Search Box

Narasimhudu (2005)చిత్రం: నరసింహుడు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్కికార్జున్ , గంగ
నటీనటులు: జూ.యన్. టి. ఆర్, అమిషాపాటిల్, సమీరా రెడ్డి
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: చంగల వెంకటరావు
విడుదల తేది: 20.05.2005

ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక
ఏలకో బాలికా మోసుకొచ్చావే ఇలాగా
ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైనపడనీక
ధన్యోస్మి అంటాచిలకా
అందుకున్నాక అందాల నీ కానుకా...

ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక
ఏలకో బాలికా దూసుకొచ్చావే ఇలాగా

అర్ధం చేసుకో మగరాయా అంతా చెప్పుకున్నా
ఇంకా చాటుగా మిగిలాయా కనులు చెదిరే కాంచనా
వివరించే వీలు ఉందా వేధించే వయసులో తన
ప్రవహించే వీలు కోరిందా కసిరే కైపు కామన
నోప్పంటు భయపడతాన తీపిగాయాలు చేస్తున్నా
నిప్పంటినా సరసాన ఆపసోపాల తాపాలు చల్లార్చనా

ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక
ఏలకో బాలికా దూసుకొచ్చావే ఇలాగా

ఇదేం కోరికే కురదాన కొంపే మునిగిపోగా
నిదానించమంటున్నాన కదిలిరావేం మన్మధ
సుకుమారం సోలిపోదా కవ్వించే కయ్యమాపగా
సఖి భారం పంచుకోరాదా చెయ్ రా చెలియ సంపద
వద్దోద్దు అంటానంటే నిదురిస్తుంటే నీ జంటా
సయ్యంటు చెయ్యందిస్తే రకరకాల సుఖాలు నీవేకదా

ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక
ఏలకో బాలికా మోసుకొచ్చావే ఇలాగా
ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైనపడనీక
ధన్యోస్మి అంటాచిలకా
అందుకున్నాక అందాల నీ కానుకా...


Most Recent

Default