Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Gudumba Shankar (2004)





చిత్రం: గుడుంబా శంకర్ (2004)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్
దర్శకత్వం: వీర శంకర్
నిర్మాత: కె. నాగేంద్ర బాబు
విడుదల తేది: 10.09.2004



Songs List:



లే లే లేలే ఇవ్వాళే లేలే పాట సాహిత్యం

 
చిత్రం: గుడుంబా శంకర్ (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె కె (కృష్ణ కుమార్ కున్నత్)

లే లే లేలే ఇవ్వాళే లేలే
లే లే లేలే ఈరోజల్లే లేలే
వీలుంటే చిరుమల్లే లేకుంటే చిరుతల్లే
రెండంటే రెండున్నాయి బాటలే
ఔనంటే ఆకల్లే లేకుంటే బాకల్లే
ఉంటేనే పోతుంటాయి బాధలే

లే లే లేలే ఇవ్వాళే లేలే
లే లే లేలే ఈరోజల్లే లేలే
వీలుంటే చిరుమల్లే లేకుంటే చిరుతల్లే
రెండంటే రెండున్నాయి బాటలే
ఔనంటే ఆకల్లే లేకుంటే బాకల్లే
ఉంటేనే పోతుంటాయి బాధలే

చరణం: 1
నిన్నే కవ్విస్తుంటే సుడిగాలై చుట్టేయాలి లేలే
గొడుగల్లే పనిచెయ్యాలి నిన్నే కదిలిస్తుంటే 
పడగల్లే పనిపట్టాలి లేలే
నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి
నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి
అణిచేస్తే ముంచెయ్యాలి లే...
నేలల్లే ఉండాలి అందరి భారం మోయాలి
విసిగిస్తే భూకంపాలే చూపాలే...

లే లే లేలే ఇవ్వాళే లేలే
లే లే లేలే ఈరోజల్లే లేలే

చరణం: 2
చెడు ఉంది మంచి ఉంది అర్థం వేరే ఉంది
చెడ్డోళ్లకి చెడు చేయడమే మంచి
చేదుంది తీపి ఉంది భేదం వేరే ఉంది 
చేదన్నది ఉన్నపుడేగా తీపి
ఎడముంది కుడివుంది కుడి ఎడమయ్యే గొడవుంది
ఎడముంది కుడివుంది కుడి ఎడమయ్యే గొడవుంది
ఎటుకైనా గమ్యం ఒకటేలే...
బ్రతుకుంది చావుంది చచ్చేదాకా బ్రతుకుంది
చచ్చాకా బ్రతికేలాగ బ్రతకాలే...

లే లే లేలే ఇవ్వాళే లేలే
లే లే లేలే ఈరోజల్లే లేలే
వీలుంటే చిరుమల్లే లేకుంటే చిరుతల్లే
రెండంటే రెండున్నాయి బాటలే
ఔనంటే ఆకల్లే లేకుంటే బాకల్లే
ఉంటేనే పోతుంటాయి బాధలే



చిగురాకు చాటు చిలక పాట సాహిత్యం

 
చిత్రం: గుడుంబా శంకర్ (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బి.చరణ్, సుజాత

చిగురాకు చాటు చిలక 
ఈ అలజడి ప్రేమేగా 
అలవాటు లేదు గనక 
మది సులువుగ నమ్మదుగా 

చిగురాకు చాటు చిలక 
తను నడవద ధీమాగా 
అనుకోని దారి గనక 
ఈ తికమక తప్పదుగా 

తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా 
ఐతే అది తేలనిదే అడుగుపడదుగా 
సరికొత్తగ నా వంక చూస్తోందే చిత్రంగా 
ఏమైందో స్పష్టంగా బయట పడదుగా 

చిగురాకు చాటు చిలక 
ఈ అలజడి ప్రేమేగా 
అలవాటు లేదు గనక 
మది సులువుగ నమ్మదుగా 

చెప్పకు అంటూ చెప్పమంటూ చర్చ తేలేనా 
తప్పనుకుంటూ తప్పదంటూ తర్కమాగేనా 
సంగతి చూస్తూ జాలి వేస్తూ కదలలేకున్నా 
తేలని గుట్టు తేనెపట్టు కదపలేకున్నా 

వణికే నా పెదవుల్లో తొణికే తడిపిలుపేదో 
నాకే సరిగా ఇంకా తెలియకున్నది 
తనలో తను ఏదేదో గొణిగి ఆ కబురేదో 
ఆ వైనం మౌనంలో మునిగి ఉన్నది 

చిగురాకు చాటు చిలక 
ఈ అలజడి ప్రేమేగా 
అనుకోని దారి గనక 
ఈ తికమక తప్పదుగా 

ఎక్కడి నుంచో మధురగానం మదిని మీటింది 
ఇక్కడి నుంచే నీ ప్రయాణం మొదలు అంటోంది 
గలగల వీచే పిల్లగాలి ఎందుకాగింది 
కొంపలు ముంచే తుఫానొచ్చే సూచనేమో ఇది 

వేరే ఏదో లోకం చేరే ఊహల వేగం 
ఏదో తీయని మైకం పెంచుతున్నది 
దారే తెలియని దూరం తీరే తెలపని తీరం 
తనలో కలవరమేదో రేపుతున్నది 

చిగురాకు చాటు చిలక 
ఈ అలజడి ప్రేమేగా 
అలవాటు లేదు గనక 
మది సులువుగ నమ్మదుగా 

చిగురాకు చాటు చిలక 
తను నడవద ధీమాగా 
అనుకోని దారి గనక 
ఈ తికమక తప్పదుగా 

తను కూడా నా లాగా అనుకుంటే మేలేగా 
ఐతే అది తేలనిదే అడుగుపడదుగా 
సరికొత్తగ నా వంక చూస్తోందే చిత్రంగా 
ఏమైందో స్పష్టంగా బయట పడదుగా



చిలకమ్మ ముక్కుకి పాట సాహిత్యం

 
చిత్రం: గుడుంబా శంకర్ (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: కార్తీక్,  శ్రీవర్ధిని

చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది
అరె ఆశే ఉంటే అంతో ఇంతో అంతేనండి 
మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండి
ఆ వీరబ్రహ్మం ఆనాడిదే అన్నాడండి 
మన పరబ్రహ్మం మళ్ళీ ఎటు ఉన్నాడండి

ఏవోవో ఏవో ఏవో - ఉందోయ్ రాసి
ఏవోవో ఏవో ఏవో
ఏవోవో ఏవో ఏవో - లేదోయ్ రాజీ
ఏవోవో ఏవో ఏవో

చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది

చరణం: 1
సన్నాయే విరిగినా ఆ డోలే పగిలినా 
అయ్యే పెళ్ళాగునా రాసుంటే
పందిళ్ళే కూలినా బంధువులే పోయినా 
అయ్యే పెళ్ళాగునా రాసుంటే
చల్లే అక్షింతలు నిప్పులే ఐనా పెళ్ళాగదు రాసే ఉంటే
హే మెడ్లో పూమాలలు పాములే ఐనా పెళ్ళాగదు రాసే ఉంటే

ఏవోవో ఏవో ఏవో - ఉందోయ్ రాసి
ఏవోవో ఏవో ఏవో
ఏవోవో ఏవో ఏవో - వద్దోయ్ పేచీ
ఏవోవో ఏవో ఏవో


చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది

చరణం: 2
తిక్కన్నే వచ్చినా ఎర్రన్నే వచ్చినా 
జరిగే కథ మారునా రాసుంటే
గురుడే బోధించినా వరుడే పాటించినా 
జరిగే కథ మారునా రాసుంటే
సింహం ఓ పక్క నక్క ఓ పక్క కథ మారదు రాసే ఉంటే
పెళ్ళాం ఓ పక్క బళ్ళెమోపక్క కథ మారదు రాసే ఉంటే

ఏవోవో ఏవో ఏవో - ఉందోయ్ రాసి
ఏవోవో ఏవో ఏవో
ఏవోవో ఏవో ఏవో - బ్రతుకే చీచీ
ఏవోవో ఏవో ఏవో

అరె ఆశే ఉంటే అంతో ఇంతో అంతేనండి 
మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండి
ఆ వీరబ్రహ్మం ఆనాడిదే అన్నాడండి 
మన పరబ్రహ్మం మళ్ళీ ఎటు ఉన్నాడండి

ఏవోవో ఏవో ఏవో - ఉందోయ్ రాసి
ఏవోవో ఏవో ఏవో
ఏవోవో ఏవో ఏవో - లేదోయ్ రాజీ
ఏవోవో ఏవో ఏవో



చిట్టి నడుమునే చూస్తున్నా పాట సాహిత్యం

 
చిత్రం: గుడుంబా శంకర్ (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్లికార్జున్ , శంకర్ మహదేవన్, ప్రేమజి అమరెన్

చిట్టి నడుమునే చూస్తున్నా 
చిత్రహింసలో చస్తున్నా 
కంటపడదు ఇక ఎదురేవున్నా...
చుట్టుపక్కలేమౌతున్నా 
గుర్తు పట్టనే లేకున్నా 
చెవిన పడదు ఎవరేమంటున్నా...
నడుమే వుడుమై నన్ను పట్టుకుంటె జాణ 
అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా 
ఆ మడతలో మహిమేమిటో 
వెతకాలి తొంగిచూసైనా 
ఆ నునుపులో పదునేమిటో 
తేల్చాలి తప్పు చేసైనా 

Come on come on (3)

ఓ రీ దేవుడా I think I did it again 
I think I seen it again 

Your నడుముని చూసి frooty girl 
I am losing all my concentration in this world 
I am unable to సుత్తయ్ మలైతయ్ girl 

Now look what I am running away 
with u pearl 
If ur my ఎంకి I am your 
నాయుడు బావా నాయుడు బావా 

Come on come on (4)

నంగ నాచిలా నడుమూపి 
నల్ల తాచులా జడ చూపి 
తాకి చూస్తే కాటేస్తానంది 
చీమ లాగా తెగ కుడుతుంది 
పాములాగ పగ పడుతుంది 
కళ్ళుమూసిన ఎదరేవుంది 
తీరా చూస్తే నలకంత నల్లపూస 
ఆరా తీస్తే నను నవిలేసే ఆశ 
కన్నెర్రగ కందిందిలా నడువొంపుల్లో నలిగి 
ఈ తిక మక తేలేదెలా ఆ సొంపుల్లో మునిగి 

ఓ రీ దేవుడా I think I did it again 
I think I seen it again 

ఎన్ని తిట్టినా వింటానే కాలదన్నినా పడతానే 
నడుము తడమనీ నన్నొకసారీ...
ఉరిమిచూసినా ఓకేనే ఉరే వేసినా కాదననే 
తొడిమి చెవిని చెబుతానే సారీ 

హాయిరే హాయిరే ఏ ప్రాణ హాని రానీ 
హాయిరే హాయిరే ఇక ఎమైనా కానీ 
నిను నిమరక నా పుట్టుక పూర్తవదు కదా అలివేణీ 
ఆ కోరిక కడతీరగ మరు జన్మ ఎందుకే రాణీ 

Come on come on (10)

I think I did it again I think I seen it again 
check it out check it out your check it out 



ఏమంటారో నాకు నీకున్న ఇదిని పాట సాహిత్యం

 
చిత్రం: గుడుంబా శంకర్ (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిణి, యస్. పి. బి. చరణ్

ఏమంటారో నాకు నీకున్న ఇదిని
ఏమంటారో నువ్వు నేనైన అదిని
ఏమంటారో మారిపోతున్న కథని
ఏమంటారో జారిపోతున్న మతిని
చూసే పెదవిని మాటాడే కనులని
నవ్వే నడకని కనిపించే శ్వాసనీ
ఇచ్చిపుచ్చుకున్న మనసుని 
ఇదా అదా యధావిధా మరి

ఏమంటారో నాకు నీకున్న ఇదిని
ఏమంటారో నువ్వు నేనైన అదిని
ఏమంటారో మారిపోతున్న కథని
ఏమంటారో జారిపోతున్న మతిని

ఎదురుగా వెలుగుతున్న నీడని
బెదురుగా కలుగుతున్న హాయిని
తనువునా తొనుకుతున్న చురుకుని
మనసునా ముసురుకున్న చెమటని
ఇష్టకష్టాలని ఇపుడేమంటారో
ఈ మోహమాటాలని మరి ఏమంటారో
స్వల్ప భారాలని ఇపుడేమంటారో
సమీప దూరాలని అసలేమంటారో
జారే నింగిని దొరలాంటి ఈ దొంగని
పాడే కొంగుని పరిమళించే రంగుని
పొంగుతున్న సుధాగంగని 
ఇదా అదా అదే ఇదా మరి

ఏమంటారో మారిపోతున్న కథని
ఏమంటారో జారిపోతున్న మతిని

జాబిలై తళుకుమన్న చుక్కని
భాద్యతై దొరుకుతున్న హక్కుని
దేవుడై ఎదుగుతున్న భక్తుని
సూత్రమై బిగియనున్న సాక్షిని
పాతలో కొత్తని ఇపుడేమంటారో
పోట్లాటలో శాంతిని మరి ఏమంటారో
తప్పులో ఒప్పుని ఇపుడేమంటారో
గతజన్మలో అప్పుని అసలేమంటారో
నాలో నువ్వుని ఇక నీలో నేనుని
మాకే మేమని మనదారే మనదనీ
రాసుకున్న ఆత్మచరితని 
అదా ఇదా ఇదే అదా మరి

ఏమంటారో నాకు నీకున్న ఇదిని
ఏమంటారో నువ్వు నేనైన అదిని
ఏమంటారో మారిపోతున్న కథని
ఏమంటారో జారిపోతున్న మతిని





కిళ్ళి కిళ్ళి కిళ్ళి కిళ్ళి నమిలాక పాట సాహిత్యం

 
చిత్రం: గుడుంబా శంకర్ (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: మాస్టార్జి
గానం: మల్లికార్జున్

నబో నబో నబరిగాజులు 
నబో నబో నబరిగాజులు 
ఎతుగొలుసులు ముక్కుపుడకలు 
నడుముసన్న నాగరాలు ఎవలెరుగని బాగోతం 
అబో అబో అబో అబో బేడపరక టిక్కటి 
ఏయ్ మల్లి ఔర్ తొడ లగాజొర్ 
Suit boot soore rome జయాల గొంట్ర గంజ 
లాగి పీకి పీకి లాగి ఎయ్య్ కోట్ ఎయ్య్

కిళ్ళి కిళ్ళి కిళ్ళి కిళ్ళి నమిలాక బాగున్నాదె నాగమళ్ళి 
దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావ మళ్ళీ 
కిళ్ళి కిళ్ళి కిళ్ళి కిళ్ళి నమిలాక బాగున్నాదె నాగమళ్ళి 
దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావ మళ్ళీ 
గట్టు గుంది గమ్మత్తుగుంది కోరికెగసి కోట్లాటనంది 
కొట్టుకొచ్చె నీ వాలు సూపు కందిరీగై కటేస్తవుంది 
ఓ పిల్ల నీ కిళ్ళి బాగున్నదే ఓ పిల్ల నీ కిళ్ళి బాగున్నదే 

కిళ్ళి కిళ్ళి కిళ్ళి కిళ్ళి నమిలాక బాగున్నాదె నాగమళ్ళి 
దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావ మళ్ళీ 
కిళ్ళి కిళ్ళి కిళ్ళి కిళ్ళి నమిలాక బాగున్నాదె నాగమళ్ళి 
దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావ మళ్ళీ 

నల్లగొండ నరుసు పోదాము పాయ బురుసు 
నీ కొరకు చేస్తా యెంతైన కరుసు 
నా జేబులోని పరసు పరేసుకుంది మనసు 
నీ మెడకేస్తా బంగారు గొలుసు 
హే నల్లగొండ నరుసు పోదాము పాయ బురుసు 
నీ కొరకు చేస్తా యెంతైన కరుసు 
నా జేబులోని పరసు పరేసుకుంది మనసు 
నీ మెడకేస్తా బంగారు గొలుసు 
హద్దు దాటి ముద్దిస్తావ వద్దు వాడు ఉడికి చస్తాడు ఆగు 
అద్దరాతిరి ఆ ఆటకు అనుమతిస్త ఈ పూటకు 
ఓ పిల్ల నీ చొరవ బాగున్నాదే

ఆకు పాకు చిత్తల పాకు దాము దూము దయ 
ఉస్కలకిల లాలు చాత దెఖ్ నికల్ గయ 
ఆడు బిడ్డ ఆడు అయ్య ముంగిటాడు డబ్బులిస్తడాడు 
ఆడు ఆడు అడు అడు అడు అడు ఆడూ 
ఆడు పాడు చిందులాడు ఓ పిల్ల పోతె మళ్ళి రాదు ఈడు 
వస్తే ఎవడుంటదే నీకు తోడు 
అయ్యో ఆడు పాడు చిందులాడు 
ఓ పిల్ల పోతె మళ్ళి రాదు ఈడు 
వస్తే ఎవడుంటదే నీకు తోడు 
ఆడు ఆడు ఆడు ఆడు చిందులాడు 
ఆడు ఆడు ఆడు ఆడు చిందులాడు 
ఆడు చిందులాడు ఆడు చిందులాడు 

Most Recent

Default