Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Hitler (1997)





చిత్రం: హిట్లర్ (1997)
సంగీతం: కోటి
నటీనటులు: చిరంజీవి, రాజేంద్రప్రసాద్, రంభ
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాత: ఎమ్. వి.లక్ష్మీ
విడుదల తేది: 04.01.1997



Songs List:



నడక కలిసిన పాట సాహిత్యం

 
చిత్రం: హిట్లర్ (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
పడుచు సొగసుల పాలాస్త్రీ అంటనీరా నామేస్త్రీ
నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
పడుచు సొగసుల పాలాస్త్రీ అంటనీరా నామేస్త్రీ
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ...
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ...
మొగుడు మొగుడని అంటే స్త్రీ మొదలుపెడితే వన్టూత్రీ
ఒంపు సొంపుల యంగోత్రీ కాలుజారకే ఖంగోత్రీ
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ...
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ...
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ...
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ...

చరణం: 1
అందమైన మాట అడ్డు సోకులమ్మ సొంత బొడ్డు జివ్వుమన్న రవ్వలడ్డు
ఎబిసిలు లేని జెడ్ ఏపుగున్న బుగ్గరెడ్డు లేతగున్న నీటిబొట్టు
అలకా కులుకు ఎప్పుడెప్పుడెప్పుడంటు నిప్పురాజుకుంటుంటే
పలకా బలపం లవ్వులవ్వులవ్వుమంటు ప్రేమదిద్దుకుంటుంటే
అలకా కులుకు ఎప్పుడెప్పుడెప్పుడంటు నిప్పురాజుకుంటుంటే
పలకా బలపం లవ్వులవ్వులవ్వుమంటు ప్రేమదిద్దుకుంటుంటే
తనువే పలికే కసి కవ్వాలి నరమే ఒణికే ఎద మనాలి
తెరలే తెరిచి పద తెనాలి పదవే పొదకి పసి మరాళి
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ...
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ...
నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
ఒంపు సొంపుల యంగోత్రీ కాలుజారకే ఖంగోత్రీ

చరణం: 2
రాజమండ్రి రేవుకాడ రంగసాని మేడకాడ రాతిరేల రంభదంట
నాయుడోరి ఇంటి కాడ నల్లతుమ్మ చెట్టు నీడ ఎన్నెలంత ఎంకిదంట
అడిగేదడుగు అల్లిబిల్లి కన్నెతీగ పూలుపిందెలేస్తుంటే
వెతుకో వెతుకు వేడిపుట్టి వెచ్చబెట్టి వెన్నుపూస దాస్తుంటే
అడిగేదడుగు అల్లిబిల్లి కన్నెతీగ పూలుపిందెలేస్తుంటే
వెతుకో వెతుకు వేడిపుట్టి వెచ్చబెట్టి వెన్నుపూస దాస్తుంటే
జగడం రగడం జతజవానీ పరువం పలికే ప్రియభవాని
తొలిగా పడితే చెలి నిషానీ జరిగే జతులే యమకహానీ
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ...
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ...
నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
ఒంపు సొంపుల యంగోత్రీ కాలుజారకే ఖంగోత్రీ
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ...
హే... అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ...



కూసింది కన్నె కోయిలా పాట సాహిత్యం

 
చిత్రం: హిట్లర్ (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: భువన చంద్ర
గానం: మనో, సుజాత, రేణుక, సంగీత

పసి పసి పరువము తల తల తల తల
కసి కసి వయసుల కల కల కల కల
చిరు చిరు చిలకల కిల కిల కిల కిల
అలజడి తొలగిన మనసుల కల కల
పిలవక పిలిచిన పిలుపుల పిలుపుల
పలకక పలికిన పెదవుల పెదవుల
తొనికిన తొనికిన మదువుల మదురిమలో

కూసింది కన్నె కోయిలా
ఊగింది గుండె ఊయలా
మబ్బుల్లో రాజహంసల
వయసు జుమ్మని ఆడిందహో

కూసింది కన్నె కోయిలా
ఊగింది గుండె ఊయలా
మబ్బుల్లో రాజహంసల
వయసు జుమ్మని ఆడిందహో

పొద్దున్నె వచ్చేసింది జాబిలి
నా రాణి నువ్వేనంది ఓ చెలీ
పొవోయి శంకర శాస్త్రీ
చెయ్యాలా నీకు శాస్తీ
రెక్కల కట్టుకు చుక్కల మిట్టకు
రివ్వున సాగెదమా
వన్నెల చిన్నెల వెన్నెల మడుగున జలకాలాడెదమా

గట్ల గైతే పోరీ నేను వస్తనులే

కూసింది కన్నె కోయిలా
ఊగింది గుండె ఊయలా
మబ్బుల్లో రాజహంసల
వయసు జుమ్మని ఆడిందహో

ఆనందం పొందే నాడె హాలిడే
జాలిగా ఉంటె పాప జాలిడే
వలపు సందడిలో
వయసు తాకిడిలో

అల్లరి హద్దుని మెల్లగ తాకిన
ముద్దుల సవ్వడిలో
అరె మెత్తని ఒంపున మెత్తగ తాకిన
మల్లెల జాతరలో
వయ్యరాలే వాడె వేడె కౌగిట్లో

కూసింది కన్నె కోయిలా
ఊగింది గుండె ఊయలా
మబ్బుల్లో రాజహంసల
వయసు జుమ్మని ఆడిందహో

కూసింది కన్నె కోయిలా
ఊగింది గుండె ఊయలా
మబ్బుల్లో రాజహంసల
వయసు జుమ్మని ఆడిందహో



కన్నీళ్లకే కన్నీరొచ్చే పాట సాహిత్యం

 
చిత్రం: హిట్లర్ (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర, అనుపమ, రేణుక

కన్నీళ్లకే కన్నీరొచ్చే
కష్టాలకే కష్టం వేసే 
కన్నా ఇలా నిన్నే చూడగా 
ఓ ... అన్ని నువ్వై భారం మోయగా 
ఈ బరువే నీ చదువై ఎదిగిన పసి కూన 

ఓ ఓ ఓ ... ఓ ఓ ఓ ... ఓ ఓ ... ఓ ఓ ఓ ... కన్నీళ్లకే
అమ్మ లోని లాలన నాన్న లోని పాలన
అందిపుచ్చుకున్న ఈ అన్న నీడలో 
కొమ్మ చాటు పూవులై కంచె చాటు పైరులై 
చిన్ని పాపలందరూ ఎదుగు వేళలో 
ముసిరే నిశిలో నడిచే దిశలో 
నెత్తురుతో నిలిపావే ఆరని దీపాన్ని

ఓ ఓ ఓ ... ఓ ఓ ఓ ... ఓ ఓ ఓ ... ఓ ఓ ఒ. .. కన్నీళ్లకే
దారి చూపు సూర్యుడా జోల పాడు చంద్రుడా 
నీవు కంట నీరు పెడితే నిలువలేమురా 
నీరు కాదే అమ్మలు తీరుతున్న ఆశలు 
ఇన్నినాళ్ళ భారమంతా కడుగుతున్నవి 
ఒడిలో ఒదిగి రుణమై ఎదిగి 
మరు జన్మ నిను కని పెంచే అమ్మవుతామయ్య
నీ నవ్వే వెన్నెల వెలుగమ్మ 
నా యదలో కాంతుల కొలువమ్మ

ఏ దైవమో దీవించాడు 
మా అన్నగా దిగి వచ్చాడు 
ఏ జన్మలో రుణమో తీర్చగా 
ఓ ... మా కోసమే ప్రాణం పంచగా 
ఏ పుణ్యం మా కోసం ఈ వరమిచ్చిందో
నీ నవ్వే వెన్నెల వెలుగమ్మ 
నా యదలో కాంతుల కోలువమ్మ




మిస మిస మెరుపుల పాట సాహిత్యం

 
చిత్రం: హిట్లర్ (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, చిత్ర

మిస మిస మెరుపుల మెహబూబ
కసి కసి మొర విను దిల్ రూబా
మిల మిల మెరుగుల మెహరూబ
మెలికలు తిరిగెను దిల్ రూబా
మెహ బూబా మేరి దిల్ రూబా
మెహ బూబా మే తెరి దిల్ రూబా

మిస మిస మెరుపుల మెహబూబ
కసి కసి మొర విను దిల్ రూబా
మిల మిల మెరుగుల మెహరూబ
మెలికలు తిరిగెను దిల్ రూబా

కిసుక్కు మంటె కన్నె గుండె కూలర్
కసెక్కి పోదా కుర్ర ఈడు సమ్మర్
చురుక్కు మంటె ఒంపులోని హీటర్
ఉడిక్కి పోదా ఒంటిలోని వాటర్
తలుక్కు సోకులోన తనివితీరి పోకా
కొలిక్కి వెల్లనంది ఈ వింతా
చలెక్కి ఉన్న గంట తాపమంటుకోదా
చిరాగ్గ మారిపోద క్యాలెండర్

మెహ బూబా మే తెరి దిల్ రూబా
మెహ బూబా మేరి దిల్ రూబా

మిస మిస మెరుపుల మెహబూబ
కసి కసి మొర విను దిల్ రూబా
మిల మిల మెరుగుల మెహరూబ
మెలికలు తిరిగెను దిల్ రూబా
మెహ బూబా మేరి దిల్ రూబా

వలెయ్యమంటె పిల్లదాని పేజర్
వరించి రాద వాలు పొద్దు లీజర్
కమాన్ అంటె కొంటె చూపు సీజర్
కుమారి వైపే కంటి ముందు హాజర్
మజాల కిక్కులోని మాట చెప్పుకోగా
బజారుకెక్కుతున్న బాజీగర్
బుజాలు తడుముకుంటు మోజు పెంచుకోగా
మిసైలు పంచుతున్న మంజ్రేకర్

మెహ బూబా మేరి దిల్ రూబా
మెహ బూబా మే తెరి దిల్ రూబా

మిస మిస మెరుపుల మెహబూబ
కసి కసి మొర విను దిల్ రూబా
మిల మిల మెరుగుల మెహరూబ
మెలికలు తిరిగెను దిల్ రూబా

మెహ బూబా మేరి దిల్ రూబా
మెహ బూబా మే తెరి దిల్ రూబా



ఓ కాలమా పాట సాహిత్యం

 
చిత్రం: హిట్లర్ (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె. జె. యేసుదాస్

ఎందరిని ఏ దరికి చేర్చినా
సంద్రాన ఒంటరిగా మిగలదా నావా

ఓ కాలమా ఇది నీ జాలమా
ఓ కాలమా ఇది నీ జాలమా
మమతలు పెంచి మనసులు విరిచి
చలగాట మాడతావు న్యాయమా

ఓ కాలమా ఇది నీ జాలమా
ఓ కాలమా ఇది నీ జాలమా

రెక్కలొచ్చి గువ్వలూ ఎగిరి వెళ్ళి పోయినా
గూటి గొండెలో ఇలా ఈటె గుచ్చి వెల్లవే
ముల్ల చెట్టు కొమ్మాలైనా ఎంత పైకి వెళ్ళినా
తల్లి ఏరుపై ఇలా కత్తి దూసి ఉండవే
మీరే తన లోకమనీ బ్రతికిన సోదరునీ
చాల్లే ఇక వెల్లమనీ తరిమిన మిమ్ము గనీ
అనురాగమెంత చిన్న బోయనో

ఓ కాలమా ఇది నీ జాలమా
ఓ కాలమా ఇది నీ జాలమా

నారు పోసి దేవుడు నీరు పోయలేదనీ
నెత్తురంత దార పోసి పెంచడమే పాపమా
ఏరుదాటి వెంటనే పడవ కాచు వారిలా
అయిన వాల్లు మారి పోతె అంతకన్న శాపమా
నిన్నే తమ దైవమనీ కొలిచిన వారేనా
యముడై వేదించకనీ నిను వెలి వేసేనా
అనుబంధమింత నేరమాయనా

ఓ కాలమా ఇది నీ జాలమా
ఓ కాలమా ఇది నీ జాలమా

మమతలు పెంచి మనసులు విరిచి
చలగాట మాడతావు న్యాయమా



ప్రేమా జోహార్ పాట సాహిత్యం

 
చిత్రం: హిట్లర్ (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, మురళి

ప్రేమా జోహార్ డౌన్ డౌన్ హిట్లర్

Most Recent

Default