Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Nuvvu Leka Nenu Lenu (2002)




చిత్రం: నువ్వులేక నేనులేను (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
నటీనటులు: తరుణ్ , ఆర్తి అగర్వాల్, లయ
దర్శకత్వం: వై. కాశీ విశ్వనాథ్
నిర్మాత: డి.సురేష్ బాబు
విడుదల తేది: 14.01.2002



Songs List:



ఏదో ఏదో అయిపోతుంది పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వులేక నేనులేను (2002)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: వై. కాశీ విశ్వనాథ్
గానం: ఉష

ఏదో ఏదో అయిపోతుంది
ఎదలో ఏదో మొదలయ్యింది
నిన్నే చూడాలని నీతో ఉండాలని
నేనే ఓడాలని నువ్వే గెలవాలని
పదే పదే అనిపిస్తుంది నీ పిలుపే వినిపిస్తుంది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన

కళ్ళేమో కలలు మాని నిన్ను వెతుకుతుంటే
మనసేమో పనులు మాని నిన్ను తలుచుకుంటే
కాళ్ళు నీతో కలిసి నడవాలని కలవర పడుతుంటే
చేయి నీతో చెలిమి చెయ్యాలని తొందర పెడుతుంటే
వేరే దారి లేక నా దారే నువ్వయ్యాక
తీరం చేరినాక ఈ కెరటం ఆగలేక
నిన్నే తాకాలని నీతో గడపాలని
ముద్దే ఇవ్వాలని పొద్దే పోవాలని
మనసేమో మనసిచ్చింది
వయసేమో చనువిచ్చింది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన

ఏదో ఏదో అయిపోతుంది
ఎదలో ఏదో మొదలయ్యింది

ఆరాటం హద్దు దాటి మాట చెప్పమంటే
మోమాటం సిగ్గుతోటి పెదవి విప్పనంటే
ఉత్సాహం నిన్నే పొందాలని ఉరకలు వేస్తుంటే
ఉల్లాసం నీకై చెందాలని పరుగులు తీస్తుంటే
ఏమీ పాలుపోక సగపాలే నువ్వయ్యాక
ప్రాయం వచ్చినాక పరువం ఆగలేక
నువ్వే కావాలని నిన్నే కలవాలని
మనసే విప్పాలని మాటే చెప్పాలని
ఒళ్ళంతా పులకిస్తుంది తుళ్ళింత కలిగిస్తుంది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన

ఏదో ఏదో అయిపోతుంది
ఎదలో ఏదో మొదలయ్యింది





చీ చీ చీ బుల్లెమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వులేక నేనులేను (2002)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఆర్.పి. పట్నాయక్, లేనీనా చౌదరి 

చీ చీ చీ బుల్లెమ్మ చీ చీ చీ



నువ్వంటే నాకిష్టం పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వులేక నేనులేను (2002)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: వేటూరి
గానం: ఆర్.పి. పట్నాయక్

నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం
నువ్వంటే నాకిష్టం నా నువ్వైతే నాకిష్టం
నాలో ఆలాపన ఆగేనా ఆపిన
ఎదలో లయ వినవా ప్రియా

నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం

చరణం: 1
చెరువా దూరము లేవులే ఇష్టమైన ప్రేమలో
ఆశలే కంటిలో బాసలై ఇష్టమాయే చూపులే
కోపతాపాల తీపి శాపాల
ముద్దు మురిపాల కథ ఇష్టమే
ఎంత అదృష్టమో మన ఇష్టమే ఇష్టము

నువ్వంటే నాకిష్టం  నీ నవ్వంటే నాకిష్టం
నువ్వంటే నాకిష్టం  నా నువ్వైతే నాకిష్టం

చరణం: 2
ఎగసే ఆ గువ్వల కన్నా మెరిసే ఆ మబ్బుల కన్నా
కలిసే మనసేలే నాకిష్టం
పలికే ఈ తెలుగులా కన్నా చిలికే ఆ తేనెల కన్నా
చిలకా గోరింకకు నువ్విష్టం
ఇష్టసఖి నువ్వై అష్టపది పాడే
అందాల పాటల్లో నీ పల్లవిష్టం
నువ్వంటే ఎంతిష్టం... నీ ప్రేమంటే అంతిష్టం...
నేనంటే నాకిష్టం... నాకన్నా నువ్విష్టం....



ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వులేక నేనులేను (2002)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉష

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
గాలిలోన వేలితోటి రాసి చూపనా
నేల మీద సిగ్గుముగ్గు వేసి చూపనా
వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు
ఏర్చి కూర్చి చూపనా

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను

రామచిలక గోరువంక బొమ్మ గీసి తెలుపనా
రాధాకృష్ణుల వంక చేయిచూపి తెలుపనా
చిరునవ్వుతో తెలుపనా కొనచూపుతో తెలుపనా
నీళ్ళు నమిలి తెలుపనా గోళ్ళు కొరికి తెలుపనా
తెలుపకనే తెలుపనా...

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను

కాలివేలు నేల మీద రాసి చూపనా
నా చీరకొంగు తోటి  వేలు చుట్టి చెప్పనా
కూనలమ్మ పాటలో రాయబారమంపనా
గాలికైనా తెలియకుండా మాట చెవిని వేయనా
నాలో ప్రాణం నీవనీ...

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
గాలిలోన వేలితోటి రాసి చూపనా
నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా
వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు
ఏర్చి కూర్చి చూపనా...

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను



నిండు గోదారి కదా ఈ ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వులేక నేనులేను (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్. పి. పట్నాయక్, కౌసల్య

నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికి బంధువుగా ఈ ప్రేమ
రెండు హృదయాల కథే ఈ ప్రేమ
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ
కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ

నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికి బంధువుగా ఈ ప్రేమ

ప్రేమ అన్నది ఎంత గొప్పదో మరి
రాజు పేద బేధమంటు లేదు దీనికి
బ్రహ్మచారికీ బతుకు బాటసారికీ
ప్రేమదీపమల్లే చూపుతుంది దారిని
మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమ
చెరితగ ఇల నిలిచే గ్రంథం ఈ ప్రేమ
ప్రేమే మదిలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది

నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికి బంధువుగా ఈ ప్రేమ
రెండు హృదయాల కథే ఈ ప్రేమ
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ

ప్రేమ జోరుని ఎవ్వరాపలేరని
ఆనకట్టలాంటి హద్దులంటు లేవని
ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమని
గొంతు ఎత్తి లోకమంత చాటిచెప్పని
ప్రేమే తోడుంటే నిత్యం మధుమాసం
తానే లేకుంటే బతుకే వనవాసం
ప్రేమే కలకాలం మనవెంట ఉండి నడుపుతుంది

నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికి బంధువుగా ఈ ప్రేమ
రెండు హృదయాల కథే ఈ ప్రేమ
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ
కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ

నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికి బంధువుగా ఈ ప్రేమ



చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వులేక నేనులేను (2002)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, ఉష

చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి
జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది
పువ్వు పువ్వునా నవ్వులు చూసి
పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది

ఆ తుంటరి కోపం తొలి పొద్దు
ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు
అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు

చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి
జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది

ఏ బ్రహ్మ రాసాడో పాశాలిలా మారాయి స్నేహాలుగా
ఏ జన్మలో రక్త బంధాలిలా ఈ రెండు దీపాలుగా
ఏ రెండు కళ్ళల్లో చూపొక్కటై మా పొద్దు తెల్లారగా
ఏ గుండెలొ చోటు దక్కిందిలా ఏ తోడు కానంతగా
రాలేటి ఏ పూల రంగులో ముంగిళ్ళలో ముగ్గుగా
రోషాల ఈ లేత బుగ్గలో రోజాలు పూయించగా
ఆ బంధం అనుబంధం మాదె కదా

చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి
జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది

ఆ చెమ్మచెక్కల్లో చెలిమే ఇలా మారింది పంతాలుగా
ఈ కుర్ర తిక్కల్లో ఉడుకే ఇలా సాగింది పందాలుగా
ఆ మూతి విరుపుల్లో మురిపాలిలా పొంగాయిలే పోరులా
ఈ తిట్టి పోతల్లో అర్ధాలనే వెలిగించుకో వేలుగా
కారాల మిరియాల దంపుడే కవ్వింత పుట్టించగా
కల్యాణ తాంబూలమెప్పుడో కలలన్ని పండించగా
ఆ అందం ఆనందం మాది కదా

చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి
జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది
పువ్వు పువ్వునా నవ్వులు చూసి
పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది
ఆ తుంటరి కోపం తొలి పొద్దు
ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు
అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు

చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి
జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది


Most Recent

Default