Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Vamsoddharakudu (2000)




చిత్రం: వంశోద్ధారకుడు (2000)
సంగీతం: కోటి
నటీనటులు: బాలకృష్ణ , రమ్యకృష్ణ , సాక్షీ శివానంద్
దర్శకత్వం: శరత్
నిర్మాతలు: యమ్.ఎస్.రెడ్డి. టి.సుబ్బిరామిరెడ్డి
విడుదల తేది: 14.01.2000



Songs List:



కొండపల్లి బొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: వంశోద్ధారకుడు (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: ఘంటాడి కృష్ణ
గానం: యస్. పి. బలు , చిత్ర

కొండపల్లి బొమ్మ తొందరెందుకమ్మా చందనాల ముద్దు గుమ్మ
కోటిపల్లి రాజా కొంగుపట్టి పూజ చేసుకోరా బాలరాజ
పూతకొచ్చే వేళల్లో లేత లేత ఊహల్లో
చాటుమాటు సరసంలో దాగిఉన్న మైఖంలో
మనసా వాచా వలచాను నేను నిన్ను

కొండపల్లి బొమ్మ తొందరెందుకమ్మా చందనాల ముద్దు గుమ్మ
కోటిపల్లి రాజా కొంగుపట్టి పూజ చేసుకోరా బాలరాజ

తిననాన తిననాన తిన్న తాననానన (2)

వయసంటూ వచ్చాక మనసంటూ ఇచ్చాక
ప్రేమంటూ పుట్టకుండా ఉండమంటే ఎట్టాగ
బంధించి గుండెలోనే దాచుకుంటే మర్యాద
కల్లోకొచ్చిన బావా నా కౌగిళిలోకి రావా
మెళ్ళో మాలే వెయినా నీ ఒడ్లో వాలగ రానా
వినవే బాల ఎదలోని రాసలీల


కోటిపల్లి రాజా కొంగుపట్టి పూజ చేసుకోరా బాలరాజ
కొండపల్లి బొమ్మ తొందరెందుకమ్మా చందనాల ముద్దు గుమ్మ

దినకు దినకు దిన్నా  దినకు దిన 
దినాక దినక్ దినక్ దిన్నా

మత్తేదో కమ్మేసి గమ్మత్తే చేస్తుంటే 
మన పొత్తే పంచదార తీపి రుచులే తేవాల
నీ సొత్తే సొంతమైతే హాయి అంతే చూడాలా
అల్లుకుపోదాం భామ ఆలస్యం చేయకు రామ్మా
తొందర లేదంటూనే గిలిగింతలు పెడతావేలా
తగునా మధనా మదిలోని బాధ వినరా

కొండపల్లి బొమ్మ తొందరెందుకమ్మా చందనాల ముద్దు గుమ్మ
కోటిపల్లి రాజా కొంగుపట్టి పూజ చేసుకోరా బాలరాజ
పూతకొచ్చే వేళల్లో లేత లేత ఊహల్లో
చాటుమాటు సరసంలో దాగిఉన్న మైఖంలో
మనసా వాచా వలచాను నేను నిన్ను





అందాల ప్రాయం కందింది పాపం పాట సాహిత్యం

 
చిత్రం: వంశోద్ధారకుడు (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర

ఓ... ఓ... ఓ... ఓ...ఓ
ఓ... ఓ... ఓ... ఓ...ఓ

అందాల ప్రాయం కందింది పాపం పూబంతి తాకిడికే
కనరాని గాయం కలిగించే తాపం నీ కొంటె చూపులకే
జతచేరి జవరాలి మదిలోగిలి
పలికింది సరసాల తొలి జావళి

అందాల ప్రాయం కందింది పాపం పూబంతి తాకిడికే

పరువైనా పరువాన పసికూన రాగాలు నను పిలిచెనా 
అనువైన సాయలు అందించనా
మృదువైన ఇరుముల్లో ఒనికేటి వైనాలు కనిపించెనా 
మౌనాల గానాలు వినిపించినా
చిక్కని చెక్కిలి నొక్కిలిలోన ఉక్కిరి బిక్కిరిగా
కొత్తగ అద్దిన ముద్దులు నిన్ను ముంచెత్తగా

హోయ్ అందాల ప్రాయం కందింది పాపం  
నీ కొంటె చూపులకే

తొలిసారి తెలిసింది సొగసింటి తగువెంత సుఖమైనదో 
పొగరాని సెగలెన్నో రగిలించెనో
చెలి వీణ పలికింది ముదిరేటి మునిపంట మురిపాలతో 
పదునైన కొనగోటి సరిగమలతో
వెచ్చని ఊపిరి తాకెను నన్ను అల్లరి పల్లవిగా
పచ్చని ఆశలు పాకలు ఎన్నో చిగురించగా

అందాల ప్రాయం కందింది పాపం పూబంతి తాకిడికే
కనరాని గాయం కలిగించే తాపం నీ కొంటె చూపులకే
హే జతచేరి జవరాలి మదిలోగిలి
పలికింది సరసాల తొలి జావళి




గుడిగంటలు మోగే వేళా పాట సాహిత్యం

 
చిత్రం: వంశోద్ధారకుడు (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: మల్లెమాల
గానం: హరిహరన్, చిత్ర

సాని సాని సాని సనినిప నీస నీస నీస నిపమరి
రిమమప మరిస రిమమప మరిస రిమమప పనినినిస

గుడిగంటలు మోగే వేళా
గువ్వలు గుసగుసలాడే వేళా
ఖజురహో శిల్పంలో నిన్ను చూశానే
అదరహో అనిపించి పరవశించానే
హృదయమే పాన్పుగా ముందు పరిచాను నీ ముందు పరిచాను

సాని సాని సాని సనినిప నీస నీస నీస నిపమరి
రిమమప మరిస రిమమప మరిస రిమమప పనినినిస

నీ అందెల సవ్వడిలో నిగమ సారముంది
నీ చూపుల రాపిడిలో మధన తాపముంది
ఎన్నో జన్మల పుణ్యం ఎదురైనది ఈ వేళ
ఈ అరుదైన అనువైన అనుబంధం
ఇక ఏనాడూ విడిపోదు ఈ బంధం
ఇది దొరకక దొరికిన శృంగార సౌభాగ్యము

గుడిగంటలు మోగే వేళా
గువ్వలు గుసగుసలాడే వేళా
ఖజురహో శిల్పంలో నిన్ను చూశానే
అదరహో అనిపించి పరవశించాను

తద్దిందింతన  తద్దిందింతన (2)
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఏ ఏ న,  న న న, ఏ ఏ ఏ ఏ ఏ ఏ న

సిరి తరగని మధుసిరి నీ పరువానికి బిరుదు
నిను మించిన మదవతీ ఈ లోకంలో అరుదు
నింగీ నేలకు వంగీ నిను నను చూస్తోంది
ఈ పులకింత విలువెంతో వయ్యారం
నీ మదిలోని వలపంత పురుషోత్తమా
ఇది కని విని ఎరుగని కైవల్య వైభోగమే

గుడిగంటలు మోగే వేళా
గువ్వలు గుసగుసలాడే వేళా
ఖజురహో శిల్పంలో నిన్ను చూశానే
అదరహో అనిపించి నిన్ను చేరాను
హృదయమే పాన్పుగా ముందు పరిచాను నీ ముందు పరిచాను

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ





బుడి బుడి చినుకుల వానా పాట సాహిత్యం

 
చిత్రం: వంశోద్ధారకుడు (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: రాము, చిత్ర

బుడి బుడి చినుకుల వానా చినదానా చిటికేసిందమ్మో  
హొ హొ హొ హో హొ, హొ హొ హొ హో హొ
తడి పొడి సొగసుల్లోని గుట్టంతా బయటేసిందమ్మో 
హొ హొ హొ హో హొ, హొ హొ హొ హో హొ
అందిస్తావ కొత్త అందాలన్నీ
సందిస్తావా కొంటె బాణాలన్నీ
సూర్యుడు చూడని సుందర దీవుల్లో

బుడి బుడి చినుకుల వానా చినదానా చిటికేసిందమ్మో  
హొ హొ హొ హో హొ, హొ హొ హొ హో హొ
తడి పొడి సొగసుల్లోని గుట్టంతా బయటేసిందమ్మో 
హొ హొ హొ హో హొ, హొ హొ హొ హో హొ

తళుకు తలుకుమను మెరుపులు వెలుగులు 
మిడిసి మిడిసి పడు పరువపు సొగసులు 
వగలు తెలిసి మతి చెడినదే ఓ చెలియా
చిలిపి చిలిపి చిరు చినుకుల పొదిగిన 
విరుల శరములను వదిలిన మాధనుడి 
ఒడుపు తెలిసినది నిన్నిక విడవదుగా
కోరి కన్నేతనం కోక దాటే క్షణం కౌగిలింతే సుఖం ఔనా
ఊరించి ఊరించి గోపాలా ఊగించమాకయ్య ఉయ్యాలా సిగ్గే అగ్గై రగిలే వేళల్లో

బుడి బుడి చినుకుల వానా చినదానా చిటికేసిందమ్మో 
హొ హొ హొ హో హొ, హొ హొ హొ హో హొ
తడి పొడి సొగసుల్లోని గుట్టంతా బయటేసిందమ్మో 
హొ హొ హొ హో హొ, హొ హొ హొ హో హొ

మనసుపడిన తొలి వలపుల తహా తహా 
ఎగసి పడిన పసి వయసుకు తెలియక 
తనువు విరహమున మరిగిన క్షణమిదిరా
పడుచుతనపు రుచి పెదవికి తెలియును 
అధర సుధల రుచి మనసుకి తెలియును 
మరుల రుచులు మగమతికే తెలియునుగా
ఈడు నీ పొందుకై ఈల వేసే క్షణం బలక్రిష్ణార్పణం అననా
గుండెల్లో పుట్టింది గిలిగింత పాకింది మెల్లంగ ఒళ్ళంతా వయ్యారాలే వరదై పాంగంగా

బుడి బుడి చినుకుల వానా చినదానా చిటికేసిందమ్మో  
హొ హొ హొ హో హొ, హొ హొ హొ హో హొ
తడి పొడి సొగసుల్లోని గుట్టంతా బయటేసిందమ్మో 
హొ హొ హొ హో హొ, హొ హొ హొ హో హొ
అందిస్తావ కొత్త అందాలన్నీ
సందిస్తావా కొంటె బాణాలన్నీ
సూర్యుడు చూడని సుందర దీవుల్లో




డోలే డోలే పాట సాహిత్యం

 
చిత్రం: వంశోద్ధారకుడు (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత 

డోలే డోలే




నీ చూపు చూస్తే భల్లే పాట సాహిత్యం

 
చిత్రం: వంశోద్ధారకుడు (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: గానం: యస్. పి. బాలు, చిత్ర

నీ చూపు చూస్తే భల్లే 

Most Recent

Default