే రస పట్టుగా
ఉండీ లేనట్టుగా
వచ్చే లేటెస్టుగా
తామర ఆకుల్లో నీరల్లె నువ్
అంటీ అంటక ఉండు
తామర ఆకుల్లోనీరల్లె
నువ్ నాతో జంటగా వుండు
సంతోషి సంతోషి సంతోషి నువ్వు
నా జంటై వెంటొస్తే సంసారి
సంతోషి సంతోషి సంతోషి నువ్వు
తాకేస్తే అవుతాలే నీ దాసి
పట్టీ పట్టనట్టుగా ఉండి లేనట్టుగా
తామర ఆకుల్లో నీరల్లే
నువ్ అంటీ అంటక వుండు....
తామర ఆకుల్లో నీరల్లే
నువ్ నాతో జంటగ వుండు


********   ********   ********


చిత్రం: బాబా (2002)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: శివ గణేష్
గానం: పి.జయచంద్రన్

పల్లవి:
రాజ్యమా సన్యాసమా భోగమా లేక యోగమా
జ్నానియా అజ్నానియా ఎవరురా ఇతడు ఎవరురా
అంబరం దాటిన అతిశయం బాబా జాతకం
అంబరం దాటిన అతిశయం బాబా జాతకం
ప్రశ్నలా బతికెలే మౌనమై వెలిగెలే

రాజ్యమా సన్యాసమా భోగమా లేక యోగమా
జ్నానియా అజ్నానియా ఎవరురా ఇతడు ఎవరురా

చరణం: 1
కొడుకులు లేని ఒడిలోకి వెలుగై వచ్చిన రాజాయే
వాసనలెన్నో పంచుటకు దైవమిచ్చిన రోజాయే
కీర్తికి బదులు భుజములపై మూటలెన్నో మోశాడు
విధి ఇది విధి ఇది అని తలచి చెమట నోడ్చి బతికాడు
ఏ వృత్తిలోనైనా తప్పులేదు అంటాడు
పనిమాని కూర్చుంటే ముప్పువుంది అంటాడు
పెరిగినా తరిగినా ఎన్నడూ తొణకడు
అతిశయం ఎంతో అతిశయం అతిశయం బాబా జాతకం

చరణం: 2
దేవుడు లేడని ప్రతిపూటా బోధించాడు నాస్తికత
భౌతికవాదం మదిలోన పూసిందేలా ఆస్తికత
నుదుట విభూధిని దిద్దుకుని వస్తున్నాడు ఈ జ్నాని
ఆశ్చర్యమాశ్చర్యంగా వుండే
అయ్యా డయ్యె రాముడే
తన తల్లి ప్రేమకే తలవంచె నీబాబా
హృదయాన ఏనాడు పసివాడు ఈ బాబా
వేదనే కోరిన పెన్నిధై వెలిగెలే


**********  **********  **********


చిత్రం: బాబా (2002)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: శివ గణేష్
గానం: కార్తిక్

పల్లవి:
మేమడుగేస్తే అదరాలి అధికార పీఠం
మే మెదురొస్తె బెదరాలి భేతాళ భూతం
శక్తినివ్వు.... శక్తినివ్వు....
దేవా.... దేవా...
తల్లివి నీవే తండ్రివి నీవే
ప్రణవము నీవే ప్రాణము నీవే

రేణువు నీవే స్ధాణువు నీవే
జులుమునణచుటకు
భువిని గెలుచుటకు శక్తినివ్వు
నట్టేటి నావలనే నడిపించు శక్తినివ్వు

చరణం: 1
మునిగేటి జీవులనే రక్షించు శక్తినివ్వు
తలపొగరు సిగపట్టు కీర్తించు శక్తినివ్వు
తన ఇంటి చీకటిని తోలగించేశక్తినివ్వు
కాలాన్ని జ్వాలల్ని చేధించే శక్తినివ్వు
నామాటతో ఊరు మారేటి శక్తినివ్వు

చరణం: 2
బిగిపట్టు పట్టాక సడలించబోను
ముందడుగు వేశాక వెనుకాడబోను
ననునమ్ము తమ్ముళ్ళని వంచించబోను
ఓనిచ్చెనై నిలుచుండి నే మోసబోను
నా ప్రజల క్షేమాన్ని నే మరిచిపోను
నే బ్రతికేది నీ కొరకె విడిచి పోనేపోను
మద్దెలను మిద్దెలను నే కోరుకోను
కాలాల హద్దులను నే మించబోను
దేవా...దేవా...

Most Recent

Default