Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "R.P.Patnaik"
Appudappudu (2003)


చిత్రం: అప్పుడప్పుడు  (2003)
సంగీతం: ఆర్. పి.పట్నాయక్, మధుకర్
నటీనటులు: రాజా అబెల్, శ్రియా రెడ్డి
దర్శకత్వం: చంద్ర సిద్దార్ధ
నిర్మాత: ఎ.రమేష్ గౌడ్
విడుదల తేది: 16.05.2003

Palli Balakrishna Tuesday, March 26, 2019
Swagatam (2008)


చిత్రం: స్వాగతం (2008)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం:  భాస్కరభట్ల
గానం: టిప్పు
నటీనటులు: జగపతిబాబు , అనుష్క , భూమిక , అర్జున్ సార్జా
దర్శకత్వం: దశరథ్
నిర్మాత: ఆదిత్యారామ్
విడుదల తేది: 25.01.2008

ఉన్నన్నాళ్ళు హాయిగా ఉండాలంది జీవితం
సరదాగా చిందులు వేసేద్దాం
వెళ్ళిందంటే రాదుగా మళ్ళీ మళ్ళీ ఈ క్షణం
కాలంలో పాటే పరిగెడదాం
నేనింతే నా తీరింతే అంటూ కూర్చుంటే
నీ చుట్టూ వెలుగెంతున్నా నువ్వుండేది చీకట్లోనే
ఏ సరిహద్దుని నో ఇక వద్దని
ఓ చిరునవ్వుతో వెల్‌కమ్‌ చెప్పెయ్‌

అప్పుడప్పుడు చాలా చిన్న సంగతే
ఎంతో తృప్తి నివ్వదా నీలో నీకు
చూడగలిగితే ఎన్నో అధ్భుతాలని లోకం
చూపగలదని మరిచిపోకు
కోటల్లో కోరికలన్ని కొండెక్కే వీలివ్వద్దు ఎదురొచ్చే ఆనందాన్ని
వద్దొద్దంటూ ఆపెయ్యద్దు
ఈ బ్రతుకన్నది హే బహు చిన్నది
ఓ చిరునవ్వుతో స్వర్గం చేసెయ్
లా ల ల ల ల

కంటి చూపుతో కొంచెం పలకరించుతూ
ప్రేమే చిలకరించుతూ
ఆనందించు నోటి మాటతో బంధం కుదురుతుందని
భారం తగ్గుతుంది ఆలోచించు
హే నలుగురితో పాటే నేను అనుకోడం ఆరంభించు
సంతోషం రెక్కలు తొడిగి ఎగిరొస్తుంది ఆహ్వానించు
ఈ పదిమందిలో నీ పరదాలను
ఓ చిరునవ్వుతో మాయం చేసెయ్


******   *******  *******


చిత్రం: స్వాగతం (2008)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: వేటూరి
గానం: కార్తిక్ , చిత్ర

మనసా మౌనమా..మదిలో రాగమా
మనసా క్షేమమా..మనిషే ప్రాణమా
చిగురులు వేసే చైత్రమా..చినుకై రాలే మేఘమా
చెరగని కావ్యం బంధమా..తరగని దూరం కాలమా
ఎదలోతుల్లో ఆనందమా !

మనసా మౌనమా..మదిలో రాగమా
మనసా మౌనమా !

నీలాకాశం సావాసంతో తారాలోకం సాగేవేళ
ప్రేమావేశం ప్రాణం పోసే గుండెల్లోనా
సాయంసంధ్యా నారింజల్లో సాయం కోరే నీరెండల్లో
తోడూ నీడా ఈడూ గూడూ నీవే కదా

వలచీ..పిలిచే..నాలో ఆశవైనా శ్వాసవైనా నీవే మైనా !

మనసా మౌనమా..మదిలో రాగమా
మనసా క్షేమమా..మనిషే ప్రాణమా

Few see It’s Lust..
Few see It’s Love..
For me It’s You..Only You !

భూజం బంతీ బుగ్గల్లోన..రోజారంగు సిగ్గుల్లోన
నీ అందాలా శ్రీగంధాలే పూసే వేళ
మాటేలేని కన్నుల్లోన..పాట పాడే పాపల్లోన
నీ చూపుల్లో నే బందీగా చిక్కే వేళా

జతగా..శృతిగా..అనురాగం యోగం ఏకం అయ్యే సంతోషాన !

మనసా మౌనమా..మదిలో రాగమా
మనసా క్షేమమా..మనిషే ప్రాణమా

Palli Balakrishna Wednesday, December 13, 2017
Nee Sneham (2002)


చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్ , ఉష
నటీనటులు: ఉదయ్ కిరణ్ , జతిన్, ఆర్తి అగర్వాల్
దర్శకత్వం: పరుచూరి మురళి
నిర్మాత: యమ్. ఎస్. రాజు
విడుదల తేది: 01.11.2002

ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం
ఈ అనుభవం వెన్నెల వర్షం
ఎలా తెలపటం ఈ సంతోషం

ఓ హాని - ఐ లవ్ యు

నమ్మనంటావో ఏమో నిజమే తెలుసా
అమృతం నింపే నాలో నీ చిరు స్పర్శ
ఒప్పుకోలేవో ఏమో మురిసే మనసా
రెప్పనే దాటిరాదే కలలో ఆశ
పొద్దేరాని నిద్దర్లోనే ఉండిపోని
నిన్నే చూసే కల కోసం
సర్లేకాని చీకట్లోనే చేరుకోని
నువ్వు కోరే అవకాశం
తక్కువేం కాదులే ఈ జన్మలో ఈ వరం

ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం

వానలా తాకగానే ఉరిమే మేఘం
వీణలా మోగుతుంది యదలో రాగం
స్వాగతం పాడగానే మదిలో మైకం
వచ్చి ఒడి చేరుతుందా ఊహాలోకం
ఉన్నట్టుండి నిన్నట్నుండి రాజయోగం
దక్కినంత ఆనందం
అయ్యో పాపం ఎక్కడ్లేని ప్రేమ రోగం
తగ్గదేమో ఏ మాత్రం
తానుగా చేరెగా ప్రియమైన ప్రేమాలయం

ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం
ఈ అనుభవం వెన్నెల వర్షం
ఎలా తెలపటం ఈ సంతోషం


********    ********   ********


చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్ , ఉష

ఏమో అవునేమో నిజమేమో
నాలో మైమరపే రుజువేమో
ఏంచేసిందో ఆ చిన్నది
ప్రేమించేసానందీ మది
తన పేరైనా అడగాలన్నా ఎదరుంటేనా
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి

ఏమో అవునేమో నిజమేమో
నాలో మైమరపే రుజువేమో

ఒక్కటే జ్ఞాపకం ఆమెతో పరిచయం
మబ్బులో మెరుపులా తగలటం
అక్కడే ఆ క్షణం మొదలు ఈ లక్షణం
నిద్రలో నడకలా సాగటం
ఆ మెరుపు కంటపడకుంటే
తన జంట కలిసి నడవందే
ఈ మరపు వదలనంటుందే ఇంకెలా
చెప్పమ్మా ఓ పావురమా ఆమెతో ఈ సంగతి

ఏమో అవునేమో నిజమేమో
నాలో మైమరపే రుజువేమో

ఆమెనే వెతకటం అందుకే బతకటం
కొత్తగా ఉన్నదే అనుభవం
ప్రేమనే పిలవటం ప్రేమనే తెలపటం
బొత్తిగా నేర్పదీ సతమతం
తన కంటి చూపులో మౌనం
చదివేదెలాగ నా హృదయం
తన గుండె గూటిలో నే వాలేదెలా
చెప్పమ్మా కలవరమా ఆమెతో నీ అలజడి

ఏమో అవునేమో నిజమేమో
నాలో మైమరపే రుజువేమో
ఏంచేసిందో ఆ చిన్నది
ప్రేమించేసానందీ మది
తన పేరైనా అడగాలన్నా ఎదరుంటేనా
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి


*********   *********    *********


చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉష

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా
ఆ... ఆమని మధువనమా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా

సరిగసా సరిగసా రిగమదని
సరిగసా సరిగసా నిదమ దని
సాస నిని దాద మామ గమదనిరిస గా
నినిదగ నినిదగ నినిదగ నినిదగ
సగమగ సనిదని మద నిస నిస గసగా

పసిడి వేకువలు పండు వెన్నెలలు
పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ
పచ్చనైన వరిచేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు
కళ్ళముందు నిలిపావే ముద్దుగుమ్మా
పాల కడలి కెరటాల వంటి
నీ లేత అడుగు తన ఎదను మీటి
నేలమ్మ పొంగెనమ్మా
ఆ... ఆగని సంబరమా ఆ ఆగని సంబరమా

సగమగా రిస సనిదమగ సగ సగమగా
రిస సనిదమగ సగ
సగస మగస గమద నిదమ గమదనిసా
సనిస సనిస నిస నిస నిస గమ రిస
సనిస సనిస నిస నిస నిస గమ రిస
గాగ నీని గగ నీని దగ నిగ సపా

వరములన్నీ నిను వెంట బెట్టుకొని
ఎవరి ఇంట దీపాలు పెట్టమని
అడుగుతునవే కుందనాల బొమ్మ
సిరుల రాణి నీ చేయి పట్టి
శ్రీహరిగా మారునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
అన్నమయ్య శృంగార కీర్తనల
వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా
ఆ...రాముని సుమ శరమా
ఆ...రాముని సుమ శరమా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా
ఆ...ఆమని మధువనమా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవమ్మా



*********   *********    *********



చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె కె (కృష్ణ కుమార్ కున్నత్)

ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
మాట మన్నించుమా బయటపడిపోకుమా
చెయ్యేత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీపేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా

ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా

చూపులో శూన్యమై పెంచుతూ ఉన్నది
జాలిగా కరుగుతూ అనుబంధం
చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది
జ్యోతిగా వెలుగుతూ ఆనందం
కలత  ఏ కంటిదో మమత ఏ కంటిదో
చెప్పలేనన్నది చెంప నిమిరే తడి
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా

దేహమే వేరుగా స్నేహమే పేరుగా
మండపం చేరనీ మమకారం
పందిరై పచ్చగా ప్రేమనే పెంచగా
అంకితం చేయనీ అభిమానం
నుదిటిపై కుంకుమై మురిసిపో నేస్తమా
కళ్ళకే కాటుకై నిలిచిపో స్వప్నమా
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా

ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
మాట మన్నించుమా బయటపడిపోకుమా



*********   *********    *********



చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఆర్.పి.పట్నాయక్ , రాజేశ్

కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం
కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వూ నేను నీడనివ్వాలి
స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా
నిన్నూ నన్నూ చూడగానే నమ్మితీరాలి

కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం

బొమ్మా బొరుసులేని నాణేనికి విలువుంటుందా
మనమిద్దరమూ పుట్టుండకపోతే చెలిమికి విలువుందా
సూర్యుడూ చంద్రుడూ లేని గగనానికి వెలుగుటుందా
మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా
గలగలమని సిరిమువ్వగా కలతెరుగని చిరునవ్వుగా
నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం

కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం

వివరిస్తున్నది అద్దం మన అనుబంధానికి అర్ధం
నువ్వు నాలాగా నేన్నీలాగా కనిపించడమే సత్యం
నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాతిరి దారికి దీపం
నీ కల నిజమై కనిపించనిదే నిదరించనురా నేస్తం
గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా
మన ప్రాణాలే తన పాదాలై సాగాలి నీ స్నేహం

కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు వేడుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం
కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వూ నేను నీడనివ్వాలి
స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా
నిన్నూ నన్నూ చూడగానే నమ్మితీరాలి




*********   *********    *********



చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఆర్.పి.పట్నాయక్

 (సోలో సాంగ్)

వేయి కన్నులతో వేచిచూస్తున్నా
తెరచాటు దాటి  చేరదా నీ స్నేహం!
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం!
ప్రాణమే నీకూ కానుకంటున్నా
మన్నించి అందుకోవా నేస్తమా!

వేయి కన్నులతో వేచిచూస్తున్నా
తెరచాటు దాటి  చేరదా నీ స్నేహం!

నీ చెలిమే ఊపిరిలా బతికిస్తున్నది నన్ను
నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్ను
ఎంత చెంత చేరినా సొంతమవని బంధమా
ఎంతగా తపించినా అందనన్న పంతమా
ఎంత ఆశ ఉన్నా నిన్ను పిలిచేదెలాగమ్మా
అందాల ఆకాశమా

Palli Balakrishna Thursday, November 16, 2017
Manasantha Nuvve (2001)




చిత్రం: మనసంతా నువ్వే (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నటీనటులు: ఉదయ్ కిరణ్ ,  రీమా సేన్
దర్శకత్వం: వి.యన్. ఆదిత్య
నిర్మాత: యం5.యస్.రాజు
విడుదల తేది: 19.10.2001



Songs List:



తూనీగా తూనీగా పాట సాహిత్యం

 
చిత్రం: మనసంతా నువ్వే (2001)
సంగీతం: ఆర్. పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సంజీవని , ఉష  

తూనీగా తూనీగా ఎందాకా పరుగెడతావే రావే నా వంక
దూరంగా పోనికా ఉంటాలే నీ వెనకాలే రానీ సాయంగా
ఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింకా ఇంతేగా నీ రెక్క
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా

తూనీగా తూనీగా ఎందాకా పరుగెడతావే రావే నా వంక

దోసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తున్నాగా
వదిలెయ్యకు సీతాకోక చిలుకలుగా
వామ్మో బాగుందే చిట్కా నాకూ నేర్పిస్తే చక్క
సూర్యున్నే కరిగిస్తాగా చినుకులుగా
సూర్యుడు ఏడి నీతో ఆడి చందమామ అయిపోయాడుగా
ఓ...ఓ...ఓ...ఓ...

తూనీగా తూనీగా ఎందాకా పరుగెడతావే రావే నా వంక

ఆ కొంగలు ఎగిరి ఎగిరి సాయంత్రం గూటికి మళ్ళీ
తిరిగొచ్చే దారిని ఎపుడూ మరిచిపోవెలా
ఓసారటు వైపెలుతుంది మళ్ళీ ఇటు వైపొస్తుంది
ఈ రైలుకు సొంతూరేదో గురుతు రాదెలా
కూ కూ బండి మా ఊరుంది ఉండిపోవే మాతో పాటుగా
ఓ...ఓ...ఓ...ఓ...

తూనీగా తూనీగా ఎందాకా పరుగెడతావే రావే నా వంక
దూరంగా పోనికా ఉంటావా నీ వెనకాలే రానీ సాయంగా
ఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింకా ఇంతేగా నీ రెక్క
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా



చెప్పవే ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: మనసంతా నువ్వే (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే 
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే 
హే హే హే... హే హే హే... హే హే హే...

ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
ఎపుడో ఒకనాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వనీ
ఇపుడు నిను చూపగలనని ఇదిగో నా నీడ నువ్వనీ
నేస్తమా నీకు తెలిసేదెలా


చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా

ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని
గుండెలో ఊసులే నీకు చెప్పాలని
ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని
గుండెలో ఊసులే నీకు చెప్పాలని
నీతలపులు చినుకు చునుకుగా 
దాచిన బరువెంత పెరిగెనో
నిను చేరే వరకు ఎక్కడా కరిగించను కంటి నీరుగా
స్నేహామా నీకు తెలిపేదెలా

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే 
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే 
హే హే హే... హే హే హే... హే హే హే...



కిటకిట తలుపులు పాట సాహిత్యం

 
చిత్రం: మనసంతా నువ్వే (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర 

కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం
రెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా
ప్రేమ ప్రేమ ప్రేమ...ప్రేమ

కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం

నిన్నిలా చేరేదాకా ఎన్నడూ నిదరే రాక
కమ్మని కలలో అయినా నిను చూడలేదే
నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంక
రెప్పపాటైనా లేక చూడాలనుందే
నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా
కాసేపిలా కవ్వించనా నీ మధుర స్వప్నమై ఇలా
ప్రేమ ప్రేమ ప్రేమ...ప్రేమ

కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం

కంట తడి నాడు నేడు చెంప తడి నిండే చూడు
చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా
చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి
అమృతం అయిపోలేదా ఆవేదనంతా
ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా
ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా
ప్రేమ ప్రేమ ప్రేమ...ప్రేమ

కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం
రెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా
ప్రేమ ప్రేమ ప్రేమ...ప్రేమ (3)





నీ స్నేహం ఇక రాను అని పాట సాహిత్యం

 
చిత్రం: మనసంతా నువ్వే (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఆర్.పి.పట్నాయక్ 

నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా
ఈ దూరం నువు రాకు అని నను వెలివేస్తూ ఉన్నా
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే



ధిన్ ధిన్ ధినక్ పాట సాహిత్యం

 
చిత్రం: మనసంతా నువ్వే (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మహాలక్ష్మి అయ్యర్

ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది
ఉండుండి ఆ సవ్వడి గుబులేదో రేపింది
హా ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది

మహ ముద్దుగా ఉంది నా రూపు నాకే అద్దంలో చూస్తుండగా
నువ్వు చేరినట్టుంది కనుపాపలోకి నిద్దర్లో నేనుండగా
నువ్వలా కొంటెగా తొంగి చూస్తే ఎలా
సిగ్గుగా ఉండదా చీర మార్చేదెలా
హో ల ల ల ల ల...

హే ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది

ఈ వేళ ఏమైందో ఈ గాలి ఏదో రాగాలు తీస్తున్నది
ఈ నేలపై ఉన్న పాదాలకేవో  పాఠాలు చెబుతున్నది
ఊరికే ఇక్కడే ఉండిపోకన్నది
కోరికె రెక్కలై ఎగరవేయన్నది
హో ల ల ల ల ల...

ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది
హా ఉండుండి ఆ సవ్వడి గుబులేదో రేపింది
హే ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది



మనసంతా నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: మనసంతా నువ్వే (2001)
సంగీతం: ఆర్. పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. చరణ్, సుజాత

చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే 
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే 
హే హే హే... హే హే హే... హే హే హే...

వయసుకే తెలియదే ఇన్నాళ్ళు గడిచిందని
పరికిణీ బొమ్మకి పైట చుడుతుందని
దూరమే చెప్పదే నీ రూపు మారిందని
స్నేహమే ప్రేమగా పెరిగి పెద్దైందని
ఇకపై మన కౌగిళింతకి చలి చీకటి కంటపడదని
ఎపుడూ మన జంట గడపకి కలతన్నది చేరుకోదని
కొత్తగా తెలుసుకున్నాననీ...

చెప్పనా ప్రేమా చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా

రెక్కలే అలిసినా నీ గుండెలో వాలగా
ఎక్కడా ఆగక ఎగిరి వచ్చానుగా
పక్కనే ఉండగా కన్నెత్తి నను చూడక
దిక్కులే తిరుగుతూ వెతికావులే వింతగా
ప్రాణానికి రూపముందని అది నువ్వై ఎదురయ్యిందని 
ప్రణయానికి చూపు ఉందని హృదయాన్నది నడుపుతుందని
విరహమే తెలుసుకోవాలని...

చెప్పనా ప్రేమా చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే 
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే 
హే హే హే... హే హే హే... హే హే హే...



ఆకాశానా ఎగిరే పాట సాహిత్యం

 
చిత్రం: మనసంతా నువ్వే (2001)
సంగీతం: ఆర్. పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కే.కే‌, సుజాత

ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా
అడుగు నేలపై ఆగనన్నది ఎంత ఆపుతున్నా
పిల్ల గాలితో తూగుతున్నది వింత హాయిలోనా
ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా

అటు ఇటు తిరుగుతు కన్నులు
చిలిపి కలలను వెతుకుతు ఉన్నవి
మదిని ఊరించు ఆశనీ కలుసుకోవాలనో
మధురభావాల ఊసుని తెలుసుకోవాలనో
 
ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా

తడబడు తలపుల అల్లరి ముదిరి మనసును తరుముతు ఉన్నది
అలలుగా తేలి నింగిని పలకరించేందుకో
అలసటే లేని ఆటలో అదుపు దాటేందుకో

ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా
అడుగు నేలపై ఆగనన్నది ఎంత ఆపుతున్నా
పిల్ల గాలితో తూగుతున్నది వింత హాయిలోనా
ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా



ఎవ్వరినెప్పుడు పాట సాహిత్యం

 
చిత్రం: మనసంతా నువ్వే (2001)
సంగీతం: ఆర్. పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె కె (కృష్ణ కుమార్ కున్నత్)

ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ
ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ
అర్దం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ
జీవిత పరమార్దం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా 
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా 

ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ
ప్రతి ఇద్దరితో ఈ గాధే మొదలంటుంది ఈ ప్రేమ
కలవని జంటల మంటలలో కనబడుతుంది ఈ ప్రేమ
కలిసిన వెంటనే ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా 
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా 

Palli Balakrishna
Lakshmi Kalyanam (2007)


చిత్రం: లక్ష్మీ కళ్యాణం (2007)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ , మణిశర్మ (బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: నిహాల్, ప్రాణవి
నటీనటులు: కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ (తొలిపరిచయం)
దర్శకత్వం: తేజ
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 15.02.2007

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా
అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా

అవుననుకో గోరువంకా అలుసిచ్చాను కనుక
జరిగింది తెలుసుకోక నాపై నింద లేయక
నీకేమీ ఊసుపోక నాదే నేరమనక
నిజమంతే వాదించక....

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా

ఓ కన్ను మూసి చూస్తున్నట్టు ఉంది
నా ఒంటి నడక నాకే నచ్చకుంది
నాతోనే నాకు గొడవయ్యినట్టు వుంది
నా నుంచి నేనే వేరయ్యినట్టు వుంది
ఊరుకోలేను చేరుకోలేను మనసిలా ఎందుకుంది
మూగనేకాను మాటకాలేను ఎమిటవుతున్నది...

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా

నాతోట పువ్వే నాపై కోపమంటే
ఈ ప్రాణమింకా వున్నా లేనిదంతే
నాలోని సగమే నాకే దూరముంటే
ఏ సందడైనా మనసే నవ్వదంతే
చిలిపి జగడాన్ని పెంచుకున్నను నేస్తమా తప్పు నాదే
చెలిమి విరహాన చేదు చూసాను పంతమా ఆగవే...

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా
నీకేమీ ఊసుపోక నాదే నేరమనక
నిజమంతే వాదించక...

Palli Balakrishna
Srinu Vasanti Lakshmi (2003)




చిత్రం: శీను. వాసంతి.. లక్ష్మి... (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ 
నటీనటులు: ఆర్.పి.పట్నాయక్ , నవనీత్ కౌర్, పద్మప్రియ
దర్శకత్వం: ఇ. శ్రీనివాస్
నిర్మాత: యన్.యమ్.సురేష్
విడుదల తేది: 26.03.2003



Songs List:



కుకుకూ కుకుకూ పాట సాహిత్యం

 
చిత్రం: శీను. వాసంతి.. లక్ష్మి... (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ 
సాహిత్యం: కులశేఖర్ 
గానం: ఆర్.పి.పట్నాయక్

కుకుకూ కుకుకూ కుకుకూ కూ
తొలిరాగం నేర్పింది ఈ పలుకూ
కుకుకూ కుకుకూ కుకుకూ కూ
నవలోకం చూపింది ఈ పిలుపూ
చిగురాకుల సవ్వడి ఐనా చిరుగాలి తాకినా
గుడిగంటల సందడి విన్నా నాలో ఏదో మైమరపూ

కుకుకూ కుకుకూ కుకుకూ కూ
తొలిరాగం నేర్పింది ఈ పలుకూ

చరణం: 1
కుశలములెన్నో అడిగినదీ కులికే గోదావరీ
పులకలు నాలో చిలికినదీ ఎగసే ఈ లాహిరి
కరిమబ్బునే మహముద్దుగా ఎదముందుకు తెచ్చెను గాలీ
తడికన్నుల్లో సిరివెన్నెల్లే కురిపించెను జాబిలీ... 

కుకుకూ కుకుకూ కుకుకూ కూ
తొలిరాగం నేర్పింది ఈ పలుకూ
కుకుకూ కుకుకూ కుకుకూ కూ
నవలోకం చూపింది ఈ పిలుపూ

చరణం: 2
అడుగులు తానై నడిపినదీ పుడమే ఓదారినీ
పదములు పాడీ పంచినది ఒడిలో ఓదార్పుని
రుణమన్నదే యిక తీరదే నా ప్రాణములిచ్చిన గానీ
నేల తల్లికే నేను యివ్వనా ఈ గీతాంజలీ... 

కుకుకూ కుకుకూ కుకుకూ కూ
తొలిరాగం నేర్పింది ఈ పలుకూ
కుకుకూ కుకుకూ కుకుకూ కూ
నవలోకం చూపింది ఈ పిలుపూ

చిగురాకుల సవ్వడి ఐనా చిరుగాలి తాకినా
గుడిగంటల సందడి విన్నా నాలో ఏదో మైమరపూ

కుకుకూ కుకుకూ కుకుకూ కూ
తొలిరాగం నేర్పింది ఈ పలుకూ





పాడనా శిలను కరిగించు గీతం పాట సాహిత్యం

 
చిత్రం: శీను. వాసంతి.. లక్ష్మి... (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ 
సాహిత్యం: కులశేఖర్ 
గానం: ఆర్.పి.పట్నాయక్, నిహాల్

పాడనా శిలను కరిగించు గీతం
పరమేశ్వరుడే యిలకేతెంచి
పులకించి నర్తించు నవ నాట్య వేదం

పాడనా మదిని మురిపించు గీతం
స్వరమాధురిలో మనసే నెమలై
పురివిప్పి ఆడేటి ఆనంద గీతం

పాడనా...

నారద ప్రణిపాతం స్వర భారతి పదపీఠం
ఓంకార నాదాల నిగమార్ధసారం సంగీతం
వెన్నెల జలపాతం మరుమల్లెల మణిదీపం
స్వరరాగ రసయోగ గంగాప్రవాహం సంగీతం
దిగంతాల శ్రుతి సుగంధాలు వెదజల్లును సంగీతం

పాడనా శిలను కరిగించు గీతం
స్వరమాధురిలో మనసే నెమలై
పురివిప్పి ఆడేటి ఆనంద గీతం

చరణం: 1
తుంబురు వరదానం తుహినాచల పరిధానం
మందార మకరంద మాధుర్యపానం..నా గానం
తుమ్మెద ఝంకారం నా పాటకి శ్రీకారం 
పరువాల పరవళ్ళ సెలయేటి వేగం  నా రాగం 
కళాభారతికి కళాఘాతమది  ఏమిర నీ గీతం 

పాడనా శిలను కరిగించు గీతం
స్వరమాధురిలో మనసే నెమలై
పురివిప్పి ఆడేటి ఆనంద గీతం

నాదబ్రహ్మ గురు త్యాగరాజ కృత
పంచరత్నములకించుమించు సరిసాటియైన
మమ గాన వాహినికి మంజుల మార్దవ మానస గీతికి ఊపిరులాడక స్వరములు తోచక 
తికమక పడిపడి పదములు తడబడి
శ్రుతి తప్పి మతిపోవు పసివాడవు  జన్యజనకాల, ధన్యగామకాల నా మూర్చనలకింక మూర్చిల్లిపోతావు

|| పాడనా ... ||

చరణం: 2
గలగల పారే సెలయేరమ్మ  సరిగమలంటే నేర్పింది
కిలకిల పాడే ప్రతి గువ్వమ్మ గమకములంటే చూపింది
అమ్మ పాటలో లాలి లాలన చిన్ని పాపలో హాయి భావన గాలి తరగలో గాన మధురిమ
పేద వెదురులో ప్రాణ స్పందన
కడలి అలల కమనీయ కీర్తన
పుడమి ఎదను చినుకమ్మ నర్తన
సుప్రభాత సుమ రాగ రంజన
సూర్యదేవ కిరణాల దీవెన
వేద మంత్రముల నాద ఘోషణ
కాగితాలలో కావ్య వేదన
గుండె గూటిలో వాయులీనమై
కంటి పాపలో స్వప్న రాగమై 
గాన పథమ్మున నను నడిపించే
జానపదమ్ముల జాను తెలుగు
తొలి పాటతల్లి నా జోతలందుకొని పొంగిపోగా ... 

పాడనా...




కోదండ రాముణ్ణి పాట సాహిత్యం

 
చిత్రం: శీను. వాసంతి.. లక్ష్మి... (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ 
సాహిత్యం: కులశేఖర్ 
గానం: ఆర్.పి.పట్నాయక్

పల్లవి:
కోదండ రాముణ్ణి చూడు కోరింది యిచ్చేటివాడు
ఆ సుందరాంగుణ్ణి చూడు మా తల్లి సీతమ్మ జోడు
అందాలన్ని చూడ కళ్ళు చాలకుంటె
నా మనసుతొ చూడు చూడయ్యో 
ఆ రూపం అపురూపం
నిలపాలోయ్ గుండెలోపలా
ఆదైవం మనకోసం వెలిశాడోయ్ నేలపై యిలా

చరణం: 1
శ్రీరాముని చిరునవ్వుగ వెలుగొందిన సీత
ఆ దేవుని వెనకాతలె వనికేగెను మాత
లంకేశుడు బెదిరించెను పలుమాయలచేత
బెంబేలున మూర్ఛిల్లెను అయ్యో మనసీత
ఆ బాధే నాలో పాటై పాడేను రామాయణం

కోదండ రాముణ్ణి చూడు

చరణం: 2
హనుమంతుడు వివరించెను సీతాసతి జాడ
శ్రీరాముడు వదిలించెను లంకేశుని చీడ 
పరనిందకు శీలమ్మును శంకించుట చేత
పెనుమంటలలో దూకి పునీత అయ్యె సీత 
ఆ గాథే నాలో పాటై పాడేను రామాయణం 

కోదండ రాముణ్ణి చూడు





అమెరిక అన్నాడు పాట సాహిత్యం

 
చిత్రం: శీను. వాసంతి.. లక్ష్మి... (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ 
సాహిత్యం: కులశేఖర్ 
గానం: మాలతి, ఆలి, సునీల్

ఏ పిల్లాయ్ 
ఏటి
నువ్వు నాకు నచ్చావ్
నాకూ నా గోపి నచ్చాడు
గోపిగాడ ఆడెక్కడుంటాడు
ఏమో...

అమెరిక అన్నాడు అరెకరమమ్మాడు
అడ్డరోడ్డు సంతలో నన్నొదిలి పోయాడు

తెలిసినోడు, తెలియనోడు, 
పడుచోడు, ముసలోడు 
ఉన్నోడు, లేనోడు, వెంటపడి నవ్వుతాడు హా...

పిల్లా బాగున్నా వంటడూ - అంతనచ్చావా ?
పిల్లా ఏవూరు అంటడూ - ఊరు చెప్పేనా?
అమ్మాయ్ ఏఁ పేరు అంటడూ - పేరు చెప్పేవా ?
అలా ఓ సారి అంటడూ - చాటుకెళ్ళావా ?

అమ్మ దొంగా చాటుకెళ్ళినావా
అందమంతా అప్పగించినావా ?

ఏంటి తెగమెలికలు తిరిగిపోతున్నావు

నా గోపి యే గుర్తోస్తున్నాడు 
అంత గుర్తొచ్చేసే పనేంచేశాడేంటి...?

మనువని చెప్పాడు మడతలు విప్పాడు
మావిడి తోపులో మంచం వేశాడు
అమ్మతోడు అందగాడు మల్లెలవీ జల్లినాడు
దగ్గరగా వచ్చినాడు బుగ్గలవీ గిల్లినాడు  హాఁ

అబ్బా మా చడ్డ గుంటడూ - మీద కొచ్చాడా ?
అమ్మీ ముద్దెట్ట మంటడూ - ముద్దుపెట్టావా ?
ఛీపో సిగ్గంటే ఒగ్గడూ - పట్టుకున్నాడా?
కుర్రాడేమాత్రం తగ్గడూ - అంత పనోడా?

కొంటె వాడా కోకలాగినాడా ?
సూపుతోటే కాక రేపినాడా ?

చెట్టంతుంటాడు చెప్పినదింటాడు
నలుగురినెప్పుడూ  నవ్విస్తుంటాడు
కొత్తలుంగీ కట్టినాడు గళ్ళ బనీనేసినాడు
మండగొలుసు పెట్టినాడు 
మందులవీ అమ్ముతాడు

మందులమ్ముతాడా ?

పిల్లా నీ వాడు ఎవ్వడే? - డాక్టరబ్బాయి 
అబ్బో ఏఁమందులున్నవే? - బోలెడున్నాయీ
సరే మీ బావ ఎక్కడ? - తెలీదబ్బాయి

కండపుష్టికి ధాతుపుష్టికి తిరుగులేని వనమూలికలమ్ముతాం
మూలిక వాడండి మూలన పడ్డ మగతన్నాని వెలికి తీయండి
చీకటి పడితే చాలు చిరుత పులైపోతారు మామాట నమ్మండి
గజ్జిగాని, దురద గాని, తామరగాని
గోక్కోవడానికి గోళ్ళు లేవని బాధపడకండి
ధనుర్వాతం, పక్షవాతం కాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు, నడుంనొప్పులు, వెన్నునొప్పులు
మెడనొప్పులు, తొడ నొప్పులు
అన్ని నొప్పులకూ ఒకటే మందు

రూపాయ్ కొడితే ఉంటుంది మీ ముందు
పెద్దాపురం తైలం నొప్పులన్నీ మటుమాయం

అరే మా బావ గొంతులా ఉందే...?
ఏటి మీ బావ సందుల్లో మందులమ్ముతాడా ?
మరి డాక్టరని పెద్ద బిల్డప్పిచ్చావ్ ....
మా ఊళ్ళో సందుల్లో మందులమ్మేవాళ్ళని డాక్టరనే అంటారు

మందులోడా  ఓరి మాయలోడా
మాతరేసి మాయ చేసినోడా 





వానా వానా వానా పాట సాహిత్యం

 
చిత్రం: శీను. వాసంతి.. లక్ష్మి... (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ 
సాహిత్యం: కులశేఖర్ 
గానం: ఆర్.పి.పట్నాయక్

పల్లవి:
వానా వానా వానా నీలాకాశంలోన
నీతో చిందేసి ఆడన
వానా వానా వానా మేఘాలాపన లోన
నేనూ ఓ పాట పాడన
పన్నీటి పూలతోన  ఊసులాడుకోన
పసిపాపలా హరివిల్లునే చెయిచాపి అందుకోన

వానా వానా వానా

చరణం: 1
వానలోన కాగితాల పడవలేసే చిలిపి ప్రాయం
యింకాగురుతే చిన్నినేస్తం
యేటిలోన గాలమేసి ఎదురుచూసే మనసు పాపం
మదిలో మెదిలే నాటి బాల్యం 
వాననీటిలో ఆడుకున్న ఈతలు
జామతోటలో పాడుకున్న పాటలు
మరుపే లేని తియ్యనైన జ్ఞాపకాలు 

వానా వానా వానా

చరణం: 2
నింగిలోన మబ్బుకూన అందుకుంది చినుకురాగం
దాహంకోరే నేలకోసం 
నేలపైన నీటివీణ పల్లవించే మబ్బుకోసం
స్నేహం పంచే పూలగీతం
కోయిలమ్మతోపాటు కొంటె పాటలు
జాబిలమ్మతో ఎన్ని జామురాత్రులు
మరుపే లేని తియ్యనైన జ్ఞాపకాలు

వానా వానా వానా



గోదారి నవ్వింది పాట సాహిత్యం

 
చిత్రం: శీను. వాసంతి.. లక్ష్మి... (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ 
సాహిత్యం: కులశేఖర్ 
గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష

గోదారి నవ్వింది తుమ్మెదా
నిండు గోదారి నవ్వింది తుమ్మెదా

గోదారి నవ్వింది తుమ్మెదా
నిండు గోదారి నవ్వింది తుమ్మెదా
మా పల్లె నవ్వింది తుమ్మెదా
మల్లె పువ్వల్లె నవ్వింది తుమ్మెదా
సంబరాల వేళ తుమ్మెదా
ఊరు స్వర్గమయ్యిందమ్మ తుమ్మెదా
ఇన్ని సంతోషాలు నిండు నూరేళ్ళుంటె
ఎంత బాగుంటుందె తుమ్మెదా

గోదారి నవ్వింది తుమ్మెదా
నిండు గోదారి నవ్వింది తుమ్మెదా 
హోయ్ తుమ్మెదా

ఆనందమె బ్రహ్మ తుమ్మెదా
మనిషికానందమె జన్మ తుమ్మెదా
కోరుకున్నదంత కళ్ళు ముందు ఉంటె 
ఆనందమె కద తుమ్మెదా
ఆకాశమేమంది తుమ్మెదా
చిటికెడాశుంటె చాలంది తుమ్మెదా
అంతులేని ఆశ గొంతుదాటలేక 
ఇరక పడతాదమ్మ తుమ్మెదా
ఈ నవ్వు తోడుంటె తుమ్మెదా
ఇంక కష్టాలదేముంది తుమ్మెదా

గోదారి నవ్వింది తుమ్మెదా
నిండు గోదారి నవ్వింది తుమ్మెదా 
హోయ్ తుమ్మెదా

గోధూళి వేళల్లొ తుమ్మెదా
ఎద రాగాలు తీసింది తుమ్మెదా
కొంటె గుండెలోన సందె పొద్దువాలి 
ఎంత ముద్దుగుంది తుమ్మెదా
అందాల చిలకమ్మ తుమ్మెదా
కూని రాగాలు తీసింది తుమ్మెదా
కన్నె మూగ ప్రేమ హాయి పాటల్లోన 
ఊయలూగిందమ్మ తుమ్మెదా
పుణ్యాల నోమంట తుమ్మెదా
ఈ లోకాన ఈ జన్మ తుమ్మెదా

గోదారి నవ్వింది తుమ్మెదా
నిండు గోదారి నవ్వింది తుమ్మెదా
మా పల్లె నవ్వింది తుమ్మెదా
మల్లె పువ్వల్లె నవ్వింది తుమ్మెదా
సంబరాల వేళ తుమ్మెదా
ఊరు స్వర్గమయ్యిందమ్మ తుమ్మెదా
ఇన్ని సంతోషాలు నిండు నూరేళ్ళుంటె
ఎంత బాగుంటుందె తుమ్మెదా

గోదారి నవ్వింది తుమ్మెదా
నిండు గోదారి నవ్వింది తుమ్మెదా 
హోయ్ తుమ్మెదా

Palli Balakrishna Sunday, October 8, 2017
Holi (2002)


చిత్రం: హోలీ (2002)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్
నటీనటులు: ఉదయ్ కిరణ్, రీచా పల్లోడ్
దర్శకత్వం: యస్.వి.యన్. వర ప్రసాద్
నిర్మాత: నూకారపు సూర్యప్రకాష్ రావు
విడుదల తేది: 30.08.2002

ఔనని అంటావో మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో
ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో
తెలియక సతమతమౌతోంది నా మనసెంతో

అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో

ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని

ఔనని అంటావో మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో

చిగురాకుల లేఖలు రాసి
చిరు గాలి చేతికి ఇచ్చి
ఎపుడో నే పంపించాను నువ్వు చూడలేదా

నా మసనే పడవగా చేసి
కలలన్నీ అలలుగా చేసి
ఎపుడో నే పంపించాను నిన్ను చేరలేదా

చెప్పాలని అనిపిస్తున్నా
నా ఎదుటే నువ్వు కూర్చున్నా
మనసులోని మాట నీకు చెప్పలేకపోతున్నా
చెప్పకుండా ఓ క్షణమైనా ఉండలేకపోతున్నా

ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని

ఔనని అంటావో మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో

ప్రేమన్నది ఊపిరి కాదా
అందరిలో ఉండేదేగా
పరిచయమే లేదని అంటే వింతే కదా

నువ్వున్నది నాలోనేగా
ఈ సంగతి విననే లేదా
మదిలోనే నువ్వు నిదరోతూ గమనించలేదా

ఎదనిండా ఆశలు ఉన్నా
ఎన్నెన్నో ఊసులు ఉన్నా
ప్రేమ భాష రాదు అంటే నమ్మవా ఓ మైనా
కళ్ళలోకి చూసి అయినా పోల్చూకోవ నా ప్రేమ

ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని

ఔనని అంటావో మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో
ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో
తెలియక సతమతమౌతోంది నా మనసెంతో

అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో

ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని



********  ********   *******


చిత్రం: హోలీ (2002)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: కె.కె., సాధన సర్గం

ఓ చెలియ నా చెలియ నేలకి వచ్చిన దేవకన్యవ
ఓ సఖియ నా సఖియ పున్నమి వెన్నెల కాంతి రేఖవా

ఓ చెలియ నా చెలియ నేలకి వచ్చిన దేవకన్యవ
ఓ సఖియ నా సఖియ పున్నమి వెన్నెల కాంతి రేఖవా

కల్ల ముందర స్వర్గం నీవా,అందం అంటె అర్దం నీవా
నడిచి వొచ్చిన బాపు బొమ్మవా

ఓ చెలియ నా చెలియ నేలకి వచ్చిన దేవకన్యవ
ఓ సఖియ నా సఖియ పున్నమి వెన్నెల కాంతి రేఖవా

పత్రం,పుష్పం,దూపం,దీపం గుల్లొ పెట్టమంది గుండెలోన కొరికమ్మ
అందం చందం అన్ని ఉన్నా ముము ముద్దుగుమ్మ సొంతమైతె చాలునమ్మా
యే మాట చెప్పలేక పెదవంచు ఆగంది
ఆరోజే నిన్ను చూసి పుల్లకింత రేగింది
ఏ మరుమల్లె విరబూసింది ఎడారి కౌగిల్లలూ

నవ్వె అందం నడకె నాట్యం ఎట్ట చెప్పనమ్మ బాషలంటు చాలవమ్మా
నువ్వె రాగం నువ్వె తాలం నువ్వె ప్రానమంది చూడవయ్య కొంటె జన్మ
ని తోడె లేకపోతె మది బోసిపోథంది
ని స్నెహం తీగళాగ నను అల్లుకుంటుంది
ని చిరునవ్వె సిరిసిరి మువ్వై మొగింది నా గుండెలొ


********  ********   *******


చిత్రం: హోలీ (2002)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: కె.కె., కవితా కృష్ణమూర్తి

పల్లవి:
ఆడపిల్లలు అరె లేడి పిల్లలు హంస నడక నేర్చుకున్న చేప పిల్లలు
ఆ వాలు చూపులు విసిరేసి పాపలు మగవారిలోన ప్రేమ చిచ్చు పెట్టి పోదురు

చరణం: 1
నీలో నాలో మౌనం పెంచే పాటే కాదా ప్రేమ నిజంగా
ఆటా పాటా ప్రేమేనంటే అయ్యో పాపం కుర్రతనంగా
అందరికి అందదుగా ప్రేమ సుధా
ఎందుకలా ప్రేమ వట్టి కట్టు కధ
లైలా మజ్ఞూల గాధే తెలుసుకదా
అయ్యో వారి కధ చివరకి వేరు కదా
మీకు మాకు దూరం తప్పదుగా

ని స గ ని స మ
ని స గ రి స ని స
ని స గ స గ మ
గ మ ప ద ప మ గ మ గ రి స రి
ని స గ ని స మ
ని స గ రి స ని స

చరణం: 2
కళ్ళు కళ్ళు చదివే భాష ప్రేమేనయ్యో చూడు తమషా
హెల్లొ అంటే ప్రేమేనంట అయ్యొ రామ ఇంత పరాకా
మనసులిల ముడిపడని పెళ్ళి సుధ
పెళ్ళి తంతు జరిగేది పైన కదా
ప్రేమే పెళ్ళికిల పువ్వుల పల్లకిగ
తేడ వచినద ప్రేమే చావు కదా
మీకు మాకు వాదం తప్పు కదా
బ్రహ్మచారులు కొయొద్దు కోతలు వెనక నుంచి తీయవద్దు తీపి గొతులు
మీ మాయ మాటలు నమ్మెది ఎవ్వరు అరె ఆడగాలి సొకగానె రెచిపోదురు


Palli Balakrishna Saturday, September 23, 2017
Nee Kosam (1999)

చిత్రం: నీకోసం (1999)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ ( బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్)
సాహిత్యం: సాహితి
గానం: రాజేష్, కౌసల్య
నటీనటులు: రవితేజ , మహేశ్వరి
దర్శకత్వం: శ్రీను వైట్ల
నిర్మాత: ఘంటా శ్రీనివాస రావు
విడుదల తేది: 03.12.1999

నీకోసం  నీ కోసం
నీకోసం  లలలా  నీ కోసం

ఎపుడూ లేని ఆలోచనలు
ఇపుడే కలిగెను ఎందుకు నాలో
నీకోసం  నీ కోసం
ఈ లోకమిలా  ఏదో కలలా
నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉందీ

నీకోసం  నీ కోసం
నీకోసం  లాలలా  నీ కోసం

లలలలలా..లలలలలా..లాలాలా..
లలలలలా..లలలలలా..లాలాలా..
లాలాల..లాలాల..
సయ్య సయ్య సా సయ్య సయ్య సా
సయ్య సయ్య సయ్య సయ్య
సయ్య సయ్య సా సయ్య సయ్య సా
సయ్య సయ్య సయ్య సయ్య

నాలో ఈ ఇదీ  ఏ రోజూ లేనిదీ
ఏదో అలజడీ  నీతోనే మొదలిదీ
నువ్వే నాకనీ  పుట్టుంటావనీ
ఒంటిగా నీ జంటకే ఉన్నాను నేనిన్నాళ్ళుగా

నీకోసం  నీ కోసం
నీకోసం  లాలలా  నీ కోసం

నాలో ప్రేమకీ  ఒక వింతే ప్రతీదీ
వీణే పలుకనీ  స్వరమే నీ గొంతుదీ
మెరిసే నవ్వదీ  మోనాలీసదీ
ఈ నిజం ఇక కాదనే ఏ మాటనూ నే నమ్మనూ

ఎపుడూ లేని ఆలోచనలు
ఇపుడే కలిగెను ఎందుకు నాలో
నీకోసం  నీ కోసం
ఈ లోకమిలా  ఏదో కలలా
నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉందీ
నీకోసం  నీ కోసం
నీకోసం  లాలలా  నీ కోసం

Palli Balakrishna Saturday, August 19, 2017
Sambaram (2003)



చిత్రం: సంబరం (2003) 
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నటీనటులు: నితిన్, నేహ
దర్శకత్వం: దశరద్ (కొండపల్లి దశరథ్ కుమార్)
నిర్మాత: తేజ
విడుదల తేది: 31.07.2003



Songs List:



దేవుడిచ్చిన వరమని తెలిసే పాట సాహిత్యం

 
చిత్రం: సంబరం (2003) 
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: టిప్పు

దేవుడిచ్చిన వరమని తెలిసే 
నడిచి వచ్చిన కలలని తెలిసే 
మనసు తెచ్చిన వెలుగని తెలిసే 
తెలిసే తెలిసే తెలిసే 
దేవుడిచ్చిన వరమని తెలిసే 
నడిచి వచ్చిన కలలని తెలిసే 
మనసు తెచ్చిన వెలుగని తెలిసే 
తెలిసే తెలిసే తెలిసే 
అలవాటు లేని ఈ పులకింత 
తన రూపమే గదా మనసంతా 
ఇది ప్రేమ కాక మరి ఏంటంటా 
No doubt no doubt no doubt no 
ఇది ప్రెమ ప్రేమ ప్రేమ....ఇది ప్రేమ ప్రేమ ప్రేమ 
ఇది ప్రేమ ప్రేమ ప్రేమ.....ఇది ప్రేమ ప్రేమ ప్రేమ 

ప్రాణమున్నది మనసు తెను లేని జీవితం బొరుసు 
పుస్తకాలలో దాచుకున్న నా జ్ఞాపకాలనే అడుగు 
ఆమె పేరునే మనసు అరె మాటిమాటికీ తలుచు 
ఆమెకోసమై ఎంత వేచినా చెంత చేరదే అలుపు 
అనురాగమే ఒక మేఘమై తొలిప్రేమగా కురిసింది అని 
తనలో తనే మనసే ఇలా మురిసిందిలే 

దేవుడిచ్చిన వరమని తెలిసే.....నడిచి వచ్చిన కలలని తెలిసే 
మనసు తెచ్చిన వెలుగని తెలిసే 
తెలిసే తెలిసే తెలిసే 

ఆమె కళ్ళలో మెరుపు అరె ఆమె నవ్వు మైమరుపు 
ఆమె ఊహలో ఆమె ధ్యాసలో తేలితున్నది మనసు 
ఆమెకోసమీ బ్రతుకు మది ఆమెకోసమే బతుకు 
ఇన్ని రోజులు చిన్ని మనసెలా కలవరించెనో అడుగు 
తన ప్రేమలో నిజముందని ఈ రోజుతో ఋజువైనదని 
తనలో తనే మనసే ఇలా మురిసిందిలే...హో..హో.. 

దేవుడిచ్చిన వరమని తెలిసే 
నడిచి వచ్చిన కలలని తెలిసే 
మనసు తెచ్చిన వెలుగని తెలిసే 
తెలిసే తెలిసే తెలిసే 
దేవుడిచ్చిన వరమని తెలిసే 
నడిచి వచ్చిన కలలని తెలిసే 
మనసు తెచ్చిన వెలుగని తెలిసే 
తెలిసే తెలిసే తెలిసే 
అలవాటు లేని ఈ పులకింత 
తన రూపమే గదా మనసంతా 
ఇది ప్రేమ కాక మరి ఏంటంటా 
No doubt no doubt no doubt no 
ఇది ప్రేమ ప్రేమ ప్రేమ......ఇది ప్రేమ ప్రేమ ప్రేమ 
ఇది ప్రేమ ప్రేమ ప్రేమ.......ఇది ప్రేమ ప్రేమ ప్రేమ 





ఎందుకే ఇలా గుండె లోపల  పాట సాహిత్యం

 
చిత్రం: సంబరం (2003) 
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఆర్.పి.పట్నాయక్

ఎందుకే ఇలా గుండె లోపల 
ఇంత మంట రేపుతావు అందని కల
అన్ని వైపులా అల్లుకోకిలా 
ఆగనీక సాగనీక ఎన్నాళ్లిలా
వెంటాడుతు వేధించాలా మంటై నను సాధించాలా
కన్నీటిని కురిపించాలా జ్ఞాపకమై రగిలించాలా
మరుపన్నదే రానీయవా దయలేని స్నేహమా

ఎందుకే ఇలా గుండె లోపల 
ఇంత మంట రేపుతావు అందని కల
అన్ని వైపులా అల్లుకోకిలా 
ఆగనీక సాగనీక ఎన్నాళ్లిలా

చరణం: 1
తప్పదని నిను తప్పుకుని వెతకాలి కొత్త దారి
నిప్పులతో మది నింపుకుని బతకాలి బాటసారి
జంటగా చితిమంటగా గతమంత వెంట 
ఒంటిగా నను ఎన్నడూ వదిలుండనందిగా
నువ్వు నీ చిరునవ్వు చేరని చోటే కావాలి
ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి

ఎందుకే ఇలా గుండె లోపల 
ఇంత మంట రేపుతావు అందని కల
అన్ని వైపులా అల్లుకోకిలా 
ఆగనీక సాగనీక ఎన్నాళ్లిలా

చరణం: 2
ఆపకిలా ఆనాటి కల అడుగడుగు తూలిపోగా
రేపకిలా కన్నీటి అల ఏ వెలుగు చూడనీక
జన్మలో నువు లేవని ఇకనైన నన్ను నమ్మని
నిన్నలో వదిలేయనీ ఇన్నాళ్ల ఆశని
చెంతేవున్నా సొంతం కావని నిందించేకన్నా
నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్నా

ఎందుకే ఇలా గుండె లోపల 
ఇంత మంట రేపుతావు అందని కల
అన్ని వైపులా అల్లుకోకిలా 
ఆగనీక సాగనీక ఎన్నాళ్లిలా




ఎర్ర గులాబీ పాట సాహిత్యం

 
చిత్రం: సంబరం (2003) 
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: రవివర్మ, మల్లి

ఎర్ర గులాబీ




మధురం మధురం పాట సాహిత్యం

 
చిత్రం: సంబరం (2003) 
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: రాజేష్

మధురం మధురం ఎపుడూ ప్రేమ 
సహజం సహజం ఇలలో ప్రేమ 
కలలసీమలో నిజము ఈ ప్రేమ 
అనురాగం పలికించే ప్రియనేస్తం ప్రేమ ప్రేమ... 

ఎపుడూ ఎదకీ ఒకటే ధ్యాస 
ఎపుడో అపుడూ నాదను ఆశ 
బదులు కోసమే ఎదురు చూస్తున్నా 
మదిలోనే కొలువున్నా నిను చూసీ పలుకే రాదే... 

వలపూ విషమూ ఒకటేనేమో 
మనసూ మమతా కలలేనేమో 
చిగురుటాశలే చెదిరిపోయేనే 
ఎదకోసే ఈ బాధా మిగిలిందీ ప్రేమ ప్రేమ.... 



నక్కతోక పాట సాహిత్యం

 
చిత్రం: సంబరం (2003) 
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: రవివర్మ, శ్రీరామ్ బాలాజి

నక్కతోక 




నీ స్నేహం దూరం ఆయె పాట సాహిత్యం

 
చిత్రం: సంబరం (2003) 
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్

నీ స్నేహం దూరం ఆయె 
నీ ప్రాణం భారం ఆయె 
నీ నీడే రాదే నీ వెంట 
ఇన్నాళ్ళూ నీతో ఉంటూ 
కన్నీళ్ళే రానీకంటూ 
చెప్పేటి వారే లేరింకా 
పగలనీయకు గుండెలని 
చెలిమి లేదు అని... 
ఎవరి దారులు వారివనీ 
ముగిసె నీ మజిలీ... 
ఋణము తీరిన బంధం నిన్నే 
ఒదిలి పోయిందీ... 
మనసు ఒంటరినయ్యానంటూ 
కుమిలి పోతుందీ... 

నీ ఆశే నీరయ్యింది 
నీ శ్వాసే నిప్పయ్యింది 
నీకంటూ ఇంకా ఏముంది 
ఈ దూరం భారం అంది 
ఈ గాయం పోనంటుంది 
నువ్వింక చేసేదేముంది... 





పట్టుదలతో చేస్తే పాట సాహిత్యం

 
చిత్రం: సంబరం (2003) 
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్లికార్జున్

పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం 
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా 
నీ ధైర్యం తొడై ఉండగా ఏ సాయం కోసం చూడకా 
నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా 
ఏ నాడూ వెనకడుగేయకా ఏ అడుగూ తడబడనీయకా 
నీ గమ్యం చేరేదాకా ధూసుకుపోరా సోదరా 
పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం 
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా 

ఇష్టం ఉంటే చేదు కూడా తియ్యనే 
కష్టం అంటే దూది కూడా భారమే 
లక్ష్యమంటూ లేని జన్మే దండగా 
లక్షలాది మంది లేదా మందగా 
పంతం పట్టీ పోరాడందే 
కోరిన వరాలు పొందలేరు కదా 
పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం 
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా 

చేస్తూ ఉంటే ఏ పనైనా సాద్యమే 
చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే 
ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా 
ఎక్కలేని కొండనేదీ లేదురా 
నవ్వే వాళ్ళు నిద్దరపోగా 
దిక్కులు జెయించి సాగిపోరమరి 

పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం 
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా 
నీ ధైర్యం తొడై ఉండగా ఏ సాయం కోసం చూడకా 
నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా 
ఏ నాడూ వెనకడుగేయకా ఏ అడుగూ తడబడనీయకా 
నీ గమ్యం చేరేదాకా ధూసుకుపోరా సోదరా 
పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం 
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా





పిట్ట నడుం పాట సాహిత్యం

 
చిత్రం: సంబరం (2003) 
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి. పట్నాయక్, ఉష

పిట్ట నడుం




ప్రేమను పంచిన ప్రేమను  పాట సాహిత్యం

 
చిత్రం: సంబరం (2003) 
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్

ప్రేమను పంచిన ప్రేమను 
ప్రేమను పెంచిన ప్రేమను 
ఆశగా కొరదా ప్రతి హృదయం 
ప్రేమను పొందటమో వరం 
అది అంబరమంటిన సంబరం 
ప్రేమలో తేలుదాం ప్రతి నిమిషం 
ప్రేమలో ఈ లోకమే సాగే ప్రేమగా 
ప్రేమతో ఈ జీవితం ప్రేమించగా 
ప్రేమను పంచిన ప్రేమను 
ప్రేమను పెంచిన ప్రేమను 
ఆశగా కొరదా ప్రతి హృదయం 

పసి మదిలో ఏముందో ముందుగానే తెలిసుంటుంది 
అందుకనే ఆ దైవం జంటగానే నడిపిస్తుంది 
మూసి ఉన్న కళ్ళలో ఎన్ని ఆశలో 
భాష రాని గుండెలో ఎన్ని ఊసులో 
సిరివెన్నెలంటి ఈ స్నేహం 
గతజన్మలోని బహుమానం 
ఈ జంట చూసి పులకించిపోయి శతమానమంది లోకం 

ప్రేమను పంచిన ప్రేమను 
ప్రేమను పెంచిన ప్రేమను 
ఆశగా కొరదా ప్రతి హృదయం 

ఎవ్వరితో ఎవ్వరికో ప్రేమ రాత రాసుంటుంది 
ఆ మదికీ ఈ మదికీ బంధమేసి నడిపిస్తుంది 
గుప్పేడంత గుండెలో ప్రేమ అన్నది 
జ్ఞాపకాల ఊపిరై తాకుతుంటది 
ప్రేమించి చూడు ఒకసారి 
అది మార్చుతుంది నీ దారి 
ఈ ప్రేమలోన ఆకాశమంత సంతోషముంది లేరా 

ప్రేమను పంచిన ప్రేమను 
ప్రేమను పెంచిన ప్రేమను 
ఆశగా కొరదా ప్రతి హృదయం 
ప్రేమను పొందటమో వరం 
అది అంబరమంటిన సంబరం 
ప్రేమలో తేలుదాం ప్రతి నిమిషం 
ప్రేమలో ఈ లోకమే సాగే ప్రేమగా 
ప్రేమతో ఈ జీవితం ప్రేమించగా 
ప్రేమను పంచిన ప్రేమను 
ప్రేమను పెంచిన ప్రేమను 
ఆశగా కొరదా ప్రతి హృదయం 


Palli Balakrishna Wednesday, August 16, 2017
Gemeni (2003)



చిత్రం: జెమిని (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నటీనటులు: వెంకటేష్ , నమిత , ముంతాజ్
దర్శకత్వం: శరన్
నిర్మాతలు: యమ్.శరవణన్ , యమ్.బాలసుబ్రహ్మణియన్, యమ్.ఎస్. గుహన్, బి.గురునాథ్
విడుదల తేది: 11.10.2002



Songs List:



చెలి చెడుగుడు జెమిని జెమిని పాట సాహిత్యం

 
చిత్రం: జెమిని (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: వేటూరి
గానం: అనురాధా శ్రీరామ్, యస్ పి బాలు

చెలి చెడుగుడు జెమిని జెమిని తల తిరుగుడు జెమిని జెమిని
చలి విరుగుడు జెమిని జెమిని పిలుపెరగడు జెమిని జెమిని 
కలబడుమరి జెమిని జెమిని    కధ ముదిరిన జెమిని జెమిని 
నిలబడు మరి జెమిని జెమిని  చెలి వలచిన జెమిని  జెమిని
జెమిని జెమిని జెమిని జెమిని  కామిని  కామిని కామిని కామిని
జెమిని జెమిని జెమిని జెమిని   కామిని  కామిని కామిని కామిని
నీ క్రేజీ సొగసులతో టీనేజీ వయసులతో వీలైతే పురుషుడికి ఈలేసే తికమకలు
వెయ్ పోటు...వెయ్ పోటు(4)

చెలి చెడుగుడు జెమిని జెమిని తల తిరుగుడు జెమిని జెమిని
చలి విరుగుడు జెమిని జెమిని పిలుపెరగడు జెమిని జెమిని 

జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని...

సిగ్గిడిచిన పిల్లరో మొగ్గ చెడిన మల్లెరో బుగ్గపండు గిల్లరో తిక్క దించరో 
ఓ బజారు కోకిల కాలు జారు షోకిలా మారుతావు కాకిలా రెచ్చి పోకిలా
ఏలూరుల ఎక్కినా ఉయ్యురుల ఊగినా బెజవాడల బెంగ పడి మంగళగిరి చేరినా
వచ్చేస్తా టచ్చేస్తా నచ్చింది ఇచ్చేస్తా దాచింది దోచేస్తా దమ్మెంతో చూపిస్తా
కొట్టు కొట్టు కోక నట్టు కట్టు కట్టు చీర కట్టు
ముద్దులన్ని మూట కట్టు మూత పెట్టి ముద్దు పెట్టు
వెయ్ పోటు...వెయ్ పోటు
వెయ్ పోటు...వెసేయ్ పోటు

చెలి చెడుగుడు జెమిని జెమిని తల తిరుగుడు జెమిని జెమిని
చలి విరుగుడు జెమిని జెమిని పిలుపెరగడు జెమిని జెమిని 

జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని...

కంటపడిన చిన్నది కంటగించు కున్నది 
కనికరించ కున్నది కన్ను గీటినా
లవ్వు మత్తులో పడి లైఫ్ బొత్తిగా చెడి అడ్డరోడ్డునే పడి అలమటించినా
కృష్ణలో మునిగినా కృష్ణుడల్లే తేలినా భంగు ఎంత కొట్టినా బ్యారేజి ఎక్కినా
నీ రూపే గుండెల్లో దాచనే ఇన్నాళ్లు నీకోసం ఉంచానే కవ్వించే కౌగిల్లు
పావడాల పానిపట్టు ప్రాయసాల తేనే పట్టు ఎక్కమాకు చింత చెట్టు చిట్టి చీమ నిన్ను కుట్టు

వెయ్ పోటు...వెయ్ పోటు (2)

చెలి చెడుగుడు జెమిని జెమిని తల తిరుగుడు జెమిని జెమిని
చలి విరుగుడు జెమిని జెమిని పిలుపెరగడు జెమిని జెమిని 
కలబడుమరి జెమిని జెమిని    కధ ముదిరిన జెమిని జెమిని 
నిలవడు మరి జెమిని జెమిని  చెలి వలచిన జెమిని  జెమిని
జెమిని జెమిని జెమిని జెమిని  కామిని  కామిని కామిని కామిని
జెమిని జెమిని జెమిని జెమిని   కామిని  కామిని కామిని కామిని
నీ క్రేజీ సొగసులతో టీనేజీ వయసులతో వీలైతే పురుషుడికి ఈలేసే తికమకలు
వెయ్ పోటు...వెయ్ పోటు(3)





పూలలో తేనే ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: జెమిని (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: వేటూరి
గానం: రాజేశ్ 

పూలలో తేనే ప్రేమ... ప్రేమ 
తేనెలో తీపి ప్రేమ... ప్రేమ
తీపిలో హాయి ప్రేమ... ప్రేమ  
హాయి నీవంది ప్రేమ... ప్రేమ
భహుశా నా ప్రాణమై నిలిచే నీ ప్రేమా 
మనసో అది ఏమిటో తెలియనిది ప్రేమా

పూలలో తేనే ప్రేమ... ప్రేమ 
తేనెలో తీపి ప్రేమ... ప్రేమ
తీపిలో హాయి ప్రేమ... ప్రేమ  
హాయి నీవంది ప్రేమ... ప్రేమ

చరణం: 1
కమ్మని కల కౌగిలి కధ ఎర్రని పెదాలలో ప్రేమ 
వెన్నెల కల వెచ్చని వల నీవు నేనైన ప్రేమ
కమ్మని కల కౌగిలి కధ ఎర్రని పెదాలలో ప్రేమ 
వెన్నెల కల వెచ్చని వల నీవు నేనైన ప్రేమ
కాలం చెల్లని ప్రేమ నీ దూరపు చేరువ ప్రేమ
సింధూరపు తూరుపు ప్రేమ నీవు సుమా...

పూలలో తేనే ప్రేమ... ప్రేమ 
తేనెలో తీపి ప్రేమ... ప్రేమ
తీపిలో హాయి ప్రేమ... ప్రేమ  
హాయి నీవంది ప్రేమ... ప్రేమ

చరణం: 2
ఆ పరిచయం ఈ పరిమళం పూసిన ఎడారి నా ప్రేమ
కోరిన సుఖం చేరిన సగం నాకు నీవైన ప్రేమ
ఆ పరిచయం ఈ పరిమళం పూసిన ఎడారి నా ప్రేమ
కోరిన సుఖం చేరిన సగం నాకు నీవైన ప్రేమ
చూపుగ నాటిన ప్రేమ కను చూపుకు అందని ప్రేమ
అందానికి అందం తెచ్చే ప్రేమ సుమా...                 

పూలలో తేనే ప్రేమ... ప్రేమ 
తేనెలో తీపి ప్రేమ... ప్రేమ
తీపిలో హాయి ప్రేమ... ప్రేమ  
హాయి నీవంది ప్రేమ... ప్రేమ
భహుశా నా ప్రాణమై నిలిచే నీ ప్రేమా 
మనసో అది ఏమిటో తెలియనిది ప్రేమా

పూలలో తేనే ప్రేమ... ప్రేమ 
తేనెలో తీపి ప్రేమ... ప్రేమ
తీపిలో హాయి ప్రేమ... ప్రేమ  
హాయి నీవంది ప్రేమ... ప్రేమ




దిల్ దివాన పాట సాహిత్యం

 
చిత్రం: జెమిని (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: వేటూరి
గానం: ఉష

దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్
చైన్ చురాయే నీందుడాయే కాన్ ఏ హర్ పల్
వేణువూది చంపుతావు వేళగాని వేళలో
ఉట్టిగొట్టి పుట్టికాస్త ముంచుతావు వాడలో
కన్నెముద్ద వెన్నముద్ద దోచుకున్న హాయిలో
చీరనైన వదలవాయే సిగ్గుపడ్డ ఈడులో

దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్
చైన్ చురాయే నీందుడాయే కాన్ ఏ హర్ పల్

చరణం: 1
కోయిలమ్మ కొమ్మకొచ్చి కొత్తపాట పాడుతుంటే
తుమ్మెదొచ్చి రెమ్మపూల గుమ్మెతేనె కోరుకుంటే
అందమైన ఇంట్లో నందనాలు పూసే 
చిలకముక్కుపచ్చ తోరణాలుకట్టే
నోరుపండనివ్వు ముద్దుతో...
మిలి ఏక్ ఆజ్ నబీ సే కోయీ ఆగేనా పీచే                
తుమ్ హి కహొయే కోయీ బాత్ హై

దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్
చైన్ చురాయే నీందుడాయే కాన్ ఏ హర్ పల్

చరణం: 2
అందమంతా లాలపోసి ముద్దచేసే జంటలోన
నీటిపైట మీటి పోయే వీణలాంటి ఒంటి మీన
మరుగుతున్న ఎండె కరిగి వెన్నెలాయే
పాలవెల్లువల్లె ఈడు తుళ్లిపోయే
గోరువెచ్చ వాలు పొద్దులో...
మిలి ఏక్ ఆజ్ నబీసే కోయీ ఆగేనా పీచే
తుమ్ హి కహొయే కోయీ బాత్ హై 

దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్
చైన్ చురాయే నీందుడాయే కాన్ ఏ హర్ పల్
వేణువూది చంపుతావు వేళగాని వేళలో
ఉట్టిగొట్టి పుట్టికాస్త ముంచుతావు వాడలో
కన్నెముద్ద వెన్నముద్ద దోచుకున్న హాయిలో
చీరనైన వదలవాయే సిగ్గుపడ్డ ఈడులో

దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్
చైన్ చురాయే నీందుడాయే కాన్ ఏ హర్ పల్





బ్రహ్మ ఓ బ్రహ్మ పాట సాహిత్యం

 
చిత్రం: జెమిని (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: యస్ పి బాలు

బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా వుంది గుమ్మ
బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా
బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా వుంది గుమ్మ
బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా
జాబిల్లిలా వుంది జాణా ఆ నవ్వు మీటింది వీణ
ఏడేడు లోకాలలో యింత అందాన్ని ఈ రోజే చూశానుగా       

బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా వుంది గుమ్మ
బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా

చరణం: 1
నీలాల ఆ కళ్లలో నీరెండ దాగున్నదో
ఆ లేడి కూనమ్మ ఈ వింత చూసింద ఏమంటదో
ఆ పాల చెక్కిళ్లలో మందారమే పూచేనో
ఈ చోద్యమే చూసి అందాల గోరింట ఏమంటదో
నా గుండె దోసిళ్లు నిండాలిలేనాడు ఆ నవ్వు మత్యాలతో
ఈ జ్ణాపకాలన్ని నే దాచుకుంటాను ప్రేమతో                           

బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా వుంది గుమ్మ
బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా

చరణం: 2
నూరేళ్ల ఈ జన్మనీ ఇచ్చింది నువ్వేననీ         
ఏ పూజలూ రాని నేనంటే నీ కెంత ప్రేముందనీ
ఈ వేళ ఈ హాయినీ నా గుండెనే తాకనీ
అందాల ఆ రాణి కౌగిళ్లలో వాలి జీవించనీ
ఆ పంచభూతాలు ఒక్కొక్కటై వచ్చి చల్లంగ దీవించనీ
తన చెంతకే చేరి ఏ రోజు చెప్పాలి ప్రేమనీ            

బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా వుంది గుమ్మ
బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా
బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా వుంది గుమ్మ
బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా
జాబిల్లిలా వుంది జాణా ఆ నవ్వు మీటింది వీణ
ఏడేడు లోకాలలో యింత అందాన్ని ఈ రోజే చూశానుగా

బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా వుంది గుమ్మ
బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా




చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు పాట సాహిత్యం

 
చిత్రం: జెమిని (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: వందేమాతరం శ్రీనివాస్

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు
చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు
తల్లడిల్లిపోతుంది తల్లి అన్నదీ
బొట్టురాల్చుకుంటుందీ కట్టుకున్నదీ
పాడె ఎత్తటానికే స్నేహమన్నదీ
కొరివి పెట్టడానికే కొడుకు వున్నదీ

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు

చరణం: 1
పోయినోడు యిక రాడు ఎవడికెవడు తోడు
ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు
నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నదీ
కన్నీళ్లకు కట్టేకూడా ఆరనన్నదీ
చావు బ్రతుకులన్నవి ఆడుకుంటవీ
చావులేని స్నేహమే తోడువుంటదీ...

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు
చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు




బంధమే ముల్లు అయినా పాట సాహిత్యం

 
చిత్రం: జెమిని (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: వేటూరి
గానం: ఆర్.పి.పట్నాయక్ 

బంధమే ముల్లు అయినా బాధలో నవ్వు ప్రేమ
ఏడు జన్మాలకైనా తోడు  నేనన్న ప్రేమ
లైలా మజ్నూలుగా రాలిన ఆ ప్రేమ
బ్రతుకే ఓ మాయని చాటిన ఈ ప్రేమ

బంధమే ముల్లు అయినా బాధలో నవ్వు ప్రేమ
ఏడు జన్మాలకైనా తోడు  నేనన్న ప్రేమ

చరణం: 1
కమ్మని కల కంటికి అల వెచ్చని నిషాలదీ ప్రేమ
ప్రేయసి శిల వలపొక వల  నన్ను కాదన్న ప్రేమ       
కమ్మని కల కంటికి అల వెచ్చని నిషాలదీ ప్రేమ
ప్రేయసి శిల వలపొక వల  నన్ను కాదన్న ప్రేమ   
కాలం చల్లని ప్రేమ మన దూరం చెరపని ప్రేమ
ప్రాణానికి ప్రాణం ప్రేమ నీవు సుమా...

బంధమే ముల్లు అయినా బాధలో నవ్వు ప్రేమ
ఏడు జన్మాలకైనా తోడు  నేనన్న ప్రేమ




నడక చూస్తే వయారం పాట సాహిత్యం

 
చిత్రం: జెమిని (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: వేటూరి
గానం: శంకర్ మహాదేవన్ ,  ఉష

సాకి: 
ఓ సిన్నదానా సందె వేళ సందు చూసి వచ్చేయనా
నీ గుండెలోన నిద్రపోనా...

పల్లవి: 
నడక చూస్తే వయారం కులుకు చూస్తే సింగారం
పడుచు సోకు పలారం దుమ్ము దుమారం
పిడత ముద్ద పింగాణం  ఉడత నడుము వడ్డాణం 
మనసుపడ్డ మాగాణం గుట్టు గుడారం
వియ్యల వారి ఉయ్యాల కట్నం వయ్యారిభామా
ఓహో అల్లారు ముద్దు చల్లారనీదు పిల్లాడి ప్రేమా

హే హే ధిల్లా లంగడియో హే ధిల్లా లంగడియో
ధిల్లా లంగడియో హే ధిల్లా లంగడియో

నడక చూస్తే వయారం కులుకు చూస్తే సింగారం
పడుచు సోకు పలారం దుమ్ము దుమారం

మనసు నిలవదంట మడి కట్టుకుంటే ఎట్టా
మల్లెమొగ్గలన్నీ నన్ను గిల్లేసే ఈ పూట
వయసు పిలిచెనంట ఇక వాయిదాకి టాటా
ముద్దులెన్నో వచ్చి నన్ను ముంచేసే ఈ పూట
మాట ఇచ్చినాక మొహమాటమేలనంట
చాటు చూసుకుంటా తొలికాటు వేసుకుంటా
ఆటు పోటులన్నీ నీతోటి పంచుకుంటా
ఆటవిడుపు కోసం నా రూటు మార్చుకుంటా

ధిల్లా  లంగడియో... హే ధిల్లా  లంగడియో...(4)

నడక చూస్తే వయారం కులుకు చూస్తే సింగారం
పడుచు సోకు పలారం దుమ్ము దుమారం

మంచు పల్లకీలో మరుమల్లె ఒత్తిడంట
ఒత్తిడెంత ఉన్నా నీ ఒళ్లంతా పువ్వంట
పంచదార ఇసకే ఈ మంచు వెన్నెలంట
నంచుకుంటే రుచిలే నీ ముద్దంతా యిమ్మంట
పడుచు ఎండకెన్నో మురిపాలు పొంగెనంట
ఒడిసి పట్టగానే ఒళ్లంత మీగడంట
అహ ఓపలేను నాలో వయసమ్మ గుండెకోతా
చెరగనీకు పాప చెలిమైన బ్రహ్మరాత

ధిల్లా  లంగడియో... హే ధిల్లా  లంగడియో...(2)   
 
నడక చూస్తే వయారం కులుకు చూస్తే సింగారం
పడుచు సోకు పలారం దుమ్ము దుమారం
పిడత ముద్ద పింగాణం  ఉడత నడుము వడ్డాణం 
మనసుపడ్డ మాగాణం గుట్టు గుడారం
వియ్యల వారి ఉయ్యాల కట్నం వయ్యారిభామా
ఓహో అల్లారు ముద్దు చల్లారనీదు పిల్లాడి ప్రేమా

హే హే ధిల్లా లంగడియో హే ధిల్లా లంగడియో
ధిల్లా లంగడియో హే ధిల్లా లంగడియో
ధిల్లా లంగడియో హే హే ధిల్లా లంగడియో


Palli Balakrishna Monday, August 7, 2017
Family Circus (2001)


చిత్రం: ఫ్యామిలీ సర్కస్ (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్, లెనిన
నటీనటులు: జగపతిబాబు , రోజా, కంచి కౌల్
దర్శకత్వం: తేజ
నిర్మాత: సుంకర మధుమురళి
విడుదల తేది: 01.01.2001

నను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో
నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో
నను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో
నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో
అరె ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో
నా పరువు కాస్త తియ్యకే పిల్లో మరదలు పిల్లో
నువ్వు కొట్టిన తియ్యని దెబ్బలకి బావో సుబ్బులు బావో
మరి నిద్దర పట్టక చస్తినిరో బావో సుబ్బులు బావో

నువు చూపులతో గిల్లకురో బావో సుబ్బులు బావో
నా బుగ్గలు బూరెలు అయ్యనురో బావో సుబ్బులు బావో
నువు చీటికి మాటికి చంపకే పిల్లో మరదలు పిల్లో
నీ మటలింక నమ్మనే పిల్లో మరదలు పిల్లో
నువు రాతిరి పెట్టిన ముద్దులకు బావో సుబ్బులు బావో
నేను ఉక్కిరిబిక్కిరి అయ్యానురో బావో సుబ్బులు బావో

అరె నీకు నాకు లింకని బావో సుబ్బులు బావో
ఊరంత గుప్పుమందిరో బావో సుబ్బులు బావో
అరె నూతులు గోతులు తియ్యకే పిల్లో మరదలు పిల్లో
నా కొంప ఇంక ముంచకే పిల్లో మరదలు పిల్లో
నువు గుద్దిన చోటే గుద్దకురో బావో సుబ్బులు బావో
నా వీపు వాచిపొయనురో బావో సుబ్బులు బావో


Palli Balakrishna Wednesday, August 2, 2017
Aa Naluguru (2004)


చిత్రం: ఆ నలుగురు (2004)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: చైతన్య ప్రసాద్ (All Songs)
గానం: యస్.పి.బాలు, ఆర్.పి. పట్నాయక్ , ఉష
నటీనటులు: రాజేంద్రప్రసాద్, ఆమని
దర్శకత్వం: చంద్ర సిద్దార్థ
నిర్మాత: శ్రీమతి సరిత పట్రా
విడుదల తేది: 09.12.2004

గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ
ఆటలే ఆడిన పాపాయి
ఇంతలో ఎంతగా ఎదిగెనో వింతగా
వధువుగా మారే మా అమ్మాయి
wish you happy married life
All the best for rest of life
ఆనందాల వేళ ఇది
అభినందనల మాల ఇది
గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ
ఆటలే ఆడిన పాపాయి

మనం చేస్తున్నాం అనుకుంటాం కాని అదంతా ఒట్టిదే
Marriages are made in Heaven

స్వర్గం లోనే పెళ్ళి చేసేసి దేవుడే పంపుతుంటే
మళ్ళీ ఇట్టా మేళతాళాల వేడుకే ఎందుకో
మీలాంటోళ్ళే నేలపై చేరి రాతలే మార్చుతుంటే
వేళాకోళం కాదు పెళ్ళి అని చాటుదామందుకే
ఆ మూడుముళ్ళే వేస్తే ఏడడుగులు నడిపించేస్తే
కాదయ్యా కళ్యాణము
మనసులనే ముడివేయలి నూరేళ్ళు జత నడవాలి
అపుడేగా సౌభాగ్యము

wish you happy married life
All the best for rest of life
ఆనందాల వేళ ఇది
అభినందనల మాల ఇది
గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ
ఆటలే ఆడిన పాపాయి

పెళ్ళైన కొత్తలో మా ఆయన నన్ను బంగారం అనేవాడు
ఇప్పుడు బోషాణం అంటున్నాడు

రోజు తింటే నేతి గారైనా చేదుగా మారిపోదా
మోజే తీరితే కాపురం కూడా కొట్టదా బోరుగా
ఏడే కదా స్వరములుండేవి కోటి రాగాలకైనా
కూర్చేవాడికి నేర్పు ఉండాలి కొత్తగా పాడగా
సంగీతపు సాధనలాగ సరదా పరిశోధనకాగా
చెయ్యాలి సంసారము
ఉంటాయి కలిమి లేమి వెంటాడే కష్టము సుఖము
కలబోతే సుఖసారము

wish you happy married life
All the best for rest of life
సుందరం సుమధురం జీవితం ఓ వరం
ఆటలా పాటలా సాగాలి
మంజులం మోహనం జంటగా జీవనం
ఈ క్షణం శాశ్వతం కావాలి
wish you happy married life
All the best for rest of life
ఆనందాల వేళ ఇది
అభినందనల మాల ఇది


*********  *********   ********


చిత్రం: ఆ నలుగురు (2004)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: యస్.పి.బాలు

నలుగురు మెచ్చినా నలుగురు తిట్టినా
విలువలే శిలువగా మోశావు
అందరు సుఖపడే సంఘమే కోరుతూ
మందిలో మార్గమే వేశావు
బతికిన నాడు బాసటగా
పోయిన నాడు ఊరటగా
అభిమానం అనురాగం చాటేదీ
ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు

పోయిరా నేస్తామా పోయిరా ప్రియతమా
నీవు మా గుండెలో నిలిచావు
ఆత్మయే నిత్యము జీవితం సత్యము
చేతలే నిలుచురా చిరకాలం
నలుగురు నేడు పదుగురిగా
పదుగురు వేలు వందలుగా
నీ వెనుకే అనుచరులై నడిచారు
ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు


*********  *********   ********


చిత్రం: ఆ నలుగురు (2004)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: యస్.పి.బాలు

ఒక్కడై రావటం ఒక్కడై పోవటం
నడుమ ఈ నాటకం విధి లీల
వెంట ఏ బంధము రక్త సంబంధము
తోడుగా రాదుగా తుధి వేల
మరణమనేధీ ఖాయమని
మిగిలేను తీపి గాయమని
నీ బరువు నీ పరువు మోసేది...ఆ నలుగురు

రాజని పేధని మంచని చెడ్డని
బేధమే ఎరుగని యామ పాశం
కోట్ల ఈశ్వర్యము కటిక దారిద్ర్యము
హద్ధులే చెరిపేనే బహుధూరం
మూటలలోని మూల ధనం
చేయదు నేడు సహగమనం
మన వెంట కదా గంట నడిచేది... ఆ నలుగురు

నలుగురు మెచ్చిన నలుగురు తిట్టిన
విలువనే శిలువగా మోసావు
అంధారు సుఖపడే సంఘమే కోరుతూ
మందిలో మార్గమే వేశావు
బతికిన నాడు బాసటగా
పోయిన నాడు ఊరటాగా
అభిమానం అనురాగం చేసేది... ఆ నలుగురు

పోయిరా నేస్తామ పోయిరా ప్రియతమ
నువ్వు మా గుండెలో నిలిచావు
ఆత్మాయే నిత్యము జీవితం సత్యము
చేతలే నిలుచురా కలకాలం
నాలుగు నేడు పదుగురు గా
ఆ పదుగురు వేలు వందాలు గా
నీ వెనుకే అనుచరులై నడిచారు... ఆ నలుగురు

Palli Balakrishna Tuesday, August 1, 2017
Nuvvu Nenu (2001)




చిత్రం: నువ్వు నేను (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నటీనటులు: ఉదయ్ కిరణ్ , అనిత
దర్శకత్వం: తేజా
నిర్మాత: పి.కిరణ్
విడుదల తేది: 10.08.2001



Songs List:



గాజువాక పిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వు నేను (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్

ఆహ్ ఒరే వెంకటేషు ఇలా వెయ్యరా దరువు
అది అలా కొట్టు
డండడడన్ డండడడ డండడడ డన్ డన్
అబ్బబ్బబ్బా ఏముందిరా అది ఏసుకోరా
వన్ టు ఇదుగో పాట ఫోర్

గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం గాదా 
గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం గాదా 
గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం గాదా నీ చెయ్యి సాపలేదా
నీ చెయ్యి సాపలేదా మా గాజు తొడగలేదా
గాజువాకే పిల్లా మాది గాజులోళ్ళమే పిల్లా మేము
గాజువాకే పిల్లా మాది గాజులోళ్ళమే పిల్లా మేము

సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్ళంగాదా (2)

సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్ళంగాదా నీ వీపు సూపలేదా
నీ వీపు సూపలేదా మా సబ్బు రుబ్బలేదా
సబ్బవరమే పిల్లా మాది సబ్బులోళ్ళమే పిల్లా మేము
సబ్బవరమే పిల్లా మాది సబ్బులోళ్ళమే పిల్లా మేము

సిరిపురం పిల్లా మేం సీరలోళ్ళంగాదా(2)

సిరిపురం పిల్లా మేం చీరలోళ్ళంగాదా నీ చీర ఇప్పలేదా
నీ చీర ఇప్పలేదా మా చీర సుట్టలేదా
సిరిపురమే పిల్లా మాది చీరలోళ్ళమే పిల్లా మేము
సిరిపురమే పిల్లా మాది చీరలోళ్ళమే పిల్లా మేము

మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్ళంగాదా
మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్ళంగాదా
మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్ళంగాదా నీ కాలు చాపలేదా
నీ కాలు చాపలేదా మా మువ్వ కట్టలేదా
మువ్వలపాలెమే పిల్లా మాది మువ్వలోళ్ళమే పిల్లా మేము
మువ్వలపాలెమే పిల్లా మాది మువ్వలోళ్ళమే పిల్లా మేము



ప్రియతమా ఓ ప్రియతమా పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వు నేను (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: యస్.పి.బి.చరణ్ , ఉష

ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం
ఓహో ప్రియుతమా ఓ ప్రియుతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం
నిన్ను చూడాలని ఏదో మాట చెప్పాలని
కలవరిస్తోందని తెలుసా

ఓహో ప్రియుతమా ఓ ప్రియుతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం
ఓహో ప్రియుతమా ఓ ప్రియుతమా

చరణం: 1
ఎప్పుడో అపుడెప్పుడో ముడిపడినదీ బంధమేదో
ఇప్పుడే ఇపుడిప్పుడే నీ మనసు చెప్పింది నాతో
వానవిల్లు ఏదో మెరిసిందలా
పూలజల్లు నాపై కురిసిందిలా
రాగమో అనురాగమో
ఈ వింత మాయనేమంటారో

ప్రియుతమా ఓ ప్రియుతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం
ఓహో ప్రియుతమా ఓ ప్రియుతమా

చరణం: 2
గుట్టుగా కనిపెట్టగా మససంత నీ సంతకాలే
మత్తుగా గమ్మత్తుగా ఎదనిండ నీ జ్ఞాపకాలే
నిన్ను చూడకుండా మనసుండదే
నిన్ను చూసినాక కునుకుండదే
మోహమో వ్యామోహమో
ఈ వింత మాయనేమంటారో

ప్రియుతమా ఓ ప్రియుతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం
ప్రియుతమా ఓ ప్రియుతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం
నిన్ను చేరిందనీ తన మనసు విప్పిందని
ఐ లవ్ యూ అంటోందని తెలుసా
నిన్ను చేరిందనీ తన మనసు విప్పిందని
ఐ లవ్ యూ అంటోందని తెలుసా




అయ్యయ్యో అయ్యయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వు నేను (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: రవి వర్మ, ఉష

అయ్యయ్యో అయ్యయ్యో  అయ్యో అయ్యయ్యయ్యో




నువ్వు నేను పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వు నేను (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం:  కె.కె., ఉష

నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను 



నీకోసమే ఈ అన్వేషణ పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వు నేను (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: కె.కె.

నీకోసమే ఈ అన్వేషణ
నీ ధ్యాసలో  ఈ ఆలాపన
ఎడబాటు రేపిన
విరహావేధనా నరకయాతనా
కాలమే దీపమై దారి చూపునా
నీకోసమే ఈ అన్వేషణ
నీ ధ్యాసలో  ఈ ఆలాపన

చరణం: 1
కళ్ళల్లోన నిన్ను దాచిన
ఊహాల్లోన ఊసులాడిన
స్వప్నంలోన యెంత చూసిన
విరహమే తీరదె
జాజి కొమ్మగాని ఊగిన
కాలిమువ్వగాని మోగిన
చల్లగాలి నన్ను తాకినా నీవనే భావనే
ఎదురుగ లేనిదే నాకేంతోచదే
రేపటి వేకువై రావే...

నీకోసమే ఈ అన్వేషణ
నీ ధ్యాసలో  ఈ ఆలాపన

చరణం: 2
నిన్ను తప్ప కన్ను చూడదే
లోకమంత చిమ్మ చీకటే
నువ్వు తప్ప దిక్కు లేదులే
ఓ సఖి నమ్మవే
గుండె గూడు చిన్నబోయనే
గొంతు ఇంక మూగబోవునే
నీవు లేక ఊపిరాడదే ఓ చెలి చేరవే

ఆశలు ఆవిరై మోడైపోతినే
తొలకరి జల్లువై రావే...

నీకోసమే ఈ అన్వేషణ
నీ ధ్యాసలో  ఈ ఆలాపన
ఎడబాటు రేపిన
విరహావేధనా నరకయాతనా
కాలమే దీపమై దారి చూపునా

నీకోసమే ఈ అన్వేషణ
నీ ధ్యాసలో  ఈ ఆలాపన




ప్రియతమా (Sad Song) పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వు నేను (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఉష

ప్రియతమా  (Sad Song)



నా గుండెలో నీవుండిపోవా పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వు నేను (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: సందీప్ , ఉష

నా గుండెలో నీవుండిపోవా నా కళ్ళల్లో దాగుండిపోవా
చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా...

నా గుండెలో నీవుండిపోవా నా కళ్ళల్లో దాగుండిపోవా
చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా...
నా గుండెలో నీవుండిపోవా 

నా హృదయం ప్రతి వైపు వెతికింది నీ కోసమేలే
నా నయనం ఎటు వైపు చూస్తున్న నీ రూపమేలే
నీ... పాటలో పల్లవే కావాలి
నా... ఎదలో మెదిలే కధలే పాడాలి

నీ కళ్ళల్లో నన్నుండిపోనీ నీ గుండెలో రాగాన్ని కానీ
సిరివెన్నెలై వచ్చి కనురెప్పలే తెరచి
మన ప్రేమనే చూపనీ...
నీ కళ్ళల్లో నన్నుండిపోనీ 

ఏ నిమిషం మొదలైనదో గాని మన ప్రేమ గాధ
ప్రతి నిమిషం సరికొత్తగా ఉంది ఈ తీపి బాధ
ఈ... దూరమే దూరమై పోవాలి
నీ... జతలో బతుకే నదిలా సాగాలి

నీ కళ్ళల్లో నన్నుండిపోనీ నీ గుండెలో రాగాన్ని కానీ
చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా...

లాలాల లాలాల లాలా లాలాలా లాలా లాలా
లాలాల లాలాల లాలాల లాలాల లాలాలా లాలా
లాలాల లాలాల లాలా




నువ్వే నాకు ప్రాణం పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వు నేను (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: కె.కె., ఉష

నువ్వే నాకు ప్రాణం
నువ్వే నాకు లోకం
ప్రేమే రాగ బంధం 
ప్రేమే వేద మంత్రం
కష్టాలెన్ని ఎదురైనా గాని 
మనకున్న బలమే ప్రేమ ప్రేమ

నువ్వే నాకు ప్రాణం
నువ్వే నాకు లోకం
ప్రేమే రాగ బంధం 
ప్రేమే వేద మంత్రం


నీలో ఆశ రేపే శ్వాస పేరే ప్రేమ కాదా
లోలో పల్లవించే పాట పేరే ప్రేమ కాదా
జీవితానికో వరం ప్రేమనీ
ప్రేమ లేని జీవితం లేదనీ
ఒకటై పలికేనట ఈ పంచ భూతాలు

నువ్వే నాకు ప్రాణం
నువ్వే నాకు లోకం
ప్రేమే రాగ బంధం 
ప్రేమే వేద మంత్రం

నిన్ను నన్ను కలిపే వలపు పేరే ప్రేమ కాదా
మిన్ను మన్ను తడిపే చిలిపి చినుకే ప్రేమ కాదా
లోపమంటు లేనిదే ప్రేమని
ప్రేమ నీకు శాపమేం కాదనీ
ఎదలో పలికేనట కళ్యాణ రాగాలు

నువ్వే నాకు ప్రాణం
నువ్వే నాకు లోకం
ప్రేమే రాగ బంధం 
ప్రేమే వేద మంత్రం
కష్టాలెన్ని ఎదురైనా గాని 
మనకున్న బలమే ప్రేమ ప్రేమ

నువ్వే నాకు ప్రాణం
నువ్వే నాకు లోకం
ప్రేమే రాగ బంధం 
ప్రేమే వేద మంత్రం




గున్నమావి కొమ్మ మీద పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వు నేను (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: మల్లికార్జున్ , ఉష

గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక
సన్నజాజి తీగ మీద అందాల రాచిలక
ఎవరూ లేని ఏకాకంట చక్కని గోరింక
అంతా ఉన్నా ఒంటరి పాపం వన్నెల రాచిలక
మమతలు తెలియని ఆ గోరింకకు చిలకే తోడంట
మనసులు కలిసిన ఆ ప్రేమికులు ఒకరికి ఒకరంట

గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక
సన్నజాజి తీగ మీద అందాల రాచిలక

గోరువంక తన గుండె గూటిలో చిలకని దాచింది
రామచిలక ఆ గోరువంకనే కనుపాపనుకుంది
కాటుకెంత అడ్డు వచ్చినా కంటి చాటు స్వప్నమాగునా
చేతులెంత అడ్డు పెట్టినా గుండె మాటు సవ్వడాగునా
కఠిక హృదయాలు ఏమనుకున్నా ప్రేమొక వరమేగా

గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక
సన్నజాజి తీగ మీద అందాల రాచిలక

పాడులోకం ఆ జంటను చూసి కత్తులు దూసింది
కక్ష గట్టి ఆ మనసులనిట్టే దూరం చేసింది
పంజరాలలోన పెట్టినా రామచిలక మూగబోవునా
హోరుగాలి ఎంత వీచినా ప్రేమ దీపమారిపోవునా
బ్రహ్మ రాతల్ని మార్చాలంటే మనుషుల వశమేనా

గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక
సన్నజాజి తీగ మీద అందాల రాచిలక
ఎవరూ లేని ఏకాకంట చక్కని గోరింక
అంతా ఉన్నా ఒంటరి పాపం వన్నెల రాచిలక
మమతలు తెలియని ఆ గోరింకకు చిలకే తోడంట
మనసులు కలిసిన ఆ ప్రేమికులు ఒకరికి ఒకరంట
నువ్వు నేనంటా

Palli Balakrishna
Neeku Nenu Naaku Nuvvu (2003)



చిత్రం: నీకు నేను నాకు నువ్వు (2003)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
నటీనటులు: ఉదయ్ కిరణ్, శ్రేయా శరన్
దర్శకత్వం: రాజశేఖర్ ( కన్నడ డైరెక్టర్)
నిర్మాత: డి.సురేష్ బాబు
విడుదల తేది: 15.08.2003



Songs List:



నా చిరునామ నీ హ్రుదయాన  పాట సాహిత్యం

 
చిత్రం: నీకు నేను నాకు నువ్వు (2003)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: పెద్దాడ మూర్తి
గానం: కె.యస్.చిత్ర, రాజేష్

నా చిరునామ నీ హ్రుదయాన 
కొలువైంద అవునా ఏమొ... 
నా చిరునవ్వె ని పెదవుల్లొ 
వెలుగైంద అవునా ఏమొ... 

నీ గుండెల్లొ నిండాన గొరింటల్లె పండాన 
నిజమొ కాదొ నాకె తెలియదు గా.... 
నీ కల్లలొ నెనేన నీ కలలల్లె రాలేన 
కలవొ లేవొ వెతికె చెపుతాగా 

నా చిరునామ నీ హ్రుదయాన 
కొలువైంద అవునా ఏమొ... 

మదువొలికె సిరిపెదవుల్లొ నువుదాచిన పేరు నాదేగ 
ఉందనుకొ అది నిజమైతె మరి మాటగ మరదా 
బుగ్గలొ కుర్ర సిగ్గులొ ఎర్రబొతె నేను కాన 
అవుననొ ఇంక కాదనొ అర్దమైతె చెప్పలేన 
నిమన్సంటె నేనేగ నీ మమతంత నాదేగ 
ఇంకా నాకె తెలియని సంగతిగా ఆ... 

నా చిరునామ మ్మ్మ్.. నీ హ్రుదయాన 
మ్మ్మ్... కొలువైందా ఆ అవునా ఏమొ 

అడుగడుగు నీ ప్రతిపనిలొ ఊహించిన తోడు నేనేగ 
నీ ఊహె నాకొచింద గురుతెప్పుడు లేదుగా 
చటుగ పూట పూటగ వెతికేదె నన్ను కాద 
కాదులె లేదు లేదులె అపవాద కన్నె వీన 
కాదంటుంటె అవునని లె లేదనుటుంటె వుందనిలె 
ఏమొ ఏమొ ఏమొ ఏమొలే... 

నా చిరునామ నీ హ్రుదయాన 
కొలువైందా నిజమేనేమొ 
నా చిరునవ్వె మ్మ్మ్...నీ పెదవుల్లొ ఆ అ 
వెలుగైందా నిజమేనేమొ....




ప్రేమకన్న గోప్పదింక పాట సాహిత్యం

 
చిత్రం: నీకు నేను నాకు నువ్వు (2003)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం:  కులశేఖర్ 
గానం: శంకర్ మహదేవన్ , చిత్ర 

ప్రేమకన్న గోప్పదింక 




గుమ్మరే గుమ్మరే పాట సాహిత్యం

 
చిత్రం: నీకు నేను నాకు నువ్వు (2003)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం:  పెద్దాడ మూర్తి
గానం: కె.కె., ఉష 

గుమ్మరే గుమ్మరే 




తెలుగు భాష తియ్యదనం పాట సాహిత్యం

 
చిత్రం: నీకు నేను నాకు నువ్వు (2003)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం:  చంద్రబోస్‌
గానం: యస్. పి. బి. చరణ్‌

పల్లవి: 
తెలుగు భాష తియ్యదనం తెలుగు భాష గొప్పతనం 
తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం 
తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా 
తెలుగు మరచిపోతే వాళ్లని నువు మరచినట్టురా 
ఇది మరువబోకురా

చరణం: 1
అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది 
నాన్నా అన్న పదములోన అభిమానం జనిస్తుంది 
మమ్మీడాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుందీ 
మామ అన్నమాట మనసు లోతుల్లో నిలుస్తుంది 
అక్కా అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది 
ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుందీ 
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు 
కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు  
తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా 
తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ల రుణం తీర్చరా

చరణం: 2
కొమ్మల్లోన పక్షులన్ని తమ కూతను మార్చుకోవు 
భూమిపైన ప్రాణులన్ని తమ భాషను మరువలేవు 
మనుషులమై మనభాషకు ముసుగును తగిలిస్తున్నాము 
ప్రపంచాన మేథావులు మన పలుకులు మెచ్చినారు 
పొరుగు రాష్ట్ర కవులు కూడ తెలుగును తెగ పొగిడినారు 
ఆంధ్రులమై మనభాషకు అన్యాయం చేస్తున్నాము 
అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు 
అది భాషా ఆచారాలను మింగెయ్యెద్దు 
తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా 
ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా... 
వెనక్కి తగ్గమాకురా 

తెలుగు భాష తియ్యదనం తెలుగు భాష గొప్పతనం 
తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం 
తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా 
తెలుగు మరచిపోతే వాళ్లని నువు మరచినట్టురా 
ఇది మరువబోకురా

మమ్మీడాడీ అన్నమాట మరుద్దామురా 
అమ్మానాన్నా అంటూ నేటి నుండి పిలుద్దామురా 
ప్రతిజ్ఞ పూనుదామురా




పెళ్ళాడే తీరాలన్నారు పాట సాహిత్యం

 
చిత్రం: నీకు నేను నాకు నువ్వు (2003)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం:  చైతన్య ప్రసాద్ 
గానం: యస్. పి. బాలు, చిత్ర 

పల్లవి:
రెండు మనసులు కలిసిన వేళా
రెండు మమతలు కలిసిన వేళా
ఒక తెలిసీ తెలియని బంధం దరిచేర్చినదీ అనుబంధం

పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ
ఒద్దు బాబోయ్ బాబోయ్ బాబోయ్ అంటే వింటారా
పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ
ఒద్దు బాబోయ్ బాబోయ్ బాబోయ్ అంటే వింటారా
పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ

చరణం: 1
ఒక అమ్మడు అబ్బో ఐశ్వర్య
ఒక అమ్మాయి అచ్చం అమీష
ఓ సుందరి డిటో మనీష
ఓ చిన్నది సెక్సీ బిపాసా
ఈ బ్యూటీ క్వీన్స్ లో ఓటే ఎవరికి వెయ్యాలీ...

మీ ఆకలి చూపులు ఆపండి...
మీ అల్లరి ఊహలు చాలండి
ఈ పైపై మెరుగులు కాదండి
మదిలోపలి అందం చూడండీ
మీ వంకాయ ఫేసుకు ఇంకా చాన్సు కావాలా

ఓయ్
పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ
ఒద్దు బాబోయ్ బాబోయ్ బాబోయ్ అంటే వింటారా
పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ

చరణం: 2
ఆ అబ్బాయి రేపటి టెండూల్కర్
ఈ కుర్రాడు ఇప్పటి సూపర్ స్టార్
ఓ బుల్లోడి అడ్రసు యూ.యస్సు
ఓ చిన్నోడికున్నాయి ఎస్టేట్సు
వీళ్ళందరిలోనా సుందరుడెవరో తేల్చాలీ

ఆ స్టేటసు చూస్తే చెడతారు
ఒట్టి గ్లామరు బుట్టలో పడతారు
మరి డబ్బుకు కొవ్వు జబ్బుంది
అది తగ్గకపోతే ఇబ్బంది
మీ మంకీ ఫేసుకు వెంకీలాంటోళ్ళొస్తారా

అరరరె
పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ
ఒద్దు బాబోయ్ బాబోయ్ బాబోయ్ అంటే వింటారా
పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ

చరణం: 3
మరి మీకెళాంటోళ్ళు కావాలంటా
పెనుకష్టం ఓర్చే సీతమ్మ
పతి ఇష్టం తీర్చే రాధమ్మ
అనురాగం పంచే రామయ్య
మది వెన్నలు దోచే కన్నయ్య
మనసిచ్చేవాళ్ళే మాకూ తోడుగ రావాలీ

పెళ్ళాడాలంటే అట్టాంటమ్మాయ్ కావాలీ
పెళ్ళాడాలంటే అట్టాంటబ్బాయ్ కావాలీ
ఆ జంటను చూస్తే కన్నులపంటై పోవాలీ
పెళ్ళాడాలంటే అట్టంటమ్మాయ్ కా వా లీ





నేను నీకెవరని పాట సాహిత్యం

 
చిత్రం: నీకు నేను నాకు నువ్వు (2003)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం:  వేటూరి 
గానం: కార్తీక్, ఉష 

నేను నీకెవరని





గోల్ గోల్ పాట సాహిత్యం

 
చిత్రం: నీకు నేను నాకు నువ్వు (2003)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం:  చంద్రబోస్‌
గానం: ఉదయ్ కిరణ్, ఉష 

గోల్ గోల్ 

Palli Balakrishna

Most Recent

Default