Search Box

MUSICAL HUNGAMA

Srinivasa Kalyanam (1987)చిత్రం: శ్రీనివాస కల్యాణం (1987)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల సీతరామ శాస్త్రి
గానం: బాలు, సుశీల
నటీనటులు: వెంకటేష్ , భానుప్రియ, గౌతమి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: కె. మురారి
విడుదల తేది: 25.09.1987

తుమ్మెదా ఓ తుమ్మెదా
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా
తుమ్మెదా ఓ తుమ్మెదా
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా
మగడు లేని వేళ తుమ్మెదా
వచ్చి మొగమాట పెడతాడె తుమ్మెదా
మాట వరసకంటు తుమ్మెదా
పచ్చి మోట సరసమాడె తుమ్మెదా
అత్త ఎదురుగానే తుమ్మెదా
రెచ్చి హత్తుకోబోయాడె తుమ్మెదా

తుమ్మెదా ఓ తుమ్మెదా
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా

ఎదురు పడితె కదలనీక దడికడతాడే
పొద చాటుకి పద పదమని సొద పెడతాడే
 ఎదురు పడితె కదలనీక దడికడతాడే
పొద చాటుకి పద పదమని సొద పెడతాడే
ఒప్పనంటె వదలడమ్మా ముప్పు తప్పదంటె బెదరడమ్మా
ఒప్పనంటె వదలడమ్మా ముప్పు తప్పదంటె బెదరడమ్మా
చుట్టు పక్కలేమాత్రం చూడని ఆత్రం
పట్టు విడుపు లేనిదమ్మ కృష్ణుని పంతం

మగడు లేని వేళ తుమ్మెదా
వచ్చి మొగమాట పెడతాడె తుమ్మెదా
మాట వరసకంటు తుమ్మెదా
పచ్చి మోట సరసమాడె తుమ్మెదా
అత్త ఎదురుగానే తుమ్మెదా
రెచ్చి హత్తుకోబోయాడె తుమ్మెదా

తుమ్మెదా ఓ తుమ్మెదా
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా
తుమ్మెదా తుమ్మెదా

తానమాడు వేళ తాను దిగబడతాడే
మాను మాటు చేసి చుడ ఎగబడతాడే
 తానమాడు వేళ తాను దిగబడతాడే
మాను మాటు చేసి చుడ ఎగబడతాడే
చెప్పుకుంటె సిగ్గు చేటు అబ్బ నిప్పులాంటి చూపు కాటు
 చెప్పుకుంటె సిగ్గు చేటు అబ్బ నిప్పులాంటి చూపు కాటు
ఆదమరిచి ఉన్నామా కోకలు మాయం
ఆనక ఎమనుకున్నా రాదే సాయం

మగడు లేని వేళ తుమ్మెదా
వచ్చి మొగమాట పెడతాడె తుమ్మెదా
మాట వరసకంటు తుమ్మెదా
పచ్చి మోట సరసమాడె తుమ్మెదా
అత్త ఎదురుగానే తుమ్మెదా
రెచ్చి హత్తుకోబోయాడె తుమ్మెదా

తుమ్మెదా ఓ తుమ్మెదా
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా
 తుమ్మెదా ఓ తుమ్మెదా
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా

AMAZON PRIME MOVIES

Most Recent

Default
google.com, pub-8613670326032963, DIRECT, f08c47fec0942fa0